Monday, August 26, 2019

పట్టమిదే స్వర్ణ సింధు ! Bharat's Ratna !


పట్టమిదే స్వర్ణ సింధు ! భారత్స్ రత్నా!



ఫోటో కర్టెసి - గూగుల్ అమ్మణ్ణి :)

పట్టపు కర్టెసీ - ఆంధ్రప్రభ ; New Indian Express వారు :)


పట్టుగ గెల్వంగా జై
గొట్టిరి; కోమలియె శ్రీమకుటమార్జింపన్
పట్టిరి బ్రహ్మ రథమ్మును
పట్టమిదే స్వర్ణ సింధు ! భారత్స్ రత్నా !




జిలేబి

140 comments:



  1. పట్టుగ గెల్వంగా జై
    గొట్టిరి; కోమలియె పసిడి కొట్టుకు తిరుగన్
    పట్టిరి బ్రహ్మరథమ్మును
    పట్టమిదే స్వర్ణ సింధు ! భారత్స్ రత్నా !


    జిలేబి

    ReplyDelete


  2. దిట్టగ గెల్వంగా జై
    కొట్టిరి; సింధును పసిండి కొట్టుకు రాఁగన్
    పట్టుగ నూరేగింపన్
    పట్టము గట్టన్ జనాళి వరుసన్‌ గనిరే!


    జిలేబి

    ReplyDelete


  3. World ButterMinton Champ :)

    100% Sindhustani :)



    Amulebi :)

    ReplyDelete
  4. ఇది కూడా బంగారమేనండి 👏👏. World Para Badminton పోటీలో స్వర్ణం గెలుచుకుంది ... ఎడమకాలు లేని ... మానసి జోషి. గట్టిగా చప్పట్లు కొట్టండి.

    మానసి జోషి : Para Badminton విజేత

    ReplyDelete


  5. పండెను ప్రేమని పద్మయె
    వండెను పదముల త్వరితము పరుగిడ నవియే
    దండిగ ప్రియుడిని చేరన్
    రండర్రా చదివి వాటి రంగుల చూడన్ :)



    జిలేబి

    ReplyDelete
  6. శుభోదయం జిలేబి గారూ!

    ReplyDelete
    Replies


    1. శుభోదయమండీ కంది వారు!


      జిలేబి

      Delete


  7. కోరిక లేవియు లేకన్
    ప్రేరణ హృదయపు కుహురము పేర్మిని గానన్
    తీరని తపనని గుడిలో
    బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్


    జిలేబి

    ReplyDelete


  8. కోరిక లేవి లేకయు ప్రకోపము లేకయు భక్తి తోడుగా
    ప్రేరణ హృత్తు లో గొనుచు ప్రేమను పంచుచు ధ్యాన మార్గమం
    దారని తీవ్రతన్ తపన దాపుగ తోరణకట్టగా గుడిన్
    బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్!


    జిలేబి

    ReplyDelete


  9. తెలగాణ బిడ్డ ! సింధూ !
    అలంకృతంబయె పసిడిని! బ్యాడ్మింటన్ క్వీన్!
    పులకింపన్ లాగుదురు జ
    ను లెల్లరిక బ్రహ్మరథమును జిలేబమ్మా !


    జిలేబి

    ReplyDelete


  10. మాయమ్మే! తెలగాణ బిడ్డ! తెలుగమ్మాయీ !భళా! సింధు! నీ
    ధ్యేయమ్మందుకొనేవు దేశమునకై బ్యేడ్మింటనాటన్ ! జిలే
    బీయంబిద్ది జనాళి బ్రహ్మరథమున్ వేగమ్ము వేగమ్ముగా
    సాయంబట్టుచు లాగి పుష్పములతో సాగించిరే యానమున్ !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మొన్ననొక పోస్ట్ లో వ్రాసిన పద్యాలనే మళ్ళీ జపిస్తున్నారన్నమాట? లోకం తీరు అంతే లెండి, "సింధు" నదీ వరదలో కొట్టుకుపోతున్న జనాలకు .. అదే దేశంలో అదే నగరంలో అదే సమయానికి జరిగిన World Para Badminton Championship లో స్వర్ణం గెలిచిన వికలాంగురాలు, మన దేశ వనిత మానసి జోషి .. అంతగా ఆనడం లేదు.‌ ఇక్కడ నిన్న వ్యాఖ్య పెట్టినా కూడా ఆ అమ్మాయి గురించి ఒక్క పద్యమైనా కట్టలేదు మీరు. పైపెచ్చు ఇప్పుడేమో వేరే పద్యాల reprint కూడా. ప్చ్ ప్చ్. సర్లెండి మీ బ్లాగ్, మీ పద్యాలు, మీ ఇష్టం.

