పదమూడన్న భయమ్మదేల రమణీ ప్రార్థింపు మా యీశునిన్
అదేమో గానండి న్యూమరాలజీ, వాస్తు, సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్యం, 'దుష్ట తిథి' గట్రా లను చూస్తే , వాటి విషయం చదివితే వెంటనే ఓ కామింటు ఉల్టా వేయా లని పిస్తుందండీ :)
క్రితం రోజు మన దీక్షితులు గారు త్రయోదశి గురించి టపా రాస్తే టట్ అని వెంటనే 'తాత పల్కుకు సవాలు వేయము' అని ఓ డిండిమ కట్టేసా :)
అదేదో మరీ నారదాయ నమః అయి పోయినట్టుంది; శర్మ గారి మనసు నొచ్చేసు కున్నట్టుంది . తిట్టి నట్టు న్నారు సుమా జిలేబి గారు అనుకున్నారు !
అబ్బే ! మన యొజ్జ గారిని తిట్టడమా ! అనపర్తీశు ని తిట్టడమా ! అదిన్నూ మా గోజీ ల వారిని తిట్టడమా ! నెవర్ ! నో ! నో ! నో !
భట్టి తన భట్టి కావ్యము లో (రావణవధ) లో మొదటి పద్యాన్ని పదమూడు అక్షరాలున్న రుచిరమన్న రేర్ వృత్తము తో ప్రారంభించేడు ! సవాలే సవాలన్నట్టు త్రయోదశ పదము లతో :)
అదిన్నూ ఈ రుచిరము లో మొదటి గణము జగణము (మరీ జిలేబి ) :)
అభూనృపో విబుధ సఖా ! పరం తపః అంటూ దశరథుని గుణ గణా లతో రుచిరమన్న పదమూడు అక్షరాలున్న వృత్తము తో ప్రారంభిస్తాడు :) అది గుర్తు కొచ్చి సవాలు వేసా :) అంతే నన్న మాట !
ఏమండీ దీక్షితుల వారు సరియా ?
అభూనృపో విబుధ సఖః పరంతపః
శ్రుతాన్వితో దశరథ ఇత్యుదాహృతః ! !
చీర్స్
జిలేబి
బిలేజి పద్యములవి భీతిగొల్పెనే :)
(రుచిరము)
అందుకేనా ఈరోజు శంకరాభరణంలో రుచిర వృత్తంతో పూరణ చెప్పారు. భేష్!
ReplyDelete
ReplyDeleteకందివారు నమో నమః
అవునండి
జిలేబి
ReplyDeleteనిబద్ధ తన్గలిగెను నెయ్యుడున్గదా!
సభాస్థలిన్ నిలిపెను సంతసమ్ముగన్
సెబాసు !శంకరుడయ! చేర్చెనెల్లరిన్
గుభాళి తావి విరియ గొమ్మిపుష్పముల్!
జిలేబి
ReplyDeleteవిపన్ను లన్ననుమడ! వీక్షచేయుచు
న్నపారమౌ కరుణల నాదరించి క
న్నుపొందు వారలకట నొప్పు రీతి ద
న్నుపాటి గన్నిదురను నూకు చెన్నుగా!
కలావతీ(రుచిరము)
జిలేబి
Delete* దత్తపది కన్ను మిన్ను చెన్ను పన్ను
ReplyDeleteచిటారు కొమ్మ చిలుక చిక్కెగా రిటై
ర్డు టాపు బూటుల సయి రూపసుల్లటన్
మిటాయి పొట్లము మజ మించెనే బడా
యి! టక్కు లాడి రమణి యీసురో గురో :)
జిలేబి
ReplyDeleteఉదుంబరావతి నట నూరికావలన్
కదంబరంబుగ గన కాస్త చిత్రమై
ముదావహంబుగ నిడె ముందు చూపు వా
రు! దాఖలాయిది గద రూఢిగాసుమా :)
జిలేబి
ఈ టపా ఎలాగో నా దృష్టి దాటిపోయింది. నాకు కోపమేం లేదు.
ReplyDeleteఒక డౌట్ అనుమానం భట్టిగారు, పదమూడక్షరాల, పదమూడు పదాల అరుదైన వృత్తం ఎంచుకోవడం, అందునా రావణ వధ ను వర్ణించడానికుపక్రమిస్తూ, విశేషం ఏంటో చెప్పండి. పద విభాగంలో పదమూడు పదాలు కనపడలేదు, పొరబడ్డానా? ఎలా పద విభాగం చెప్పండి.
Deleteపదమూడు అక్షరములు సరి
రెండవది పదములు అన్నది తప్పు :) శ్యామలీయం వారు పట్టని లా పాయింట్ మీరు పట్టేసేరు :) నెనరుల్స్ !
పదమూడు అక్షరాలు - ఉదాహరణ
బిలేజి పద్యములవి భీతిగొల్పెనే :)
చీర్స్
జిలేబి
ఏవో నాకంటబడిన వాటిపై అపపుడు స్పందించటమే కాని గొంగడిపై వెంట్రుకలవలె మీతప్పులెన్నటంపై నాకాసక్తిలేదు. నావ్యాపకం నాకున్నది చాలు.
Delete
Deleteశ్యామలీయులను గోకుటయే జిలేబి వారి వ్యాపకము :(
జిలేబి
ఫిబ్రవరి లేక మార్చి లో మీ ఊరు రావలసొచ్చేలా ఉంది, ఓ మనవరాలి పెళ్ళికి, తప్పేలా లేదు. టిక్కట్టులు తీసి పంపుతానంటోంది, ఏం చేయాలో తోచటం లేదు...ఎలా రావాలి మీ ఊరూ....
