Monday, January 30, 2017

నెనర్లు అన్నది తెలుగు పదమేనా :)

 
నాకో సందేహం వచ్చింది. ఈ నెనర్లు అన్నది అసలు తెలుగు పదమేనా అని. ఈ పదాన్ని మొట్ట మొదటి సారి నేను గమనించింది ఈ బ్లాగుల లోకం లోనే. ఇంతకుమునుపు ప్రింట్ మీడియా లోగాని నేను చదవిన తెలుగు పుస్తకాలో గాని ఈ పదాన్ని గమనించడం జరగలేదు. సాధారణంగా ధన్యవాదాలు లేక కృతజ్ఞతలు లాంటి పదాలు చూసాను గాని ఈ నెనర్లు అన్నది చూడటం బ్లాగులోకం లో నే.

ఈ పదమేమన్నా బ్లాగులోళ్ళ చే తెలుగులోకానికి చేర్చబడ్డ కొత్త పదమా? ఎవరైనా సందేహం తీర్చగలరు?

జిలేబి.

17 comments:

  1. పిచ్చి ముదిరి వెర్రి అయింది అని విన్నారా? తెలుగులో మాట్లాడడం, చదవడం చేయాలన్న ప్రయత్నం బాగుంది కానీ ఆ పిచ్చి కొందరికి ముదిరింది. "వీలయినంత వరకు" తెలుగులో మాట్లాడితే తప్పులేదు కానీ సాధారణ వాడుకలోని పదాలను కూడా తెగులీకరించడం (తెలుగు కాదు సుమా, తెగులు!) మొదలు పెట్టారు కొందరు ప్రబుద్దులు. 'అంతర్జాలం' అనే పిచ్చి పదాలు ఇలాగే పుట్టాయి. bus, car, phone,internet etc are universal standard words అవి అలాగే ఉండాలి కానీ తెగులీకరించకూడదు. చూడబోతే బస్సును అదేదో సినిమాలో చెప్పినట్లు "చతుష్ట్చక్ర వాహకము" అని చెబుతూ ఆనందిస్తారేమో కొందరు!!
    ReplyDelete
  2. అవును అది తెలుగు పదమే, బ్రౌన్ నిఘంటువులో ఉన్న పదమే "నెనరు" అన్నది
    ReplyDelete
  3. వరూధిని గారు మీ కొచ్చిన సందేహమే నాకు వుండేది. అంటే ఇప్పుడు పోయిందని కాదు.జీడి పప్పు చెప్పింది అక్షర సత్యం.మాయాబజార్ లో గిల్పం లా అంతర్జాలం, నెనర్లు, భాష కోవిదులు తమ పరిజ్ఞానాన్ని ప్రదర్శించు కోవడానికి రాసే పదాలే తప్ప వాటి వల్ల మన వ్యావహారికం లో ఇసుమంత ఉపయోగం లేదు.ధూమశకట విరామ స్తలమునకు పోయి మార్జాల వైరి వాహన మాతా పురానికి పోవు బండి ఎప్పుడు వచ్చును అని రాసిన దానికి రైల్వే స్టేషన్ కి వెళ్లి పార్వతీపురం వెళ్ళే ట్రైన్ ఎప్పుడు వస్తుందని అడిగాడు అని చదివిన దానికి యెంత తేడా వుంది అర్ధం చేసుకోవడం లో?ఏంటో ఈ బ్లాగ్స్ లో మనసులో ఉన్న భావాల్ని రాసుకోడానికి ఒక వేదిక లా కాకుండా తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ఇగో ని satisfy చేసుకోడానికే దుర్వినియోగ పడుతున్నట్టు గా అని పిస్తోంది.
    ReplyDelete
  4. ఇక్కడ కామెంటిన వారికి,
    అయ్యా "నెనరు" అనే పదం గురించి చాలానే చర్చ జరిగింది బ్లాగ్లోకంలో.... ఈ పదాన్ని తెలుగు బ్లాగరులు "thank you" అనే ఆంగ్ల పదానికి సులువైన తెలుగు పదంగా తీసుకొచ్చారు... (ధన్యవాదాలు లేదా కృతజ్ఞతలు అని రాయడం పెద్దగా ఉండడం ఒక కారణం) అంతే గానీ ఎవరి పాండిత్యాన్నీ ప్రదర్శించడానికి కాదు.. ఎవరో ఒకరు ఇలాంటి పదాలని వాడదం మొదలేట్టకపోతే ఇక తెలుగు లో అన్నీ అరువుతెచ్చుకున్నవే ఉంటాయి.. మీకు నచ్చకపోతే వాడడం మానెయ్యండి కానీ వాడే వాళ్ళని కించపరచకండి... మీరు చెప్పే "universal standards" అనేవి కేవలం మీ అభిప్రాయం... మీరు చెప్పిన పదాలనే (internet తప్ప) రకరకాల ఐరోపా భాషలలో రకరకాలుగా వాడతారు, పలుకుతారు...
    ReplyDelete
  5. జిలేబీ గారూ,
    కన్యాశుల్కం నాటకకర్త గురజాడ అప్పారావు రాసిన "పుత్తడిబొమ్మా పూర్ణమ్మా" అనే ప్రసిద్ధ గేయంలో ఉందా మాట! "కాసుకు లోనై తల్లీదండ్రీ నెనరూ న్యాయం విడనాడి" అని ఆ గేయంలోని ఒక పాదం.

