Tuesday, June 24, 2014

ఆకసాన మేఘం !


ఆకసాన మేఘం !
 
ఎండి పోయిన పుడమి
నోళ్ళు వెళ్ళ బెట్టి ఆకసం
వైపు చూస్తోంది కనీసం
ఒక్క ముక్క మేఘమైనా
కనిపించ క పోదా అంటూ
 
ఆ వైపే వస్తోన్న తెమ్మర కి
బాధేసి సముద్ర రాజుని ఆశిస్తే
రేడు నిలువెత్తు కెరటమై
ఆకసాన్ని ముద్దెట్టు కోడానికి
శత విధాలా ప్రయత్నిస్తున్నాడు
 
వస్తుందా మేఘమాలిక ???
 
 
జిలేబి

1 comment:

  1. ఏదు లేదు రాదు రాదు
    పెరిగింది పాపం పుడమిపై
    జరగాలి హననం ఈ రోజు
    అప్పుడే మళ్ళీ దర్శనం ఋతువై

    ReplyDelete