Monday, January 8, 2018

జిలేబి వరుసల్ భళిభళి చిత్రమయ్యెనే !



జిలేబి వరుసల్ భళిభళి చిత్రమయ్యెనే !
 
దత్తపదికి డిండిమ తో చిన్న ప్రయత్నం !
 
నిషంగదియె కందివరులు! నెమ్మ దిన్ సదా
విషక్తముగ నిచ్చు ! భళి కవీశ్వరుండితం
డు! సంఘమును జేర్చెనదియె డోల నమ్ములా
డ! శంకరుని కొల్వు పదికుడా! రమించుమా
!

డిండిమ
జిలేబి
 
దత్తపది - 130 (నది-మది-పది-గది)
నది - మది - పది - గది
పై పదాలను ఉపయోగిస్తూ గురుశిష్య సంబంధాన్ని వివరిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో శివరామకృష్ణ గారు ఇచ్చిన దత్తపది)
 
 
 
 
డిండిమ
 
నిషంగదియె కందివరులు! నెమ్మ దిన్ సదా
విక్తముగ నిచ్చు !భళి కవీశ్వరుండితం
డు! సంఘమును జేర్చెనదియె డోల నమ్ములా
! శంకరుని కొల్వు పదికుడా! రమించుమా !
 
౦౦౦
 
డిండిమ

డిండిమ పద్య లక్షణములు

  1. వృత్తం రకానికి చెందినది
  2. అతిశక్వరి ఛందమునకు చెందిన 11230 వ వృత్తము.
  3. 15 అక్షరములు ఉండును.
  4. 20 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణి: I U I - I I U - I I I - I U I - U I U
    • త్రిమాత్రా శ్రేణి: I U - I I I - U I - I I I - U I - U I - U
    • పంచమాత్రా శ్రేణి: I U I I - I U I I - I I U I - U I U
    • షణ్మాత్రా శ్రేణి: I U I I I - U I I I I - U I U I - U
    • మిశ్రగతి శ్రేణి (5-4) : I U I I - I U I - I I I U - I U I - U
  6. 4 పాదములు ఉండును.
  7. ప్రాస నియమం కలదు
  8. ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
  9. ప్రతి పాదమునందు జ , స , న , జ , ర గణములుండును


చీర్స్
జిలేబి


11 comments:



  1. జిలేబి వరుసల్ భళిభళి చిత్రకందమై
    భళీ యనెనహో కవివర ! పద్యమైయిటన్
    మలాయి పలుకుల్ మదిమది మానసమ్మునన్
    సలాము లనెగా నెలతుక చక్కనేర్వగన్!

    జిలేబి

    ReplyDelete


  2. నిఘంటువును చూడక మది నెమ్మదిన్ గనం
    గ ఘంటమున జేర్చ వలయు కంద పద్యమున్
    పొగాకువలె ఘాటువలదు పూవుబోడియా
    జిగేలు మనిపించవలెను చిత్రపద్యముల్ !

    జిలేబి

    ReplyDelete


  3. మనోజ్ఞు డతడే విభుడు! నమామి! సత్యమై
    అణోరణిగ వెల్గునతడు ! అంతటన్ గలం
    డు! నాధు డగుచున్నఖిలము డూయుచున్ సనా
    తనుండు,మదిలో నిలిచె సుతారమై సదా!

    ಜಿಲೇಬಿ

    ReplyDelete


  4. త్రయోదశి కథల్ గను! మన తాతగారి ప
    ల్కు యోచనల గాను బుళుబుళుక్కులాడెనే!
    వయోజనుల పల్కులకు సవాలు వేయుమా
    ప్రయోజనములేని కతల పంచనేలయా :)

    జిలేబి

    ReplyDelete

  5. నిఘంటువును జూచుచు గజనీ మహమ్మదై
    జగమ్ము నట తాకెనుగద జాణ పూవుబో
    డి! గట్టి దరువల్ గనుచు పెడేల్మనంగ ని
    మ్మ గయ్యిమని డిండిమనిట మాచనార్యకున్ :)

    జిలేబి

    ReplyDelete


  6. దత్తపది పన్ను మిన్ను కన్ను చెన్ను హనుంతుడి స్తుతి

    విపన్నులను చెన్నుగ సయి వీక్ష చేయుమ
    య్య పావనివి! కన్నులనిడి యాదరించుమ
    య్య పాటిగను, దన్నుగ హృదయంబునందు ని
    న్ను పేర్మిగ సదా కొలిచెద మోర్వి నివ్వుమా !

    డిండిమ
    జిలేబి

    ReplyDelete


  7. వయోజనుడ!విద్య గరచి వ్రాసెదన్నిటన్
    ప్రయోజనముగా నిలిపెద పద్యరావముల్
    సయాటలివియే గురువుల సన్నిధిన్ జన
    ప్రియమ్ము గనుగూర్చ మదిని పిండెదన్నికన్ :)


    జీపీయెస్ కై

    జిలేబి :)

    ReplyDelete


  8. కలగాదయా జనులు గట్టిగ యత్నము జేయ పేర్మితో
    పలుకుల్ వినూత్నముగ పద్యములెల్లను రూపుదిద్దగన్
    వెలుగున్ తెలుంగు మదివేణువు గానముగా సయాటలన్
    లలితమ్ముగా నిలచి లబ్జును‌గాంచునయా కవీశ్వరా!


    కవికంఠభూషణ
    జిలేబి

    ReplyDelete


  9. తినాలి ! పనిచెయ్యవలెను ! తిండిపోతులై
    జనుల్ బతుక రాదు లలన ! జాగరూకులై
    త్సునామి యగు జీవితమున తూకమున్న జీ
    వనమ్ము నిలలో నెలకొలుపన్దగున్ సుమా!

    జిలేబి

    ReplyDelete


  10. బడాయి పలుకుల్ వలదకొ ! బామ్మ మాట ట
    ట్టడామ్మనుచు నేర్వదగు నిటన్ గులాబి పు
    వ్వ! డంబమిది గాదు రమణి ! వాణి డిండిమల్
    పెడేలు మనునప్పుడపుడు పేర్మి మాత్రమే !

    జిలేబి

    ReplyDelete

  11. జిలేబి కపితల్ మరిమరి చింపిరాయెన
    య్య! లంపటముగానట వలయమ్ములోన చి
    క్కి లావు సయితమ్ము విడిచి కిమ్మనన్ హరీ
    చలాకు మరిచామయ! మము చంపనేలనో !

    జిలేబి

    ReplyDelete