Friday, March 10, 2017

సరసిజనాభ సోదరికి సాటి జయంతి, జయంతి యే గదా !


 
రసిజనాభ సోదరికి సాటి జయంతి, జయంతి యే గదా  
 
 
వెడలగ శంకరుండతని వెంటన దక్షిణభారతమ్మునన్
బడబడ లాడి పద్యములు పారుచు నాడుచు బోవగన్ , భళీ
చెడుగుడు పూరణమ్ములను చెంగని చూడన, వేకువన్ గనన్
పడమటఁబొంచి చూచెనఁట భానుఁడుషోదయకాంతు లీనుచున్ !


శుభోదయం
జిలేబి 

137 comments:

 1. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు గానీ ఇక్కడే ఓ చోట ఈ క్రింది వాక్యాలు (ఓ "లెక్చరర్" గారు వ్రాసిన మాటలు) కనిపించాయి. చదివి మిక్కిలి విచారించాను జిలేబి గారూ 😩!

  "now I'm worked as lecturer in ......... I was applied for degree lecture."

  భావమేమిటో 🤔🤔??

  మరీ ఇటువంటి ప్రాథమిక తప్పులున్నది కాదు గానీ ఇంగ్లీష్ వాక్యనిర్మాణం గురించి ఓ ఉదాహరణ ఇదివరలో ఓ ICS ఆఫీసర్ గారి ఆత్మకథలో చదివినది గుర్తొస్తోంది. మద్రాస్ యూనివర్సిటీ స్ధాపించడానికై ప్రతిపాదనలు జరుగుతున్నప్పుడు ఇండియన్ గుమాస్తా గారు సంబంధిత ఆఫీస్ నోట్ లో The Chancellor of Madras University shall be the Governor of Madras అని వ్రాశాడట. నోట్ అప్పటి మద్రాస్ గవర్నర్ గారి పరిశీలన కొరకై వెళ్ళిందిట. దాంట్లో పై వాక్యం చదివి అక్కడే మార్జిన్ లో Please send me an English translation of this అని గవర్నర్ గారు వ్రాసి వెనక్కు పంపించారట 😀. (గుమాస్తా గారు వ్రాసిన పై వాక్యం రివర్స్ లో ఉండాలి, లేకపోతే మద్రాస్ యూనివర్సిటీ ఛాన్సలర్ గారే మద్రాస్ గవర్నర్ గా ఉంటారు అనే విపరీతార్థం వస్తుంది 😀)

  ఇది గుమాస్తా గారి ఇంగ్లీషు, అది లెక్చరర్ గారి ఇంగ్లీషు ☹️.

  ReplyDelete
  Replies
  1. గుమాస్తాగారి ఇంగ్లీషుకు శిక్షించచ్చు, అక్కడ జరిగింది పొరపాటు. లెక్చరర్ గారిది.....ఈయన లెక్చరర్ గనక శిక్ష ఏముండాలి? :)

   Delete


 2. మనుషులు మానవత్వమును మంచిదనమ్మును వీడినారిట
  న్ననుచు జిలేబి తత్వముల నాడుచు బోవగ నేలనౌ సదా
  కనుబొమ లెల్ల నీరునటు కార్చుచు నేడ్చుచు జీవితంబున
  న్ననుశృతి గాంచకన్ పయ నమెల్లను వీడుచు బోవనేలవే !

  జిలేబి

  ReplyDelete


 3. ఘనమగు తాత ! మీకథను గానగ గుర్తుకు వచ్చె నయ్యరో !
  వెనుకటి కాలమందునట వేలికి దారము గట్టి బంపగన్
  తను పని కేగి గాంచెనట దారయు దారము నేల గట్టెనో
  యనుకొని బుద్ధిమంతుడగు యార్యుడొకండు జిలేబులొప్పగన్
  !

  జిలేబి

  ReplyDelete
 4. "మాలిక" బిగుసుకున్నట్లుందే ?

  ReplyDelete
  Replies


  1. ఎక్కడున్నారండీ లక్కు పేట రౌడీ గారు

   విన్నకోట వారి కంప్లయింటు కూసింత చూద్దురూ :)

   జిలేబి

   Delete
  2. మాలిక పాక్షికంగా బిగిసిందా? కొన్ని బ్లాగులే ప్రచురింపబడటం లేదో!

   Delete
  3. అలాగే ఉంది శర్మ గారూ. అలా కనబడకున్న బ్లాగులలో మీదొకటి. మీ "రాజు గారి కుక్క" టపా "మాలిక" లో రాలేదు.

   Delete
 5. మాలిక కాదు వదన బిగిసినట్టుంది :)

  ReplyDelete
  Replies


  1. అయ్యో పాపం :)

   వదన కూడానా :)

   జిలేబి

   Delete


 6. కవితల రాయు డెవ్వరిని గానక వేచెను సూవె బ్లాగున
  న్నవి చదువంగ వెంబడి ధనాయనుచున్ లలితమ్మ మెచ్చగన్
  తవికల రాణి యా గడుసు తార విహారి కమింట్ల వేయగన్
  కువకువ లాడి వచ్చె పద కూర్పుల పద్య చతుష్కమున్గనన్ !

  జిలేబి

  ReplyDelete


 7. ఘనమగు విల్లు నాతడటు కంకవలెన్గని కైగొనంగనౌ
  క్షణమున కూలగన్, రమణి కన్నులనవ్వుల గాన నయ్యరో,
  యినకుల తేజుడా విభుని యీగడ లారగ జూచి నౌర! స
  జ్జనకుడటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్

  జిలేబి

  ReplyDelete


 8. నిజమును నిర్భయంబుగను నిగ్గులదేల్చిరి విన్నకోట రా
  య! జమ గనంగ వచ్చె గదయా సుకవీశులు యొజ్జ దీక్షితుల్ !
  సుజనుల పల్కు సృష్టియగు సూక్ష్మమిదే నరసింహ, గానగన్
  మజగొని వచ్చె పద్యమిట మానవ! చంపకమాల వృత్తమై‌!

  జిలేబి

  ReplyDelete


 9. నిగనిగ లాడు గుండునటు నింగిని సూర్యుడు కాల్చ, తారల
  న్నిగలిసి నాట్య మాడగను నిండుగ చుక్కల రీతి నెత్తిపై
  పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
  సెగలను దాచి మానవుని సేనము చట్టన సేద దీరనౌ !

  జిలేబి

  ReplyDelete


 10. పరుగున వచ్చెనమ్మ మన పాటల రాణి జిలేబి సాహితీ,
  గరుడుఁడు భీతినొందె, నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్
  పరుగిడె పాకుచున్నటను, పద్య మహత్యము గానవే చెలీ
  వరమిది సారసత్వమగు వాణి శుభాంగి లతాంగి సర్వదా!

  జిలేబి

  ReplyDelete


 11. పడతుల మానభంగములు, పాగెములేక జనావళిన్ని పో
  నడచుట హానికారక మనాగరకం బగు మానవాళకిన్
  విడదగునయ్య విప్లవము వీకొనుమా!హజరత్ సలామతౌ !
  జడతల భారతమ్మునకు జాగృత!యుత్తిగ మేలుకోవయా !


  జిలేబి

  ReplyDelete


 12. వరముగ వచ్చె యోధుడట, వారిజ జూడ ముదంబు గానగన్
  పురుషుని, కంఠమం దపుడు పుస్తెను గట్టెను చాన వేడ్కతో
  పురజను లెల్ల మెచ్చ పతి! పూవిలుకాడి యవాయి మత్తులో
  న రమణి యా జిలేబి సరి నాధుని గూడె శుభాంగియై భళీ !

