తెలుగు లో చెప్పండి :)
ఈ మధ్య హేవిళంబ/హేవిళంబి ఏష్యము లాంటి పదాలు వరస బెట్టి కనిపిస్తున్నాయి !
అబ్బ ! ఏమి ఈ సంస్కృత యాంధ్ర భాష 'గోళ' అను కోవాల్సి వచ్చేసే :)
మచ్చుకకి కొన్ని :)
ఈ సంవత్సరం పాడ్యమి ఏష్యమైంది ! (పాడ్యమి ఏష్యము )
పూర్వ సిద్ధాంతం ప్రకారం గణిస్తే పాడ్యమి 29 న వస్తుంది,
29 న కూడా సూర్యోదయానికి పాడ్యమి లేదు ఏష్యమయింది.
28 న మాత్రం పాడ్యమి ఉదయం 8-27 నుండి తె.5-45 వరకు ఉన్నది (తె. 5-45 అంటే ఏమిటి ?)
సూర్యాదిసిధ్ధాంతాలకు వచ్చిన కరణగణితగ్రంథాల్లో ఉన్న విధానాలను అనుసరించి పంచాగాలు చేస్తారు వీళ్ళు – కాని ఆ కరణగ్రంథాలే చెప్పినట్లు బీజసంస్కారాలు చేయరు
సూర్యాది సిద్దాంతాలు
- కరణగణిత గ్రంథం
- బీజ సంస్కారం
దృక్సిధ్దాంతం అనేది ఆధునికఖగోళశాస్త్రంతో ఏకీభవించి చేసే విధానం – అది శాస్త్రీయం
దృక్ సిద్దాంతం
ఆధునిక ఖగోళ శాస్త్రం
దృగ్గణిత పంచాగాలకూ వీరుచేసే పంచాంగాలకూ తేడా వచ్చి జనానికి గందరగోళం పంచుతోంది.
దృగ్గణిత పంచాంగం
దృగ్భిన్నపంచాంగ గణితాన్ని నిషేధించాలండి
దృగ్భిన్నపంచాంగం
హేవిళంబి ! హేవిళంబ !
విళంబము -> విలంబము -> ఆలస్యము -> ఆలస్యం గా వచ్చే ఉగాది అనుకుంటా :)
అందరికీ ఉగాది శుభాకాంక్షలతో !
శుభోదయం
జిలేబి
మీకు బుధవారం దాకా పండగ రాదనుకొంటా. అమెరికాలో ఈఏడాది అన్ని ఒకరోజు ముందే.
ReplyDelete
Deleteఅన్యగామి గారికి
మీకున్నూ శుభకామనల సహిత
జిలేబి
ReplyDeleteహేవిళంబి! యుగాది రమ్మ ! గృహే మనోజ్జ్వల చైత్రమై
మావిడాకుల వేపపూతల మాలగార్వపు కాలమై
తోవజూపుము మంచిగానగ తోగదోచగ యీశువున్
గావుమమ్మ జిలేబులెల్లర కాలవాహిని వాలునన్ !
జిలేబి
జిలేబీగారు, మీకు జ్యోతిశ్శాస్త్రపరిజ్ఞానం కొంచెం తక్కువగా ఉండటం వలన గందరగోళం కలిగిందేమో తెలియదు. కాని ప్రతిశాస్త్రానికి పరిభాష అనేది ఉంటుంది - విషయాన్ని స్పష్టంగా శాస్త్రీయంగా చెప్పటానికి పరిభాష అవసరం తప్పకుండా ఉంటుంది.మరి తిథి అన్నది కూడా సంస్కృతపదమే - అది కూడా తెలియని రోజులు వస్తున్నాయో - ఇప్పటికే వచ్చేసాయేమో తెలియదు. అన్నట్లు హేవిళంబి అన్నప్పుడు ఆలస్యం దాని రాకలో కాదు - అది ప్రజలకు అన్నిపనుల్లోనూ ఆలస్యం కలిగిస్తుందని భావం అనుకుంటాను.
ReplyDeleteత్వరలోనో కఠినాతికఠినమైన పంచసిధ్ధాంతిక మొదలు పెడదామని యత్నిస్తున్నాను కాని తీరటం చాలాచాలా కష్టంగా ఉంది.
ReplyDeleteధన్య "వాదము" లు శ్యామలీయం వారు
జ్యోతిష విన్నాణమసలు
లోతైన విషయము బోవె లోలాక్షి జిలే
బీ! తీగలు లాగన కా
లాతీత సమస్యలు మరలా బయలుపడున్ :)
జిలేబి
మన్నించాలి. జిలీబీగారూ, మీకు తెలియదు పొండి అనలేదు. లొకంలో సవాలక్ష శాస్త్రాలున్నాయి. అన్నింటికీ వేటి పరిభాష వాటికుంది. ఏవో కొన్ని తప్ప మిగిలిని వాటి పరిభాషలతో మనకు పరిచయం లేకపోవటంలో ఆశ్చ్యర్యమూ లేదు అపరాథమూ లేదు. మాటవరసకి నేనిప్పుడు కొత్తగా గణాంకశాస్త్రం(statistics) తాలూకు పరిభాషతో కుస్తీపడుతున్నాను! అంతా కొత్తగా గడబిడగా ఉందంటే అందులో ఆ శాస్త్రం తప్పూలేదు నాతప్పూ లేదు. అదంతే.
ReplyDelete