మొత్తం మీద మా సంపత్తు గారు పట్టు పట్టి ముహూర్తం బెట్టేసేరు 'ఎలచ్చన్ల' కి
కాబట్టి శ్రీకారం మొదలయ్యింది కాబట్టి - ఇక మీదట జిలేబి ఎక్కువగా రాజకీయాల గురించి రాయకూడదని నిర్ణయించేసు కుంది !
ఎందుకంటే ఏమి జెప్పను ! అన్న తీరుగా ఈ మధ్య లాలించే చేయి పాలించవా అని సరి కొత్త మీడియా స్లోగన్ మొదలయ్యింది కాబట్టి నేను కూడా చాలా తీవ్రం గా ఆలోచిత్తా ఉండా - మరీ మనం కూడా ఎలచ్చన్ల లో పాల్గొందామా అని !
ఎలచ్చన్ల లో కాంటెస్ట్ జేస్తే ఏమి ప్రయోజనం !?
మరీ ఓట్లు రాక పోయినా , మరో పార్టీ ని దెబ్బ తీయొచ్చు అన్న మాట - అంతే !
వారణాసి లో సన్నాసి ఎలచ్చన్ల లో నిలబడితే నేనూ కూడా ఎలచ్చన్ల లో అక్కడ నిలబడతా నని అనుకుంటున్నా !
ఎందు కంటే వారణాసి జిలేబి లకి మరీ ప్రసిద్ధి ! తెల్లారి లేచి వేడి టీ పా ల తో జిలేబి నాష్టా లాగిస్తారు కాబట్టి నేను కూడా అక్కడ ఒక టికాణా వేస్తే ఇక నాకు కనీసం తెల్లారి జిలేబి అమ్మకాలు కాకుండా ఉంటాయా మరి ?
చాయ్ కప్పు కి జిలేబి పోటీ - సవాలే సవాల్ !
చాయ్ కప్పు జిలేబి ఒక పార్టీ అవకూడదా మరి అంటారేమో మరి ! ఊహూ కుదరదు !
తెల్లారి నాష్టా దాకా అయితే కలిసి ఉంటాం కాని పోరాటం వస్తే మీకు మీరే మాకు మేమే ! అంతే అంతే !
కాబట్టి బ్లాగు వీరులారా --> వెంటనే జిలేబి కి ఓటేసి జిలేబి ని పోటీ గా నిలబెట్టడం మీ కనీస కర్తవ్యం !
కుదరదు - జిలేబి రుచి నో గుడ్ ! గులాబి సువాసన ఘుమ ఘుమలు మరీ మరీ బాగున్నాయి అంటారా ! ఇక మీ ఇష్టం ! ఘుమల్ ఘుమల్ తో సరదా గా సాగి పొండి !!
Welcome to the floor !
చీర్స్
జిలేబి
Welcome to the "flour"!
ReplyDeleteజిలేబీ గుర్తును ఎలక్షన్ కమీషన్ ఎవరికీ కేటాయించినట్లు కనబడదు.
ReplyDeleteమీదే ఆలస్యం.