Friday, March 24, 2017

గూటిలో చిలుక

 
 
గూటిలో చిలుక
 
ఎగెరిగిరి పడుతోంది
గూటిలో చిలుక
కనుల ముందర
విశాల విశ్వం !
 
ఎంత ఎగిరినా
గూటిని దాటనేంటి ?
 
ఓ ! ఆ కనిపించే
విశాల విశ్వమంతా
ఈ గూడేనా ?
 
గూడు మాయం
చిలుక ఎగిరింది
 
 
ఎక్కడా విశ్వం ?
ఎక్కడా గూడు ?
ఎక్కడా చిలుక ?
కనిపించ దేంటి ?
 
 
శుభోదయం
జిలేబి

15 comments:

  1. జిలేబిగారు, ఏదో క్రొత్త తత్త్వాన్ని ఆవిష్కరిస్తున్నట్టున్నారు!

    ReplyDelete
  2. గూడు గూడనియేవు, గూడు నాదనియేవు, నీ గూడు యెక్కడే చిలకా ?
    (గురజాడ వారికి క్షమార్పణలతో)

    ReplyDelete
  3. గూడూ-విశ్వం-చిలుకా ..హంస ఎగిరిపోయిందని కవి హృదయం కావచ్చును..జిలేబి చుట్టాల ఆక్రుతిలాగానే ఈ జిలేబి పోస్ట్లుకూడా అయోమయం,పజిలం ...మరి

    ReplyDelete
    Replies

    1. ఆస్ట్రో జోదు వారికి

      పజిలు పజిలు పజిలు పజిలు

      జిలేబి

      Delete


  4. ధన్యవాదాలండీ అన్యగామి గారు


    మదిలోని వూసులకు అక్షర రూపం అంతే !


    నెనర్లు
    జిలేబి

    ReplyDelete
  5. గూడతత్త్వవిదానంద జిలేబీ తీర్థస్వామినివారి నిగూఢ పీకూ (హైకూ చెల్లెలు) తత్త్వాలకు, వారి ఇటీవలి ఆరోగ్య పరిస్థితికి మధ్య సంబంధమేమైనా వున్నదా?

    ఇట్లు,
    స్వామిని వారి అనుంగు శిష్యవిషాదుడు
    నిత్యశంకానంద.

    ReplyDelete
  6. కొంటె చేష్టితాల గోర్వంక పనిలేక
    చిలుక లాగ పలుకు చిత్రమొలుక
    తరచు గాను నిట్లు తత్త్వాలు పాడును
    గూడు మిథ్య చిలక గోడు మిథ్య .

    ReplyDelete
    Replies
    1. కెవ్ కేక ఓ గురూజీ కెవ్ కేక ...
      కెవ్ కేక శ్రీ రాజాజీ కెవ్ కెవ్ కెవ్ కెవ్ కే ... క.
      అ ... ఆ ...

      (చిలకా? గోరింకా? విప్పర మీరింకా
      తీర్చరె మా శంఖ చూడగ మీ వంక ...)

      :) కేహా (కేవలం హాస్యం) ...

      Delete

    2. లఘువా ?

      జిలేబి

      Delete


  7. విన్న కోటలోని విద్వత్తు గనుమా గూటిలోని గుండు చిలకా :)

    నెనర్లు నరసింహారావు గారు

    జిలేబి

    ReplyDelete

  8. స్వామీ నిత్య శంకానంద శిష్య పరమాణు వారికి

    నెనరుల తో

    జిలేబి





    ReplyDelete


  9. లక్కాకుల వారికి

    ఆటవెలది యద్భుతంబుగ యున్నది

    జిలేబి

    ReplyDelete


  10. మాట లేల రమణి మదిలోన గుబులేల
    గూడు మిథ్య చిలుక గోడు మిథ్య
    రామ రామ యనగ రమ్యమగును గాద
    తత్వ మేల యమ్మ తమ్మికంటి !

    జిలేబి

    ReplyDelete
  11. చిలుక ఎగిరిపోయే
    గూడు రాలిపోయే
    చెట్టు ఎండిపోయే
    కనిపించవుగా..

    ReplyDelete