మేము ఆస్తికుల మోయ్, శానా గొప్పోళ్ళం !
అగ్ని మీళే పురోహీతం !
ఆ ఇంతకీ దేముడు రాయిలో ఉండాడా ? రప్పలొ ఉండాడా ?
కనిపిస్తాడా ? కనిపిం చడా ?
నమ్మకుమున్న వాళ్ళ కె కనిపిస్తాడా ?
ఓయ్ ! మీరు నాస్తికులు . ఛీ ఛీ పో పో ! మీకు వాడు కనిపించడు !
'ఓయ్ ! నిజంగా వాడే ఉంటె , నమ్మకమున్నా లేకున్నా కనిపించాలి కదా ఉంది, ఉన్నాడు, ఉన్నది అంటే నమ్మకానికి అతీవల కనిపిం చాలీ గదా ?
ఆయ్ ! నో నో నో ! నువ్వు నాస్తికురాలివోయ్ ! నీకు కనిపించడు ;
సరే ఆస్తికా ! అస్తు ! ఇంతకీ నీ దేముడు విగ్రహంలో , రాయి లో ఉండాడా ? దానికేమైనా శాస్త్రం గట్రా ఉందా అని నిరూపణ ఉందా ?
శాస్త్రం మనిషి వ్రాసిందోయ్ ! ఆ పై వాడు ఉన్నాడు అన్నది నిజమైతే, మనిషి వ్రాసిన శాస్త్ర నిరూపణ ఉంటె ఏమిటి ? లేకుంటే ఏమిటి ?
ఆయ్ ! అట్లా కాదు నిరూపణ కానిదే ఉన్నాడా లేదా అన్నది సత్య దూరం కాదు ! కాబట్టి శాస్త్ర నిరూపణ కావాల్సిందే
నాస్తికుడు బుర్ర గోక్కున్నాడు !
వీళ్ళ పిండా కూడు ! ఉన్నాడు అంటారు ! ఉన్నాడు అన్న వాణ్ని గొప్పగా సర్వాంతర్యామి అంటారు ! రాయి లో ఉండాడు ,రప్పలొ ఉండాడు , నీలో ఉండాడు, నాలో ఉండాడు మనం దరిలో ఉన్నాడు అంటారు ! మళ్ళీ క్రేజే ఆస్తికాస్ , యు సి, మళ్ళీ నిరూపణ కావాలి అంటారు !
అబ్బ ! నాస్తికత్వమే బెష్టు ! లేదు ! తంటా వదిలే! వెతికితే ఉంటాడు; నీ నమ్మకాన్ని బట్టి కనిపిస్తాడు గట్రా ఇఫ్ బట్ నో స్టేట్మెంట్ లు లేవు !
మేం ఆస్తికులమోయ్ ! శానా శానా గొప్పో ళ్ళం !
శుభోదయం
జిలేబి
నాస్తికత్వమే బెష్టు ! లేదు ! తంటా వదిలే! Best
ReplyDeleteఅవునండీ, ముందు మీరు దేవుణ్ణి నమ్మాలి!
ReplyDeleteఆ తర్వాతే మేం శాస్త్రబద్ధంగా నిరూపిస్తాం, నమ్మితే గానీ మా నిరూపణ మీకర్థమవదు.
ఇంకో మాటలో చెప్పాలంటే... మేం నిరూపించింది మీకర్థం కాలేదంటే మీరింకా సరిగా నమ్మడం లేదన్న మాట!!