ఇచ్చట జిలేబీలు అమ్మకానికి గలవు !
ఏమిటోయ్ జిలేబి ,మరీ చిట చిట లాడి పోతున్నావు అయ్యరు గారు నిమ్మళం గా అడిగేరు .
నా ముక్కు పుటాలు అదిరేయి . భూదేవి భయపడి కందింది కాలి అందెల జోరుకి .
వామ్మో జిలేబి ఇది నువ్వే నా ? ! ఇంత గా ఆకాశానికి ఎగిరెగిరి పడి నీ కోపాన్ని ప్రదర్శిస్తున్నావ్ ! అయ్యరు గారు హాశ్చర్య పడి పోయేరు .
కాదా మరి కాదా మరి అన్నా హుంకరిస్తో .
ఏమిటోయ్ నీ బాధా ! అడిగేరు అయ్యరు గారు .
నా బ్లాగు టపాలని కాపీ కొట్టే స్తున్నారు జనాలు . నా జ్ఞాన సంపద ని కాపీ రైటు లేకుండా లెఫ్టు రైటు కాపీ కొట్టేస్తూ నా పేరు కూడా ఉదహరించ కుండా అంతా తమదే నన్నట్టు రాసేసు కుంటున్నారు మళ్ళీ ఇంతెత్తు కి ఎగిరా .
ఏమన్నావ్ నీ జ్ఞాన సంపదా ? అడిగేరు అయ్యరు గారు
అవును నా జ్ఞాన సంపద, నా విజ్ఞానం, నా అనుభవ సారం అంతా కలబోసి నేను టపాల ని పుష్పమాల గా కూరుతూంటే , జనాలు విచ్చల విడి గా పుష్పాపచయం చేస్తున్నారు .
పుష్పాపచయం ! మంచి పదమే వాడేవు జిలేబి !! పుష్పాపచయం కాకుంటే, పుష్పం మరో రోజులోపు నేల పాలు! అయ్యరు గారు ఫక్కున నవ్వేరు!
నీ జ్ఞాన సంపద ? నీ విజ్ఞానం ? అవన్నీ నీ కెవరు ఇచ్చేరు జిలేబి ? అయ్యరు గారు అడిగేరు
ఎవరిచ్చేరు అంటే ? ఎవరివ్వడం ఏమిటి ? అవి నావే అవి నావే అన్నారెండో మారు నావే అన్నప్పుడు నా కెందుకో మరి సందేహం వచ్చింది . నావ నావ ఈ శబ్దం దేన్నో సూచిస్తోందే ? ఏమిటది చెప్మా అన్న ఆలోచనలో పడ్డా .
'ఏదో ఆలోచనలో పడ్డట్టు ఉన్నావే జిలేబి ? అయ్యరు గారు బాణం ఎక్కు పెట్టేరు .
అంటే , నావే కదా ఈ జ్ఞాన సంపద ?
'నావే' మరి ! అయ్యరు గారు నావని నొక్కి వక్కాణించేరు .
ఈ జ్ఞానం ఎవరిచ్చేరు నీకు జిలేబి ?
మళ్ళీ ఆలోచనలో పడ్డా .
ఈ జ్ఞానం నీకు కాకుంటే వేరే ఎవరికైనా దక్కే అవకాశం ఉందంటా వా ?
ఏమో ఈ మారు కొంత లో వాయిస్ అయ్యింది నాది .
ప్రకృతి నీ ద్వారా కాకుంటే మరో ఎవరి ద్వారో ఈ జ్ఞానాన్ని పంచి పెట్టేది కాదా ?
కాదని చెప్పటానికి ఎందుకో సందేహం వచ్చింది .
సమోహం సర్వ భూతేషు ! అన్నాడు పై వాడు .
మా కాలం లో రైట్ హాన్రబాల్ శ్రీనివాస అయ్యరు గారి ప్రసంగాలు , లెక్చర్లు చదివే వాళ్ళం. ఆహా ఏమి వీరి అంగ్ల పాటవం ! ఏమి వీరి జ్ఞాన సంపద అనుకుని అబ్బుర పడే వారం . ఈ కాలం లో ఈ రైట్ హానరబెల్ శ్రీనివాస అయ్యరు గారి గురించి వారి రచనల గురించి ఎవరి కైనా చెబ్తే , ఆ ఎవరాయన అని అడగరా ?
అడుగుతారు అన్నట్టు తలూపా . నేనే మరిచి పోయా అట్లాంటి మేధావుల గురించి .
అంటే కాల వాహిని లో మనం వ్రాసేవి, వెలుబరచేవి ఆ కాలానికి, మరీ మించి పోతే మరో ఒక తరానికి రంజు గా ఉండ వచ్చు. ఆ పాటి దానికి నా జ్ఞానం నా సంపదా అంటూ , తెలిసిన వాటిని కూడా (ఆ తెలియబరచిన వాడెవ్వడు?) మనం చెప్పడం మానేయటం సబబేనా ? అయ్యరు గారి పృచ్చ !
