Monday, September 15, 2014

దేవుడా! టపా ఎవరూ ఎత్తుకు పోకుండా చూడూ ! (హవేల్దార్ హరి రాం సింగ్ కథ!)

దేవుడా! టపా ఎవరూ ఎత్తుకు పోకుండా చూడూ ! (హవేల్దార్ హరి రాం సింగ్ కథ!)

దేవుడా !

పైనున్న దేముడు ఉలిక్కి పడ్డాడు !

పంచ దశ లోకం నించి మరీ 'ది' నాటీ , ది నాటీ గా ఎవరో ఒక జిలేబీ అశ్రు ధారా ప్రవాహిని అయి పిలుస్తోంది !

జిలేబి ఏమి నీ కోరిక ! పై నున్న 'భాగ' మంతుడు అడిగేడు .

నా టపాలు ఎవరూ ఎత్తుకు పోకుండా చూడు ! జిలేబి కోరింది .

దేవుడు నిట్టూర్చేడు .

హవేల్దార్ హరి రాం సింగ్ అవతారం దాల్చడానికి ఉద్యుక్తు డయ్యేడు .

దేముడి పెండ్లాం నా కేమి ఉద్యోగం సామీ అంది .

హవేల్దార్ కి ప్రేయసి గా నువ్వు పంచ దశ లోకం లో పుట్టి ఆ లోకం లో నే నువ్వు బలాదూరు టపాలు రాస్తూ ఉంటావు . నా హవేల్దారు హరి రాం సింగు 'జాన్' 'మాల్' లో నిన్నే నే పెండ్లాడు తా ! దేముడు చెప్పేడు .

మరి మాకు స్వామీ ! ద్వార పాలకులు అడిగేరు .

మూడు మాడి పోయేలా మీరు కౌపీన కాపీ ధారులై , కాపీ రౌతు లై పంచ దశ లోకం లో వికటాట్ట హాసం చేస్తో బతకండి . మిమ్మల్ని కాపీ రైటు కింద నేను బుక్ జేసి మీకు మళ్ళీ మోక్ష మిస్తా ! దేముడు ఆశీర్వ దించేడు .

సీను బదలయ్యింది --

పంచ దశ లోకం లో భక్తులు దేవా కనరావా అంటూ పాటలు పాడటం మొదలెట్టేరు .

అదిగో అల్లదిగో ఏతెంచు చున్నాడు పంచ దశ లోక మునకు -- హవేల్దార్ హరి రాం సింగ్ !!

శ్రీ మద్రామా రమణ హరీ !!

కంత ల మంచెం పై నుండి నిద్ర లో దబ్బున అటు తిరిగి ఇటు తిరిగి నేల మీద పీపా లా పడ్డది జిలేబి - వామ్మో ఇది ఏమి విష్ణు మాయ కలయో అనుకుంటూ నిదుర లేచి కన బడని కనులకి లోలాకులు పెట్టేసు కుని సీరియస్సు గా ఓ టపా రాయటం మొదలెట్టింది -- అదియే ఈ హవేల్దార్ హరి రాం సింగ్ కథ !!


శుభోదయం
జిలేబి
 

1 comment:

  1. Very interesting! I had to use google to translate it so it was a bit confusing, but very bthoughtful

    ReplyDelete