      (బైదివే, ఆ జోషీ అమ్మాయి నాకేమీ చుట్టం కాదు. తన ప్రతిభ, కృంగిపోకుండా పట్టుదలతో సాధించిన విజయం నచ్చాయి. అలాగే సింధు పట్ల నాకేమీ వ్యతిరేకత లేదు - అసలే మా జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ కూడానూ😳) 👇

      "పట్టుదల" :: మానసి జోషి (29-08-2019 ఆంధ్రజ్యోతి దినపత్రిక (Hyd), పేజ్.13)

      Delete
    2. Yes Sir, him too. Great show 👏. Fully able-bodied ఆటగాళ్ళ గెలుపుల సందడిలో ఇటువంటి వాళ్ళ విజయాలు వెనుక బెంచీలకు వెళ్ళిపోతున్నాయి. Indiatimes కరెక్ట్ గా చెప్పింది 👇.

      Para Badminton champion Pramod Bhagat

      Delete


  11. ఫిట్టిండియా యటంచున్
    గట్టిగ పూనిక జిలేబి గనుమా మోడీ
    చట్టను వచ్చెదరదిగో
    దిట్టగ స్టేడియములోన ధిమిధిమి యనుచున్ :)


    జిలేబి

    ReplyDelete


  12. అభియానమ్ముల దేశమి
    దె! భారతాంబ తనరార దిట్టగ జనులె
    ల్ల భవముగా శారీరిక
    విభవము మానసిక దృఢత విరివిగ చేరన్!


    జిలేబి

    ReplyDelete


  13. తడబడకన్ విశాలముగ దాతృత చూపుచు రాజధర్మమున్
    వడివడి నేర్చి నెమ్మిగొని వాక్కుని తేనియ లూర జేయుచున్
    మడమయు ద్రిప్పకన్ జనుల మంచిగ నేలుచు పర్వరీణమున్
    విడిచెడి వాఁడె వీరుఁడగు విద్దెను జూపి విలక్షణమ్ముగా!


    జిలేబి

    ReplyDelete


  14. అరె! శశి తరూరుడే మె
    చ్చె రా భళి యటంచు మోడి చేవయు మేలం
    చు! రవంత సందియమ్మిత
    డు రయ్యనగ పార్టి మారి డుమ్మా యనునో :)



    జిలేబి

    ReplyDelete


  15. హైదర బాదొచ్చేసా!
    నా దరి శిష్యులిక వచ్చి నాణ్యము గా యో
    గా, దర్శన భాగ్యములన్
    సాదరముగ పొందవచ్చు సత్సంగములోన్ !


    జిలేబి

    ReplyDelete


  16. పారా బ్యాడ్మింటను లో
    శ్రీ రాజ్ఞిగ జోషి మానసి కితాబుల తో
    తారాపథమ్ము! జయహో
    భారత దేశపు మహిళల ప్రగతి జిలేబీ!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. 👌
      (అడీగి వ్రాయించుకున్నట్లున్నా మొత్తానికి బాగా వ్రాశారు🙂)

      Delete


    2. బతిమాలుచు రాయించిన
      స్తుతివలె కలదోయ్ జిలేబి! తోయలి! పద్యం
      బతి సుళువుగ నమరె! నెనరు
      లు!తీయటి పలుకులు పదములు వరలె తనరన్


      జిలేబి

      Delete


  17. ప్రేమ లో పడకండర్ర! ప్రేమ లోన
    మేలు కొని నొకరినొకరు మెచ్చుకొనెడు
    రీతి జీవింప యతనము రెంచనొకటి
    గాను మార్చి చేయుడి శుభ కార్యమనగ!