ఈ అయ్యరు గారి వైపు సూటి గా చూసా . చాలా సహజం గా ఏమీ తెలియని భోళా మనిషి గా కని పిస్తాడు గాని, ఇట్లాటి 'విష్ణు మాయ ' లో పడి పోయినప్పుడు మాత్రం విచిత్రం గా ప్రశ్న లతో నే కొంత కనువిప్పు కలిగిస్తాడు సుమీ అనుకో కుండా ఉండ లేక పోయా !
అంతే నంటారా ?
"కాదా మరి ? నీకు తెలిసింది నువ్వు తెలియ బరచు. ఎవరో ఎదో కాపీ కొట్టే స్తున్నారని నువ్వు చెప్పటం ఆప మాకు !
నువ్వు కాకుంటే మరొక్కరెవ్వరినో ప్రకృతి వరిస్తుంది. "
తలూపా. తల నాదేనా మరి మళ్ళీ సందేహం !!
'some' దేహం ఇచ్చిన ఆ సమ 'దేహుడు' ఈ మెదడు నిచ్చి చాలా తప్పు చేసేడు సుమీ అనుకో కుండా ఉండ లేక పోయా !!
చీర్స్
జిలేబి
(శ్రీ కష్టే ఫలే శర్మ గారి - బ్లాగు అమ్మకానికి గలదు టపా చదివేక!)
జిలేబీగారూ,
ReplyDeleteమీ హాస్యప్రియత్వం అభినందనీయం. కాని అన్ని సందర్భాల్లోనూ హాస్యం పనికిరాదు. నిజమే, శర్మగారు కాకపోతే మరొకరు జ్ఞానసంపదను వితరణం చేస్తారు - అనుమానం అక్కరలేదు. కాని దానర్థం జ్ఞానశీలురను అవమానించే స్థితిని మనం నిరోధించాలన్నదీ ముఖ్యమైన విషయమే. సందర్భాన్ని గమనించకుండా అన్నీ అతితేలిగ్గా తీసుకోవటం వలన సమాజానికే నష్టం. సుద్దులు చెప్పేవారిని అవమానిస్తున్న సమాజం లో కుర్చొని మనం అయ్యా మీరు చెప్పటం మానకండి అనే హక్కు కలిగి ఉండము.
Deleteశ్యామలీయం వారు,
ఒప్పుకుంటున్నా . మరి ఆ కాపీ కొట్టే వాళ్ళ లింకులు మనం బయట పెట్టె టందుకు ఎందుకు జంకు తున్నాం ??
జిలేబి
రైట్ ఆనరబుల్ శ్రీనివాస "శాస్త్రి" గారు అని విన్నాను. రైట్ ఆనరబుల్ శ్రీనివాస "అయ్యరు" కూడా ఉండేవారా?
ReplyDeleteవిన్నకోట వారు,
ReplyDeleteవారు శాస్త్రి గారే ! కాల గతి లో పూర్తి పేరు కూడా గుర్తుండవు అన్నదానికి ఇదియే మరి రుజువు !!
నెనర్లు
జిలేబి
Thanks.
ReplyDeleteఇక శర్మ గారి విషయానికొస్తే, పరిణామాలు వారికి చాలా బాధ కలిగించాయని తెలుస్తూనే ఉంది. వారి నిర్ణయం ఆ బాధ మూలంగానూ, సమస్యకి పరిష్కారం దొరకట్లేదనిన్నూ తీసుకున్నట్లు తోస్తోంది.
IP (Intellectual Property) అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విషయం. శర్మ గారికి తెలియదనుకోను. వ్యాపారదృష్టి తో కాక సరదాగా వ్రాసుకుంటున్న బ్లాగు అయినప్పటికీ వారు తీసుకున్న నిర్ణయం బట్టి వారు చాలా సున్నిత మనస్కులని తెలుస్తోంది.
మీరన్నట్లు కాపీ కొట్టే వాళ్ళ లింకులు బాహాటంగా ఇవ్వవచ్చు. అలా చెయ్యటానికి తన సభ్యత ఒప్పుకోవట్లేదని శర్మ గారు తన బ్లాగులో చెప్పారు. ఇక శ్రీనివాస్ గారు సలహా ఇచ్చిన "కాపీస్కేప్" గురించి శర్మ గారు ఓ ముతక సామెత తో తన అభిప్రాయం చెప్పేసారు కదా.
వారి శ్రేయోభిలాషులు, అభిమానులు నచ్చజెప్పి మనసు మార్చే ప్రయత్నాలు ఉధృతంగా చేస్తున్నారు, అభినందిచదగినది. శర్మ గారు తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకుంటారని ఆశిద్దాం.
