గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !
కందము
మన దేశము కోశమయా
జినుగుల పాశమ్మును విడజిమ్మగ నరుడా !
మనవులు చెప్పితి నాశము
మన రీతియు గాదు సూవె మహిలో సఖుడా !
జినుగుల పాశమ్మును విడజిమ్మగ నరుడా !
మనవులు చెప్పితి నాశము
మన రీతియు గాదు సూవె మహిలో సఖుడా !
*****
తేటగీతి
దేశ మేమిచ్చెననకు నే దేశమునట
నెగడు కోశముగా నిల్ప నీమమున్ గొ
ని పని జేసి వినాశమున్నింకు జేయ
నేమి చేసితి పాశము నేర్వ దగును !
నెగడు కోశముగా నిల్ప నీమమున్ గొ
ని పని జేసి వినాశమున్నింకు జేయ
నేమి చేసితి పాశము నేర్వ దగును !
*****
ఆటవెలది
దేశమున్ జనాళి దేవళమ్ముగ జూడ
వలె వినాశ మెల్ల వదుల వలెను!
కోశ మవగ వేద ఘోష జిలేబియ
పాశము గను మేలు బాంధవమ్ము !
వలె వినాశ మెల్ల వదుల వలెను!
కోశ మవగ వేద ఘోష జిలేబియ
పాశము గను మేలు బాంధవమ్ము !
*****
మత్త కోకిల
దేశమాయెను భారతమ్ముర దేవభూమిగ వెల్గుచున్
కోశమాయెను వేదవిద్యకు కోరి పుట్టిరి దేవతల్
నాశమయ్యిరి దుష్టులున్ను సనాతనమ్మును గూల్చగన్
పాశమున్ గొని దీటుగానటు పాజమున్ గొన మేలగున్
కోశమాయెను వేదవిద్యకు కోరి పుట్టిరి దేవతల్
నాశమయ్యిరి దుష్టులున్ను సనాతనమ్మును గూల్చగన్
పాశమున్ గొని దీటుగానటు పాజమున్ గొన మేలగున్
*****
ఉత్పలమాల
దేశము నీది నాది సయి దేవళ మై వెలి గెన్ జనాళికిన్
కోశము వేద వాక్కునకు, కోరిరి దేవతలున్ ప్రభూతి కా
వేషము లెల్ల తీరగను ; పెక్కు వినాశములన్నెదుర్కొనెన్,
భూషణ చేయు పాశముగ భూరిగ దీటుగ జైజవాన్! కిసాన్!
కోశము వేద వాక్కునకు, కోరిరి దేవతలున్ ప్రభూతి కా
వేషము లెల్ల తీరగను ; పెక్కు వినాశములన్నెదుర్కొనెన్,
భూషణ చేయు పాశముగ భూరిగ దీటుగ జైజవాన్! కిసాన్!
*****
చంపకమాల
చలిమల పైన సైనికులు శాంతిని జేర్చుచు దేశమున్ సదా
వలయము గావ కోశముగ వర్ధిలె భారత భూమియే ధరా
తలమున వేద సారముల తత్త్వము పాశము వీడ నేర్పుచున్
పలికె వినాశముల్ వలదు; పాడదగున్ భళి కీర్తి చంద్రికన్
*****
శార్దూలము
నాదేహంబను జాలమున్ విడుమయా! నాదేశ పాశంబు నీ
దై దారుఢ్యమవన్ వినాశముల నీదౌ కైపులన్ ద్రోలుచున్
వేదమ్మే మన కోశమై ప్రజలకున్ విద్యావిధానమ్ముగా
సాధించన్దగు శాంతి సౌఖ్యము నిలన్ శార్దూలమై నిల్చుచున్
*****
పంచ చామరము
నినాద మిద్ది దేశ మున్ సనీడ గాను నిల్పుమా
వినాశ మేల పాశ మేల విశ్వ మెల్ల నీదయా !
సనాతనమ్ము భావ మెల్ల సాగరమ్ము, నీదు దే
శ నాడి కోశమయ్య, మేలు జన్మ భూమి నీదయా
మత్తేభ విక్రీడితము
మన దేశమ్మది కోశమయ్య భువిలో మాన్యంబుగా వేదవా
క్కునకున్, ధర్మపథమ్మునన్ మెలయ నిగ్గుల్దేల్చు పాశమ్ము బో
వ నరుల్ జీవిత మందు నిమ్మళము గా భాసిల్ల! కాపాడు కొ
మ్మ నమస్సున్నిడి దేశ మాతకు నిటన్ మాన్పించి నాశమ్ములన్!
జైహింద్
జిలేబి
ReplyDeleteఛందస్సులో గణితాంశములు రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D
http://eemaata.com/em/issues/201209/1991.html?allinonepage=1
ReplyDeleteనినాద మిద్ది దేశ మున్ సనీడ గాను నిల్పుమా
వినాశ మేల పాశ మేల విశ్వ మెల్ల నీదయా !
సనాతనమ్ము వేద భావ సాగరమ్ము, నీదయా
జనాళి కోశ మయ్యె మేలు జన్మ భూమి నీదయా !
పంచచామరము
జిలేబి
ReplyDeleteమూగబ్బాయి మిష రయిలు
బోగీ కతలన్ మదిమది పూబోడి యిలా
లాగిస్తూ వుంటే యె
ట్లాగో? యెప్పటికగునకటా కథ శుభమై !
జిలేబి
ReplyDeleteవినిపించెన్రామ మహిమ
హనుమంతుఁడు లంక కేగి; యసువులఁ బాసెన్
తునుమగ రాముడు లంకే
శుని! సీతాయణము వినుడు శుభముల బడయన్ !
జిలేబి
ReplyDeleteకనుగొనిరి కొత్త కైపద
మును శంకరవర్యులు గద ముగ్ధ జిలేబీ !
విను ! పూరించన్ దగునే
హనుమంతుఁడు లంక కేగి యసువులఁ బాసెన్
జిలేబి
ReplyDeleteమహిళా దినోత్సవము! యీ
మహీతలమునందు భామ మాన్యముగ/వెలుం
గ!హవణముల/నేర్వదగు సు
మహారమైనెలకొనదగు మానిని వినవే!
జిలేబి
ReplyDeleteఅదిగో శ్యామలరాయలు !
సదనంబందున జిలేబి చకచక హనుమం
తు దరువు వీర విహారము
పదవే వెనువెంట వేయ పద్యంబొకటిన్ :)
జిలేబి
ReplyDeleteకృతకముగ నుండె పద్యము
లతికించినటు లగుపించె లబ్జుగ లేదే !
కతగట్టురీతి కూడదు
వతంసితముగ కనిపించు వరవడి వలదోయ్ :)
జిలేబి
ReplyDeleteవచనైక్యత తగు రీతిన్
రచనల లో గాన్పడవలె రమణి జిలేబీ !
కిచకిచ యనరాదు సుమా
సచేత నత్వము గనవలె చందంబపుడే !
జిలేబి
ReplyDeleteగిందాలమ్మ జిలేబీ
కందంబిదికాదు సూవె! గణగణ యనుచున్
డెందపు కైపుల సయి గణ
బంధములన్ వేయనేల పద్యపు రమణీ :)
జిలేబి
ReplyDeleteఅనిలాత్మజుడన నెవరో?
వెనుకన్నాతడెచట చని వెదికెను సీతన్ ?
తన కర్మగ రావణుడో?
హనుమంతుఁడు; లంక కేగి; యసువులఁ బాసెన్
జిలేబి
ReplyDeleteఈ పద్యంబును మార్చం
డీ!పడికెట్టు పదసవ్వడి వలదు సహదే
వా! పద్ధతికాదు సుమా!
ఓపిక గాంచి సరిజేయు మోయి కవివరా !