    జిలేబి

    ReplyDelete


  18. రెండన పసిడి పతకముల
    భండారముగా ప్రమోదు భగతుండదగో
    చెండాడుచు గెలిచె భళా
    రండి సెబాసనగ నరస రాయల పిలుపై!

    జిలేబి

    ReplyDelete


  19. తిరుపతి కొండకు వచ్చును
    తిరుమల వాసుని కొలువగ తిరముగ సింధూ!
    వరమియ్యవయా సామీ
    మరల మరల స్వర్ణ పతకమై యతనమవన్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies

    1. తిరుమలలోనైనా చీర కట్టింది (లేక, అది పంజాబీ డ్రెస్సా?), ధన్యులం 🙏. ఆసలు సంగతి .. వేరే రకం దుస్తులు వేసుకుంటే ఆలయప్రవేశం ఉండదేమో?

      మొన్నటికీ మొన్న .. సన్మానం చేస్తాం మా ఇంటికి రావమ్మా అని గవర్నరు గారు పిలిస్తే .. జీన్స్, టిషర్ట్ వేసుకుని రాజభవన్ కు వెళ్ళింది. వస్త్రధారణ సందర్భోచితంగా ఉండేటట్లు చూసుకోవడంలో కూడా నిర్లక్ష్యం చూపించడం ఈ తరానికే చెల్లింది. ఎవరైనా అదేమిటమ్మా అంటే "మై ఛాయిస్" అంటూ విరుచుకుపడడమూనూ.

      రేపు తన డిప్యూటీ కలెక్టర్ ఆఫీసుకు కూడా జీన్స్ టీషర్ట్ లతోనే వెడుతుందో ఏమిటో 🙄?

      Delete


  20. కోరిక లేవియు లేకన్
    ప్రేరణ హృదయపు కుహురము పేర్మిని గానన్
    తీరని తపనని గుడిలో
    బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్


    జిలేబి

    ReplyDelete


  21. కోరిక లేవి లేకయు ప్రకోపము లేకయు భక్తి తోడుగా
    ప్రేరణ హృత్తు లో గొనుచు ప్రేమను పంచుచు ధ్యాన మార్గమం
    దారని తీవ్రతన్ తపన దాపుగ తోరణకట్టగా గుడిన్
    బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్!


    జిలేబి

    ReplyDelete


  22. నేరుగ తిరుపతి కొండని
    చేరుచు పరిశుభ్రమైన సేల ధరింపన్
    తీరుగ వైకుంఠంబున
    బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్


    జిలేబి

    ReplyDelete


  23. కోరంగ నిత్య శోభన
    మే రమణి పరిశ్రమించి మేని యహో బే
    జారై పద్మార్పితకై
    బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్!


    పద్మార్పిత బ్లాగు సరికొత్త టపా ప్రేరణ :)


    జిలేబి

    ReplyDelete


  24. ఆ రాతిని చెక్కియు గిరి
    పై రాయునిగా మలచియు పదపడుచు నమ
    స్కారము సల్ప వినయతన్
    బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్!


    జిలేబి

    ReplyDelete


  25. మన్మథుడు - ౨ :)

    నాగార్షజున షష్టిపూర్తి 29 Aug 2019 శుభ సందర్భముగా శుభాకాంక్షలతో


    ఔరా !నాగార్జునుడా
    నీ రంజిలు షష్టిపూర్తిని స్పెయును లో వి
    స్ఫారముగా‌ జరుపుకొనన్ !
    బారునఁ గూర్చున్నవాఁడె భక్త" వరుఁ" డగున్!


    జిలేబి

    ReplyDelete


  26. ఊరూరా తిరిగిన నా
    భారతిని మరువక తెలుగు భాష మరువకన్
    ప్రేరణ గొని కైపదముల
    బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁడగున్!