    తెలుగబ్బాయి :- బాగా చెప్పారు. నెనరులు
    ReplyDelete
  6. ప్రదీప్ గారు, నెనరు అనేది ఉంది నిఘంటువు లో , కానీ నెనర్లు అనే బహువచనం కొందరి సొంత పైత్యమే ! అదేమంటే, తెలుగు వాడుక తప్పు ఐపోతోంది అంటు వాపోవటం !

    నెనరు = ప్రేమ, కృతజ్ఞత
    నెనర్లు = ప్రేమలు, కృతజ్ఞతలు !

    నా టపా చదివినందుకు నెనర్లు ( అంతే ప్రేమలా? కృతజ్ఞతల? ) ప్రేమలు అనే context లో ఉపయోగించ లేము ఈ పదం ... కాబట్టి ఈ బహువచన వాడుక తప్పు !
    ReplyDelete
  7. నేను జీడి పప్పుతో ఏకీభవిస్తున్నాను. కొన్ని పదాలను చూస్తే మతి పోతుంది ఈ తెలుగు బ్లాగర్ల గుంపులో. తెలుగు బతకాలంటే పల్లెల్లో, గ్రామాలలో వున్న తెలుగు చాలు. ఈ ప్రచండ వీరాభిమాన తెలుగు చదివితే వున్న మతి పోయి హిందీనే బెటరనిపిస్తుంది.

    నానైఅతే నెనర్లు అన్నప్పుడల్లా పెసర్లే గుర్తుకొస్తాయి. ధన్యవాదాల మాట అటుంచి.
    ReplyDelete
  8. రవి గారు గారు

    చక్కగా చెప్పారు.
    ReplyDelete
  9. చదువరి-గారు,

    గురజాడ రచనలో ఆ పదం వుండవచ్చు గాక (ఈ పాటని కోట్ చేసిన నాలుగో వ్యక్తి మీరు!), కానీ Thanks అనే అర్థంలో వాడబడలేదు. మీరే ఆ పంక్తిని మరోసారి చదివి చూడండి. నిజానికి చాలామంది (సీనియర్) బ్లాగర్లను అడిగాను, బ్రౌణ్యంలో ఇచ్చిన అర్థం పక్కనపెట్టి తెలుగు సాహిత్యంలో కానీ, వాడుకభాషలో కానీ ఒక్క వాక్య ప్రయోగం చూపెట్టమని. ఇంకా జవాబు కోసం యెదురు చూస్తున్నాను.

    బ్లాగ్లోకంలో వీరతెలుగాభిమానం మెండుగా వుందని నమ్మేవాళ్ళలో నేనూ వొకణ్ణి.

    భవదీయుడు,
    శ్రీనివాస్
    ReplyDelete
  10. 'నెనర్లు' అనే మాట నాకు నచ్చదు. 'ధన్యవాదాలు' అనేదే నేను వాడతాను.

