Saturday, July 9, 2016

దేముడు బాబాయ్ :)

దేముడు బాబాయ్ :)
 
రాముడిని వెతుకబోవ దేముడు కనబడెన్ !

ఈ మధ్య బ్లాగులో దేముడు బాబాయ్ ఎక్కువ గా కనబడటం మొదలెట్టడం తో బెత్తం మేష్టారు దేముడు లో ము గాదోయ్ వు ఉండాలోయ్ అంటూ వెనుక బడేరు :)

గురువు గారి వెనుకే శిష్య పరమాణువు గూడా బడేను !

ఈ ము కారము ఎట్లా వచ్చి ఉండ వచ్చు ? అని ఆలోచిస్తే ఓ మోస్తరు కాముడు అన్న పదం గుర్తు కొచ్చింది !


కాముడు కాముడు అంటూ కావుడు కావుడు అనటం కూడా కద్దు అనుకుంటా :)


అట్లా ముకారము వు కారము అయినట్టు యిక్కడ వు కారము ము కారమయి పోయిందేమో అను కున్నా !

మొత్తం మీద చాలా రోజుల తరువాయి టపా వ్రాత కి మోక్ష మొచ్చేను !

ఈ మధ్య ఒక నెల రోజుల బాటు కమింట్ల తో నే భుక్తా యాసం గడిచి పోయింది !

ఈ నేపధ్యం లో ఈ దేముడు బాబాయ్ కనబడి జిలేబి నీ మొర ఆలకించితి ! నీ టపా కు మేటరు గా వచ్చితి ;

బంతాట ఆడేసు కో అన్నాడు !
మా ఏడు కొండల పెరుమాళ్ళు ఇంత దయ తలిచే డన్న మాట !

దేముడా ! నీకు జోహారు !


సో, బ్లాగు మిత్రోదరు లారా ! ఈ దేముడు బాబాయ్ ఎట్లా వచ్చి ఉంటా డను కుంటారు ?


చీర్స్
జిలేబి

26 comments:

  1. నీమమ్మున పల్లె జనులు
    దేముడనుచు మ్రొక్కులిడెడు తీరు తెలిసియున్ ,
    దేముడిలో తప్పు వెదుకు
    ధీమతులకు భాష తీరు తెలుపుము దేవా!

    ReplyDelete
    Replies
    1. రచ్చబండల దగ్గిర పదిమంది చేరితే కొందరు బూతులు కూడా మాట్లాడతారు.విషయం హాస్యసంబంధమైతే ప్రాజ్ఞులూ,విద్వజ్జనులూ,మర్యాదస్తులు కూడా ఏమీ అనుకోరు - మరీ చాందసులైతే తప్ప!అనతమాత్రాన బూతుల్ని కూడా ఇష్టారాజ్యంగా వాడాలా?తప్పును తప్పని చెప్పి సవరించకపోతే ఆ పాండిత్యం దేనికి కాల్చనా?ఆ పాండిత్యాన్ని వినయంగా స్వీకరించక వెక్కిరించడం విప్లవమా?ఆధునికమా?పైత్యమా?

      Delete
    2. జన వ్యవహారము కొరకా
      ఘన పండిత సుష్టు కొరకు గలవా భాషల్?
      జన భాష నుండి విడివడి
      ఘన పండితు లుంట వారి ఘనతా ! అహమా?

      పండితుల మాట సుష్టువు!
      దండిజనుల నుండి పుట్టి తల్లి పలుకు గా
      మెండుగ వ్యవహారము నం
      దుండు పలుకు సుష్టువు నకు దూరంబగునా?

      భాష జనుల కొరకు , పండితులకు గాదు ,
      ప్రజలు మాటలాడు పలుకు సుష్టు ,
      పదము మారు , దాని పరమార్థమును మారు
      మార్పు లేని భాష మరణమొందు.

      ఎరుకగల వారమందురు ,
      అరమరికలు లేని జనుల వ్యవహారములో
      విరిసిన తాజా మల్లెల
      పరిమళ పదసంపద లకు పరిహాసములా!

      Delete

    3. లక్కాకుల వారా మజాకా !