  జిలేబి

  ReplyDelete


 13. అరయగ తండ్రి యానయన కానన మేగెను,యక్కు జేర్చెనౌ
  భరతునిఁ, జంపె రాఘవుఁడు భామినికై సురలెల్ల మెచ్చఁగన్
  హరణము జేయ రావణుని, హా!శరణమ్మనగన్ విభీషణు
  న్నిరతము కాపుగాచెను సనీదమునన్ సుగుణాభిరాముడై !


  జిలేబి

  ReplyDelete


 14. త్రిగుణపు సాధనా పథము తీక్షణ మైన జపమ్ము గూడగన్
  సగుణపు రేడు సూర్యుని, శశాంకుని హృత్తున సత్య మై సదా
  నిగుడు జిలేబి నిక్కము సనీదము గాంచుము సృష్టి నంతయున్
  సుగుణనిధీ కనుంగొనుము చుక్కలనే నడి ప్రొద్దు జామునన్

  జిలేబి

  ReplyDelete


 15. సతతము భూత కాలపు సజావుల చింతనలన్ సవారులౌ
  గతజలసేతుబంధనమె; కల్గగఁ జేయు ననంతలాభముల్
  వెతలను వీడి యత్నముల వేగము జేయ జిలేబి, ముంగటన్
  బతుకును నీడ్వ మేలగును బాధ్యత గాంచి మెలంగ వే సఖీ‌ !

  జిలేబి

  ReplyDelete


 16. పలుకుల తియ్యబోడి ! మజ! పద్యములెల్ల సదా భళాయనన్
  కలికి కవుంగిలింత; కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా
  కలకువ యై జిలేబి సరి కావ్యము ముద్దుగ రాక బోవగన్ !
  నెలతుక యత్నముల్ వలయు నెల్లపుడున్ వికసింప యోచనల్ !

  జిలేబి

  ReplyDelete


 17. వనమున గాంచె లేమనట వాకలువేయ మనమ్ము పెండ్లి యా
  డెను తను రీతిగా మనుజుడేగద! శోభలనొంది చేరగన్
  ముని సహవాసమంది సతి, ముద్దుగ బొందెను పుత్రు లిద్దరన్
  ఘనముగ కొల్వరండిట సగర్వము గాను జిలేబు లై భళా!

  జిలేబి

  ReplyDelete


 18. పృథువిఁ బురూరవుస్సగరు హైహయజున్ బురుకుత్సుఁ జంద్రమ
  త్యధిపు నలుం దిలీపు యవనాశ్వభవుం భరతున్ గయున్భగీ
  రథుని మరుత్తనంగు శిబి రాము సుహోత్రుని నంబరీషునిం
  బృథుని యయాతి రంతి శశిబిందుని భార్గవు మించవే హరీ!

  ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోని పద్యం
  ఇందులో షట్చక్రవర్తుల పేర్లు,షోడశమహారాజుల పేర్లున్నాయి

  source->

  http://chitrakavitaprapancham.blogspot.com/2017/05/blog-post_72.html

  జిలేబి

  ReplyDelete


 19. పరిణితి గాంచి పాటవము, భావము లెల్ల, జిలేబి, రమ్యమై
  వరముగ తెల్గు లోకమున వారిజ మా లలితమ్మ వచ్చెనౌ
  స్వరముల పాటలెల్ల తను సాజముగా వినిపించెనమ్మరో !
  సరసిజ నాభ సోదరికి సాటి జయంతి జయంతి యే గదా !

  జిలేబి

  ReplyDelete


 20. మలుపుల వేగ వేగముగ మారుతి కైపు జిలేబి బండ్ల, హా!
  కులుకుల తేలియాడి, మజ, గొల్లని కెవ్వు మటంచు బోయెడు
  న్నెలతుక లెల్ల గాంచి, భళి, నేర్చెద నూతన వాహనమ్మనన్,
  ఎలుక వడంకె ,విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్!

  జిలేబి

  ReplyDelete


 21. అనితర సాధ్యమైనటి సదాశివునిన్ ధనువున్నటన్ గొనన్,
  మనుజుల లో మనీషి పరమాత్ముడయోధ్య పురాధినాధుని‌న్
  తనయుఁడు ,భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో
  తనరెడి సీత సుందర వితానపు మోమున గాంచినామయా

  జిలేబి

  ReplyDelete


 22. సరసిజ నాభ సోదరి! విసంచితివే ! గురజాడ పొత్తమున్
  బిరబిర చూచినాను! కనిపించిన వారిని ప్రశ్న వేసితిన్
  "వరుసలు జూడగా మధురవాణి గిరీశము కూతురౌ గదా?"
  సరియని చెప్పలేమనుచు సారము దెల్పె, బుజంగికాయటన్!

  జిలేబి

  ReplyDelete


 23. శరణము నీకు మేలుగను చక్కని రాజ! జిలేబి యయ్యరో !
  విరసము గాదు సుమ్మి , మజ, వీనుల విందగు గీత మయ్యరో !
  సరసముకుంద ! మాలి,కరసాన మనోహరమయ్యె సూవె "యా
  చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్!

  జిలేబి

  ReplyDelete


 24. సరసపు పల్కులన్ జగతి శాంతము గా వెలయన్ మహిన్ తుషా
  ర రవము గాంచి మానవులు రమ్యము గా నిను గొల్వగన్నప
  స్వరముల మీరి మేలుగన భారతి ! నీదు కటాక్షమున్ సదా
  తిరముగ నిమ్మ ! వాణి! వినుతించెద తెల్లనితల్లి ! శారదా !

  జిలేబి

  ReplyDelete


 25. పతి పతి పాతి పాతి పతి ! పంచ పతుల్వలయున్!తథాస్తనన్
  పతులు గణింప నైదుగురు; భానుమతీసతికిన్ సుయోధనా
  శ్రితసితకున్ గణింపగను క్షేత్రి బలాడ్యుడు ధీరుడాతడౌ
  పతియన నొక్కడౌ!సొబగు బాలుడు లక్ష్మణుడయ్యె సంతతై!

  జిలేబి
  *పాతి - భర్త - ఆంధ్రభారతి ఉవాచ

  ReplyDelete
  Replies
  1. బిడారంలో ఒంటె గుడారంలో చేరింది :)

   Delete


  2. హ! బి డారమ్ముల వాసం
   తి బిలేజి,గుడారమున్ జతియతుల గాంచెన్ !
   సభికుల మనస్సు దోచెన్ !
   గుబగుబ మనె యయ్యవారు గూడ జిలేబీ :)

   జిలేబి

   Delete


 26. మరణము సాజమయ్యదయ!మానవుడా విను జీవితమ్మునన్
  శరణము రాజమార్గమయ! సన్నిధి గాంచి శతఘ్నుడా విభున్
  మరిమరి గొల్చుచున్,మదిని మంచితలంపుల నింపుచున్ సదా
  కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా!

  జిలేబి

  ReplyDelete


 27. కరివెద పూర్తిజేసి తొల కారుకు వేచు యదేష్టి రీతిగన్
  పొరతెరవెల్ల పూర్తిగన పుణ్యములౌమిడివోవ దోషమే
  జరఠము గాన,మాలిని, సజావు‌ గనంగను మేల్మి గానగన్
  పరమపదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్

  జిలేబి

  ReplyDelete


 28. మరుకపు రూపమందు సయి మాయల జేయ నతండు, సీత తా
  మరకనులున్ చమక్కుమన, మత్తును గొల్పి, మరింత భీతిగా
  పరుగిడె తాటకేయుడట ! బాణము చువ్వన, విప్రలంభ, డం
  భ రతు వధించె, రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై!

  జిలేబి

  ReplyDelete


 29. కమలముఖీ,జిలేబి సుమ గంధము జేర్చును ముద్దు గూర్చుచున్
  రమణికిఁ బూలు; చేటగును బ్రాయమునం దనుమాట మేటికిన్
  గమకము గానకన్ మజను గాంచు ప్రవర్తన, వెళ్ళబుచ్చగన్
  సమయము, జీవశక్తియును, సాధన లేమియు లేక నీవికన్ !