    That said - నెనర్లు అనే వాళ్లని ఈసడించుకోవాలా? ఎవరికి నచ్చిన పదం వాళ్లు వాడుకుంటారు. నాకు విశ్వనాధ వారి గ్రాంధిక శైలి నచ్చదు. అంతమాత్రాన గ్రాంధికమే దండగ అనగలనా? నాకు నచ్చినా నచ్చకున్నా, దాని అందమూ గొప్పదనమూ దానిదే.
    ReplyDelete
  11. వేయి పూవులు వికసించ నివ్వండి. లక్ష మెదళ్ళు చిగురించ నివ్వండి. అన్ని ప్రయోగాలు సఫలం కాకపోవచ్చు. అట్లా అని అసలు ప్రయోగాలే వద్దనకూడదు కదా.
    హిందీ భాషలో ఇట్లాంటి ప్రయోగాలు అనేకం జరుగుతున్నాయి. ఆంగ్లానికి దీటుగా దూర దర్శన్ వంటి ఎన్నెన్నో పదాలు సృష్టించబడి ప్రాచుర్యం పొందుతున్నాయి. తెలుగు ఒక పక్క ప్రభుత్వ నిర్లిప్తత వల్ల మృత భాషగా మారిపోయే ప్రమాదంలో పడుతోంది.

    తెలుగు భాషాభిమానులు ప్రత్యేకించి తెలుగు బ్లాగరులు తెలుగు వెలుగులు విరజిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.
    వ్యక్తిగతంగా నెనర్లు అనే పదం వాడేందుకు నేను కూడా ఇష్ట పడను. ఎందుకంటే ఇప్పటికే చాల ప్రాచుర్యంపొందిన ప్రత్యామ్నాయ తెలుగు పదాలు వున్నాయి కనుక. కాని అంతర్జాలం వంటి అనేక పదాలు ఎంతో ఆసక్తికరంగా వుంటున్నాయి.
    ReplyDelete
  12. Sreenivas Paruchuri: "మీరే ఆ పంక్తిని మరోసారి చదివి చూడండి." - అక్కర్లేదు, ఇప్పటికే చదివాను. ఆ అర్థం గురించి చర్చ జరిగింది, చర్చించిన వాళ్ళలో నేనూ ఒకణ్ణి. ఓసారి గుంపు చర్చల్లో చూడండి. నెనరుపై జరిగిన మొట్టమొదటి చర్చ అది.

    ఇక వాడుకభాష, సాహిత్యాలలో దాని ప్రయోగం -కృతజ్ఞత అనే అర్థంలో వాడారో లేదోననే సంగతి నాకు తెలవదు. మీరడిగింది సీనియర్లను కాబట్టి ఆ సంగతి వారు చూసుకుంటారు. నిఘంటువులో దాని అర్థం స్పష్టంగానే ఉంది. దాన్ని పక్కన పెట్టాలన్నారు, ఎందుకో చెప్పండి.

    sri: కృతజ్ఞతలు అని బహువచనం వాడినపుడు నెనరులు అనే బహువచన రూపం కూడా తప్పు కాదేమో !
    ReplyDelete
  13. ఈ చర్చ anachronistic. నెనర్లు విస్తృతంగా వాడుకలోకి వచ్చి రెండేళ్ళవుతోంది. ఇది కొన్ని ప్రభుత్వ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. నెనర్లు అని మీరు గూగుల్ శోధనలో కొట్టి చూస్తే సుమారు 35,000 ఫలితాలుచూపిస్తుంది. అంటే ఇంతమంది ఇన్నిసార్లు ఇప్పటిదాకా ఏ అర్థంలో వాడారో ఆ అర్థానికి విలువే లేదంటారా ? Thanks అనే అర్థంలో ఇంతకుముందు ప్రయోగాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు అనగా ఈ 2009 వ సంవత్సరం జనవరి 27 నాటికి Thanks అనె అర్థంలో కొన్నివేల ప్రయోగాలు కొన్నివండల రచనల్లో చెయ్యబడ్డాయి.

    ప్రింట్ మీడియాలో లేదన్నారు. ప్రింట్ మీడియాలో ఉన్న పదాలే వాడాలని రూలేమైనా ఉందా ? అసలు ప్రింట్ మీడియలో ఉన్న చాలా తెలుగు పదాల్ని ఇప్పుడు ఏ అర్థంలో వాడుతున్నారో ఆ పదాలూ, ఆ అర్థాలు ఆ మీడియా వచ్చినాక వచ్చాయే తప్ప అంతకుముందు ఆ పదాలు ఎవరికీ తెలియదు, వాటికున్న ఆ అర్థాలు అంతకంటే తెలియదు. ఏం అలాగని మానేద్దామా వాటిని వాడ్డం ?