      జయహో జయహో


      చీర్స్
      జిలేబి

      Delete
    4. నాకు దేముడు అనే పదం వికారంగా ఉంది.అందుకే వ్యతిరేకిస్తున్నాను.బాగోకపోయినా కొత్తకోసం చెత్త పదాల్ని నెత్తికెత్తుకుని నేను గాక దీన్ని మెచ్చుకుని కావ్యగౌరవం కలిగించాను అని డప్పు కొట్టుకోవాలనే దురద ఉంటే అలాగే కానివండి!గురజాడ ఎట్లాగూ అనిపించాడు గాబటి "లంజ,ముండ" లాంటివి కూడా జనవ్యవహారంలో ఉన్నాయి గాబట్టి ఎవరో ఒకరు వాటిని కూడా పైకెత్తి గౌరవప్రదం చెయ్యవచ్చు!

      Delete
    5. హరిబాబు గారు


      లం... ముం... యివన్నీ ఆల్రెడీ కథల్లో నవల్లో వచ్చేసినవే ; నాటి రావి , నిన్నటి నామిని వాడేసారు ; క్రొత్తవేదయినా చెప్పండి :)

      Delete
    6. కొత్తవి మీరూ లక్కాకుకుల వారే పుట్టించాలి,ఆ పాండిత్యమూ ఆసక్తీ మీకు చాలా ఎక్కువగనే ఉంది కదా:-(

      Delete

    7. హరిబాబు గారి మంగళా శాసనము శిలో ధాల్యము :)


      జిలేబి

      Delete
    8. జిలేబీ లక్కాకుల కవ్యుద్ఘద్వయానికి,
      చిన్నప్పుడు, అంటే మరీ చిన్నప్పుడు కాదు,నూనూగు మీసాల వయసులో "రాజాధిరాజు" సినిమా చూశాను.రామభక్తుడు బాపు గారు క్రైస్తవ మత వాతావరణం బాగా దట్టించి చూపించిన సినిమా!ఈయన లాంటి హాస్యబ్రహ్మ మార్క్శు ట్వెయిను గారు కొంచెం వ్యంగ్యాన్నీ కొంచెం ఘాటునీ కలిపి రాసిన విచిత్రవ్యక్తి నవల ఆధారం దానికి.అందులో నైతాసు నూతన్ ప్రసాద్ "మీ ద్యాముడు!" అని వెక్కిరింతగా అంటూ ఉంటాడు.ఎప్పుడు నేను "దేముడు" అనే మాట విన్నా అదే గుర్తుకొస్తూ ఉంటుంది అదే ఇబ్బంది!

      భాషకి ఉచ్చారణ ఇంపుగా ఉండటం ప్రధానం అనుకుంటే "దేముడు" అనే పదం అంత వినసొంపుగా ఉండట్లేదనీ నా బాధ!శ్యామలీయానికి బెత్తం మాస్టారు బిరుదు ఇచ్చ్గేసి ఆయన వద్దన్నాడు గాబట్టి మరింత పట్టుదలగా చెయ్యాలా!

      పల్లెల్లో మాట్లాడుకునేటప్పుడు,పిలుపుల్లో "రాముడూ!" కూడా "రావుడూ!" అవుతుంది,గమనించారా?అయితే "రాముడు మా దేముడు" అని కలిపినప్పుడు బాగా ఉంటుందని నేనూ ఒప్పుకుంటాను,విడిగా వాడినప్పుడు మాత్రం ఆ మాట అంత సొంపుగా వినబడట్లేదు.
      స్వస్తి!

      Delete

  2. లక్కాకుల వారు |!


    నమో నమః ! బహుకాల దర్శనం ; కుశల మేనా !


    రాజా ! దేముడు ఒక్కడు
    భాజా భజయింత్రులందు భారము నయ్యెన్ !
    తా జూడ హృదయ మందున
    తాజాగా నెల్లపుడును తానై యుండెన్ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. రచ్చబండల దగ్గిర పదిమంది చేరితే కొందరు బూతులు కూడా మాట్లాడతారు.విషయం హాస్యసంబంధమైతే ప్రాజ్ఞులూ,విద్వజ్జనులూ,మర్యాదస్తులు కూడా ఏమీ అనుకోరు - మరీ చాందసులైతే తప్ప!అనతమాత్రాన బూతుల్ని కూడా ఇష్టారాజ్యంగా వాడాలా?తప్పును తప్పని చెప్పి సవరించకపోతే ఆ పాండిత్యం దేనికి కాల్చనా?ఆ పాండిత్యాన్ని వినయంగా స్వీకరించక వెక్కిరించడం విప్లవమా?ఆధునికమా?పైత్యమా?

      Delete
  3. కుశలముల కేమి మామీ!
    పసగల ధీమతుల దృష్టి పైబడుచుండన్,
    పసిమియె యెల్లెడల ప్రకృతి
    రస సిద్ధులు తమకు తెలియ రానిది కలదా?