జిలేబి
ReplyDeleteఏమీ బోధపడలె! ఆ
హా! మించారెన్ జిలేబి హవ్యపు వేడిన్
శ్యామల రాయుల కర్థము
ఓ మగువా గాలె సూవె ఓపిక గొనుమా :)
జిలేబి
ReplyDeleteఏమా ధిక్కారము మా
శ్యామల రాయు పలుకులకు సరిసరి యనకన్
మీమా టలకర్థంబే
మీమాష్టారండి యనుట మీకు దగునకో ?
జిలేబి
ReplyDeleteహమ్మయ్యా! అన్నీ స
వ్యమ్మయ్యెను తాళముపడె వరదయ్యకు ఓ
యమ్మ జిలేబి భళిభళీ !
నిమ్మళముగ నిదురబోవె నీరజ నేత్రా!
జిలేబి
ReplyDeleteకొన్ని పొరపాట్లు జరిగెన్
మన్నించండి సరిజేతు మహిని జిలేబీ :)
కన్నడు చదివెడు వారల్
సన్నబ డేరనె నుగాద చక్కని చుక్కా :)
జిలేబి
ReplyDeleteమీ వివరణతో సందియ
మే విధిగ తొలగె కవివర మేధా జీవీ !
కోవెల గట్టి కొలుతుమయ
మీ వెలలేని సలహాలు మించె జిలేబిన్ :)
జిలేబి
ReplyDeleteలాభమ్ములు నై తికతను
రాభాసగనన్ జిలేబి రాజుల్ బోవన్
యీ భారతమందు మిగిలె
నాభాసములే జనులకు నాట్యమయూరీ !
జిలేబి
ReplyDeleteకవివరుడాతడు ! మేలౌ
రవి! చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్
మవురి వలె బల్కులను జే
ర్చి వివరముగ సయి జనులకు రించోళీనన్ !
Deleteకవివరుడాతడు ! మేలౌ
రవి! చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్
మవురి వలె బల్కులను జే
ర్చి వివరముగ సయి సుజనుల రించోళియనన్ !
జిలేబి
ReplyDeleteవివిధ రకములైన కథలు,
రవి చెప్పెను, విష్ణు కథలు, రంజిల్ల జనుల్
మవురి వలె నతడు బల్కుల,
జవాది నద్ది యనుదినము చక్కగ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteరాదా సేవింప ఘనుడు
కాదా రాముడు జిలేబి గట్టిగ చెప్పెన్
పోదారి సేవ గాను! స
ఖీ! దారుల తీరులన్ని ఖిల్యము లేబో !
జిలేబి
ReplyDeleteలలన! గ ణాయాసములే
ల? లబ్జు గను రాములోరి లాహిరి విడనే
ల? లకలక లేలరా శ్యా
మ! లక్ష్యమును వీడనేల మహిని జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఓం నమో వేంకటేశాయ! నొప్పు రాఘ
వేంద్రునికి ప్రతారికలపై వేడ్క గాన
నిద్దరన నాయికల బెట్టి నిగ్గు దేల్చి
చిత్రమును జూపగ జిలేబి చిగురు బోడి !
జిలేబి
ReplyDeleteఇవ్వాళ సదన మునకే
లవ్వా రాలే గురువులు లకలక యనగన్ ?
రువ్వన్ పద్యము పదములు
కవ్వింపులుగన బడక సుఖమ్ముగ లేదే :)
జిలేబి
ReplyDeleteఓరి యవివేకి ! చేరకు
రా రాముని కాదనిన నరాధములన్ ! ఓ
రోరీ మూర్ఖా! సత్యుని
జోరుగ కీర్తనల జేసి జోతల నిడుమా !
జిలేబి
ReplyDeleteమీవ్యంగంబర్థంబయె!
భావ్యము కాదు సవరించి పాఠము తెలుపన్
సవ్యము గనెట్లు ధారగ
నవ్యము గానన్ జిలేబి నలుగురు మెచ్చన్ !
జిలేబి
ReplyDeleteఆ దేవుని దేవనమన
కాదనకన్ కష్టజీవి కడగండ్లయినన్
వేదన చెందుచు నైనన్
జూదము విడువడు కరివెద జోడుగ సుదతీ!
జిలేబి
ReplyDeleteమేనల్లుడి వడుగు ముగియ
గానే వస్తా జిలేబి కాచుకొనుమ! నే
పూనెద సమీక్ష ! నాపై
లానత్తో? విడువను నిను లకలక యనెదన్!
జిలేబి
ReplyDeleteరాముని నామము విడువన్
శ్యాముడ టన్నాటవెలది శంకరు కొల్వున్
నీమముగా వేసెన్ బో!
భామయు వేయన్ కమింటు బర్రున బోయెన్
జిలేబి
ReplyDeleteముదావహమ్ము మౌన మోయి మూర్ఖలైన వారితో
సదా తొలంగి యుండు మేలు సర్వదా కవీశ్వరా
కదాచ నైన నేర్తు రయ్య కాల పోకడన్ భళా
విదాయి బల్కి నావుగా వివేకి వయ్య రాయడా!
జిలేబి
ReplyDeleteకై తవ మేలర మిత్రుడ !
జాతర తలమున వలయును జాగ్రత్త సుమా!
నీ తరమా జాణలతో
ఖాతరు చేయకు మయ కవి ఖచరుడ వీవే !
జిలేబి
ReplyDeleteదుండ గమ్ము జేయ దుష్టుఁ డాకురు రాజు,
భీకరముగ జంపె భీమసేను,
భండిలుడివలెను ప్రబలమును గాంచుచు
నడచ కృష్ణు డచట నాంది బల్క!
జిలేబి
ReplyDeleteరజనీ కాంతుని యానము
సుజన! హిమాలయమునకట చూడన్ బాబా
ను? జనుల కై జీవితమును
సజావు గా నెక్కొలుపు పసదనము గనునో?
జిలేబి
ReplyDeleteపోదారి వెండిమలకున్
చూదారీ రజని నచట చుక్కల రాణీ !
గోదారి కూడ బిలిచెన్
సాదరముగ సెలవు బలుకు సదనమునకునూ :)
జిలేబి
ReplyDeleteచచ్చేవా ? ఉన్నా వా ?
గుచ్చకు సుమ్మీ జిలేబి గుండమ్మనకో
పుచ్చలెగురు రీతిపదము
లచ్చుగ వేయును వలదు వలదు నీహారీ !
జిలేబి
ReplyDeleteకోడు భాష లోన గోడుల వెళ్లబో
సుకొని మాట లాడె చుక్క లమ్మ
కాన రాక బోవ కంద జిలేబియ !
చూడ వమ్మ, బుచికి చుక్క లంటె!
జిలేబి
ReplyDeleteఔర! బుచికి కూడను నీ
వే? రావడి యయ్యెనమ్మ వెడల సెలవులో !
కారంపు మిరియములనిక
నూరవలయునే జిలేబి నూత్నంబుగనౌ !
జిలేబి
Deleteమనసు పొరల తొలగించుకొ
ని నాట్య మాడెదము రావె నెలత జిలేబీ !
కనులన్ కనువెట్టుకొనుచు
వనముల వెంబడి తిరుగుచు వాహిని గానన్!
జిలేబి
ReplyDeleteమధుకలశమ్ము మనసుగద!
సుధలొల్కు పగులక మునుపు చూర్ణంబగున
మ్మ ధుమధుమలాడగ జిలే
బి!ధన్య జీవిగ వెలుగుము భీతహరిణియా !
జిలేబి
ReplyDeleteవారెవ్వా పద్మార్పిత!
పారించావు పదములను పరిపరి విధముల్
కోరికలు రేగెను గదా
వారిజ నేత్రా! జిలేబి ! బ్లాగుల రాణీ !
జిలేబి
ReplyDeleteభద్ర! సీత యిదియె ! పరికించు మా సుభ
ద్రయగు నేలచూలి రామచంద్ర!