ReplyDelete
Deleteరండి రండి మద్రాసు వచ్చి అక్కడినుంచి వేలూరు బండెక్కితే దిగడం అంతే
జిలేబి
ReplyDeleteగొంగడి పై వెంట్రుకలను
చెంగట కూర్చొని వరుస ఖుషీగా నెంచన్
ముంగట పనిలేని నరుడి
భంగిని కనిపించితినకొ బామ్మ జిలేబీ ?
జిలేబి
ReplyDeleteఅరకొర తెలివిని నడిగిన
వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా,
శరణాగతియే సరి యని
కరుణాకర మార్చరాద గతి భక్తులదౌ ?
***
అరె! వాక్కు! ప్రకృతి యొసగిన
వరమది! భక్తులను మిగుల వంచించెఁ గదా
సరియైన సమయమున శం
కర! మాయని త్రోసి వేసి ఖాతికని బడన్ !
ఖాతిక - అగడ్త
***
పరిణయ మాడితి బతుకిక
నరకంబాయె ననుకొనకు నరుడా! లెమ్మా!
అరరే! వగపేల విభుని
వరమది! భక్తులను మిగుల వంచించెఁ గదా!
***
తరితీపుల చూపు రమణు
ల రతగురువుగ మనుజుడ కలని గాంచితి వీ
వు రయముగా లెమ్మా నర
వర! మది భక్తులను మిగుల వంచించెఁ గదా!
జిలేబి
ReplyDeleteచేయు పనులెల్ల కలిగించె చేటునమ్మ
చూడ నాశ్రమమున వసించు మునివలె! దు
రాగతముల కంతేలేదు! రాలుగాయి!
సాధువని మెత్తుమే దురాచారు నౌర ?
జిలేబి
ReplyDeleteకైపదము మారి పోవగ
నో పడతి మరియొక పూరణోత్సాహము గాంచెన్ :)
జనుల కెల్ల మేలునుచేయు జంగమయ్య
లకు జిలేబి వందనమిడి లక్షణముగ
సాధువుగ గ్రహింతుము! దురాచారు నెపుడు
దూరముగ నుంచడము మేలు తోయజాక్షి!
జిలేబి
ReplyDeleteఇక ముందుకు దుముకుడి యను
చు కదమ్ము కదము బడాతె చువ్వన బండిన్
చకచక నడిపిరి రావ్సా
బు! కినిగెని పరిచయపరిచి బ్రువ్వట బాబా :)
జిలేబి
ReplyDeleteబండివారికి మెచ్చుకోలిడు బాగుగా తన శైలిలో
చెండుగా మన తాతగారికి చేవ చేర్చిరి రాసిరే
మెండుగా మన శర్మగారు సుమేరుపర్వతమై! భళా
కుండపట్టుకు వెళ్ళుమీ సఖి కొంచమైనను దక్కునే :)
జిలేబి
ReplyDeleteకాపీ దింపుకు ముందుమాట చదివా! కవ్వించెగా పూర్తిగా
తాపీగా చదవాలె యింకొక దఫా ! తాత్సారమేలన్ కొనన్
మీ పొత్తంబును దండిగాను కినిగే మీకిచ్చు డిస్కౌంటు కూ
డా! పోషించును మీదు మేధనయ రారండయ్య రండీ వెసన్!
జిలేబి
ReplyDeleteభూతంబై నను పట్టినావు గద నా భూతాత్మ రామయ్య తం
డ్రీ! తప్పుల్ కన బెట్టినారు జనులున్ రించోళియున్ కావు మా!
యేతావున్ గల వయ్య స్వామి త్వరగా యీభక్తుడిన్ గావ ర
మ్మా! తాతా! యిదె వేచినాడ రఘురామా నీకటాక్షంబుకై
జిలేబి
ReplyDeleteఎనిమిదవ పొత్తమొచ్చెను
కినెగిని మన బండివారు కిర్రుమనుచు లా
గి నిలుపగ ముందు మాటని,
జనులెల్లరు మేలుగాన సత్సంగమునన్
జిలేబి
ReplyDeleteసరికొత్తగ బకరా వ
చ్చె! రండి వాయించుకొనగ చెంబు తపేళా
మరువక తెండి జిలేబుల
వరుసగ వేయవలెనయ్య పండితులారా :)
జిలేబి
ReplyDeleteతలాతోకా కుదిరింద (ట) :)
జోరుగ సాగుచు మేలుగ
సారికలుగొనెడు జిలేబి స్వాతంత్ర్యంబౌ
రా రతగురువే దోచెన్
నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్!
జిలేబి
ReplyDeleteజ్ఞానార్జన పుట్టుకతో
నే నరుడా రాదు ! నీవు నేర్వగ నేర్వం
గా నేర్పుగ మారునయా
చూనాబట్టీ జిలేబి చువ్వన బోదోయ్ !
జిలేబి
ReplyDeleteకారణ మేదయ్యును ము
న్నారయ ' మూన్ ' భూమి పగిలి , అందొక భాగమ్
వేరై తొలగె - తొలుత , అవ
నీ రజమున కలువరేని నెలవొప్పారెన్
Deleteఅదురహో మున్, మూన్ :)
మూన్ మూన్ సేన్ :)
జిలేబి