    ReplyDelete
  4. >>>>ఈ నేపధ్యం లో ఈ దేముడు బాబాయ్ కనబడి జిలేబి నీ మొర ఆలకించితి ! నీ టపా కు మేటరు గా వచ్చితి ; >>>>>

    బుర్రలో గుంజు......దేవుడే దిక్కు.. :)))

    ReplyDelete
  5. రావణుడి లోని వా మన
    దేవుడిలోనూ గనుపడ తెలుగు జనమ్ముల్
    పోవిడి , రాముడిలో గల
    మూ వెలయగ దేముడనిరి ముచ్చట గొలిపెన్.

    ReplyDelete
  6. We, the fans of “Jilebi”, wish to conduct an interw with you. Be pleased to cosider.
    Let us fllow the following guide lines.

    1.Let the interview will be in the form of questions and answers.

    2.Please open a post by name MY INTERVIEW WITH PUBLIC in your own blog, or with your favourite title “ Naradaayanamah”. The questions will be posted in the comment box, the replies also to be in the form of reply comment.

    3.Please allow anybody to question including ananymous. Please allow ananymous commentor in your blog.

    4.Please answer all questions. This interview may continue for days. Any question irritating you, you are at liberty to skip, but at the same time answer that you are ‘’skipping’’ the question.

    5. This is for fun and as you are much interested in fun let us enjoy.

    6.Let the interview to be conducted in telugu

    7.I also wish to remain incognito, you are at liberty to add conditions before starting the interview.

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. ఇక్కడ నాపైన కనిపించిన ఎత్తిపొడుపులపై నా స్పందనను కొద్ది నిముషాల క్రిందట శ్యామలీయంలో ఒక టపాగా వ్రాసాను. ఆసక్తి కలవారు దానిని పరిశీలించగలరు.

    ReplyDelete

  9. రండి రండి గురువులుంగారు !

    మీరు రోలుగర్ర మా "స్టారు" :)

    దేముడు బాబాయ్ ! మాకని
    ఆమని వచ్చెను టపాల ఆటల పాటల్ :)
    రామా ! కనవేమి సుమీ !
    నీ మది చల్లగ జిలేబి నిరతము నుండన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. రచ్చబండల దగ్గిర పదిమంది చేరితే కొందరు బూతులు కూడా మాట్లాడతారు.విషయం హాస్యసంబంధమైతే ప్రాజ్ఞులూ,విద్వజ్జనులూ,మర్యాదస్తులు కూడా ఏమీ అనుకోరు - మరీ చాందసులైతే తప్ప!అనతమాత్రాన బూతుల్ని కూడా ఇష్టారాజ్యంగా వాడాలా?తప్పును తప్పని చెప్పి సవరించకపోతే ఆ పాండిత్యం దేనికి కాల్చనా?ఆ పాండిత్యాన్ని వినయంగా స్వీకరించక వెక్కిరించడం విప్లవమా?ఆధునికమా?పైత్యమా?

      Delete


    2. వాహ్ వాహ్ !

      జిలేబి

      Delete
  10. మిమ్మల్ని వారి బ్లాగులో బహిష్కరించారు కదా ? ఇక్కడకొచ్చి వారు వ్యాఖ్యానించ తగునా ? బహిష్కరణ అంటే మొత్తంగా బహిష్కరించాలి.ఇలా సగం సగం శిక్ష వేస్తే రోగం నయం కాదు.

    ReplyDelete
    Replies
    1. నీహారికగారూ, మంచి పట్టుపట్టారు. నేను జిలేబీగారిని నా బ్లాగు నుండి సకారణంగానే దూరంగా ఉంచాను. మీరన్నది ఆలోచనీయమైన సంగతి. నేను జిలేబీగారి బ్లాగులోనికి రావటానికి నిషేధం ఏమీ లేకపోయినా రాకుండటమే మేలు. అలా చేయటం వలన, ఈ‌జిలేబీగారితో సహా, ఇక్కడ నామీద సెగలుపొగలు కక్కుకొని ఉపశమనం పొందేవారికి మరింత సదుపాయంగా ఉంటుంది కూడా.

      అందుచేత మీ సలహాను ఇకనుండి అమలుచేస్తున్నాను. ధన్యవాదాలు.