గివపు దీపమయ్య! గేస్తువై వెలిగి గి
రి కొనుమయ్య యిపుడె రేకగ దరి!
ఇయం సీతా మమ సుతా
జిలేబి
Deleteఛందస్సు - ఆటవెలది
నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా భ - ద్ర - గి - రి ఉండాలి.
ReplyDeleteఈ మనసున్నది చూసా
రూ మనలని రాచి రంప రొచ్చుల జేర్చున్
ఓ మానినీ వినమ్మా
నీ మనసే ఊయలకద నెలతుక పద్మా !
జిలేబి
ReplyDeleteఅంతము లే ఆవేదన
కంతము లేదే జిలేబి కందును మనసా
శంతము రమణీ వినవే
వింతగు జీవనమిదే యువిద వినవమ్మా !
జిలేబి
ReplyDeleteబెంగ పడకే జిలేబీ !
డంగగు రీతిని శకారు డతడే గలడే !
చెంగట బిల్వంగ బలుకు
నంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్!
జిలేబి
ReplyDeleteవ్రాయమనె రాముడు సుమా !
వ్రాయన్ చదువరులు సూవె వరుసలు గట్లే !
గాయంబాయె మనసనన్
ధ్యేయము నటవీడనేల దెందపు చిలుకా !
జిలేబి
ReplyDeleteచివురులు తొడిగే ఆశకు
జవరాలా పద్మనయన ! జల్లన మదియున్
సవడుల గ్రహణంబేలా !
మవురిని సాగించనివ్వు మాలిని మహిలో !
జిలేబి
ReplyDeleteసతతము మగరాయులె తా
మతివల కది కట్టుటేల ! నప్పదు మాకోయ్ !
లతకూనలు పిలుపివ్వగ
పతి గళమున దాళి గట్టె భామ ముదమునన్!
జిలేబి
ReplyDeleteవెత! స్వస కగ్రేదిధిషూ
పతి గళమునఁ దాళిఁ గట్టె; భామ ముదమునన్
పతిని వెతుక! జీవితమున
సతతము మనదైన రీతి సాధ్యంబగునే !
జిలేబి
*అగ్రేదిధిషూపతి - చెల్లెలి మొగుడు
స్వస - చెల్లి
అప్ప కై భర్తను వెతుకుచుండగ వచ్చిన వాడు చెల్లిని పెండ్లియాడి అగ్రేదిధిషూపతి అయితే వెత యే కదా !
జిలేబి నీ పద్యాలకు నీవే భాష్యం రాసుకోవాల్సిన రోజులు దాపుల్లోనే వున్నాయి :)
ReplyDeleteఅతికతతము రమణిని గని
పతి, గళమునఁ దాళిఁ గట్టె, భామ ముదమునన్
సతియై రంపమునన్ రా
చి తిరిపరిగ మార్చెనంట చెకుముకి యనుచున్ :)
జిలేబి
ReplyDeleteఆశ్చర్య మేమి ? "మాతం
గాశ్చర్యంతి కరశాఖ కమలే ! కర్ణాం
తేశ్చర్యంతి మృగేంద్రాః"
వృశ్చిక పుచ్ఛంబు మీద వృషభము నిలిచెన్!
జిలేబి
దీనికి వచ్చిన మెరుపు :)
జిలేబీ గారు
ఇది పద్యమేనా ?
పదకట్టు మానండి
రేసుగుర్రము వారు
ReplyDeleteబుచికీ యిచ్చెను సలహా
వచనములన్ రాయమనుచు పద్యములన్ వీ
డుచు రమణి జిలేబి! వినద
గు చెప్ప పుణ్యపు పలుకుల గుడుగుడు గుంచెం :)
జిలేబి
ఓయబ్బో బుచికి పుణ్యజీవి :)
ReplyDeleteమీ కవితలతో పద్మా
యేకంగా రాతి గుండె నేడ్పించేస్తా
రే! కరిగించేస్తారే ;
ఓ కమలాక్షీ ! జిలేబి ! ఒంచేస్తారే !
ReplyDeleteమీ కలపు పదును ఓహ్ ! ప
ద్మా! కత్తి చురచుర కన్న దర్పము గలదే !
యేకంగా కోసేయకు
మా కుత్తుకల మధురోహ మాంజిష్ఠవతీ !
జిలేబి
ReplyDeleteనా పోస్ట్లా వాత్సప్పున
పో పోయే యనెడు చింత బోవనదేలా
ఆ పోతనయే బతికుం
టే పోరాటముల జేయుటే తధ్యముగా !
జిలేబి
ReplyDeleteకలిగిన వారింట భళీ
నిలబడితిని! దిష్టిబొమ్మ! నిక్కంబుగ యీ
వలువలు విలువైనవి! కా
ని లబ్జు గలిగేను కాదు నిక్కంబరయన్ !
జిలేబి
ReplyDeleteపడితిని పడితిని కష్టం
బు డిగనురుక బడితి ననుచు బుడిబుడి రాగా
లడుగడుగున నేలర పా
రుడ కర్మ ఫల మెవరిదయ రూఢిగ చెపుమా !
జిలేబి
ReplyDeleteసాంత్వనము లెన్ని చెప్పిన
సాంత్వంబుగ బల్కగాను చక్కని చుక్కా
ధీం! త్వం పదవాచ్యార్థుడు
రాంత్వంబునువిడి జిలేబి రమణించునకో ?
జిలేబి
ReplyDeleteసమయాభావము కారణ
ము మీకు సేవల నిడుటకు ముందుకు రాకన్!
కమఠంపు నడక గానిట
సముఖము రాలేదు సూవె సహృదయులారా !
జిలేబి
ReplyDeleteబుచికో యమ్మ బుచికి బుచి
కి చెత్త లెక్కువగనయ్యె కించిత్తైనన్
వచనములు గాన రాక ప్ర
వచనలముగ మారి కావ్య వాంగ్మయమున బో !
జిలేబి
ReplyDeleteఅందాలమ్మికి దేవుడు
తొందర గా జోల పాడి తోడ్కొని పోయెన్
డెందము దుఃఖంబాయె
న్నందరికి జిలేబియ విధి నాటక మిదియే !
జిలేబి
ReplyDeleteఆసాంతం తెలియని యా
వేశమ్ముల వేదన యిది వేసారితి నా
క్రోశముల నెట్లు చెప్పుదు
ఓ సాంకవమా జిలేబి ఓదార్పిదియే !
జిలేబి
ReplyDeleteమీలో ఒకరైన తెగువ
గా లౌక్యముగా జిలేబి గట్టిగ యత్నం
బేలనకో చేయదలచ
లే? లేమా ! పద్మనయన లేదే చొరవా ?
జిలేబి
ReplyDeleteతన జీవితమ్ము ధన్యము !
తనయుండే నందమూరి తారక రాముం
డన నటియించు నట జిలే
బి! నాంది బల్కిరిగ నిన్న వెంకయ్య భళీ !
జిలేబి
ReplyDeleteబంగారమ్మలు భర్తల
కొంగున ముడిగట్టు కొనుడు కొంచెము మీరున్
చెంగున వారు మిము విడిచి
రంగుల కలగనెద రమ్మ రాణుల్లారా !
జిలేబి
ReplyDeleteమీ కలపు పదునది యదిరె
నే కలహంసిని జిలేబి నీరజ నేత్రా !
సోకుల పొగుడన్ మాతర
మా కొంచెంబైన లేమ మధురా సఖియా !
జిలేబి
ReplyDeleteఓపిక లేదండీ బా
బూ పదముల బేర్చగన్ గబుక్కున రమణీ !
ఈ పదములతో ప్రాసకు
నే పదటము చెందినాను నీరజ నేత్రా !
