Wednesday, March 29, 2017

ఉగాది శుభాకాంక్షలు !


 
 
ఈ బ్లాగు వీక్షకులకు  
అందరికి
 
శ్రీ హేమలంబ నామ ఉగాది శుభాకాంక్షలు !
 
శ్రీ హేవళంబి నామ ఉగాది శుభకామనలు !
 
శ్రీ హేవిళంబి నామ జిలేబి శుభాకాంక్షలు !
 
శుభోదయం
జిలేబి
 
జగణం మొదలు
విలంబము వలదు !
సయాట ల శుభాంగి లతాంగి
జిలేబి విళంబి దిమిదిమి దిందిం !


Tuesday, March 28, 2017

తెలుగు లో చెప్పండి :) - ఉగాది శుభాకాంక్షలతో !

 
తెలుగు లో చెప్పండి :)
 

ఈ మధ్య హేవిళంబ/హేవిళంబి ఏష్యము లాంటి పదాలు వరస బెట్టి కనిపిస్తున్నాయి !

అబ్బ ! ఏమి ఈ సంస్కృత యాంధ్ర భాష 'గోళ' అను కోవాల్సి వచ్చేసే :)

మచ్చుకకి కొన్ని :)

ఈ సంవత్సరం పాడ్యమి ఏష్యమైంది ! (పాడ్యమి ఏష్యము )

పూర్వ సిద్ధాంతం ప్రకారం గణిస్తే పాడ్యమి 29 న వస్తుంది,

29 న కూడా సూర్యోదయానికి పాడ్యమి లేదు ఏష్యమయింది.

28 న మాత్రం పాడ్యమి ఉదయం 8-27 నుండి తె.5-45 వరకు ఉన్నది (తె. 5-45 అంటే ఏమిటి ?)

 సూర్యాదిసిధ్ధాంతాలకు వచ్చిన కరణగణితగ్రంథాల్లో ఉన్న విధానాలను అనుసరించి పంచాగాలు చేస్తారు వీళ్ళు – కాని ఆ కరణగ్రంథాలే చెప్పినట్లు బీజసంస్కారాలు చేయరు

      సూర్యాది సిద్దాంతాలు
-     కరణగణిత గ్రంథం
-    బీజ సంస్కారం

దృక్సిధ్దాంతం అనేది ఆధునికఖగోళశాస్త్రంతో ఏకీభవించి చేసే విధానం – అది శాస్త్రీయం

దృక్ సిద్దాంతం
ఆధునిక ఖగోళ శాస్త్రం

దృగ్గణిత పంచాగాలకూ వీరుచేసే పంచాంగాలకూ తేడా వచ్చి జనానికి గందరగోళం పంచుతోంది.

దృగ్గణిత పంచాంగం

దృగ్భిన్నపంచాంగ గణితాన్ని నిషేధించాలండి

దృగ్భిన్నపంచాంగం


హేవిళంబి ! హేవిళంబ !

విళంబము -> విలంబము -> ఆలస్యము -> ఆలస్యం గా వచ్చే ఉగాది అనుకుంటా :)


అందరికీ ఉగాది శుభాకాంక్షలతో !

శుభోదయం
జిలేబి


 

Friday, March 24, 2017

గూటిలో చిలుక

 
 
గూటిలో చిలుక
 
ఎగెరిగిరి పడుతోంది
గూటిలో చిలుక
కనుల ముందర
విశాల విశ్వం !
 
ఎంత ఎగిరినా
గూటిని దాటనేంటి ?
 
ఓ ! ఆ కనిపించే
విశాల విశ్వమంతా
ఈ గూడేనా ?
 
గూడు మాయం
చిలుక ఎగిరింది
 
 
ఎక్కడా విశ్వం ?
ఎక్కడా గూడు ?
ఎక్కడా చిలుక ?
కనిపించ దేంటి ?
 
 
శుభోదయం
జిలేబి

Friday, March 10, 2017

సరసిజనాభ సోదరికి సాటి జయంతి, జయంతి యే గదా !


 
రసిజనాభ సోదరికి సాటి జయంతి, జయంతి యే గదా  
 
 
వెడలగ శంకరుండతని వెంటన దక్షిణభారతమ్మునన్
బడబడ లాడి పద్యములు పారుచు నాడుచు బోవగన్ , భళీ
చెడుగుడు పూరణమ్ములను చెంగని చూడన, వేకువన్ గనన్
పడమటఁబొంచి చూచెనఁట భానుఁడుషోదయకాంతు లీనుచున్ !