      Delete

  11. శ్యామలీయం వారికి


    మీ మీద నాకెటువంటి కక్షలు కార్పణ్యాలూ లేవు ; కాట్ దాటి కాళ్లు కాటి కి వెళ్లే వాళ్ల లిస్టులో ఉన్న మానవ మాత్రులం కాబట్టి ;




    తమ బ్లాగు లో ఎవరి ఎవరి కామెంట్లు ప్రచురించచ్చూ కూడదూ అన్నది వారి వారి నిర్ణయం ;

    అయితే ఎందుకు దేముడు బాబాయ్ టపా అన్న సందేహం రావచ్చు ;

    మాండలికం లో మనకు తెలియని చాలా పదాలు ఉండవచ్చు; అవి పుస్తకాల్లోకి గ్రంధాల్లోకి రావచ్చ్గా కూడదా అన్నది కాలాకాలం గా వస్తున్న చర్చే ; రాబోయే కాలం లో కూడా ఈ చర్చలు వస్తూనే ఉంటాయనుకుంటా

    ఆతతాయి అన్నది వేదం లో ఉన్న పదమంటే అదే మనకాలానికి దుషట చతుషటయ మాట :)



    గురజాడ వారి కాలానికి వారు వ్యావహారికమనుకున్నది ఓ వందేళ్ల లోపలే నిఘంటువు జూసి అర్థం చేసుకునే పరిస్థితులలో ఉన్నాం

    ఆ పై మా మీడియా వారికి సరికొత్త పదాల్ని పుట్టించడమన్నది సరదా లేకుంటే దురదా ( దురదస్య దురదః జిలేబి నామ్యాః )

    దేముడు కొత్త పదం కాదు అనుకుంటా ; జనబాహుళ్యం లో ఉన్నదే అది యెట్లా వచ్చి ఉండవచ్చు అన్నదానికి సమాధానం ఏమన్నా దొరుకుతుందా అన్న దానికే ఈ టపా

    ఇక ఈ బ్లాగులో కామింట్లు మీరు రాయొచ్చా కూడదా అన్నది మీ స్వనిర్ణయం ; నావరకైతే ఎట్లాంటి అభ్యంతరాలు లేవు ;

    ఇక బూతుకామింటు కి రిటార్టు జిలేబి పచ్చి పరమ చండాల నీచాతి నీచమైన పదజాలం తో ఇవ్వడమన్నది నాకు తెలిసిన షాక్ ట్రీట్మెంట్ ; మద్రాసు ఆటో వాడు మనల్ని వాడి బూతులతో తొక్క జూస్తే వాడి భాషలో నే రిటార్టు ఇవ్వడమన్నది సమాజం నేర్పిన కరడు గట్టిన సర్యం ; ఆ పలుకులని మీ రింకా మనసులో నే పెట్టుకుని ఉన్నారంటే
    బుద్ధుడు ముసలవ్వని భుజాల మీద దాటించడం జెన్ కథ గుర్తుకొస్తుంది

    స్వస్తి

    చీర్స్ సహిత
    జిలేబి

    (జిలేబి యింత పెద్ద కామింట్లు కూడా రాస్రావా నువ్వు :) హాశ్చర్యం :))

    ReplyDelete
    Replies

    1. బై ది వే ఆ షాక్ ట్రీట్మెంట్ ప్రొటెస్టు ల తరువాయి బ్లాగ్ లోకం లో అవి తగ్గినట్టే ఉన్నాయి

      అంతా మన మంచికే

      జిలేబి

      Delete
  12. ఇంటర్నెట్ లో వెతికితే బోలెడు బూతులు పోర్న్ లూ కనిపిస్తాయి.అవన్నీ తీసుకొచ్చి మన బ్లాగులో మనం పెట్టుకున్నా చదివే వాళ్ళకు ఇబ్బంది కాబట్టి మీరంటే ఉన్న స్నేహం కొద్దీ చిన్నపాటి శిక్షతో వదిలేసారు. నాకు కోపం వచ్చినా బూతుల అవసరం నాకు ఇంతవరకూ రాలేదు.నేను బూతులు తిట్టాలంటే వాడు చాలా అదృష్టవంతుడై ఉండాలి.

    ReplyDelete


  13. వాహ్ వాహ్ ! అదృష్టవంతుడా ఎక్కడ ఉన్నావ్ :)

    మేటరు దేముడు సబ్జెక్టు నించి దూరము బోవు చున్నది :)

    అంతా విష్ణుమాయ ! ఎక్కడికి దారి తీయునో !

    జిలేబి పెట్టా బేడా సర్దేసుకుని గప్చిప్ గాయబ్ హో జావ్ :)


    జిలేబి


    జిలేబి

    ReplyDelete