జిలేబి
ReplyDeleteసరదా గా ఉందండి! స
దరు మిత్రుని పోస్టు లింకు దనదన తెలుపం
డి! రవంతగ నే చూచెద
పిరియపు పలుకులను మెచ్చి బెట్టిన దెవరో !
జిలేబి
ReplyDeleteఅతిథులె దేవుళ్ళనుకొను
జతకత్తె యొకతెయు విందు జాతర దినమం
దు తెఱగుగ జేయనట అజ
పతి తల ఖండించి వండె బంధువులు దినన్!
జిలేబి
ReplyDeleteలాంఛనములిచ్చి కవి గారిని కట్టి పడేయండ్రా :)
ఎవర్రా అక్కడ :)
మా లావుగ చెప్పకు, నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్!
ఓ లాక్షణికుడ! కందివ
రా!లాంఛనములిక మీకు రాధన మిచ్చున్
జిలేబి
ReplyDeleteమనలనందరిని గట్టెక్కించు శకారుని కి జై !
జగణపు శకారుడా నీ
వు గదా మాకెల్ల వేల్పువు! జిలేబివి, నీ
వె గురో రక్షణ మా కిల
న గట్టిగా దెబ్బలను తినక తప్పుకొనన్ :)
జిలేబి
ReplyDeleteబుచికీ! యెందుకు తొందర
కిచకిచ తెలియని పలుకులు గీరుట దేలా
వచనము లర్థము గాలే !
కచబంధపు పలుకులేల కవనకుమారా !
జిలేబి
ReplyDeleteలావా లా పొంగిందే
ఆవేదన; పద్మనయన ఆలోచనలో
కోవిదు రాలివి నీవే
ఓ వయసొచ్చిన నెలతుక పూబోడివిబో !
జిలేబి
ReplyDeleteహృదయ కవాటము లెల్లపు
డు దయగనుచు మాకు నీవు రూఢిగ, తెరిచే
వు దిరిసెనపువ్వువు జిలే
బి! దరిమి లానీవు మాకు పిరియపు లేమౌ !
జిలేబి
ReplyDeleteఓపద్మా! ప్రేమ విఫల
మా? పడతీ తెలుపవే ! సమాధానంబి
మ్మా! పదరినాము తల్లే !
ఓపిక తెచ్చుకొనుమమ్మ ఓర్మియు గూడన్ !
జిలేబి
ReplyDeleteహా! కీలు బొమ్మలముగా !
ఓ కమలనయని జిలేబి ఓడెద మమ్మా
యీ కాలగతిని మనమం
తా! కాదెవ్వారికైన తరియింప సుమా !
జిలేబి
ReplyDeleteఓటుకు నోటను కేసది
ఘాటైనది కాదు పిల్ల కాయల్లాటే !
మీటరు లెక్కలు తేలన్
హాటుగ చర్చలు జరుగును హాయిగ బొజ్జో :)
జిలేబి
ReplyDeleteనీ టచ్చే లవ్లీ ప
ద్మా! టాకాఫ్ది టవును వనితవు నీవే నీ
వే! టక్కరిదాన మనసు
సూటిగ తాకుచు పదముల చుక్కెడతావే!
జిలేబి
ReplyDeleteజీవిత మెంతో తియ్యని
దే! వైరాగ్యంబదేల దిరిసెన పువ్వా !
కావాలని రాదేదీ
ఓ వనితా! ఓడదమ్మ ఓడదు ప్రేమా !
జిలేబి
ReplyDeleteతా దేవ పుష్పమిలలో!
రాదారెంబడిది కాదు రాణి జిలేబీ !
గోదారి నింబ తరువ
మ్మా! ధీటైనట్టి పడతి మా లలితమ్మా !
జిలేబి
ReplyDeleteమార్పన్నది సహజమ్మది
ఓర్పన్నది వలయునమ్మరో పద్మా !ఓ
దార్పిదియె నీకు లలనా
దర్పణ మగునమ్మ జీవితమ్ము మన కథన్ !
జిలేబి
ReplyDeleteఎదబాటన ఎడబాటుగ
వెదుకుచు వచ్చెను జిలేబి వెతలవి నీకున్ !
కుదురుకొనుమమ్మ పద్మా
బెదురేలనకొ లలనా! సువిద్రితమిదియే !
జిలేబి
ReplyDeleteనీవాడను నీవాడను!
కైవల్యంబన్ననేమి కందమ్మా ఓ
మావా కావలె యత్నము
కేవల మదియొక్కటేను గేమ్ చేంజరయా !
జిలేబి
ReplyDeleteవాక్య మొక్కటి గాంచెను వయసు కుర్ర
వాడు; చిలిపితనమ్మున పదముల నటు
నిటుగ మార్చి జిలేబిని నెక్కి రించె
మగఁడు నెలతప్పెనని దువ్వె మగువ మీస
జిలేబి
ReplyDeleteభోళాశంకరుడు వరమిస్తే :)
జగడకత్తెలు కోరగ శంకరుండు
వరముల నొసగె మగవాండ్లు వలపు మీర
నీరు మోసెదరికబో! తనిచనుచు మజ
మగఁడు నెలతప్పెనని, దువ్వె మగువ మీస!
జిలేబి
ReplyDeleteజంబల మన "నిమ్మ" సుమా
అంబా! కడిపెండ ముద్ద గాద జిలేబీ !
జంబల కడిపెండయె భళి
జంబల కడిపంబ సుదతి సంబరముగనన్ !
కావున జంబలకడిపంబ అనగా నిమ్మ కాయ తో చేసిన అన్నము :) చిత్రాన్నము వలె :)
జిలేబి
ReplyDeleteభయ్యా ! పడతుల కిలలో
నెయ్యము లేదయ్య ! వేదనే యెక్కువగా
నయ్యే !వినుమీ బుచికీ
కయ్యము లే మిగిలెగాద కవనకుమారా !
జిలేబి
ReplyDeleteసీతమ్మ వెడలెను నగల
తో తల్కమునకు జిలేబి తోడూ నీడై
చేతుము గానము వాల్మీ
కీ! తరియింపుమయ మమ్ము కేరింతలతో !
జిలేబి
ReplyDeleteరాసాడనివిన్నా ! చది
వా సారనినానయ? సహవాసి మనుజుడా!
ఓ సీతా రాసే ర
మ్మా సిత్రముగ కథనెల్ల మాయమ్మోరే !
జిలేబి
“విషవృక్షం” లో అలా ఏమన్నా వ్రాసుందేమో? 🤔
Delete
ReplyDeleteఅలకల కొలికీ వినవే
పలుకులమరలేని వాడు, పరమాత్ముండే
సరసకు వచ్చి యడిగినన్
సరియైన వరమును కోర జాలడు సుమ్మీ !
జిలేబి
ReplyDeleteచిత్రాన్నము జంబల హాట్ !
కత్రీ నా కైఫెవరన కందము కట్టున్
చిత్రిక బట్టి జిలేబి స
చిత్రము గాను విరివిగను చినదాని కథన్ !
జిలేబి
ReplyDeleteమీ బుర్రపాదరసమం
డీ! బుడి బుక్కల కథల సుడిసుడిగ కట్టున్
కాబూలీ వాలీయ జి
లేబీ ! అదిరెన్ కహాని లేమ భళిభళీ !
జిలేబి
ReplyDeleteచెరలో పరిస్థితుల చెర
న రమణి బంధీగ నిలచి నావే పద్మా !
సరసపు దినముల జీవన
ము రయ్యనగ బోయెనకొ సముద్రము లోనన్ ?
జిలేబి
ReplyDeleteచాలా బాగుందండీ !
మీ లావణ్యంబరుదు సుమీ శేఖరుగా
రూ! లలిత పదమ్ములతో
మాలిక నల్లిరి మనోజ్ఞ మై వెలిగెనయా !
జిలేబి
ReplyDeleteఅమ్మాయ్!ఈపాటి దానికి ఐఐటీలు జీపీయెస్ లూ కావాలా ? మా లాంటి బామ్మలనడిగితే చెప్పరూ ?