శుభోదయం
జిలేబి







 

Tuesday, March 7, 2017

దత్తపది - రాజహంస వృత్తము



దత్తపది - రాజహంస వృత్తము


7, మార్చి 2017, మంగళవారం

దత్తపది - 108 (కట్టె-నిప్పు-బూది-మసి)

కట్టె - నిప్పు - బూది - మసి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
పచ్చని ప్రకృతిని వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.


***

రాజహంస వృత్తం  దత్త పది తో

రాజహంస
 
బాబూ !దినాధీశుడా తామసిన్ ద్రోలి భాసింప వృక్షంబులున్నిప్పురంబున్ భళా
శోభాయమానంబుగా దోచె తాదాత్మ్య శోర్వంబు లొప్పంగ నౌ గట్టె వీధుల్ భళా
ప్రాభాత వేళన్ మహా యజ్ఞ మయ్యెన్నిభాయింపనీ రాజహంసన్నిటన్వృత్తమై
సోపాన మార్గంబు గావింపగన్ మేని సొంపెల్ల నీరాయెనౌ, శంకరా, కందితిన్ !
 
జిలేబి
 
***
 
కందం
 
తామసి తొలగగ కిరణము
లా మంచును, నిప్పురంబు లావణ్యముల
న్నీ మహి పసిగట్టె జిలే
బీ, మజ! బాబూ, దినంబు బింకెము గాంచెన్ !

జిలేబి
(మరీ నిప్పులవంట గా ఉంది దత్తపది సమస్యా పూరణమే మేలు :) ముప్పావు వంతు కష్టపడితే చాలు :) )
 
***
 
రాజహంస పద్య లక్షణములు
  1. వృత్తం రకానికి చెందినది
  2. అభికృతి ఛందమునకు చెందిన 9586981 వ వృత్తము.
  3. 25 అక్షరములు ఉండును.
  4. 42 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణి: U U I - U U I - U U I - U U I - U U I - U U I - U U I - U U I - U
    • పంచమాత్రా శ్రేణి: U U I - U U I - U U I - U U I - U U I - U U I - U U I - U U I - U
  6. 4 పాదములు ఉండును.
  7. ప్రాస నియమం కలదు
  8. ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
  9. ప్రతి పాదమునందు త , త , త , త , త , త , త , త , గ గణములుండును.

***
 
 

Saturday, March 4, 2017

ఉత్పలమాల సాటియగు ఉత్పలమాల జిలేబి యే గదా !



ఉత్పలమాల సాటియగు ఉత్పలమాల జిలేబి యే గదా !
 
 
 
స్థావరమౌ వికుంఠపురి సన్నిధి వీడి వరమ్ము నొందగా
రావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై
పావనిలక్ష్మి గూడెజత, పన్నగ లక్ష్మణుడాతనిన్ సదా
సేవలగాంచ మోక్షమను సేవను గూర్చెను యుద్ధమందునన్ !


శుభోదయం
జిలేబి






Thursday, March 2, 2017

Atta Lady- అనుసృజన :)

 
Atta Lady*- అనుసృజన :)
 
చిక్కుబడేవు శల్యమై  యిక్కట్టైన 
జీవితం లో నీ విధికి నీవే  న్యాయనిర్ణేత గా
పుట్టుక నించి గిట్టుక దాకా
దేన్నే  వెతుకు తున్నావు ?
 
నత్తనడక బుజ్జికుంక బెత్తెడు తోక
ప్చ్ ! ప్రయోజనం లేదే !
 
దెయ్యంలా ఆ విరబోత ఏమిటి ?
దేనికోసం వెతుకులాట ?
 
ఆహ్! అర్థమయ్యింది
నువ్వు నేనూ, దెయ్యమూ వెరసి
ముగురు ముదితలం !
 
మధ్యే దారిలో తగులుకోమాక !
నీ కర్తవ్య కాలం అయిపొయింది
మళ్ళీ నీ ఫిడేలు ఎందుకే ?
 