    మనం అన్నింటిలోను నవ్యతని, ప్రయోగశీలతనీ ఆహ్వానిస్తూ తెలుగుభాష దగ్గరికొచ్చేసరికి ఇంతగా బిగుసుకుపోయి ఎందుకుంటున్నాం ? కొత్త ఇంగ్లీషు పదాల్ని కాయిన్ చేసి వాడే అధికారం ఇంగ్లీషువాళ్ళకున్నప్పుడు తెలుగువాళ్ళకెందుకు లేదా అధికారం ?

    కొత్త ఇంగ్లీషు పదాల్ని తెలుగు వాక్యాల మధ్య చొప్పిస్తే తప్పు లేదట. ఆ ఇంగ్లీషు పదం ఎవరికీ అర్థంకాకపోయినా ఫర్వాలేదు. (Infact, ఇంగ్లీషు ఎంత అర్థం కాకపోతే అంత ముద్దొచ్చేస్తుంది మనవాళ్ళకి) కానీ ముచ్చటైన అచ్చతెలుగు పదాలు మాత్రం చొప్పించకూడదట. ఇంగ్లీషు Natural అయిపోయింది. తెలుగే కృత్రిమమైపోయింది. మన ప్రగతికి సెబాసు !

    ఎవరూ వాడకుండా, ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి ?
    ReplyDelete
  14. నాకూ ఈ నెనరు అనే మాట నచ్చదు. ధన్యవాదాలు అనే మాట వాడతాను. వాడేవాళ్లను వాడనివ్వండి. దాంతో మనకేం నష్టం లేదు.
    ReplyDelete
  15. జీడిపప్పు,
    రవి గారు గారు,
    అంతర్జాలం ఏమీ బ్లాగర్లు సృష్టించిన పదం కాదు. తెలుగు బ్లాగు పుట్టకముందే ఆ పదం నిష్పాదించబడింది.
    ReplyDelete
  16. నెనర్లుకి జేజేలు!
    ఈ నెనర్లు అన్న పదం ఇంత వేడి టాపిక్ అని నాకు తెలియదు. ఆంతే కాక ఇంత విశాల పరిధిలో చర్చించ బడ్డ లేక చర్చించదగ్గ విషయమని ఇప్పుదె తెలిసింది. భ్లాగరు మిత్రులకు నెనర్లు!

    ఈ నెనర్లు కి స్థానం కల్పించదలిచాను. భ్లాగు నెనర్లు పేరుతో ప్రారంభించాను. మిత్రులు గమనించి ప్రొత్సహించగలరు!

    లింకు:

    http://www.nenarlu.blogspot.com

    జిలేబి.
    ReplyDelete
  17. జీడిపప్పు గారు... ఈ లెక్కన విద్యుత్తు లాంటివి కూడా పిచ్చి పదాలెనా? ఇవి 19వ & 20వ శతాబ్దములలొ తెలుగూరించబడినవె కదా? పదవ తరగతి వరకు నేను సైన్సు లొ చదువుకున్నవి అన్ని ఇలాంటి తెలుగూకరించబడిన పదాలె. 21వ శతాబ్దము లొ ఎందుకు తెలుగూకరించకూడదు?
    మీరు ఉదహరించిన కారు , బస్సు , రైలు (కార్ , బస్, రైల్ లను ) తెలుగు లొకి మార్చబడినవె. మరచిపొతున్న/మరుగునపడుతున్నతెలుగు పదాలను మళ్ళి వాడుక లొకి తెస్తున్న అందరికి నా ధన్యవాదాలు .


    ఇంతకీ " తెగులీకరించడం " తెలుగు పదమేనా ? మీ స్వంత ప్రయోగమా ? నేను ఎప్పుడు వినలెదు అందుకని .
 

2 comments:

  1. జిలేబిగారు, ఏమిటి ఈమాయ. మీపోస్ట్ ఇప్పటిది, కామెంట్స్ 2009 నుంచి ఉన్నాయి.

    ReplyDelete


  2. నెనరు యనెడి పద సంపద
    మన యచ్చ తెలుగు జిలేబి మధురిమ లూరన్
    గనవచ్చు జాల మందున
    ఘనంబు గా తగువులాడి గాపాడిరహో !

    జిలేబి

    ReplyDelete