  జిలేబి

  ReplyDelete


 30. జగతిని నేలనొక్కరికి సాధ్యము గాదు గదయ్య! కాలమే
  పగగనినన్,సుసాధ్యమగు భాగ్యము?మౌర్ఖ్యమదేల మానవా!
  విగతులమై విశాల వినువీధుల బోవుట కన్న, యుక్తిగన్
  పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్ !

  జిలేబి

  ReplyDelete


 31. పరిపరి కైపు పద్యముల పట్టి పరిశ్రమ జేసి పట్టుగన్
  గరిమ, పదమ్ము లన్ కలుప గాను జిలేబి, పదౌచితీయముల్
  పరుగులు వారు, పాటిగొని పట్టి పవాకము గాను పద్ధతై
  దొరలు, పరాంగవమ్ము సరి దోచును చంపకమాలయై భళా !

  జిలేబి

  ReplyDelete


 32. సదనము శంకరార్యులది ! చక్కటి ఛందపు పుష్ప మాలికల్
  కుదురుగ ఠావుకొన్న యిలు; కూరిమిగా వ్యవహార గ్రామ్యమౌ
  పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్
  కదనము కైపదమ్ములది ! కాకలుదేఱ నకో జిలేబియా !

  జిలేబి

  ReplyDelete


 33. తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పు! నే
  తెలుగు జిలేబు లూర మజ తెల్పెద పబ్బము నేడు మాన్యులా
  ర; లుకలుకల్ మరేల నయ! రండి! సభాస్థలి యెల్బియెస్నటన్
  కలిసెద మయ్య యెల్లరును గట్టెద మయ్య ప్రణాళికల్ భళా!


  స్వాగతం సుస్వాగతం
  ఫ్రమ్ యెల్బీయెస్
  జిలేబి
  సైనింగ్ ఆఫ్ (ఆన్ :))


  చీర్స్
  జిలేబి

  ReplyDelete


 34. వడివడి గాను చేరితిని వారధి యైప్రభు వున్ గనన్ మదిన్
  వడకుమలన్! జిలేబి బడబాగ్నులు హృత్కమలంబు లన్విడన్
  గడగడ లాడు శీతమున గట్టిగ యత్నము జేయగన్ సుమా,
  పిడికిలిలోన నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్!

  జిలేబి

  ReplyDelete


 35. తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాప, రే
  తల సమయంబులో వెతల తామిక కష్టము చెంద నీయకన్
  తెలుగు మహా సభన్ జరిపి తేజము నింపెను చంద్ర శేఖరుం
  డలుక యదేల నీకు కవి! రాధనమున్ గొను మయ్య శంకరా!

  జిలేబి

  ReplyDelete


 36. మదిని మధింప గన్నెలమి మన్నిక గాంచి జిలేబులూరగన్
  చదివిన జ్ఞానమంతయును చప్పున పోవు నదేమి చిత్రమో
  విదురుడ! పల్కులన్నియును వింగడమాయె, నుదర్చి పల్కు గన్
  పదునకొనంగనౌ పటిమ పాటవ మై వెలసెన్ మహాశయా

  జిలేబి

  ReplyDelete

 37. త్రికరణ శుద్ధి గావలెను తీర్థము లాడ ప్రయోజ నమ్మకో !
  సకియ! జిలేబి! నేర్చుకొను చక్కని పల్కులు మేలు జేయునే !
  నికరపు ప్రార్థనల్ పడతి నెమ్మది నివ్వదు సూవె ! అంచయా
  న! కరుణ జూప మేలగు జనాళికి జీవన యానమందునన్ !

  జిలేబి

  ReplyDelete


 38. వడివడి గాను భార్య పరివారము కాంతుని యింటిలోన జే
  ర డిమడిమల్మొదల్! మగడి రాధనముల్తొలగున్ జిలేబియా!
  కడిగడి గండ మైనతని కాల్చును తేగడ వమ్ము బోవగా
  పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్ :)


  జిలేబి

  ReplyDelete


 39. ***

  అడిగినదొక్క చీర కొనవైతివి ! నే జడ దాల్ప కోర మూ..
  రెడు పువులైన తేవు ! నడి రేయిని మాత్రమె నీకు ముద్దు నన్
  విడువక ఆటబొమ్మగ గణింతువటంచును ముక్కు చీదు నా
  పడతియె శాంతిసౌఖ్యముల భంగమొనర్పగ కారణంబగున్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  *** మైలవరపు వారికి జిలేబి కౌంటరు *** :)


  పిడికెడు బువ్వ బెట్టగను పేర్మిగ ముద్దుల నివ్వ సత్తులే !
  కడకయు లేక నన్నిట బికారిగ చేసితి వయ్య గేస్తుడా!
  పడిపడి నేను నీ రహిని పట్టుగ గాచితి; యెట్లు రుచ్యుడా
  పడతియె శాంతిసౌఖ్యముల భంగమొనర్పగ కారణంబగున్ ?

  జిలేబి

  ReplyDelete


 40. అవసర మైన తావు జన వాహిని మన్నన గాన మేలుగన్
  సవరణ జేసి పాద ముల చక్కగ గట్టి చమత్కరించుచున్
  కవకవ లాడ జేయ గడ గట్టుచు పూరణ తేగడల్గనన్
  కవితల, లేని భావములు, కైతల కెక్కెఁ బ్రశంసనీయమై!

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. రవి కిరణంబు మాడ్కి , తనరన్ , రచనల్ వెలయించి , లోక బాం
   ధవుడయి వెల్గువాడు , ఘనతన్ విడనాడి , తథేక దృష్టి , కం
   దువ గత క్రీడలో బడెను , దోగి , సమస్యల పూరణార్థ , మీ
   కవి - తలలేని భావములు కైతల కెక్కె ప్రశంసనీయమై .

   Delete


 41. కమఠపు రీతి యైన భళి, కాంక్షిత మున్బడ యన్ సదా నరుల్
  ఖమణివలెన్నహర్దినము కార్యము లెల్లను చక్క బెట్టుచున్
  సమకలనమ్ము జేయ తమ శక్తిని జీవన యానమందు నా
  సమరము శాంతి గూర్చు ఘన సంపద లిచ్చును నిశ్చయమ్ముగన్ !

  జిలేబి

  ReplyDelete


 42. తెలియక చేరితిన్ కొలువు తేగడ గాంచితి నేర్వ గానిటన్
  మలిచిరి కంది వర్యులయ మాన్యపు కందము లెల్ల గూర్చగన్
  పలికెద వృత్త పద్యముల పల్కుల తేనియలూరగానిటన్
  వలచెద కావ్య కన్నియను వాక్కున మాధురి జాలువారగన్ !


  జీపీయెస్ వారికి
  జిలేబి

  ReplyDelete


 43. వికసిత కోమలాంగి యెద వేగము గాంచదె పూవుబోడియా,
  చెకుముకి రాయి కైపుల సచేతన గల్గదె మానసంబునన్,
  పకపక నవ్వులన్ మగడు పక్కకు వచ్చుచు నింబునివ్వ, లే
  మ! కరముఁ బట్టినంత రస మంజుల భావము లుద్భవించవో!

  జిలేబి

  ReplyDelete


 44. మెలకువ గానుమయ్య మనమేగతి బోవగనేమి వారికిన్?
  పలికిరి రాజకీయ పరిపాటిగ మంత్రులు వేదికన్ సదా
  విలువలు లేని బల్కుల కవీశ్వర! మాటల కేమి చెప్పగన్
  తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక! నేర్చినఁ గొల్వు లిత్తురే ?