అదృష్టం ఒక అర్థం కాని
పొడుపు కథ అనమాకు !
నీ కర్తవ్యాన్ని నిభాయించావు - Atta Lady !
 
నిమ్మళం గా కూర్చో !
ఆ స్మార్ట్ ఫోనెందుకే చేతిలో ?
పొద్దుగూకుడు ఆ గీకుళ్ళెందుకే ?
 
విశ్రామ రథానివి
నీ బాట నీదే నీ వేగం నీదే !
హే! జిలేబి ! వచ్చిన దారి వంకర టింకర
సరిజేయగలవా వాటిని ?
నైజం గా మారిన నిజం కాదూ అది ?
దేని కోసం యీ వెతుకులాట ?

ఆహ్! అర్థమయ్యింది
నువ్వు నేనూ, దెయ్యమూ వెరసి
ముగురు ముదితలం !
 
మధ్యే దారిలో తగులుకోమాక !
నీ కర్తవ్య కాలం అయిపొయింది
మళ్ళీ నీ ఫిడేలు ఎందుకే !
 
అదృష్టం ఒక అర్థం కాని పజిల్ అనమాకు
నీ కర్తవ్యాన్ని నిభాయించావు - Atta Lady !

Songwriters: VAN DYK/VISSER
From the Album - AttaGirl
Attagirl lyrics © Sony/ATV Music Publishing LLC
 
 
అనుసృజన
జిలేబి
 
ఈ పదాన్ని సృష్టించిన
శ్రీ విన్నకోట నరసింహా రావు గారికి
అం కిం టం :)
 
***
Origin of the word - Atta Lady
 
This word Atta Lady is coined by Vinnakota  Narasimha Rao.
 
అభినందన, మెచ్చుకోలు, ప్రోత్సాహం తెలియజేసే వ్యావహారిక పదం, సాధారణంగా (చిన్నవారిని) atta boy, atta girl అంటారు. నా సొంత కవిత్వం వాడి atta lady అనే పదం తయారుచేసానన్నమాట . 
 
atta girl పూర్తి రూపం "that's a good girl". ఇది కాలానుక్రమంగా "that a girl" అయ్యి దాన్నుంచి "attagirl" అయ్యింది(ట). అలాగే attaboy కూడా. దాన్ని అనుసరించి నేను attalady పదం తయారుచేశాను (పాత "మాయాబజార్" సినిమాలో ఘటోత్కచుడి స్ఫూర్తితో. 

- విన్నకోట నరసింహారావు 
 
జిలేబి కంద పద్యం - ఆన్ "అట్ట" లేడీ :)
 
హి దటీజ్ ది లేడి ! గుడ్ గార్ల్ !
హి దేర్ షి గోస్!యట్ట లేడి! హీ దట్జ్ హర్ ! యై
సీ ! దేర్ ద డెవిల్ గోస్ ఓహ్ !
దేర్ దేర్ షీ గోస్ ! జిలేబి దైనేమ్ లేడీ !

*** original song lyrics from the album Atta Girl

Stuck in a rut and a very tight place
Judge and jury of your own damn fate
From the cradle to the grave,
You're looking for something
Snips and a snail and a puppy dog tail
Nip and tuck, but to no avail
You look like Hell,
You're looking for something?
Oh, it's plain to see
Oh, it's you and me and the Devil makes three
Don't get stuck, somewhere in the middle
You payed all your dues and you're not on second fiddle
Don't say luck is something like a riddle
You payed for your place in this world: Attagirl!
Better sit tight, gotta drop that phone
This is a story for the girls back home
Living on their own
Looking for something
Goosebump Babe, gotta cover your tracks
Skid marks running all over your back
Face that fact
You're looking for something
It's plain to see
It's you and me and the Devil makes three
Don't get stuck, somewhere in the middle
You payed all your dues and you're not on second fiddle
Don't say luck is something like a riddle
You payed for your place in this world: Attagirl!
I want it all, I wanted everything
I want it now, I wanted everything
I want it loud, I wanted everything
I want it now, I wanted everything
Don't get stuck, somewhere in the middle
You payed all your dues and you're not on second fiddle
Don't say luck is something like a riddle
You payed for your place in this world: Attagirl!

Songwriters: VAN DYK/VISSER
Attagirl lyrics © Sony/ATV Music Publishing LLC