పట్టు మామి, ఉణక్కు వేలై ఒన్ణుం ఇల్లయా :)
అబ్బబ్బా, అయ్యరు వాళ్ ఈ మధ్య మరీ పిచ్చ పిచ్చ గా ఉందండీ ! చెప్పా మా అయ్యరు గారి తో !
ఏమోయ్ నీకొచ్చిన 'కష్టం' ? అయ్యరు గారు హిందూ పేపర్ లో మోడీ వర్సెస్ ఆల్ (ఇందులో తర తమ బేధం లేకుండా అన్ని పార్టీలు ఉన్నట్టున్నాయిస్మీ:)) న్యూస్ ఐటెం చదువుతూ తలెత్తి కనబడని కళ్ళద్దా లని సరి జేసుకుని చూసేరు .
అసలు ఏమీ పనిపాటా లేకుండా పోయిన్దండీ చెప్పా అయ్యరు గారి తో ;
ఎందుకోయ్ ?
"ఈ మధ్య బ్లాగు లోకం లో సరి ఐన టపాలు ఏమీ రావడం లేదండీ ! టపా కంటెంటు మారినా కామింట్లలో శ్రీ మాన్ రామ ప్పెరుమాళ్ వారు నలిగి పోతున్నారు ; సీతమ్మ బెబ్బెలు పడి పోతున్నట్టు ఉన్నది నా కైతే " చెప్పా వారితో
దానికీ నీ పిచ్చ పిచ్చ కి సంబంధం ఏమిటోయ్ ? బుర్ర అర్థమయ్యీ అర్థమవనట్టు ఊపి ప్రశ్నిం చేరు అయ్యరు గారు .
ఆ ఏముందండీ, అందరూ గోదారి పుష్కరాలంటూ వెళ్ళా మంటూ టపాలు రాస్తున్నారు ; మనమూ వెళ్దా మా " అడిగా అయ్యరు గారి తో .
ఇదిగో జిలేబి నాకు 'ఇరుక్కుం' ఇడమే వైకుంటం' ! ఆ గోదారి దాకా పోవాలంటే ఈ శాల్తీ ఎంత కష్ట పడాలి నీకు తెలిసిందే కదా అన్నారు అయ్యరు గారు ;
అబ్బబ్బా ! ఈ పడక్కుర్చీ వేదాంతా నికి ఏమి గాని .. ఈ మధ్య బ్లాగు లోళ్ళు పట్టు మామీ నీకు వేరే వేలై ఏమీ లేదా అని అడిగే రండీ మళ్ళీ చెప్పా .
వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ముంది జిలేబి ? నువ్వు ఉబుసుపోక తెల్లారి గట్రా నేను వేడి వేడి గా వేసిన కాఫీ లాగించేసి బ్లాగుల మీద పడతావు ! అట్లా జూస్తే, పెందరా ళే పని పాటా లేకుండా ఉన్న వాళ్ళే కదా ఇట్లా టపాలు , కామింట్లు గిలుకుతారు అని జనం అనుకుంటారు - చెప్పేరు అయ్యరు గారు .
అబ్బ ! ఈ అయ్యరు గారు ఎప్పుడైనా నాకు వత్తాసు పలుకుతారా ; ఊహూ నెవెర్ ఇన్ యువర్ లైఫ్ జిలేబి అని అనుకో కుండా ఉండలేక పోయా .
ఇంతకీ ఏమన్నారోయ్ బ్లాగు లోళ్ళు ? ఉత్సుకత తో అడిగేరు లెగ్ పుల్లింగ్ జేస్తూ
ఇట్లా అన్నారండీ జెప్పా :
"ఓ సౌభాగ్యవతి
నీవు పతియే ప్రత్యక్ష దైవమని ,
పతి పాదపద్మములే కైవల్య పదమని,
పతి సేవే మోక్ష మార్గమని ఎరిగిన ఇంతివని,
అయ్యర్ సేవ చేసుకొనే వృద్ద నారిశిరోమణివని "
అయ్యరు గారు పడక్కుర్చీ నించి క్రింద పడి పోతారేమో అన్నంత గా బిగ్గరగా నవ్వేరు .
"జిలేబి నీకు జనాలు ఇంత మంచి తాకీదు ఇచ్చెరా ! ఔరా ! కాల మహిమ కాకుంటే, అయ్యరు తెల్లారి గట్రా నిద్ర లేచి కాఫీ పెట్టి జిలేబి ని నిద్ర లేపి , బీ లేజీ నించి వాయగొడితే, ఆ జిలేబి పంచ దశ లోకం లో కామింటులు కొడుతూ టీం అండ్ తిండి పాస్ చేస్తూ బతి కేస్తోంటే , పతి సేవే మోక్ష మార్గమని ఎరిగిన ఇంతి వని, వాణీ , నా జిలేబి నిన్ను పొగిడేరా " అంటూ ఆ పై మూర్చ పోయేరు !
అయ్యరు వాళ్ అయ్యరు వాళ్ అంటూ వారి మొగమ్మీధ వారిచ్చిన కాఫీ ఏ కొంత చల్లా! ఆ వేడి కి ఉలిక్కి పడి
"జిలేబి! ఇది నిజంగా కాల మహిమయే ! -" అంటూ మరో మారు నొక్కి వక్కాణిం చేరు !
పోనీ లెండి అయ్యరు గారు ! ఆ క్రెడిట్ లో మీకో సగం ఇచ్చేస్తా ! చెప్పా - ఈ మధ్యే అర్ధనారీ తత్వమే అద్వైత మని ఒక మహానుభావులు వారు సెలవిచ్చిన వైనం గుర్తుకొచ్చి !
చీర్స్
జిలేబి
(வேலை இல்லாத கண்மணி :)
This comment has been removed by the author.
ReplyDeleteనారీతత్త్వం మహత్తత్త్వం పరతత్త్వ మయోమయమ్।
ReplyDeleteఅర్థం పురుషతత్త్వశ్చ నారీభాగ మితి స్మృతమ్॥
అబ్బబ్బా, అయ్యరు వాళ్ ఈ మధ్య మరీ పిచ్చ పిచ్చ గా ఉందండీ? :)
ReplyDelete