జిలేబి బూరెలు - ఎవరిని దండిం చాలి ?
బ్లాగు రీడర్లు , మొదట ఈ కథ చదవ వలె - ఆ పై ఈ టపా గిలిగిం తలు :)
అందరి నీ ఝాడిం చాలి అంటే దండించాలి అని జిలేబి రాణీ వారి ఆజ్ఞ మేరకు రాజు అందరిని దండిం చేడు .
దండిం చిన తరువాయి జిలేబి రాణీ వారి ని రాజా వారు అడిగేరు - మహారాణీ ! అందరిని దండిం చాలి అన్నావ్ ! నీ మాట మేరకు దండిం చేశా ! ఇంతకీ అందరినీ ఎందుకు దండిం చ మన్నట్టు ?
జిలేబి మహా రాజ్ఞి ఇలా సమాధానమిచ్చింది .
"ప్రభూ ! అందులో ఘన కార్యం చేసిన వారు ఉన్నారు నీతి నియమాలకి తావివ్వక ; అంటే మీ రాజ్యం లో నీతి విలువలు వలువలు వదిలిన స్త్రీ లా ఉంది .
కార్యానికి ప్రతి దండనం తామే ఇచ్చిన వారు ఉన్నారు , మీ రాచరికాన్ని మన్నించక దండాన్ని తమ చేతుల లో తీసుకుని ;
ఘన కార్యానికి వత్తాసు ఇచ్చిన వాళ్ళూ ఉన్నారు - దానిని ఖండించక .
ఆ ఘన కార్యాన్ని చూసీ చూడనట్టు ఉన్న వారూ ఉన్నారూ , వారికి బుద్ధి చెప్పక, మీ రాజా వారి ఆస్థానానికి ఆ సంఘటన గురించి చెప్పక .
ఇట్లా అందరూ దండనార్హులే . అని జెప్పి ...
ఆ పై ఆ ఘన కార్యానికి మూల భూతమైన కల్లు తాగిన వారూ ఉన్నారు . వారు కల్లు తాగడానికి మూలం మీ రాజ్యం లో మీరు అనుమతించిన కల్లు దుకాణా లు ...
సో, రాజా ఇందులో మీకూ భాగముంది అని రాజా వారి వైపు చూసింది జిలేబి రాణి .
రాజా వారు తలూపేరు .
ఆ పై వారి రాజ్యం లో దండోరా వేయిం చేరు - కల్లు దుకాణా లన్నీ బందు అని .
కథ సిలికాన్ వేలీ కి ...
మనమంతా కామెంట్ వేలీ కి ....
చీర్స్
జిలేబి
పని లేక పిపీలికమైన వారి పంచాగ్ని టపా కి కామెంటు కొట్టాలని ఆశ పడి న వారు ఇక్కడ కామెంటులు కొట్ట వచ్చు :)
ReplyDeleteకామెంటడం మా బ్లాగ్జన్మ హక్కు :)
ఇట్లా కామెంట్లు మూత బెట్టి మూట కట్టేయడానికి నిరసనావ్రతం తెలియ జేస్తున్నాం :)
చీర్స్
జిలేబి
(రండి అందరం కలిసి కా 'మింట్లు' కొడతాం :))
శ్యామలీయం వారికి,
ReplyDeleteమీ మాలిక లో కథ గురించి. అక్కడ మిమ్మల్ని కా మింటు తో కొట్ట డానిక్ ఫేకు బుక్కు లేకుంటే యా హూ అక్కౌంటు కావలె ! అవన్నీ లేవు . కాబట్టి కామింటు ఇక్కడ కొడు తున్నా :) మీరు కూడా కామింటు దుకాణం మీ బ్లాగు లో బందు జేసి నట్టు ఉన్నారు : కామింటు కోరితే మాత్రం చాలదు - కామింట డా నికి సుళువు కూడా కల్పించ వలె :) జేకే :
కథ బాగుంది
మిగిలిన భాగాల కోసం ఆసక్తి తో ఎదురు చూస్తున్నాం.
ఇంతకీ ఆసక్తి తో ఎదురు చూడడం అహింస యా లేక హింసయా ??
జిలేబి
పొరపాటైనది.. ఇంత ఇబ్బందని తెలియలేదు. వ్యాఖ్యలకు తలుపులు తెరువబడినవి!
Deleteకల్లు దుకాణాలు బందయితే అంతా బందే!
ReplyDeleteసరిగ్గా సంవత్సరం తర్వాత...
ReplyDelete"రాజా! పొరుగుదేశం దండయాత్రకు సన్నాహాలు చేస్తోంది!! ఎప్పుడైనా మీద పడొచ్చు!!!"
"ఆ! వెంటనే మన సైన్యాన్ని అప్రమత్తం చేయండి. ఆ బిజ్జల దేవుని పీచమణుద్దాం."
"అంత సీనులేదు ప్రభూ. బిజ్జల దేవుడు అమ్రికా నించి లేటేస్టు జెట్ ఫైటర్లు, హవిట్జర్లూ తెప్పించుకున్నాడట!! యుద్ధం జరిగితే ఒక రోజులో మన పని ఖాళీ!"
"అలాగా? అయితే సూట్ కేసులు నింపండి. అమ్రికా ఫ్లైట్‌కి టికెట్ బుక్ చేయండి. మనం కూడా తెద్దాం వాడికంటే లేటెస్ట్ మోడల్‌వి."
"డబ్బుల్లేవ్ ప్రభూ! ఖజానా ఖాళీగా వుంది!!"
"అలాగా? ఎప్పుడూ నిండుగా వుండే ఖజానా ఖాళీ ఎలా అయింది?"
"కల్లు నిషేధించారుగా?"
"ఓహ్ చచ్చాం! అయినా ఎప్పుడూ బీదరుపులు అరిచి మన వద్ద అప్పులు తీసుకునే బిజ్జల పీనుక్కి అంత డబ్బెక్కడిది?"
"పొలిమేరల్లో బార్లు తెరచి మన వాళ్ళ దగ్గరే ఇబ్బడి ముమ్మడిగా డబ్బుల్లాగాడు ప్రభూ!"
(సరిగ్గా సంవత్సరం ముందరి ఫ్లాష్ బ్యాక్)
***
మూలం మీ రాజ్యం లో మీరు అనుమతించిన కల్లు దుకాణా లు ...
సో, రాజా ఇందులో మీకూ భాగముంది అని రాజా వారి వైపు చూసింది జిలేబి రాణి.
రాజా వారు తలూపేరు.
***
"అరే! ముందీ రాణీ***ని లోపల తోయండిరా!"
ఇంకెక్కడి రాణీ ప్రభూ? నిన్న రాత్రే లేచిపోయి పొరుగు దేశం చేరింది!!
కథ సమాప్తం.
శ్రీ కాంత్ చారి గారు,
Deleteఆంధ్రుల వేదనకు అక్షర రూపమిస్తున్న మీకు అభినందనలు" :)
జిలేబి
నా వ్యాఖ్యలో ఆంధ్రుల వేదన దాగివుందా జిలేబీ గారూ? ఆ ముక్క నాకే తెలీదు!?!
Deleteపంచాగ్ని కి దీటు - మోహన్లాల్ మరో చిత్రం - 'స్పిరిట్' వెరీ వెరీ వండర్ఫుల్ మూవీ. ఇంకా కూడా చెప్పా లంటే, తన్మాత్రా కూడాను .
ReplyDeleteజిలేబి