  ReplyDelete


 45. తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక! నేర్చినఁ గొల్వు లిత్తురే"
  పలుకనదేల పక్కి వలె ! పాలకు లన్ గను మయ్య నేర్చిరే
  తెలివిగ పట్టు తెల్గు పయి, ధీటుగ తియ్యగ మాట లాడుచున్
  వెలిగిరి వేల్పు గాను ! మరి వెల్గుము నీవును గొల్వు లేలకో ?

  జిలేబి

  ReplyDelete


 46. పలికితి నూరకన్నకొ సభాస్థలి నందున లేమ ? కష్టమే
  తెలుఁగును నేర్చుకొమ్మనుట? తేలిక! నేర్చినఁ గొల్వు లిత్తురే
  వెలుగుల చంద్ర శేఖరుడు వీధుల వీధుల పాఠశాలలన్
  జిలుగు వెలుంగు తెల్గుల భజిష్యము గాను జిలేబులూరగన్ !

  జిలేబి

  ReplyDelete


 47. మనసున నమ్మితిన్ శివుని మాలతి యై మనువాడ భర్తగా
  త్రినయన చంచలాక్షి గను తీరుగ గాన్పడ నాది శక్తియై
  వినుమయ తండ్రి! వెండిమల ! వింగడ మై సయి యాదియోగి కై
  యనలమె సుమ్మి చల్లన, మహాహిమశైలము వేడి యీభువిన్


  జిలేబి

  ReplyDelete


 48. కషణము లేల పౌరులకు గట్టిగ జేయుడు బాస నేడిటన్
  ధిషణయు గల్గి తీరుగను ధీమతు లై జను లెల్ల దేశమున్
  శషభిష లెల్ల వీడి సయి శాంతికి తోడ్పడ మేలు గాను, ని
  ర్విషము సుధామయంబనుచు వేల్పురు దెల్పిరి మానవాళికిన్ !


  జిలేబి

  ReplyDelete


 49. చితికెను జీవితమ్ము సయి చెంగట గంపెడు బిడ్డ లాయెరా
  పతి సరసమ్ములాడ! సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో
  బతుకును సాగ దీయ! మన భారత దేశపు రూపు రేఖల
  య్య!తరుణు లెల్ల బంధితులు యాంత్రిక జీవన మందు నేడిటన్ !

  జిలేబి

  ReplyDelete


 50. పతి!పతి!పాతి! పాతి!పతి! పంచముఖుండు తథాస్తనంగ నా
  యతివకు పంచపాండవులు యంత్రణమయ్యిరి మత్స్య ఛేదన
  మ్ముతరముగాన! అక్షపతి ముంగిట వేదిజ నొడ్డగన్ సభా
  పతి సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో


  జిలేబి

  ReplyDelete


 51. వసతులు లేవు మాకు సయి వాసిగ జీవిత మున్సృశించగా
  దసలయిపోయినాము విధి దారుణ మై నిలువంగ ముంగటన్
  కసమస కాదు చందురుడ! కావలె పంటకు మద్దతుల్ సదా
  యసవస పంప కాలు కడు యాతన పెట్టెను గ్రామవాసులన్ !

  జిలేబి

  ReplyDelete
 52. అంశము - సీతారాముల కళ్యాణం
  ఛందస్సు- చంపకమాల
  న్యస్తాక్షరములు...
  మొదటిపాదం 4వ అక్షరం - భ.
  రెండవపాదం 12వ అక్షరం - ద్ర.
  మూడవపాదం 15వ అక్షరం - గి.
  నాల్గవపాదం 20వ అక్షరం - రి.

  **"

  భళిర భళీ !అయోనిజకు భద్రుని తోడుగ పెండ్లి వేడుకల్
  తళతళ శోభలన్ గొలుపు తంద్రము భవ్యముగా! జిలేబియా !
  గళగళ పాడు దామిక సుఖమ్ముగ గింగురు లైన తీరులన్
  మిళితము గాంచి పాటలను మేలుకొనంగ జనుల్ వయారియా !


  శుభోదయం
  జిలేబి

  ReplyDelete


 53. వ్రతతిగ గోముగా ముదిత, వాంఛిత రాణిని గాంచి సంతసిం
  చి తిరుగగా సదా వెనుక, చిక్కెను జాలము లో గదా మగా
  డు తిరిప జోగి తస్సదియ డుంటక డుంటక యే యికన్! రమా
  పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్!


  జిలేబి

  ReplyDelete


 54. సతులట నల్గు రయ్యిరయ జ్ఞాని మగండట! కాకి ఒర్రుడున్!
  అతిథులు రాగ నింటికి శుభాంగియ! విందుకు గేస్తు మాటగన్,
  వెతపడ గా మగండు, నలివేణియు జాయల పాయబెట్టుచున్,
  పతి తలఁ గోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్!

  జిలేబి

  ReplyDelete


 55. కుతకుత వేడి మీద జతగూడగ విందుకు జట్టుగానటన్
  సతతము రీతి గా నతిథి సౌఖ్యము గూర్చెడు యంచయాన స
  మ్మతముగ సంతసించి మజ మత్తున దేలుచు భద్ర విట్చరా
  ట్పతి తలఁ గోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్

  జిలేబి

  ReplyDelete


 56. సిగరము నెక్కె నాపతియె! చెప్పగ సిగ్గుల దొంతరై భళా,
  మగనికి, గర్భమయ్యెనని మానిని, మీసము దువ్వె వేడుకన్
  సగపడు కైపుగానతడు చక్కగ భార్యకు ముద్దు లిచ్చుచున్
  జగమెరు గున్నికన్ సతిని చక్కని తల్లిగ మేలు బంతిగన్ !

  జిలేబి

  ReplyDelete


 57. శంకరాభ 'రణం' లో కవిరాజుల రోజు వారి రణం :)


  పణముగ బెట్టి నాను తల! పాండితి నెల్లను నేను! మేలుగన్
  గణముల జూడ కున్న భళి గట్టిగ వేతురు మొట్టికాయలన్
  రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్!
  అణకువ తోడు వృత్తమును నాణ్యపు చంపక మాల జేతునే!


  జిలేబి

  ReplyDelete


 58. రమేశు గారి భావానికి- కవిత్వం రాస్తే మాత్రం చాలదు వూరూరూ తిరిగి పుస్తకానికి పబ్లిసిటీ యిచ్చుకోవాలి :)


  వణికముగాను కావ్యమును వాసిగ బేర్చి జిలేబులన్, భళా
  రుణముల జేసి పబ్లిషరు రూఢిగ ముద్రణ జేయ బాసటై,
  యణకువ తోసహాయము సయాటల జేయుచు మార్కటింగుకున్
  రణమొనరింపకున్న కవిరాజుపరాభవ మందు నెల్లెడన్!

  జిలేబి

  ReplyDelete


 59. పరుగున వచ్చి నాడు తన పట్టెడు కూటికి నల్లలాడుచున్
  గరుడుఁడు, సర్పభీతుఁడయి, గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్,
  మరుగగు చున్విటమ్మొకడు మండలి వెంటబడన్! సదాశివున్,
  హరగిరి నాధుడాజ్ఞ యన హాంత్రమికన్నెవరెవ్వరోగదా !

  జిలేబి

  ReplyDelete


 60. పొలమును దున్నినంత సుత పుట్టట యెట్టుల సాధ్య మమ్మరో?
  బలబల లాడకోయి సయి బాళిభగమ్మును జేయుమయ్యరో,
  కలమును దూయ గా నరుడ కావ్యము కైపుల జేర్చు నెట్లయా?
  జలజల పారు నెట్లు మజ? చక్కగ రీతిగ నట్లనే సుమా

  జిలేబి

  ReplyDelete


 61. అతివయు సిగ్గు లొల్క సయి యార్యుడు సౌమ్యము గా తలోదరిన్
  జతగని ముద్దు లన్గునిచి జంకును ద్రోలగ మత్తు గాంచుచున్
  స్థితిపథ జీవ నమ్మున వశీకరమౌనుగదా జిలేబి యై
  సతి! సతి క్రీడ సల్ప మగసంతు జనించెను మెచ్చి రెల్లరున్

  జిలేబి

  ReplyDelete


 62. అతుకుల బొంత గాధయిది! హద్దులు దాటి మధూళి త్రావినా
  వ?తరము కాదు పల్కనిటు వంకరకొంకర మాటలెల్ల మా
  దతెవుల తోడు! పాతకుడ! ధర్మముగాదిది చెప్పకోయి!యే
  సతిసతి క్రీడసల్పమగసంతు జనించెను, మెచ్చిరెల్లరున్?

