Monday, June 23, 2014

జిలేబి 'స్విస్సు' అకౌంటు !!

జిలేబి 'స్విస్సు' అకౌంటు !!

స్విస్సు బ్యాంకు లో నీ అకౌంటు ఏమైంది జిలేబి ? అడిగారు మా అయ్యరు గారు !

స్విస్సు అకౌంటు కేమి టండీ ! అది ఒక సేఫ్ వాల్ట్ !! క్షేమం గా ఉంటుంది అన్నా అట్లా న్యూస్ పేపర్ తిరగేస్తున్న అయ్యరు గారికి కాఫీ ప్రిపేర్ చేస్తో .

భంశు ! నీ అకౌంట్లకి డోఖా వచ్చే టట్టు ఉందే మరి ? చెప్పారు అయ్యరు గారు ఇవ్వాళ్టి హిందూ పేపరు చూపిస్తో .

వామ్మో వామ్మో అంటే మా అకౌంటు డీటెయిల్స్ బ్యాంకు వాళ్ళు గవర్నమెంటు కి ఇచ్చేస్తారా మరి ?

అట్లాగే ఉంది కదా మరి ?

అంటే నా డబ్బులు అంతా పోయినట్టే నా !!

ఏమో మరి . ఎంత బెట్టా వేమిటి అకౌంట్లో ? 

మన రాబోయే ఏడేడు నలభై తొమ్మిది తరాలకి సరిబడ్డా పైకం పెట్టా నే మరి !

అంతే ఇక అన్నీ గవర్నమెంటు వారికి సొంతం !

అదెట్లా అండీ అంత దస్కమూ గవర్నమెంటు వాళ్ళు లాగేసు కుంటే మనకి జీవనం ఎట్లా మరి ?

ఆ ఏముందీ, జమీందారీ, రాజుల వారి రాజ్యాన్ని గవర్నమెంటు పాత కాలం లో తీసేసు కుంటే ఏమి చేసారు ? ప్రివీ పర్సు ఇచ్చేరు కదా అట్లాగే నీకూ ఏదో కొంత ముట్ట జేబ్తారు లే !

ప్చ్చ్ ప్చ్ ! జేబులో డబ్బులు పోయనే అని పాత పాట పాడేసు కోవాలా మరి ? 

ఆ ఏముందీ గవర్నమెంటు 'కార్య రంగం' లో కి దిగే ముందే దస్కాన్ని ఏ నాసావు కో మారిషియస్ కో తర లించేయ్ . కాదూ కుదరదూ అంటే ఇండియా కే తరలించేయ్ ! ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్ట లేడని సామెత ఉండనే ఉందాయే మరి !!


హమ్మయ్య ! మా అయ్యరు గారి లాంటి తెలివి మరి వేరే ఎవరికైనా వచ్చునా మరి అని మరింత సంతోష పడి పోయి వారికి మంచి ఫిల్టరు కాఫీ కలిపి ఇచ్చా !!

'అదేనోయ్ నీ చేతి మహిమ ! ఫిల్టరు కాఫీ , హిందూ రీడింగ్ దే గొ టు గెదర్ , యు నో ! అన్నారు మా అయ్యరు గారు !

జిలేబి ఫిల్టరు కాఫీ మజాయే వేరు కదా మరి !!

శుభోదయం
జిలేబి

 

3 comments:

  1. అదేం పాపం 'శతక' తరాలకి సరిపడినది దాచెయ్యలేకపోయారా?

    ReplyDelete
    Replies
    1. అప్పటికే స్విస్సుబ్యాంక్ వారి లాకర్లు క్రిక్కిరిసిపోయి గోలగోల అయ్యిందేమోనండీ!

      Delete

    2. శర్మ గారు,

      శ్యామలీయం వారు జిలేబి బుట్ట లో పడ్డారు !! సరియైన జవాబే కదా మరి వారిచ్చినది !!

      జిలేబి

      Delete