    తెలుగు భాషా దినోత్సవ సందర్భముగా
    శుభాకాంక్షలతో


    జిలేబి

    ReplyDelete


  27. ఫిట్టిండియా యటంచున్
    గట్టిగ పూనిక జిలేబి గనుమా మోడీ
    చట్టను వచ్చెదరదిగో
    దిట్టగ స్టేడియములోన ధిమిధిమి యనుచున్ :)


    దేహలి
    జిలేబి‌ :)

    ReplyDelete


  28. బారున, బారున, బారున,
    బారున, బారున, జిలేబి బారున బారన్
    బారున బారన్ బారని
    బారున కూర్చున్న వాడె భక్తవరుడగున్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బారు బారు దేఖో, హజార్ బారు దేఖో .... అనే పాత హిందీ పాట గుర్తొచ్చిందండి 🤪.

      Delete


  29. RBI ఉవాచ :)


    చక్రీయము మాంద్యమహో!
    వక్రతని సమస్యలున్ వ్యవస్థీకృతమై
    సక్రమ మైన పెరుగుదల
    యక్రమముగ మార దోహదంబయె సుదతీ !


    జిలేబి

    ReplyDelete


  30. తనకు ముప్పు లేని తరుణము తనదారి
    యడ్డు పడని హరిమ యనవసరము
    గాను మతియు వీడి గర్వము తోడుగా
    యేన్గు చంప నోప దెలుకనైన!


    జిలేబి

    ReplyDelete


  31. స్థానబలమ్ము వాజినము శౌర్యము సంహతి వ్యుష్టిగానదే
    మానసి! యత్న మెంతయు సమానము కాదు విధాత యాజ్ఞయే
    వైనము దేనికైనను! సవాలును వేయుచు పోతరమ్ముతో
    యేనుఁగు చంపఁ జాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్!


    జిలేబి

    ReplyDelete
  32. తస్మాత్ జాగ్రత్తండోయ్.
    "జగన్ పై అనుచిత వ్యాఖ్యలు ... తెలంగాణా వాసికి బేడీలు"
    అంటూ ఇవాళ్టి (30-08-2019) "ఆంధ్రజ్యోతి" (హైదరాబాద్) దినపత్రిక 8వ పేజ్ లో వార్త :(

    తస్మాత్ జాగ్రత్త

    ReplyDelete


  33. తస్మాత్ జాగ్రత్త సుమా !
    కస్మాలమని తెగిడిన వికాసపథమ్మున్
    విస్మయములింక తప్పవు
    తస్మీత్ కందముల చేర్చు తరుణులకైనన్ !


    జిలేబి

    ReplyDelete


  34. మందగమనానికిదిగో
    బందోబస్తులివియేను! బ్యాంకులు చూడన్
    బిందాసుగపన్నెండే!
    చిందర వందరయు కాక చిక్కుల పడకన్!


    జిలేబి

    ReplyDelete


  35. వలదు నాశనమిక చేయ వలదు వలదు
    బెడిసి కొట్టును తప్పక పెల్లుబుకుచు
    నరుల "కొప్పును", ప్రకృతి వినాశనంబు,
    పట్టి లాగుచు నేర్పును పాఠములను!


    జిలేబి

    ReplyDelete


  36. ప్రకృతి విధాత కల్పిత విభావరి కన్నులు కానకన్ జనుల్
    నికటము గాను చేరి తన నిర్మలతన్ చెడ గొట్ట నిక్కమౌ
    ప్రకృతి వినాశనంబె! కడు పావన కార్యము మానవాళికిన్
    సుకృతము గాను వచ్చిన వసుంధర రక్షణ సేయుటేగదా!


    జిలేబి

    ReplyDelete


  37. ఆకాశవాణి కి పంపినది ( చదువబడెనట!)


    నికరము గాను చెప్పెద వినిర్మల ధాత్రిని కొట్టి లోడుచుం
    డ కటకటేను దక్కునిక డంబము వీడక బోవ తప్పదా
    ప్రకృతి వినాశనంబె! కడుపావనకార్యము మానవాళికిన్
    ప్రకృతికి చేరువై బతుకు బండిని శంభుని తోడు లాగుటే!


    జిలేబి

    ReplyDelete


  38. ట్విట్టరు బాసుని ఖాతా
    యెట్టెట్టా హ్యాకయినదె యెంకట లచ్చీ !
    చట్టని చెప్పిరి సరిజే
    సట్టే కాంప్రమయిజవలె సక్కని సుక్కా !


