కాశీ నించే ఎందుకు జిలేబి పోటీ ?
ఏమోయ్ జిలేబి, ఆ మధ్య కాశీ నించి పోటీ జేస్తా నన్నావే 'తయ్' కర్లియా హై క్యా ? - మా అయ్యరు గారు ప్రశ్నించేరు
బహు భేషు గా కాశీ నించే నండి చెప్పా తాడు సాక్షి గా !
ఎందుకోయ్ నీకు వారణాసీ - బెనారస్ - కాశీ అంత లైకింగ్ ?
మొట్ట మొదటి ది జిలేబి ! దాంతో బాటు గర్మా గరం చాయ్ - అదీ దాంతో అన్న మాట బ్రేకు ఫాష్టు ! అందుకే కాశీ నాకు బెష్టు చెప్పా హాట్ హాట్ జిలేబి నోరూరిస్తూ ఉంటే .
ఇంకా ? అయ్యరు గారి ఎగదోత .
రెండు - బెనారస్ పట్టు చీరల మోజు నాకుందని మీకు తెలుసుగా ! - ఏమండీ బెనారస్ కి వెళ్లి మంచి పట్టు చీరలు కొని నా పోటీ మొదలు పెట్ట బోతున్నా ! చెప్పా మరీ మురిపాలు బోతూ
ఇంకా ? అయ్యరు గారి మరో పృచ్చ
అదేమిటండీ ఇంకా ఇంకా అంటారు - కాశీ కి వెడితే మనకు నచ్చినదానిని వదిలి పెట్టి రావాలి అంటారు - అందుకే !
అంటే ?
నాకు మస్తు గా నచ్చిన వారు మీరే నాయె ! కాశీ కి వెళ్లి మిమ్మల్ని వదిలి పెట్టి వచ్చేస్తా చెప్పా !
ఆ అని నోరు తెరిచేసేరు మా అయ్యరు గారు !
కాశీ కాండం ఇంకా ఏమేమి చెప్ప బోతోందో మరి !
వెల్కమ్ టు 'కాశీ కాండం' !!
చీర్స్
జిలేబి
అన్ని కధలూ కంచికి వెళ్లి ముగిస్తే మోదీ గారి కధ అనాధ ప్రేతాలకి పుణ్యాన్నిచ్చే కాశీ నుంచి మొదలవుతుంది!
ReplyDeletewhat an idea moedeejee?