ఏనుగు- కోతి -రాత్రి పగలు
నిశిరాత్రి చందురుడు మత్తు గా
చూస్తోంటే మత్తేభం జోగుతోంది.
కొమ్మ పైన కోతి లబక్కున గెంతి
ఏనుగు ని పిలిచింది రా ఆడుకుందా మంటూ !
మత్తేభం జోగింది.
ఆ జోగులో కోతి ఆడుకుంటూ
పొద్దు పొడిచే టప్పటి కి జోగింది .
సూరీడు పైకొచ్చేడు !
కోతి చెట్టు కొమ్మన వెళ్లి పడుకుంది .
మత్తేభం నిద్దుర మత్తు వీడి
మత్తు గా తూగుతున్న కోతిని రావే ఆడుకుందా మంది.
మత్తులో కుదరదంటే ,
తొండం తో ఒక్కటిచ్చి
కోతి ని లాగి దాంతో ఆటాడే సుకుంది !
చీర్స్
శుభోదయం !
జిలేబి
మత్తేభము జోగుట గని
ReplyDeleteహత్తెరి మర్కటము బిల్చె నాడుకొనంగా
మత్తేభము తొండముతో
మొత్తి బిలిచె కోతి జోగ మోదంబలరన్ .
ఏముందబ్బా యిందున?
సామజమును బోలు నే యసామాన్యునితో
గేమాడెనొ నే కోతో
నా మనసుకు కొంచ మేని యవగత మవలా .
జాగిలి గోనుమో జిలేబీ
ReplyDeleteసాగిలి మ్రొక్కెద, దయగని
బాగుగ అర్ధమగు రీతి జెప్పవమ్మ
దాగిలిబూచు లాడకుండ ...
:)
ReplyDeleteధన్యవాదాలండీ కామింటి నందులకు.
జెన్ కోవెన్లకి ఎవరికి వారే భాష్యం చెప్పుకోవాలి.
మీకేమనిపిస్తే అది మీరు చెప్పవచ్చు
ప్రయత్నించండి
చీర్స్
జిలేబి
జిలేబీ తీర్థ స్వామిని వారి నూతన న్యాయము
ReplyDelete’మత్తేభ మర్కట న్యాయము’
ఈ నుడి కారము వలన మనము గ్రహించవలసినదేమనగా
‘జిల పుట్టినప్పుడే గోకవలెను. వేళ తప్పిన బుఱ్ఱ పగులును’.
’తమకు తోచిన భాష్యం రోెకలి చుట్టిన మస్తిష్కం‘
కనుక, స్వామినివారే అనుగ్రహ భాషణమిచ్చి ఈ పాంథుని మదిలో జ్ఞానదివ్వెలను వెలగించగలరు.
చలికోర్వలేను రమ్మని
ReplyDeleteచెలి పుడమి బిలువ కవోష్ణ శ్రీకరములతో
వలపు పరిష్వంగ సుఖము
వెలయించగ నినుడు భువికి విజయము చేసెన్ .
సుజన సృజన బ్లాగు నిజ శుభాకాంక్షలు
బ్లాగు వీక్షకులకు పాఠకులకు
మహిత పర్వ మందు మకర సంక్రమణ వి
శేష కాల మందు శ్రీలు గలుగ .