అడుగడుగునకున్ భళిభళి
వడియము లెండెను ఘనముగ వానల లోనన్
సడిజేయక మగడు జిలే
బి, డిగనురుకుల దరిజేరి పిరియము గానన్ !
జిలేబి
బామ్మ మాట బంగరు మూట :)
ReplyDeleteఅతి సుళువైనది కందము
యతియున్ ప్రాసల జతగ సయాటగ నేర్వన్
మతి బోవన్ భయ పెట్టిర
య తీరుగ జిలేబులెల్ల యతనము వీడన్ !
జిలేబి
ReplyDeleteకొబ్బరి బోండాంలో నీ
ళ్ళబ్బబ్బో వింతగాను లబ్జుగ సుమ్మీ !
అబ్బుర మిదియే విభునిది
జబ్బల లో బలము జేర్చె చక్కగ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteశ్రీశ్రీ కవితల లోనన్
మాశ్రీ వారి కెలుకుడున మానిని గలద
మ్మా శ్రేయస్సితరులకున్
ఓ శ్రీమాలక్ష్మి వినవె ఓపిక వలయున్ !
జిలేబి
ReplyDeleteదేనికైనా కథ గట్టు జంబలకడిపెండ అన్నట్టు :)
జిలేబి వారు కథ చెబితే ?
అల్లికల జిలేబీ కథ
చెల్లీ వినవమ్మ నీకు చెప్పెద నిపుడే!
లొల్లి యిదికాదు సుమ్మీ
మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్!
జిలేబి
ReplyDeleteగోవా లోచూసా నే
నా వనితన్ భళి జిలేబి! నాంత్రము నే చే
సా వరుసగ మెచ్చి భళీ!
రావమ్ముల తా దులిపెను రాబడి గాలే :)
జిలేబి
ReplyDeleteనిస్సారవంతమై బుసు
బుస్సనుచున్నీల్గుడేల పూబోడి సదా
తుస్సుమని పేలుచుంటివి
తస్సాదియ్య! విడువమ్మ తల్లి నిరాశన్ !
జిలేబి
ReplyDeleteఅడకత్తెర వేడి సుమా
వడియము లెండెను; విడువని వాననలోనన్
గడినుడి చేసితి; నిదురన్
సడలుకొలుప వేడి టీని చక్కగ గొంటిన్ !
జిలేబి
ReplyDeleteఅడడా! మరందు పోనేన్ !
వడియములెండెను విడువని వానలలోనన్
మడమడ యెండ్రణ్ణావే
కొడియాయ్ కాక్క మడియాయ్ సగోదరి యై తాన్ !
:)
జిలేబి
అరవ మామి కందము
ReplyDeleteద్రౌప ది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి
వాయు పుత్రుడు తలదింప వరుస గాను
భర్త లెల్లరు మౌనము! భారతమిది
పడతి కన్నీటి కథయిద్ది పంకజాక్షి !
తేట గీతి
***
గీ:పతి!భళిర వీరగీతము ! సీ యన
ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి,
యాపతులు తలదించి యావద్బలము
చాపచదరగు కైపు చక్కగ కోల్పోవ !
(అంతరాక్కర)
జిలేబి
ReplyDeleteమా రాముడొక్కడే నౌ
రౌ రా భళి చేతనైన రాజీవుడయా
మీరూ మేమూ మనమం
తా రాజిల్ల నతడే కదా కారణమౌ !
జిలేబి
ReplyDeleteఈ ప్రేమ మత్తు విడువ
మ్మా ప్రియు రాలా జిలేబి మానిని పద్మా
నీ ప్రేయస్సందునగల
దే ప్రేతాత్మవకు పడతి దిరిసెన పువ్వా !
జిలేబి
ReplyDeleteభావ పటిమలో ప్రేమా
రావమ్ములు బాగు బాగు రమణి జిలేబీ !
కేవల మంతా మిథ్య స
ఖీ వినవే నా పలుకుల కిసలయ పద్మా!
జిలేబి
ReplyDeleteఆమని అంతా మీ బ్లా
గ్లో మనసుర్రూతలూగ గోవంకలతో
ధామము గా వెలిగె సుమా
దామంబిదియే జిలేబి దౌ గైకొనుడూ !
జిలేబి
ReplyDeleteరాసిన దాంట్లో పేరా
యే సిత్రము మాయమయ్యె యేమాయెన్ బో
మా సానరాయి కివ్వా
ళా! సారూతెలియలేదు లకలక యాయెన్ !
జిలేబి
ReplyDeleteమీ యభిమానమునకు భా
మా యివియే మా నెనరులు మానిని గొనుడీ !
ఓ యమ్మో యేమి తెలుగు
రాయల వారిది జిలేబి రాసుకొనదగున్ :)
జిలేబి
ReplyDeleteరేవతి మోస్ట్ డిగ్నిఫయిడు;
ఓ వనితా రమణి వినవె పూబోడి భళా
తావియు గల్గె జిలేబీ,
జోవియలున్ కూడ సూవె జోతలు తెలుపన్ :)
జిలేబి
ReplyDeleteమనము సమస్యల తో పా
టు నడచుచు బతుకటమే పటుత్వంబా ? లే
మ నెలతుక చెప్పు పద్మా !
మనసా వినవే పలుకుల మధుర జిలేబీ !
జిలేబి
ReplyDeleteఆవేదనలో పద్మా
నీవూ అతను సరిజోదు నిజమిది యే సు
మ్మీ ! వీరావేశము వల
దే వనితామణి జిలేబి దిరిసెన పువ్వా !
జిలేబి
ReplyDeleteమనసును మల్లెల తీర
మ్మున నడిపించేను పాట ముత్యా లసర
మ్మనగ యనగ మధురమ్మా
యెనమ్మ మధురాతిమధుర యెంకట లచ్చీ :)
జిలేబి
ReplyDeleteనాలుగవ పాదము చివర
వాలుగ నొక యక్షరమ్ము వదిలారండీ !
వీలుగ "ని" యొకటి వేయన్
మేలగు పద్యంబు మీది మేధా జీవీ !
జిలేబి
ReplyDeleteమీ పూరణయద్భుతమం
డీ! పద్యంబన్ననిదియె రీతిగ సుమ్మీ
ఓ పండితార్య సెహబే
షూ! పరిపరి పొగిడెద నయ స్ఫూర్తిని గానన్
జిలేబి
ReplyDeleteకెలుకుడన నిదియె గాదా!
పలికిరి సీతమ్మ వారు పదరుచు నమ్మా
కెలుకన నొలుకును పదములు
గలగల యనుచున్నెలతుక కంద జిలేబీ :)
ReplyDeleteఅంద మైన ఆశ లంతు లేకయు పూసె
నవని నందు చాల నమ్మకముగ
మనుజు లందు దోచె మన్మధ రాగమై
బ్రహ్మ రాత గాను రంజు గాన!