    జిలేబి

    ReplyDelete


  39. ఆండోళ్ళే దుస్తులనరె
    నిండుగ కప్పుకొనవలె యని మగోండ్లే తా
    మండయని నిర్ణయములను
    మెండుగ తీసుకొనుటయకొ మేధాజీవుల్?

    జిలేబి

    ReplyDelete


  40. జీన్సు వేసెనా ! కట్టెనా సేలనరరె
    మేలు షావనిజమ్ముల మేయమగు! హ
    యాము లెన్ని మారగనేమి యాత నలకు
    కొదవ లేదు జిలేబులకు మహినినరె!



    నారదా!
    జిలేబి

    ReplyDelete
    Replies

    1. సందర్భానికి తగినట్లు, అక్కడికొచ్చే పెద్దల పట్ల గౌరవంగా ఉండేట్లు ప్రతిబింబించే దుస్తులు ధరించడం సంస్కారం .. అని నా భావం. దానికి ఆడ, మగ తేడా లేదు. దాన్ని మీరు "మేల్ షావనిజమ్", "నిండుగ కప్పుకొనవలె' అని "యాతన" పెట్టడం అనడం సరి కాదు. ఇది వ్యక్తి ప్రవర్తనకు, సంస్కారానికి సంబంధించిన విషయం.

      "మై ఛాయిస్" అంటూ గంతులేస్తే నవ్వులపాలయ్యేది వాళ్ళే. చూసేవాళ్ళు పక్కకు తిరిగి నవ్వుకుంటారు.

      మరో సంగతి చెప్పనా? వీళ్ళు ఎవరినైతే గుడ్డిగా అనుకరిస్తున్నారో ఆ దేశాల జనాలు కూడా గంభీరమైన సందర్భాలకు తగినట్లుగానే వస్త్ర్రధారణ చేసుకుంటారు .. నేను గమనించినంత వరకు.

      కాబట్టి, వయసులో పెద్దవారైన మీలాంటి వారు కూడా బుద్ధులు చెప్పాలి ... పద్యాలు కట్టడం కాదు.

      Delete
    2. ఇటువంటి చోట్ల ఎలాంటి వస్త్రధారణ అయినా ఓకే 👇

      Sindhu at fashion show

      Delete
  41. బ్లాగుల్లో రెగ్యులర్ గా వ్యాఖ్యలు పెట్టే వ్యక్తి ఒకరు ఈ మధ్య కనిపించడం లేదే, మీకేమైనా తెలుసా "జిలేబి" గారూ?

    ReplyDelete
  42. సెప్టెంబర్ కు స్వాగతం పలకండి .. ఈ అలనాటి 1960ల నాటి హిట్ ట్యూన్ తో 👇.

    Come September

    ReplyDelete
    Replies

    1. స్వా , గతం గతః :)



      జిలేబి

      Delete


  43. పేరు చూడ జిలేబి! సభికులలర న
    కర్ణపేయమ్ముగాఁ బాడె! గార్దభమ్ము
    దారి బోవుచు వినగాను తన సపక్షు
    లుండ వచ్చునని తలచి లుకలుకయనె!


    జిలేబి

    ReplyDelete


  44. వామ్మో ! గాడిద చేత పాట పాడించి సెబాసని‌ పించు కోవడాని ఇంత కత కట్టవలెనా :)



    చూడుడు మంత్రవాది యొక సుందరి నచ్చట గార్ధభమ్ముగా
    వేడుక చేయ మార్చె! తన వెన్కటి మానవ జన్మ వాసనల్
    తోడుగ వచ్చె నిప్డు ! తను తొండొరు సేవల మూటలెత్తి యా
    గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్!