  జిలేబి

  ReplyDelete


 63. రమేశు గారి భావనకు


  కవివర! భార్య వద్దనగ కాదనుచున్ పతి యంపె పుత్రుడా!
  తవిషమహో విదేశములు దస్కము బాగుగ దక్కు బోవ నీ
  కు! విధి! వివక్షయా? పసను కుత్సితమా?హతుడాయె బిడ్డడే!
  ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్!


  జిలేబి

  ReplyDelete

 64. సారంగధర

  అవును కదా! దురాయినట దాటగ కోపము తోడు ద్వేషమున్
  సవిధము గాన యా ధరుని సంకటముల్మొదలయ్యె మారుత
  ల్లి విధిని నిర్ణయించెను బలిన్గొనుచున్తునియింప తండ్రిరా
  జవిధిగ నిశ్చయించెనయ చంపగ,లోకులు గర్హ సేతురే
  "ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్"!


  జిలేబి

  ReplyDelete


 65. వరుస జిలేబులన్ పొలతి వాకిట బేర్చుచు గ్రాహకుల్ కొనం
  గ రయము గాను కాసులట ఘల్లన సర్దుచు గల్ల పెట్టి లో
  న, రజతముల్ కలల్గనుచు నాంత్రము జేయగ లచ్చుమమ్మయే
  సరములు దీసి ముద్దిడెను సంతస మందగ నద్ది తానుయున్!

  జిలేబి

  ReplyDelete


 66. పలికెద రయ్య దుష్టునకు, పల్కుల జిమ్ముదురే తుటారికిన్ !
  పలికెదరే జిలేబులకు, పల్కుల గొల్తురు రే విదగ్ధలన్!
  కలల జగంబు లో ధృవపు కావ్యము లన్నెల కొల్పుచుందురే!
  కలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్!

  జిలేబి

  ReplyDelete


 67. అరరె!జిలేబు లన్విడిచి నాకడ పోయిరి ! ఓ శుభాంగి ! వ్యా
  కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో?
  సరిసరి మీదు శోషయు ! కసాయితనమ్ముల పిల్ల కాయలన్
  సరికొనిరయ్య నేర్వమని సాధ్యము గాక పరారయేరయా !

  జిలేబి

  ReplyDelete


 68. ఓల్డ్ స్టొరీ :)


  అరకొర కావు మా చెయివు! ఆస్తుల లెక్కలు ఖచ్చితమ్ముగా
  పరకట సూక్ష్మ మెల్ల సయి బాగుగ మా కయి వాలకుండగా
  తరతర లేక గాచితిమి; దారుణ మిద్దె!ప్రభుత్వ మేలనో
  కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో?

  జిలేబి

  ReplyDelete


 69. లచ్చిందేవి కి తోబుట్టువటగా చంద్రుడు ! సోదరి ఆశపడితే వత్తాసు పల్కిన కల్వల సామి ;)


  సమయము సంజె దాటినది ! సానువు వేదిక! చిమ్మచీకటి
  న్నమరిన నీలి ఛాయ పస నాథుడు రాముని కన్నులన్గనం
  గ మురిసె సీత! సోదరుడు కల్వల సామి సహాయమిచ్చెనో
  యమవస రోజు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై

  జిలేబి

  ReplyDelete


 70. ఇలను జనాళికిన్ సఖియ! యీప్సిత మైనది మోక్ష మే సుమా
  కలగన నేల దాని కొర కై యతనమ్మును చేయ మేలగున్
  పలుకున, నెమ్మి నెక్కొనగ, బంధము లన్విడి, చింత చేసి, ని
  ర్మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్

  మరో పాకం :)
  జిలేబి

  ReplyDelete


 71. గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్
  సుజనుల పైన జంగ గొను చుండెనదే తితిదే సుమా జిలే
  బి! జవము బోవ నేడు మన వేదపు నీమము లెల్ల త్రోసిబు
  చ్చి జరఠ గుంట నక్క ఛి!ఛి! చిందులు వేసెను భారతమ్మునన్ !

  జిలేబి

  ReplyDelete


 72. వరముగ వచ్చెనమ్మ మన పాలిట జీవన మిద్ది !సారమున్
  సరళము!మానవాళి సరిసాటి సుమా! యిది వేద మమ్మ!నీ
  వరయుచు నెమ్మి నెక్కొలిపి వారధి యై మది చిల్కి దాని యం
  తరువుల గూల్చినప్పుడె గదా జగమందు సుఖంబు పెంపగున్!

  జిలేబి

  ReplyDelete


 73. మరుగున బోవ నార్షము శమాశ్రయ బౌద్ధపు తీరు లన్నికన్
  సరుగక బోవ నానెఱి, సుసాధ్యము చేయ నభేదమున్ భళా
  నరుఁడయి జన్మనెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే,
  పరుగున వచ్చి శంకరుని ప్రన్నదనంబుగ నిల్చె నండగా !

  జిలేబి

  ReplyDelete


 74. మరుగున బోవ ఛందము ఢమాలు కవిత్వపు తీరు లన్నటన్
  సరుగక బోవ పద్యము, సుసాధ్యము చేయన కైపదమ్ములన్,
  నరుఁడయి జన్మనెత్తె కరుణారహితుండగు ఫాలనేత్రుఁడే,
  పరుగున కంది శంకరుని ప్రన్నదనంబుగ నిల్చె నండగన్!

  జాల్రా జిలేబి :)

  ReplyDelete


 75. నరులకు జ్ఞాన మార్గము సనాతన ధర్మము నేర్ప గోరుచున్
  నరుఁడయి జన్మనెత్తె, కరుణార హితుండగు ఫాలనేత్రుఁడే,
  గురువుగ కీకశుండయి నిగూఢము గా నహ మున్తొలంగ‌జే
  య, రతనమయ్యె శంకరుడయా, వెలు గొందుచు భారతమ్మునన్!  जिलेबी

  ReplyDelete


 76. గలగల లాడు కొండికలు గప్పము కొట్టుచు చూచి రచ్చటన్
  జిలజిల చిత్ర మై వెలుగు, జేగురు రంగుల వన్నె తోడుగా
  తలతల లాడు చిత్ర మది ! తానము డిస్నివరల్డు లో భళా
  యెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్!

  జిలేబి

  ReplyDelete


 77. ప్రభవము గాను చేసెను తపమ్మును,నీశుని తోడు చేరగాన్
  నభమును తాకె తీక్ష్ణతయు, నాట్యము నాపి నటేశ్వరుండటన్
  విభువుగ చేర వచ్చెనట ! వీక్ష్యము! సిద్ధిని మించె శ్రద్ధయే !
  యభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్!

  జిలేబి

  ReplyDelete


 78. అభయుదు డాతడే, సరస మాడుచు నాట్యము చేయ నాగహా
  రి భయము గొల్పె చూడగను ! రిక్తము రూపము! విశ్వనాథుడై
  విభుడత డై సభాపతిగ భీషణుడై విషమాక్షుడవ్వగా
  యభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్!

