ఇచ్చట జిలేబీలు అమ్మకానికి గలవు ! 
ఏమిటోయ్ జిలేబి ,మరీ చిట చిట లాడి పోతున్నావు అయ్యరు గారు నిమ్మళం గా అడిగేరు .
నా ముక్కు పుటాలు అదిరేయి . భూదేవి భయపడి కందింది కాలి అందెల జోరుకి . 
వామ్మో జిలేబి ఇది నువ్వే నా ? ! ఇంత గా ఆకాశానికి ఎగిరెగిరి పడి నీ కోపాన్ని ప్రదర్శిస్తున్నావ్ ! అయ్యరు గారు హాశ్చర్య పడి పోయేరు . 
కాదా మరి కాదా మరి అన్నా హుంకరిస్తో . 
ఏమిటోయ్ నీ బాధా  ! అడిగేరు  అయ్యరు గారు . 
నా బ్లాగు టపాలని కాపీ కొట్టే స్తున్నారు జనాలు . నా జ్ఞాన సంపద ని కాపీ రైటు లేకుండా లెఫ్టు రైటు కాపీ కొట్టేస్తూ నా పేరు కూడా ఉదహరించ కుండా అంతా తమదే నన్నట్టు రాసేసు కుంటున్నారు మళ్ళీ ఇంతెత్తు కి ఎగిరా . 
ఏమన్నావ్ నీ జ్ఞాన సంపదా ? అడిగేరు అయ్యరు గారు
అవును నా జ్ఞాన సంపద, నా విజ్ఞానం, నా అనుభవ సారం అంతా కలబోసి నేను టపాల ని పుష్పమాల గా కూరుతూంటే , జనాలు విచ్చల విడి గా పుష్పాపచయం చేస్తున్నారు . 
పుష్పాపచయం ! మంచి పదమే వాడేవు జిలేబి !! పుష్పాపచయం కాకుంటే, పుష్పం మరో రోజులోపు నేల పాలు! అయ్యరు గారు ఫక్కున నవ్వేరు!
నీ జ్ఞాన సంపద ? నీ విజ్ఞానం ? అవన్నీ నీ కెవరు ఇచ్చేరు జిలేబి ? అయ్యరు గారు అడిగేరు  
ఎవరిచ్చేరు అంటే ? ఎవరివ్వడం ఏమిటి ? అవి నావే అవి నావే అన్నారెండో మారు నావే అన్నప్పుడు నా కెందుకో మరి సందేహం వచ్చింది . నావ నావ ఈ శబ్దం దేన్నో సూచిస్తోందే ? ఏమిటది చెప్మా అన్న ఆలోచనలో పడ్డా .
'ఏదో ఆలోచనలో పడ్డట్టు ఉన్నావే జిలేబి ? అయ్యరు గారు బాణం ఎక్కు పెట్టేరు . 
అంటే , నావే కదా ఈ జ్ఞాన సంపద ? 
'నావే' మరి ! అయ్యరు గారు నావని నొక్కి వక్కాణించేరు . 
ఈ జ్ఞానం ఎవరిచ్చేరు నీకు జిలేబి ?
మళ్ళీ ఆలోచనలో పడ్డా . 
ఈ జ్ఞానం నీకు కాకుంటే వేరే ఎవరికైనా దక్కే అవకాశం ఉందంటా వా ? 
ఏమో ఈ మారు కొంత లో వాయిస్ అయ్యింది నాది .
ప్రకృతి నీ ద్వారా కాకుంటే మరో ఎవరి ద్వారో ఈ జ్ఞానాన్ని పంచి పెట్టేది కాదా ? 
కాదని చెప్పటానికి ఎందుకో సందేహం వచ్చింది .
  
సమోహం సర్వ భూతేషు ! అన్నాడు పై వాడు . 
మా కాలం లో రైట్ హాన్రబాల్ శ్రీనివాస అయ్యరు గారి ప్రసంగాలు , లెక్చర్లు చదివే వాళ్ళం. ఆహా ఏమి వీరి అంగ్ల పాటవం ! ఏమి వీరి జ్ఞాన సంపద అనుకుని అబ్బుర పడే వారం . ఈ కాలం లో ఈ రైట్ హానరబెల్ శ్రీనివాస అయ్యరు గారి గురించి వారి రచనల గురించి ఎవరి కైనా చెబ్తే , ఆ ఎవరాయన అని అడగరా ? 
అడుగుతారు అన్నట్టు తలూపా . నేనే మరిచి పోయా అట్లాంటి మేధావుల గురించి .
అంటే కాల వాహిని లో మనం వ్రాసేవి, వెలుబరచేవి ఆ కాలానికి, మరీ మించి పోతే  మరో ఒక తరానికి రంజు గా ఉండ వచ్చు. ఆ పాటి దానికి నా జ్ఞానం నా సంపదా అంటూ , తెలిసిన వాటిని కూడా (ఆ తెలియబరచిన వాడెవ్వడు?) మనం చెప్పడం మానేయటం సబబేనా ? అయ్యరు గారి పృచ్చ ! 
ఈ అయ్యరు గారి వైపు సూటి గా చూసా . చాలా సహజం గా ఏమీ తెలియని భోళా మనిషి గా కని పిస్తాడు గాని, ఇట్లాటి 'విష్ణు మాయ ' లో పడి పోయినప్పుడు మాత్రం విచిత్రం గా ప్రశ్న లతో నే కొంత కనువిప్పు కలిగిస్తాడు సుమీ అనుకో కుండా ఉండ లేక పోయా !
అంతే నంటారా ? 
"కాదా మరి ? నీకు తెలిసింది నువ్వు తెలియ బరచు. ఎవరో ఎదో కాపీ కొట్టే స్తున్నారని నువ్వు చెప్పటం ఆప మాకు ! 
నువ్వు కాకుంటే మరొక్కరెవ్వరినో ప్రకృతి వరిస్తుంది. " 
తలూపా. తల నాదేనా మరి మళ్ళీ సందేహం !!
'some' దేహం ఇచ్చిన ఆ సమ 'దేహుడు' ఈ మెదడు నిచ్చి చాలా తప్పు చేసేడు సుమీ అనుకో కుండా ఉండ లేక పోయా !!
చీర్స్
జిలేబి 
(
శ్రీ కష్టే ఫలే శర్మ గారి -  బ్లాగు అమ్మకానికి గలదు టపా చదివేక!)