జిలేబి
ReplyDeleteరమ్య భాషణమ్ము రామకీర్తన యేను
మనుజు లార రండు మధుర గేయ
ములను గూర్చె దమ్ము ముత్యాలసరమున
రామ రామ రామ రామ యనుచు
జిలేబి
ReplyDeleteకోతి యెగురు చుండె కొమ్మల మీదుగ
మీస మున్న పిల్లి మీదు దుమికె
నుసురు బోవు నట్లు నూరక నటియింప
పట్టి బీకె కోతి పట్టు గాను
జిలేబి
ReplyDeleteనీ పాదచుంబనమ్మే
నా పూజా సాధనమ్ము నాట్య మయూరీ
రా! పట్టుబట్టి పాటల
తో పారాణినట జేర్చి తోడుగనుంటా :)
జిలేబి
ReplyDeleteసినిమా పాటల విన్నా
క నాకు నమ్మకము గలిగె కట్టేయొచ్చోయ్
మన రామునిపై పాటల్
వినరా రామా వినుమయ వీనుల విందై :)
జిలేబి
ReplyDeleteవేరు పంచ భూత ప్రేతము లేలయ
తవిక స్వాములుండ తనివి తీర
కవిత లల్లి లొల్లి గావింప బుచికీయ
బుచ్కి గాను పంచ్ దబుక్కు వేయ :)
జిలేబి
ReplyDeleteసినిమా పాటల రాయన్
మన కవసరమసలు లే సుమా యే జ్ఞానం
బును! బరికేసేయ్ యేదై
నను చెల్లు బడియగునయ్య నమ్మిక గొనుమా :)
జిలేబి
ReplyDeleteచాలా సంతోషంబయె
మీలాటి జనులు పొగుడగ మిక్కిలి గానన్
లీలగ భవసాగరమున
కాలపు కైపునపుడపుడు కట్టితి వీటిన్
జిలేబి
ReplyDeleteభామా జిలేబి వినవే
రాముఁడు రావణు నడిగె ధరణిజ హరింపన్,
నీమము తప్పితి వేలా ?
కామము నేత్రముల కప్ప గా కర్బురుడా !
జిలేబి
ReplyDeleteనా మాటవిను! శరణ్యము
రాముఁడు" , రావణు నడిగె, "ధరణిజ హరింప
న్నీ మనసెట్లొప్పెనయా"
సామము గ విభీషుణుండు, "సరికడచితివే" !
కర్బురుడు - రాక్షసుడు ఆంధ్ర భారతి ఉవాచ :)
జిలేబి
ReplyDeleteనీమము గాదు విడుమనుచు
రాముఁడు రావణు నడిగె; ధరణిజ హరింపన్
కామము హెచ్చగ కర్బురు
డా మాటల వినక చచ్చె రణమున సుమ్మీ !
జిలేబి
నీమము గాదు విడుమనుచు
రాముఁడు రావణు నడిగె; ధరణిజ హరింపన్
కామము హెచ్చగ కర్బురు
డా మాటల వినక చచ్చె ఢంకా మోతన్
జిలేబి
ReplyDeleteవ్యధలను భాండా గారపు
పొదలన్ చిక్కిరి జిలేబి పూబోడీ ! ప
న్నిదముగ తాకెన్ మీ పద
పు దరువు ! వయ్యారి ! పద్మ ! పుత్తడి గుమ్మా :)
జిలేబి
ReplyDeleteగోస్వాములైన నేమ
య్యా! స్వాంతనమెల్ల బోవ యావన్ బడరే
ఈ స్వంగము ఫీజులకై
హా!స్వంజుడ! భళిర నిస్సహాయుల మయ్యా!
జిలేబి
ReplyDeleteఆర్యానాథుడి పేర్లను
వర్యముగా తెలుపగాను వడగండ్లవలెన్
పర్యాయపద నిఘంటువు
లార్యులిడిరి వందనమ్ము లమ్మ జిలేబీ!
జిలేబి
ReplyDeleteకడగండ్లను దీర్చు మనుచు
పడిపడి వేంకటగిరిపతిఁ బ్రార్థింపదగున్
విడచుచు నాథుని, మనసా ,
చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్?
జిలేబి
ReplyDeleteచిరకామ్యంబుల్ మారెను
చిరుకార్యంబులుగ నరరె చింతయు చేయన్
స్థిరముగ విభుడే యన్నిటి
కి రాధ నంబయ్యెనమ్మ కిసలయమొందన్ :)
జిలేబి
ReplyDeleteకురస కురస అడవిలోన ...కురిసె గాంధారివాన
మెరిసె మెరిసె పెదవిపైన మెరుపు లే వేడిగాను
నలసె సొలసె వలపులేను నతివ లో చక్కగాను
కలిసి మెలిసి తిరిగిరయ్య కవన మై వెల్గిరయ్య
జిలేబి
ReplyDeleteతొక్క! బొంగు! దూల తోపు పుడింగివి
పట్టి కొట్ట వలెను పదముల కన
బెట్టిన రచయితల నడ్డి విరుగ గాను
విను జిలేబి కతల వినవె పిల్ల :)
జిలేబి
ReplyDeleteభళి ధన్యవాదములు మీ
కు! లెస్సగ జిలేబులూర కూర్చిరి పదముల్ !
సలసల లాడెడు నూనియ
న లబకు లబకనుచు తింటి నమ్మా బామ్మా :)
జిలేబి
ReplyDeleteచాలా సంతోషంబి
వ్వాళే తప్పక జిలేబి వాటిని చిత్రం
గా లెస్సగ బెట్టేస్తా!
నాలో వచ్చెనుగ జోషు నమ్ముడి నన్నున్
జిలేబి
ReplyDeleteఅనరాదు అద్భుతః యని
అనవలె అద్భుతమని విను మా మాట జిలే
బి! నమస్కృతులిమ్మ గురువు
లనగ వినవలెను గదమ్మ లక్షణముగనౌ !
జిలేబి
ReplyDeleteచాలా బాగున్నది తం
బీ! లబ్జుగ బల్కినావు భీతియు పడకన్
నీలా రాసే వారెవ
రూ లేరోయ్! భళి భళీ సిరులొలుకె గాదే !
జిలేబి
ReplyDeleteఏమిటి సర్దుకు నేదీ ?
ఓ మామి జిలేబి ? సిస్ ? అనో బ్రో అనియో
ఏ మంచీ మర్యాదయు
నీమము లేని పలుకుల విని అహోయ్ అననా ?
జిలేబి
ReplyDeleteకొట్టాలి చెప్పు తోడ
న్నెట్టెట్టా ! కొట్టవలె సినెబ్బల నట్ట
ట్టా ట్టా యనన్ జిలేబీ !
మట్టెల్లిరగాలెనమ్మ మరి సినిమాలున్ :)
జిలేబి
This comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteఆకాశంనుండి తునక
యేకాంతంగా పడింది యెందుకనో పో
యే కాలం వెళుతూ వె
ళ్తూ కాపడ మెట్టుకున్న లుక్కేసిందీ !
జిలేబి
ReplyDeleteఆది నుండి చివరి దాకను నిర్మల
మైన మదిని దోచు మాట బల్కి
నారు పద్మ గారు నారినెక్కిడుచు, జి
లేబి సాటి మీకు లేరెవరును!
జిలేబి
ReplyDeleteకామెంటున్ బెట్టిరట
న్నేమగు నోయని డిలీటు నెట్టిరి నరస
న్నా! మాటేమన వలెనని
సామీ అనుకొంటిరో విసరవలె మళ్ళీ :)
జిలేబి
ReplyDeleteఅభినందనలండీ ప
ద్మ!భంగిమల చేర్చి చెప్ప తమకే చెల్లున్
నభసపు మెరుపువలెన్ మీ
రు భజవళుల చేర్చి రమ్మ రూఢిగ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteబెంగాల్ టైగర్ కిక్ ౨ మిరపకాయ్ డాన్ సీను :)
డొక్క చీల్చెద భళిరనే డోలు కట్టె
దనను చున్ బీరముల బల్కి దబద బయని
నొక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె
వచ్చి దెబ్బలు తినిరయ వార వేళ
చిత్ర సీమ కతలలోన జికిరి లేక :)
జిలేబి
ReplyDeleteఅంద మైన మనసు నందున రాగరం
జితమగు పదముల సచిత్రమాల!
పద్మ నయన ! నీదు భావ లహరిలోన
మైక మొంది నాము మత్తు గాంచి
జిలేబి
ReplyDeleteవేదన తో రెండుహృదయ
వేదనలు కలిసిన రీతి వింగడ మాయెన్
కాదన మాకు జిలేబీ
రాదారియిదియె శుభాంగి రయ్యన బోవన్ :)
జిలేబి
ReplyDeleteవలపుల అస్త్రాన్ని మరీ
తలపుల తో నెక్కుబెట్టి తరియించారే !