  జిలేబి

  ReplyDelete


 79. హిమవంతుని కుమార్తెలు శైలజ,గంగ

  అనవమ గాధ లివ్వి సఖి యద్భుత మైనవి కాలకాలునిన్
  మనుగడ లో జనాళి మది మన్నిక గాంచిన వీ పురాణముల్
  మనకత లివ్వి నేర్వదగు మాన్యముగా చెలి, కొండరాయుడిన్
  తనయను జెల్లెలిన్ హరుఁడు దారలుగా గ్రహియించెఁ జూడుమా!

  జిలేబి

  ReplyDelete


 80. సురసుర యెండ భార్యపయి సూటిగ తాకగ మాటు విప్ప దా
  నరరె జిలేబి తళ్కులను నవ్వుల మోమును గాంచి, పైన కాం
  తి,రమణకెక్కు కైపుగని, తీరుగ యోచన చేసి చెప్పెనౌ
  "అరయఁగ నింతి!, గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్"

  జిలేబి

  ReplyDelete


 81. అరయఁగ నింతి! గుబ్బ, గవ యగ్ని, శిఖావృతమై వెలింగెడిన్
  పరిపరి రీతులన్ జనులు పాటిగ కొల్తురు దేశ మందు, తా
  నరయగ నగ్ని పర్వతము, నమ్మిన వారికి "ఫ్యూజిసాన్ " జపా
  ను రయిలు దారి లో మన కనుల్బడు మేటిగ నౌ జిలేబియా !

  జిలేబి

  ReplyDelete


 82. సరిసరి కైపదమ్ము భళి చక్కటి చిక్కు సమస్య నిచ్చిరే!
  అరె!రఘురాముడయ్య మనువాడెను సీతను కంది శంకరా!
  పరిపరి రీతి యోచనల పాటిగ చేసితి నెట్ల నొప్పునో
  భరతుఁడు పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్?

  జిలేబి

  ReplyDelete


 83. పలువిధ యత్న మెల్ల సయి పద్యము నేర్వగ చేయుచున్ సదా
  కలమును సాన బట్టుచు సుగంధము లొప్పగ తీర్చి దిద్దుచున్
  పలుకుల లోన గాన్పడెడు ప్రాసల గట్టిగ బట్టి నేర్వగన్
  పలుకఁగలేనివాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్!

  జిలేబి

  ReplyDelete


 84. ముదిమి యదేమి పోరచియ ? పోడిమి గాదె జిలేబికిన్ భళా
  చిదిమి ప్రదీపమున్ తనదు చెక్కిలి పైనిడు నాటి నుండి తా
  పొదికిలి ముద్దు లొల్కు పువుబోడియ ! అందము చూర బోవునా
  ముదిమినిఁ బొందఁగా ? మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్  జిలేబి

  ReplyDelete


 85. సుడికొను కైపులన్నులవి! సూటిగ పల్కెదనే నితంబినీ!
  గడగడ లాడి నిల్వగను, కప్పుర గంధి! జిలేబి!కేశినీ!
  పడఁతి! , పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్ధతిన్
  నడకువ తో కొమారులు వినమ్రముగా తలరాత గా సుమా!

  జిలేబి

  ReplyDelete


 86. గడుసు రమేశుడీతడు! సుఖమ్ముగ సందియమేది లేక తా
  ను డబడబా జిలేబులట నోచు కొనంగ జిలేబులే యటం
  చు డమరుకమ్ము మీటెనుగ, సూటిగ చెప్పుచు దేశ మందు పో!
  పడతి పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్దతిన్ !

  జిలేబి

  ReplyDelete


 87. విలవిల నేడ్చి మూల్గగ దవిత్రము పెన్మిటి వీచగానటన్
  గలగల చేరి దస్కమును గట్టిగ నొక్కగ పర్సులోనటన్
  తలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ
  జలజ!జిలేబి! పద్మముఖి! చామ!కళింగ! బిరాన గానుడీ :)

  జిలేబి

  ReplyDelete


 88. విలువను జేర్చు మాట,సయి వీనుల విందును గూర్చు రాగమై
  పలుకులు తేనెలూరగను పద్యము మోదము గూర్చ మెత్తురౌ
  లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన, మెచ్చ రెవ్వరున్
  మలకలమాటలన్ సుదతి మత్తున దేల్చు పదమ్ములన్ సుమా

  జిలేబి

  ReplyDelete


 89. పోతా నా పుట్టింటికి పోతా నంటూ
  పట్టు బట్టు జిలేబి ని
  ఉద్దేశిస్తూ అయ్యరు గారు :)


  అవసర మిద్ది గాదె మన నాయతనంబు శుభమ్ము గాన! జా
  య! వలయు నీదు పొందు గద ! యమ్మి ! శుభాంగి! జిలేబి ! పల్కులన్
  గవనము గా వినమ్మరొ ! యగారము లో ప్రియ ! నీవు, నా విలా
  సవతియె, లేని కాపురము, సవ్యముగాఁ గొనసాగు టెట్టులో!


  జిలేబి

  ReplyDelete


 90. సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో
  గవనము గా వినండి కనకాంగులు! మీరు భళా జిలేబులై
  జవనపు వేగ మై పతికి సారతరమ్ముగ ప్రేమ తోయరా
  శివలెను జూపి నార్యులను సింహపు కైపుల గావ తధ్యమౌ!


  జిలేబి

  ReplyDelete


 91. ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ పద్యమాలలన్
  సదనము నందు చేర్చి సయి చక్కగ దిద్దుచు నుంటి నేనిటన్
  కదనపు కైపు గాను మరి కందివ రుల్ వల దమ్మ రోజిలే
  బి!దరువు లీవి ధమ్ముగని భీతిని చెందిపలాయనంబవన్ :)

  జిలేబి

  ReplyDelete


 92. అడుగక పోయినా భళి టపా మది గిల్లిన వేసెదమ్మయా
  యెడనెడ జాంగ్రి లడ్డులను నెవ్వరి కైనను వ్యాఖ్యగా భళా
  జడిగురియన్ , థడీల్ థడిలు , సారు ! భయమ్మును వీడిగానుడీ
  అడరున వేసె దమ్ము మరియాదగ మీకొరకై జిలేబులన్

  జిలేబి

  ReplyDelete


 93. మెదలడు పల్కడే యనక మెంగెపు వాడిని నమ్మ గా నతం
  డుదయపు సూర్యు డై యితవరుండగు! డుంగని వాడు సూక్ష్ముడా
  కదలనివాఁడు సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్
  చెదరని ప్రత్యయమ్ము మన చెంగట గావలె నంత యే సుమా !

  జిలేబి

  ReplyDelete


 94. వరముల నెల్ల వేళల కవాటపు చేరువ నిల్చి కోరుటే
  ల రమణి సార పక్షి వలె? లబ్ధియె లక్ష్యమకో జిలేబి? నీ
  దు రవణ మెల్ల దంధనము! దూల సుమా! జగదాంబ నీదు త
  ల్లి! రయత నీకు జేర్చు తను లివ్వగురీతి!అలక్ష్మి నివ్వదే!


  వరలక్ష్మీ వ్రతపు శుభాకాంక్షలతో

  జిలేబి

  ReplyDelete


 95. గురుముల విత్తి తానొరగు నిగూఢము లన్వెలి తీయు నాతడే
  చరుచుచు వీపు భేషనుచు చక్కగ స్పూర్తిని చేర్చు నాతడే
  తెరగుల నీశు రూపముగ దేవ రహస్యము లెల్ల వెల్లడిం
  చి, రమణ కెక్కు రీతి గను శీఘ్రపు పైనపు నావ యాతడే !


  జిలేబి

  ReplyDelete


 96. మషిమణి రాత సుద్ధి సయి మాన్యత గల్గిన మంచి పోకయున్
  ధిషణిని నాల్క తీరు సయి ధింధిమి జేర్చు జిలేబి పోడిమిన్
  శషభిష లేవి యున్ తను విచారము చేయక పల్కులోన ని
  ర్విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై!

