Saturday, December 14, 2013

హారం మూత బడ్డాక అస్సలు టపాలు చదివేదానికి మార్గమే తెలీటం లేదు !


ఏతా వాతా చర్విత చర్వణం . అసలు మనం ఒకదానికి అలవాటు పడిపోతే ఆ అలవాటు వేరే బాహ్య స్థితుల మీద ఆధార పడి ఉంటే , ఆ బాహ్య పరిస్థితి లో మార్పు వస్తే అస్సలు మనకు చేయీ కాలూ ఆడదని మరో మారు గుర్తుకు తెచ్చింది ఈ మధ్య హారం డమాల్ డమాల్ క్లోజ్ డౌన్ షో !

హారం మొత్తం మీద మన జీవన శైలి లో తెలుగు బ్లాగు రీడింగ్ కి అంత గా ఐక్యమై పోవడమే మరి కారణం ఏమిటో !

ఏదో పొద్దున్న లేచి హారం లో ముఖం పెట్టి ఓ పది టపాలు లబ లబా చదివేసి, ఓస్ మాకు మాత్రం తెలీదా ఏమిటి అని మరో పదిహేను కామెంటు మెతుకులు పారబోసి హమ్మయ్య అని మనమూ ఓ టపా కొట్టి అవ్వాల్టి కార్య క్రమా లలో పడడం అలవాటై పోయి ఒక నెల ముందు మూత బడిన హారం తో అగ్రిగేటర్ విలువలు తెలిసి వచ్చేయి ! దాంతో బాటు, మన వీక్ నెస్ కూడాను !

అంటే అలవాటు బడ్డ ప్రాణం టపాలు చదవల లేక ఉంటుందా ? ఎదో అట్లా ఒకటీ రెండు టపాలు చదివి ఈ మధ్య సంతోష పడడం సామాన్యమై పోయింది !
ఏమోయ్, భాస్కర రామి రెడ్డి హారాన్ని మూత బెట్టేవు అని అడుగుదా మనకుంటే అసలు మా రెడ్డి గారు ఆజా పజా లేదాయే మరి ?

ఇంతకీ భాస్కరా , హారం ఎప్పుడు మళ్ళీ హా, రమ్ గా అవతరించును ?


చీర్స్
జిలేబి

5 comments:

  1. జిలేబీగారూ, కూడలి, మాలిక, బ్లాగిల్లు ఉన్నాయి కదండీ. ఐతే హారంలో కామెంట్లను ఫాలో అవటం సులభంగా ఉండేది. అదే ఇప్పుడు ఎక్కువ చిక్కుగా ఉంది.

    ReplyDelete

  2. మీరన్నమాట నిజం. తెనుగు బ్లాగులు చదవటం కామెంట్లు ఫాలో కావడం చాలా కష్టం గానే ఉంది, హారం ఉపసంహారంతో, నెలనుంచీ. హారం పునరుద్ధరింపబడుతుందని ఆశిద్దాం. ఈ లోగా బ్లాగిల్లు వారితో టపాలన్నీ ఒక చోట కనపడేలా చేశారు, బాగుంది, వాటికి రంగులూ ఇచ్చారు, కొంతలో కొంత మేలు. కాని కామెంట్ల దాగరే చిక్కొచ్చింది.వారేదో మార్పు చేస్తున్నా కామెంట్లకి అన్నారు. చూడాలి ఏం చేస్తారో. మరో దారిలేదు. హారం తెగిపోయినట్లేనా?

    ReplyDelete
  3. join blagillu
    http://www.blogillu.com/

    ReplyDelete
  4. బ్లాగిల్లు వ్యాఖ్యల విభాగం చూసారా... మరిన్ని మార్పులు త్వరలో

    ReplyDelete
  5. haaram.com officially closed... జరిగిందంతా ఓ కలగా మర్చిపోదాం

    ReplyDelete