కలగలపుగ మీరే గద
విలక్షణంబైన సుదతి విధిరాత యిదే !
జిలేబి
ReplyDeleteఝుళిపించండీ కొరడా
అలజడులు పడక సునామి యావత్ మీరే !
కొలవెరి యేలన్ పద్మా
పలుకుల రసమయ జిలేబి పట్టువిడువకోయ్ !
జిలేబి
ReplyDeleteప్రేమను పొందుచు మెప్పిం
చే ముద్దులగుమ్మ మీరు చెరుకుగడవలెన్
గోముగ తియ్యగ జూడన్
మామది అతలాకుతలము మాలిని పద్మా !
జిలేబి
ReplyDeleteకత్తి లాంటి పోస్టు! కసుకు కసుకనంగ
పొడిచి నావు గదవె పూవు బోడి !
గుండె లబకు లబకు కొట్టుకు నేనుగ
కవితను చదువగను కంబుకంఠి !
జిలేబి
ReplyDeleteధీరు రాలవు గద పద్మ ! తింతిడముల
పడుచు నిస్తేజ మవనేల వలదు తగదు
నీకిది జిలేబి నచ్చెను నీదు చిత్ర
మదియె సూపరు గానుండె మదిరనయన!
జిలేబి
ReplyDeleteపండారువెన్నెలయునట
నిండుగ కురియన్ ప్రణిధియు నిర్మలము గనన్
గండాగొండి జిలేబికి
పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే,
ప్రాతమగవాడు - శివుడు
జిలేబి
ReplyDeleteబ్రజయ! అవధియా! కట్పే
ష్టు! జమానాన విసుగెత్త శుంఠల వలె ప్ర
శ్న జమాయించగ నెట్ల
య్య జర విడుము నరసరాయ యాగీయేలా :)
జిలేబి
// “ .... శుంఠల వలె ప్రశ్న జమాయించగ ....” //
Deleteఏవిటి, నన్నే 😡 ?
ReplyDeleteరాగ జనిత పద జాలపు
భోగ విలాసిత జిలేబి ! పూబోడీ ! ప
ద్మా!గండరగండలు నీ
యాగడముల తాళలేక యాగీయనిరే :)
జిలేబి
ReplyDeleteఏవిటి ! నన్నే ! అవునం
డీ!విశదముగా జిలేబి ఢీమరి మిమ్మ
ల్నే :) విన్నకోట నరస
న్నా! వారి టపాల చూడ నా కనిపించెన్ :)
జిలేబి
ఒక అర్థం కాని పద్యం మీద అడిగిన సందేహానికి అంతకన్నా అర్థం కాని పద్యంతో జవాబివ్వడం మీకే చెల్లింది. ✋🤚నమస్కారం 🙏 .
Delete
Deleteఅడుగన్ సందేహంబును
కడుంగడుముదావహమ్ము కందంబున నే
మి డుబా కోరు జవాబున్
గడగడ యిచ్చిరి జిలేబి గడుసరి బామ్మా :)
జిలేబి
ReplyDeleteఆవిడ పో! సీ యందే
మో! విశదీకరణ చేయ ముందుకు వచ్చెన్
హా! విస విసయనుచు జిలే
బీ! విరిసెన్ పదములోయి బిరబిర యచటన్ !
జిలేబి
ReplyDeleteమనసున్ దోచే పిక్ పె
ట్టినావు ! మెలిపెట్టినావు టింగుమన జిలే
బి! నెలతుక! మాట లేలా!
నిను నే హృదిలోనబెడితి నీరజ నేత్రా!
జిలేబి
ReplyDeleteనే కల గన్నట్టి శిఖర
మీ కంజదళాయతాక్షి మించారు గన
న్నీ కాంతకై శిధిలమయి
నా కానీ నవ్వుతాను నా కేలన్ హ్రీ !
జిలేబి
ReplyDeleteకలిసామూ మిగిలామోయ్
వలపుల కనురెప్పలుగ సువర్ణ మయూరీ !
తలపులు వేరైతే విడి
కలతల చెందెదము వలదు కష్టము మనకున్ !
జిలేబి
ReplyDeleteద్విపదము లన్జో డించిన
తపన కలిగిన కవితయది! తరుణీ ముసురే
ల పరిపరివిధములుగ క
మ్మె ! పద్మ! వలదే జిలేబి మెండాడితిమోయ్ !
జిలేబి
ReplyDeleteఅలవోకగ కదలాడే
అలజడి నీవే సరిసరి అల్లరియున్, ప
ద్మ!లసిత ఆశల వెల్లువ
కలిసిన భాష్యమ్ము నీవు కాంతా రమణీ !
జిలేబి
ReplyDeleteమండు టెండ లోన మంచుకొండవలె జి
లేబి పద్మ నీవు లెస్స గాను
తోడు నీడ వెరసి తోయజాక్షి వి మీదు
మాలతి ! విరజాజి మల్లి వమ్మ !
జిలేబి
ReplyDeleteనా నిశిరాత్రి పయనమీ
వే నమ్మా పద్మ నయన ! వేసారానే
ఓ నెలతుక! కరుణవలయు
నే నా పైనన్ జిలేబి నీరజ నేత్రా !
జిలేబి
ReplyDeleteసూపరు వేదన మీదే
ఓ పద్మార్పిత ! జిలేబి గోలే గోలా
నీ పాదసేవ యేన
మ్మా పావనమందరికి జమాయించగనన్
జిలేబి
ReplyDeleteవలపు గోర నుద్ధవగీత వరుస బెట్టి
నైపుణము గనమని పంపి నావు యాద
వు డొకడిని! నీ సరి మురళి నూద గలడె?
సరసమాడఁగఁ దగవు కృష్ణా! ముకుంద!
కృష్ణం వందే జగద్గురుమ్!
జిలేబి
ReplyDeleteనా పాటే యాధ్యాత్మిక
తా! పాడెద నేను పాట తనువున్నూపన్!
ఓ పాపాత్మా ! నీ కే
మా పోయే కాలమొచ్చె మధువు వలదనన్!
జిలేబి
ReplyDeleteపాడుత! జ్యోతిష్యము చెబు
తా! ఢంకామోగిచి కొడతా నందరిన
ర్రా ఢమ ఢమయనుచున్ రం
డ్రా! డీకొల్పెదను మిమ్ము రా దారి గనన్ !
జిలేబి
ReplyDeleteమీ పూరణ బా గున్నది
మీ పద్యంబదిరెనయ్య మించారెన్ మీ
నేపధ్యంబు, మనోహర
మీ పొద్దు చదువ నదృష్టమేగలిగెనయా !
జిలేబి
ReplyDeleteదోషము తెలిపిరి గదయ, వి
శేషముల తెలియ బరచుచు శేముషి యిదియే !
పాషానమ్మిది ఛందము
శోషయు వచ్చెను మరిమరి చూడ జిలేబీ !
జిలేబి
ReplyDeleteపరిణితియిదియె కవిరాయ! పాండితినట
సాన రాయిన గీచుచు చక్క గాను
రణముఁ జేయని కవికె పరాభవమ్ము!
మేలు కొనుమయ పూరణ మెండు కొలుప !
జిలేబి
ReplyDeleteప్రేమంటే తెలియని వా
ళ్ళే మాలిని రాసెదరు భలె భలే నర్థం
బేమియు లేకన్! పద్మా
ప్రేమంటే తెలియ రాగ వీగును మాటల్ !
జిలేబి
సాహిత్య అభిమాని కుప్పిగంతులు 1
Delete>>>హీరోను ఒక పాము కరిచి పారిపోతుంది.ఆ పాము కోసం వెతుకుతూ ఉంటాడు. అది ఎందుకు పెట్టారో?>>
పాము కోసం వెతుకుతున్నపుడల్లా ఒక వస్తువు దొరుకుతుంది. ఆ వస్తువు ఎవరిదో తరువాత చెప్పించారు.
