ఈ మధ్య 'బ్లాగ్గెలకటానికి' అస్సలు బుద్దేయ్యటం లేదండీ మరీను !!
ఏమోయ్ జిలేబి ఈ మధ్య టపాలు గట్రా గెలకటం లేదు ? మా అయ్యరు గారు ప్రశ్నించేరు !
ఆ అన్నా పరాకుగా .
ఏమిటీ మరీ బిజీ అయిపోయావా ? ఇంతకు ముందైతే రోజుకో టపా బర బరా లాగించి పడేసే దానివి మరి ఈ మధ్య ఏమిటి వారానికో టపా కూడా రాయటం లే మరి ? మళ్ళీ ఎగదోసేరు అయ్యరు గారు !
"
ఈ మధ్య 'బ్లాగ్గెలకటానికి' అస్సలు బుద్దేయ్యటం లేదండీ మరీను !! " వాపోయా !!
ఏమోయ్ ఎందుకు ?
అదే అస్సలు తెలియటం లేదండీ
ఏమీ మేటరు లేదా ?
ఏమీ 'సరకు' లేదా సత్తా లేదా అన్నట్టు అనిపించి ముక్కు పుటా లెగురేసా !
ఆ మేటరు లేక ఏమిటి ! అస్సలు ఏది రాయాలని కూర్చున్నా 'అబ్బే , మనం ఈ టపా రాసి ప్రయోజనం ఏమిటి ?' అని పిస్తోంటేను !
ప్రయోజనం మాటెందుకు జిలేబి ! రాయాలను కుంటే రాసి 'పడెయ్యాలి' గాని మళ్ళీ అయ్యరు గారి ప్రోచ్చ !!
అంతే అనుకోండీ ! అయినా ఈ మధ్య ఏమిటో మరీ ఈ నిర్వేదం ' హుస్సూరు మన్నా !
నిర్వేదం ఎందు కోయ్ ?
ఏమని చెప్పుదు ? అస్సలు రాద్దామని కీబోర్డు పై వ్రేళ్ళు తాకిస్తే వ్రేళ్ళు కదిలితే నా మరి ?
అంటే ఏమిటోయ్ ?
ఇంతకు ముందు ఏమీ ఆలోచించే దాన్ని కాదు ! టపా పరుగు లిట్టేది . ఈ మధ్య ఆలోచిస్తా ఉండా అస్సలు టపా ముక్క అంటే ముక్క కూడా ఊడి పడటం లేదాయే !!
ఔరా ! అట్లా అయితే ఆ ఆలోచనలని కట్టి పెట్టి మూట కట్టి 'కూవం' రివర్ లో పడేసి , కుదేసి ఆలోచనలు ఏవీ లేక టపాలు బర బరా గీకేయి ' అయ్యరు గారు సలహా పడేసేరు
అంతే నంటారా ? చదివే వాళ్ళ గురించి ఆలోచించ కూడదా మరి ?
ఆ నీ బ్లాగు చదివే వాళ్ళు కూడా ఉన్నా రంటారా జిలేబి ??
మంచి ప్రశ్నే !!
అస్సలు బ్లాగులకి కాలం తీరి పోయిందా ? ఒరిజినల్ మేటరు కి కరువోచ్చిందా ??
ఏమో మరి బ్లాగు కాలం ఇంకా ఎంత కాలం ఉంటుందో మరి !!
చీర్స్
జిలేబి
టపాలు వ్రాయకపోతే మానె. కామెంట్లయినా కొట్టండి. మూడొస్తుందేమో!
ReplyDelete