  (మన రాజశేఖరులు మైలవరపు వారి లా అన్న మాట)


  జిలేబి

  ReplyDelete


 97. కట్టె కొట్టె తెచ్చె :)


  వినుమ జిలేబి రామకథ వీరుడు రాముడు బొట్టుదారమున్,
  ధనువును త్రుంపి, కట్టె, కుజ దారగ నయ్యెను, తండ్రి యానగా
  వనమున కేగె, మోసమున పాలుషి బోముగ బోవ నింద్రజి
  జ్జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై!

  జిలేబి

  ReplyDelete


 98. జీ పీ యెస్ వారి కటికిచీకటి కైపద సంహారం :)


  అడిగిన తక్షణమ్ము భళి యాతడు వచ్చుచు పద్య మాలికన్
  గడగడ గట్టి దేశమును కాల్చు సమస్యల పైన వేడిగా
  జడలమెకమ్ము కైవడిగ ఝాడిచి కైపదమున్, జిలేబియా
  మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్!


  జిలేబి

  ReplyDelete


 99. ఆకాశవాణి రికార్డింగ్ స్టూడియో లో మిక్సింగ్ సౌండ్స్ విన్న తరువాయి కంది వారికి వచ్చిన కైపద ఆలోచన‌:)  యుగళపు వాణి నాకసపు యుగ్మము భాగవతమ్ము సీత గా
  ధ,గులక రాళ్ళ శబ్దములు దారుణ మై వినవచ్చె రేడియో
  న గుబులు రేపె నయ్య శ్రవణమ్ముల కర్ధము నాకు దోచలే
  దు గబగబాల్మ టంచన బుధుల్ విడగొట్టుడి కైపదంబిదే
  "ఖగపతి కిచ్చె రావణుఁడు గాండివమున్ నృపకోటిఁ జంపఁగన్"

  జిలేబి

  ReplyDelete


 100. కొండ పైన రాజు ఉండు :)
  మన ప్రక్కన భిక్షువు :)


  సరసి! తలమ్ము బట్టి గద సత్తువ, టెక్కులు ! గానవే సఖీ,
  పరపతి వచ్చు కొండని నృపాలడవన్! హరి యందుకే గదా
  తిరుమలలోన వర్ధిలెను దేవుఁడుగా! శశిమౌళి ప్రీతిగన్
  సరసన వాయులింగ మయె చాయగ చక్కగ కాళహస్తిలో !


  జిలేబి

  ReplyDelete


 101. మదిమది ! పెండ్లి వేడుకలు ! మానస చోరుడు దగ్గి రాయెనే !
  కుదిరెను ముచ్చటల్ కలిసె కొవ్వలిపువ్వు సయాటలన్ పతిన్!
  మది సయి తూగె నూగె భళి మాంగలికమ్ముగ చక్కనమ్మ, కౌ
  ముది తన పుంసకున్ గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్!

  जिलेबी

  ReplyDelete


 102. అరయగ రెండు గాధలివి! హంతకులయ్యిరి పుణ్యపూరుషుల్
  సరసన ప్రాపు సత్య యన సంగరమందున నల్లనయ్య తా
  నరక నిహంత యయ్యెఁ గద, నాగగళుం డగజాత మెచ్చఁగన్
  మరుని భళా,జిలేబి తునుమాడెను ధ్యానము నడ్డగింపగా


  జిలేబి

  ReplyDelete


 103. కరముల మోడ్చి వందనము గావిచి కోరననుంగు తమ్ముడా
  భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తి! కి
  న్కరవయు లేక కాననమునన్గడి పెన్పది పైన నాల్గువ
  త్సరములు తోడు లక్ష్మణుడు,జానకి,దీవెన తండ్రియానయై  జిలేబి

  ReplyDelete


 104. అలసెను మానసమ్ము కలగాంచితి దృశ్యమపూర్వమైనద
  య్య! లయపు కాల మందున వయారము లెల్లను బోవ గానటన్
  ప్రళయపు కొక్కురాయెను! కపర్దియు శాంతిగొనన్ ప్రభాతమై
  జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్!

  జిలేబి

  ReplyDelete


 105. పదవుల నెక్కి చెప్పెదరు ఫారెను వద్దిక, నాంగ్ల భాష,యా
  చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా
  తదితరమెల్ల యంచు భళి తాము ప్రజాతిని నంపుచున్ జనా
  న దెసదెసల్ జిలేబులవ! నమ్మకు నమ్మకు నమ్మకయ్యరో!


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. చదువులు పెక్కు , పల్కుల రసఙ్ఞత లూరు , హితుల్ ' భళా జిలే
   బి ధగ ధగల్ ' యటంచు గడు పేర్ములు గూర్తురు , పాండితీ ప్రభన్
   బుధులు బొగడ్త లిచ్చిరి , ప్రపూర్ణ కళోధ్ధత మూర్తిమత్వముల్ ,
   బొదవిన వారి ' పేరు ' విని , బొందు యదృష్టము మాకు గల్గునా ?

   Delete


 106. మందూ భాయ్ :)

  పక్కన చచ్చిన అలింబకము - తేనెటీగ ను మింగుతున్న బల్లి :)  లకలక మంచు బారుల కలానిధి రాత్రిని మత్తుగాంచినా
  వకొ? కను లెర్ర బోయె తెలవారెను లేవర వేగిరమ్ముగా
  పకపక నవ్వులేలనకొ? పక్కన నీదరి చావగా నలిం
  బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా!

  జిలేబి

  ReplyDelete


 107. వన మది కైపదమ్ములకు వాటిక! రాముడె రావణుండనన్
  పనస తొనల్వలెన్వొలిచి పాదములన్ సయి చేర్చి మాధురిన్
  తనరెడు రీతి చేయగ సుతారము గా తమ దైన శైలిలోన్,
  కనఁబడి రప్డు వానరులుగాఁ గవివర్యులు తత్సభాస్థలిన్!


  జిలేబి

  ReplyDelete


 108. మిలమిల లాడు కంజముఖి మెల్తుక యౌనటి మించుగంటియా
  తిలకిని పైన మోజుగని తిన్నదరక్క భళారె దారిలోన్
  కలవరకంప యై నటులు కక్షల తీర్చుకొనంగ మారగా
  వలలునిఁ జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్!


  జిలేబి

  కందివారి వ్యాఖ్య

  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'తిలకి' ? 'అరక్క' అన్నది వ్యావహారికం. 'కలవరకంప' దుష్టసమాసం!

  జిలేబి -

  Zilebiనవంబర్ 26, 2018 6:55 AM

  :)

  తిలకిని - స్త్రీ

  కలవరకంప - jumbled

  ఆంధ్రభారతి ఉవాచ

  అరక్క - వేరేపదం దొరక్క :)


  జిలేబి

  ReplyDelete


 109. అయయొ జిలేబి వచ్చెనట నాలపుటాలపు రీతి ప్రశ్నలన్
  రయముగ వేయు నంట తను రావడి చేయునటా! గలాట,లొ
  ల్లియె యిక నాముదాల మురళీవరు ప్రాంగము పో యటంచు తా
  భయమునఁ బాఱదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో!


  జిలేబి

  ReplyDelete


 110. హృదయము లోన ప్రేమ యను హృత్వుడు వెల్గు జిలేబి యై సదా
  మదిని మధించి యాతని నిమంత్రణ గైకొనగా దగున్ సదా !
  అదియిది యేల! జ్ఞానమున కావల చూడుము, దేహవంతులన్
  చదువనివాఁడు, పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ!

  జిలేబి

  ReplyDelete


 111. రజనము కోరి మాంత్రికుడు రక్తప మంత్రము వేయ ప్రాంగమున్
  వజవజ కొంకుపాటుగన, వాజిని వేగము జోరు జోరుగా
  నిజమని పించు రీతి తను నిబ్బరగించుచు గాంచి, శీవమా
  యజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే!