సాహిత్య అభిమాని కుప్పిగంతులు 2
Delete<<<>>
క్షణం అనే సినిమాలో ఇంకా అద్భుతంగా నటించింది.వీలయితే చూడండి.అత్త వేషం ఇస్తారా అని అలిగింది కూడానూ....
సాహిత్య అభిమాని కుప్పిగంతులు 3
Delete>>>>హీరో అన్నకు "ఒక అమ్మాయికి" ప్రేమ ట్రాకు నడుస్తూ ఉంటుంది. హీరో అన్నేమో దుబాయ్ లో పనిచేస్తూ ఉన్నట్టు చెబుతారు, ఎదో శలవలకు వచ్చినట్టు చూపించారు. దుబాయ్ లో ఉన్న కుర్రాడికి, పట్నంలో హాస్టల్ లో చదుకునే అమ్మాయికి ప్రేమ ట్రాకు ఎలా నడిచింది, పైగా 1985లో! సెల్ ఫోన్లు ఇంటర్ నెట్ లు లేవాయే>>>>
ఇండియాలో చదివి దుబాయ్ వెళ్ళకూడదా ? ప్రేమ ఎలా పుట్టిందో చెప్పడానికి ఇంకో గంట సినిమా తీయాలా? తొక్కలో ప్రేమ ఎలా పుడితే ఏంటీ ?
సాహిత్య అభిమాని కుప్పిగంతులు 4
Delete>>>>>>ప్రకాష్ రాజ్ కారు ఎక్కంగానే ఒక లారీ వచ్చి వెనకనుంచి గుద్దేస్తుంది. దానికి ముందు, ఆ ప్రమాదం జరగబోతోంది అని తెలిసిన వాడల్లే అరుచుకుంటూ, హీరో తెగ పరిగెత్తి వస్తాడు. ఆ సంఘటన నేపధ్యం సినిమాలో ఎక్కడా చెప్పలేదు>>>>
ప్రకాష్ రాజ్ ని చంపడానికే హీరో బయలుదేరుతాడు.ఈలోగా ఏక్సిడెంట్ అవుతుంది. తన అన్నని చంపినవాడు అంత ఈజీగా చావడం హీరోకి నచ్చదు. ప్రకాష్ రాజ్ ని బ్రతికించిన తరువాత తనే చెపుతాడు .....ఉరి శిక్ష వేసిన వ్యక్తిని చంపేటపుడు కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళనే ఉరి తీస్తారు. ఎందుకంటే వాడు ఎందుకు చస్తున్నాడో వాడికి తెలియాలి కదా ? అని.....
This comment has been removed by the author.
Deleteసాహిత్య అభిమాని కుప్పిగంతులు 5
Delete>>>>>భలేవాళ్ళే కథ పూర్తిగా నేనే చెప్పేస్తే డైరెక్టరు దేనికీ, సినిమా తియ్యటం దేనికీ?>>>
బ్లాగుల్లో కొత్తావకాయ గారని ఒక మహిళ వ్రాస్తుంటారు.ఆవిడ వ్రాసేవి ఒకటికి రెండుసార్లు చదివితే గానీ పాఠకులకు అర్ధం కావు.ఆవిడ చెత్తగా వ్రాస్తారని అర్ధం కాదు.పాఠకుల ఊహాశక్తి మీద ఆవిడకున్న గొప్ప నమ్మకం అది.మీరు తెలుగు సినిమాలు చూడడం మానేయండి. మీకు అర్ధం కావు.మీరు వ్రాసిన వాటిల్లోనే మీకు సమాధానాలున్నాయి.మళ్ళీ చదువుకోండి.
Deleteరేపటికెట్లాగూ మీరే ఈ కామింట్లన్నీ డిలీట్ చేసేస్తారు :) ఆ పాటి దానికి వీటన్నిటిని నే చదువనేల :)
జిలేబి
This comment has been removed by the author.
Deletehttp://amruthamathanam.blogspot.in/2018/04/blog-post_13.html?m=1
Deleteతెలంగాణా వెనుకబడి ఉండడానికి ఆంధ్రా వాళ్ళే కారణం అని కేసీఆర్ అనలేదా ? సకల జనులూ వంటా వార్పూ చేసి ఫేక్ న్యూస్ లు వండివార్చలేదా ? సమాచార శాఖలో చేరడానికి ముందు మీరెన్ని వండి వార్చారో మర్చిపోలేదు. సమయం వచ్చినపుడు గుర్తు చేస్తా...
ReplyDeleteఈ పాట యిష్ట మైనది
మా పెన్మిటికయ్య వేణు ! మా బాగుందో
యీ పడి పడి వింటిమయా
మా పండిన కలయికకిది మమతల యరపా!
జిలేబి
అరప ఆడితే :)
ReplyDeleteవిరిసెను వసంత మీ వే
ళ రసమయ జగత్తు తూగ లాహిరి లోనన్
సరసన్ జిలేబుల సయా
ట! రంగు రంగుల కలయిది టాంటాం టాంటాం !
జిలేబి
ReplyDeleteఅరపయు నాడ పదనిసల
సరసపు రసమయ జగత్తు చక్కగ నాడన్
పరువమ్ములెల్ల పెనవే
య రమణుడాడెన్ జిలేబియా జీవగతిన్!
జిలేబి
ReplyDeleteయతియున్ ప్రాసలు మా తెలు
గు తెగులుగా వచ్చె గుప్పు గుప్పుయనంగన్
కతలన్ చేర్చిర యా సం
గతులన సంస్కృతమునకు సగర్వము గానన్ !
జిలేబి
ReplyDeleteनैवेन्द्राणी न रुद्राणी न मनावी न रोहिणी
वरुणानी न नाग्नायी तस्याः सीमन्तिनी समा
भट्टी काव्या
रावण वध - canto v - 20
ReplyDeleteరేపటి కెట్లాగూ మీ
రే పట్మనికొట్టి వేతురీ కామింట్లన్!
ఆ పాటి దానికి చదువ,
నే పాటుపడుటయు వేష్టు !నీహారికయా !
జిలేబి
ReplyDeleteఓయీ చదువట్లేదా
నీ యిక్కట్లైన పద్య నీరాజములన్?
మా యీ నాలుగు కామిం
ట్లే యయ్యేయా సమస్య ? లేమా చెప్మా :)
జిలేబి
ReplyDeleteప్పో యంటేయేమిటనన్
మా యందరికి తెలియన్ సమయమాయెనయా!
చేయూతనిచ్చి నారుగ
దా యూరి జనులరయంగ తరముగ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteప్రణతులిడినారు శాస్త్రులు
గణముల లెక్కసరి తేల కన్ బోవ భళీ
హణిగెలొనర్చి జిలేబియు
వణికము గా కందమొకటి వడికె భళిభళీ !
ಜ಼ಿಲೇಬಿ
ReplyDeleteఅన్నా! యడాగ మములన్
యున్నగ కనవచ్చెనోయి యుక్తము గానన్
మిన్నగ చదువుర బిడ్డా
పన్నగ శయనుడు భళారె పదముల రేడౌ :)
జిలేబి
ReplyDeleteఅన్నా! సంబోధనరా
యన్నా ! హరిబాబు గనుమయా విదురుని ప
ల్కన్నా ! తెలుసుకొనుమయా
మిన్నగ సుమ్మీ జిలేబి మించారగనన్ :)
జిలేబి
ReplyDeleteఎంతగ మురిపించునకో
నంతయు వేదన లనిచ్చునకొ నయగారం
బంతయు జిలేబి పలుకుల
కింతై నవిలువ నిడదగు కిన్నెరసానీ !
జిలేబి