Friday, March 14, 2014

అంతర్జాతీయ మహిళా మృష్టాన్న భోజనోత్స వం !

అంతర్జాతీయ మహిళా మృష్టాన్న  భోజనోత్సవం !

ఏమోయ్ జిలేబి ఈ మారు మహిళా దినోత్సవ విశేషాలేమిటి ? అడిగేరు మా అయ్యరు గారు - అడక్క అడక్క ఈ ప్రశ్నే వేయాలా వీరు ?

మరీ సంబర పడి పోయి చెప్పా- మేమంతా కలిసి వన భోజనం చేసామండీ అన్నా !

మొత్తం మీద పుష్టి గా మృష్టాన్నం లాగించారన్న మాట !

అబ్బా, ఈ మగాళ్ళ కి ఒకటే హోరు పోరు - సంవత్సరానికి ఒక్క మారు వస్తుంది ఈ మహిళా దినోత్సవం - ఏదో ఆ ఒక్క రోజైనా శుష్టం గా మృష్టాన్నం లాగించాలా వద్దా మరి ?

దానికి ముందు అంతర్జాతీయ మహిళ ల హక్కుల గురించి ఎంత గా చర్చ జరిగిందను కున్నారు మరి ?!

ఏమి చర్చించా రోయ్ ?

ఎన్నో విషయా లండీ ! హటాత్తు గా పక్కింటి పంకజం అడిగిన ప్రశ్న గుర్తుకొచ్చింది - 'ఈ ఒడ్డియాణం' అయ్యరు గారు కొత్తగా కొనిచ్చేరాండీ ' ?

అంటే ?

అంటే చాలా విషయాలన్న మాట !

సరేనోయ్ - సంఘ సేవ ఏమైనా చేసారా ?

ఆ వన భోజనం అయ్యాక మిగిలిన కూరా నారా అంతా పేద వాళ్లకి పంచి పెట్టె మండి - వాళ్ళెంత సంతోష పడ్డా రనుకున్నారు మరి !

అవునా

అంతే కాదండీ - ఇవ్వాళ పాపం మా వన భోజనానికి మహిళా కుక్ కూడదు - మగ కుక్కే కావాలని మరీ పట్టు బట్టి మగ కుక్కు చేతే వంట చేయించాం కూడాను !

మరీ డాంబికం జిలేబి - హోటల్లో ఆర్డరు ఇస్తే మగ కుక్కు కాక ఇంకా ఎవరు జేస్తారు మరి అయ్యరు గారి రిటార్టు !

అవునే ! ఈ పాయింటు మరిచి పోయామే చర్చ లో ! వచ్చే మీటింగు లో జేబ్తా - దేశం లో కుక్ ఉద్యోగాలన్నీ మగ వారు కాజేసి మహిళ లకి అన్యాయం చేస్తున్నారు - ఇది చాలా తీవ్రం గా ఖండిం చాల్సిన విషయం . పార్లమెంటు లో బిల్లు ప్రతి 'పాడించి' ఈ విషయం మీద మహిళ ల కే హక్కు ఉన్నది అని జేబ్తాం ! తద్వారా మహిళ లకి మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి - ఇక ఇదే జిలేబీ పార్టీ ఉ- మేని ఫేస్తో ! "

అయ్యరు గారు నిట్టూర్చేరు ! తన హోటలు ఉద్యోగం కూడా ఇక ఖాళీ యే నా మరి !!


చీర్స్
జిలేబి


 

1 comment:

  1. చాలా బాగుందండి మీ ఉ- మేని ఫేస్తో.

    ReplyDelete