Saturday, January 21, 2017

స(మ)రస యానం !


స(మ)రస యానం !

 


పతి వెనుక సతి మురిపెముగ
సతతము సన్మతి శుభాంగి సమరసముగనన్
జతగొని జీవన గమ్యపు
చతురత జేర్చుము సరసపు చమకుల రమణీ ! 


శుభోదయం
చీర్స్
జిలేబి

3 comments:

  1. ప్రకృతి యొడి జేరి పచ్చ తివాచి మీద
    పరవశమ్మున నడయాడు భాగ్యరేఖ
    బ్రహ్మ లిఖియించె నేమొ మా భాస్కరన్న
    ఆలుమగలకు నభివందనాలు శతము .


    ReplyDelete
  2. ఎంత అలవోకగా మీరిద్దరూ పద్యాలూ అల్లేస్తారో! వహ్వా.

    ReplyDelete
    Replies
    1. అన్యగామి గారికి ధన్యవాదాలు . ఐనా .....

      మాపద్యాలకు సాంప్రదాయ కవి ట్రేడ్మార్కేది రాలేదు , ఆ
      క్షేపాభ్యంతర సాధు చర్చలకు రాశీభూతమై , హేళనా
      రూపాక్షింతలు వేసి పోనడపినా రుద్యుక్తులంబన్ని , ఏ
      ప్రాపుల్ బొందని వట్టి గ్రామ్యములు మాపద్యంబు లింకేటికిన్ .

      Delete