జిలేబీగారు, కాపీలు కొట్టే వాళ్ళ విషయం మీద నేను చాలా ఆగ్రహంతో ఉన్న మాట వాస్తవం. మీ టపాలో కనిపించిన హాస్యరసాన్ని ఆస్వాదించే మానసికస్థితిలో లేక అనుచితంగా మీ టపా మీద కోపం వెలిబుచ్చాను. క్షమించగలరు. ఈ కాపీలను నిరోధించే విషయం మీద నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. వివరాలు చెప్పటం అనేది అనేక పెరామీటర్ల మీద ఆధారపడుతుంది - అది మీకూ తెలుసు ననుకుంటున్నాను. ఈ విషయంలో చర్చించేందుకు మీరు నాకు ఒక ఇ-మెయిల్ పంపగలరా? నా శ్యామలీయం బ్లాగును ఒకసారి చూడండి నా ఇ-మెయిల్ వివరం కోసం.
ReplyDeleteనరసింహారావుగారూ,
శర్మగారి నిర్ణయం అత్యంతబాధాకరం. వారు అత్యంతసున్నిత మనస్తత్తవం కలవారన్నదే నా నమ్మకమూ. మీరు రాసుకుంటూ పొండి - మేము దోచుకుంటూ పోతాం అనే బాపతు జనాన్ని కట్టడి చేయటం అసాధ్యంగా కనిపించే శర్మగారు నిష్క్రమణ నిర్ణయాన్ని తీసుకున్నారనుకుంటున్నాను. నా బ్లాగుపరిస్థితిని నేనూ ఒకసారి పరిశోధించుకోవాలి ఎంత దాంట్లో కాపీరాయళ్ళకు పనుకొచ్చే సరుకు ఉండదనుకుంటున్నా సరే. అందరూ తమ బ్లాగుల పరిస్థితిని శోధించుకోవాలనీ విజ్ఞప్తి చేస్తున్నాను.
అన్నట్లు జిలేబీగారూ, ఆ రైట్ హాన్రబాల్ శ్రీనివాస అయ్యరు గారే ననుకుంటాను 'భగవంతుడి దయవల్లనే మనని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నా' రని అన్నది?
ReplyDeleteఅప్పట్లో చాలామంది అలాగే ఫీలయ్యే వాళ్ళు - గురజాడ కూడా అంతే కదా!!
Deleteహరిబాబు గారు, గురజాడ వారి గురించి మీరు అన్నదానికి ఋజువు / సోర్స్ ఏమైనా ఉన్నదా?
Deleteఆయన దేశభక్తి, విజయ నగర రాజుల పట్ల స్వామిభక్తి కలిగి ఉండేవారని నా చదువు పరిధిలో నేను గ్రహించగలిగినది. ఆంగ్లేయుల పాలన మన అదృష్టం అనే భావం వ్యక్తీకరించినట్లు తగల్లేదు నా మటుకు. మీరు విశదీకరిస్తే తెలుసుకుందామని.
స్వాతంత్ర్య భారత సంగ్రామాన్ని వ్యతిరేకిస్తూ చాలా వాదనలు చేశాడు.రుజువులు ఇప్పటికిప్పుడు చూపించలేను.కానీ ఈ చర్చ చాలాచోట్ల వచ్చింది.
Deleteచాలా కవితల్లో కూడా ఇంగ్లీషువాళ్లని పొగిదే చరణాలు వున్నాయిగా - శాంపిల్ కి తోక చుక్క(?)లోనా ఇంత యగునని ఇంగ్లిలీజు లెరుగరో? అనే లైను వుంటుంది. పరిపాలించటం మన అదృష్తం అని ముక్కకు ముక్కా అనకపోయినా ఇంగ్లీషు వాళ్లకి విధేయంగా వుంటేనే ఈ దేశం బాగుపడుతుందని స్వతంత పోరాటాన్ని వ్యతిరేకించాడు.
Deleteగురజాడ సాహిత్యంలో ఇంగ్లీషు వాళ్ల పట్ల సాఫ్ట్ గా వుండటం, స్వాతంత్రోద్యమాన్ని వ్యతిరేకించటం గురించి ఆన్ లైన్లోనే కొన్ని వ్యాసాలు చదివాను.అవి ఇంగ్లీష్ ఆర్టికిల్స్.ఇప్పుడు గూగుల్ బాక్సు లో ట్రై చేస్తుంటే దొరకదం లేదు, యెందుకనో?నేను పొరపాటు గా మాత్రం చదవ లేదు, తీరిగా వెదకాలి.అబధ్ధ మయితే నాలుక కరుచుకోవదం తప్ప చెయ్యగలిగింది లేదు.
Delete