  జిలేబి

  ReplyDelete


 112. సందర్భము - మేడసాని వారి చంద్రగిరి, నారావారి చంద్రగిరి కి బాలకిట్టులవారు వచ్చిరి ! వారి అమోఘమైన "వాగ్ధాటి", తొడలు గొట్టి మరీ పలకడం, " ధారణా శక్తి" కి అబ్బుర పడి మేడసాని వారు, వారిని యవధాన విద్యకై పిలిచిరి :)


  ఈ మధ్య మన కోట రాజశేఖరుల వారి సందర్భపు‌ ముచ్చటలు చదివి చాన్నాళ్లయింది :) కాబట్టి యిది వారికే అంకితం :(  తొడలను గొట్టి గొట్టి పలు తూరులు చేసితి వయ్య చిత్రముల్
  హడలగ, బాలకృష్ణ, జను లందరు !రమ్ము వధాన విద్యకై
  గడగడ నేర్చు కొమ్మ యనగా భళి యాతడు మూర్ఛబోవుచున్
  వడఁకెను, మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్!


  జిలేబి

  ReplyDelete


 113. పరిచయ మైన వేళను గభాలున గట్టిగ కట్టి వేసె తా
  పిరియము తోడు పెన్మిటిని భీరువు మమ్మరె! తల్లితోడుగా
  నరయ చిరంటి, జామి, ముసలావిడ రూపసి సర్వదా సదా
  చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి! వేడుకన్!

  జిలేబి

  ReplyDelete


 114. విను! తనివాఱు నమ్మ మది! వీనుల విందగు కూజితమ్ములున్
  తనరు సుగంధపుష్పముల తావియు మీదు సమీరఢింభముల్
  మనసును దోచు పచ్చదనమా వనవాటిక సొత్తు! మాలినీ
  వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్!

  జిలేబి

  ReplyDelete


 115. అరకొర బుద్ధి తోడుగ సనాతన ధర్మపు నీమమెల్ల తో
  సి రగులు కోరికల్ మదిని చిత్రము గాగొని మీదు చంద్రశే
  ఖరుడిని ధ్యానమున్ సలిపి కానగ కోరగ తీర్చినట్టి యా
  వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్


  జిలేబి

  ReplyDelete


 116. పాపం పిచ్చోడు :) వెంట తగులుకున్న భామను వలదను వాడు :)


  అరె! వెస బ్రహ్మ చారినని యందెల చప్పుడు చేసి బిల్వ నే
  ల రమణి ! వెంట రావలదు ! లంపటపెట్టకు ! లాగు లాడ నే
  ల!రసికురాల! మాయని కలన్ సయి భావన చేయజాలనే !
  మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్!


  జిలేబి

  ReplyDelete 117. అరె! ప్రవరాఖ్యుడన్ ! పడతి! యమ్మవు నీవు సుమా వరూధినీ !
  పరుగిడ నీకు నీ మదిని భావన చేయకు తప్పు దారులన్
  కురుచపు బుద్ధి వీడుమిక కొంగుముడిన్ దిగ జార నీకుమా !
  మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్!


  జిలేబి

  ReplyDelete


 118. కనగల రయ్య హెచ్చుగ నుగాదిని రాబడి! ఫర్టిలైజరున్
  తనరుచు వేయుడయ్య సరి తావుల! విత్తుల తోడు చల్లగా
  దనదన నేపుగా పెరిగెతా! తన భారము తోడు మెండుగా,
  మునిఁగిన పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్!


  జిలేబి

  ReplyDelete


 119. రగులుచు తీవ్ర వాదమున రాష్ట్రము సీ! తను కస్మలంబయెన్
  పగిలెను గుండె లెల్లెడ ! జవానుల చంపిరి! యుగ్ర వాదమే
  నెగడుచు దేశధర్మమును నెమ్మిని ద్రోయుచు భాస్వరంబవన్
  భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమం దయో!


  జిలేబి

  ReplyDelete


 120. వనమున చంచలాక్షి యట వాటిని వీటిని చూచుచున్ తటా
  ల్మను చెలువంపు మోముని విలాసము గాంచి హయారె కావలెన్
  తనకిత డేను పెన్మిటని తట్టని రూపము మార్చె! హ్రీణ! రా
  మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్!


  జిలేబి

  ReplyDelete


 121. పదపద వయ్య పండితుడ ఫక్కున నవ్వుదు రెల్లరున్ వినన్!
  సదనము లోన నిట్లు కవి శంకర పల్కుటదేలకో యెటుల్
  బెదరుచుఁ గార్యముల్ విడుటె విజ్ఞత? కల్గు జయంబు లెల్లెడన్
  నదరక చేయ యత్నముల నమ్మకమున్ గొని దీటుగా సఖా!


  జిలేబి

  ReplyDelete


 122. ఆకాశవాణి వారికి పంపినది


  అదియిది యన్ని నీదు తలపైన ధురంబుగ నెత్తుకొంచు నీ
  మది కలగుండవన్ బతికి మాడుట గొప్పయకో తలోదరీ?
  కుదురుగ యోచనల్ గనుచు కోవిద, మచ్చిక కాకపోయినన్
  బెదరుచు కార్యముల్ విడుటె విజ్ఞత, కల్గు జయంబు లెల్లెడన్!


  జిలేబి

  ReplyDelete


 123. జైబోలో భాజ్పాకీ హరిహర మోడీ :)  అరరె! జిలేబి దేశమిది యద్భుత మైనది వేదమేను దీ
  ని రవళి! కార్యకర్తలన నీతి నిజాయతి యొప్పు వారలే
  సరి! సరి భాజపాయె మరి! శంకరుపైన దురాయి! వారె, త
  త్పరులు, సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్!


  జిలేబి

  ReplyDelete


 124. అరయగ నేత లై మన సమాజము నేలగ వత్తు రా సురల్
  సరళిని తీర్చి దిద్ది సయి సంగతు లన్నియు నేర్పి విజ్ఞతన్
  ధరణిని నిల్పి కాలగతి తామిక వీడెద రీ జగద్వహన్
  మరణము లేనివారు గద మానవు లెల్లరు దివ్యమూర్తులున్!


  జిలేబి

  ReplyDelete


 125. జాల్రా జిలేబి ఉవాచ :)  గణగణ నైదనంగ మన కందివరార్యుల ప్రాంగమందహో
  మణిమయ పద్యపాదములు మాన్యుల మేల్మి జిలేబులున్ భళా
  యణగని శారదాంబ కృప యద్భుతమై కనరాగ యగ్నిధా
  రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్!


  జిలేబి

  ReplyDelete


 126. కైపదమనే రవిక బిట్టు చాలు యెన్మిది గజాల వృత్తాల నల్లేయును :)  పదముల నట్లు నిట్లు నడపాదడపా సరి జేసి నేయునె
  న్మిదిగజముల్ విలాసముగ నెత్తములాడుచు వృత్తమాలికల్
  సదనములోన కైపదమును చట్టున చూడగ తృటిన్ జిలేబి!యీ
  మదగజయానకున్ రవిక మాత్రము చాలదె, చీర యేటికిన్?


  జిలేబి

  ReplyDelete


 127. సిరులొలుకంగ దేశమిక శ్రీకరమై వెలుగొంద రాష్ట్రముల్
  విరివిగ పాడిపంటలు సువిద్రితమందున చేరగావలెన్
  కరిముఖ! వేడుకొందుమయ కావవలెన్ జనులన్ సదా విసా
  రి రువణమున్ సమగ్రముగ, రిక్తతయున్ తను గాక బ్రోచుమా!


  జిలేబి

  ReplyDelete