సూరీడు - ఆకసాన పక్షి
ఆకసాన మేఘాల మాటు న
సూరీడు కనిపించీ కనిపించక
చాటు మాటై ఉంటే
ఆకసం సువర్ణ మయమై
అద్భుతం గా ఉంది
పక్షి ఆకసాన ఎగురుతూ
ఆ సువర్ణం అంతా తనదే
అనుకుని మురిసి పోయి
గిరికీలు కొడుతోంది !
సూరీడు చటుక్కున మబ్బుల నించి
బయట పడ్డాడు - మేఘం మాయమయ్యింది
సుర్రుమన్న వేడి తగలడం తో
తలెత్తి చూసింది పక్షి
ఆకసాన ఫెడేల్మని సూరీడు !
సువర్ణం మటుమాయం !!
శుభోదయం
జిలేబి
ఏం చెప్పినా జిలేబిగారు చెబితే అదో తుత్తి :)
ReplyDelete