    జిలేబి

    ReplyDelete
  45. ఏలనొ,బోరుగ నున్నది!
    మాలిక యంతయు జిలేబి మయమై పోయెన్!
    మూల్గెడు నక్కకు దెబ్బల
    వోలె పలచబడె విజిట్లు,వోడి చనుదునా?
    27 November 2017 at 23:21

    ReplyDelete


  46. ఓడిన దెవరోయి నరుడ!
    ఓడించినవారెవరు! పకోడీ లెవరోయ్
    ఝాడించినవారెవరో
    యీ! డాబులతేలెనవరొ! యిక్కట్లపడన్ :)


    జిలేబి

    ReplyDelete


  47. మూడెను జిలేబి దినములు
    చూడంగా వచ్చె హరియు చువ్వన తేలం
    గా డమడమ యనుచు సభని
    తాడోపేడో భళిభళి తా తేల్చు సుమీ :)


    జిలేబి

    ReplyDelete


  48. వారెవ్వా! భళి వస్త్రపు
    ధారణ పైకొందరచట! ధారణ, కవితా
    ప్రేరణ పై మరి కొందరు!
    ధారణ మూలము జిలేబి ధాత్రిని సుమ్మీ :)



    జిలేబి

    ReplyDelete


  49. రోసపు వీరరమణులట
    వేసము వేయు మగవాండ్ల విరగన్ దీయన్
    కాసిని లుక్కుల వేయగ
    వేసవిలో శీతవాయువే వీచుఁ గదా! :)


    జిలేబి

    ReplyDelete


  50. మీ సూచన బాగుందం
    డీ!సుబ్బురముగ జనాళి డెందము తూగన్
    బాసు అనానిమసూ నే
    నా సూచన ననుసరింతు నయ నెనరులివే !


    జిలేబి

    ReplyDelete


  51. సై! తమిళిసై! తెలంగా
    ణా తమ్ముళ్లకు బిజేపి నాణ్యత తోడై
    యేతామెత్తిన డాక్టరు
    జోతలివి జిలేబివమ్మ జోషుల తోడన్ !


    జిలేబి

    ReplyDelete


  52. Two ladies ముచ్చట్లు :)


    యూనొ? మైహజు బెండండు యువరు బ్రదరు
    సచ్చె నైసు జెంటిల్మేను ! సత్వర మెలి
    ఫెంటు వెన్ సరెండర్డండు, వెప్టు, వెడలి
    కరుణతో నుమా! పతి గాచెఁ గరివరేణ్యు!


    జిలేబి

    ReplyDelete


  53. లచ్చిందేవి శంకరి తో పెన్మిటి గురించి Two ladies talk ;)


    సకలము విష్ణుమాయ! విధి! చాకలి బట్టల మూట పూట మై
    నికటము చేరు కర్మ యదె నిత్యము సత్యము! గర్వమున్ మద
    మ్ముకడచి కాపుకోరగ సముచ్చయ రక్షణ చేయ జెచ్చెరన్
    మకరినిఁ జంపి సత్కృప నుమా! పతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్!


    ಜಿಲೇಬಿ

    ReplyDelete


  54. ఏమంటిరి కందివరా!
    రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్?
    స్వామి! యిటుల రాయుట నా
    కేమో సరియనుచు తోచకే సూచనయౌ :)


    జిలేబి

    ReplyDelete


  55. లంగా చీర రవికలన్
    లంగోటీ రాయులెల్ల లబ్జు వెతికిరే
    చెంగావి రంగు పయిటన్
    బంగారమ్మి యెచటన్ టపాల్మని దాచెన్ :)


    జిలేబి

    ReplyDelete


  56. లంగా - చీర - రవిక - పయట'
    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
    భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి


    రాయబారానికి నీవే కృష్ణా వెళ్ళాలి. టపా- అంచెలమీదుగ యెడ - దౌత్యము సలుపుమయా!


    పదిలంగా కావుమయా
    హృదయకుహుర వికసిత సిత హృదయేశ్వరుడా
    సదనములో చీరకు! ఆ
    పదనెడబాయ కతిపయ టపాల యెడ గనన్!


    పది లంగా అంటూ మొదలెట్టేసి పడ్డ అవస్థ యింతింత గాదయా :)


    హమ్మయ్య!


    జిలేబి

    ReplyDelete
    Replies

    1. * హృదయకుహర వికసిత సిత‌హృదయేశ్వరుడా!

      Delete

  57. ఈ పిచ్చిపజ్యముల వ్రా
    సే పట్టమ్మ! కనుల తెరచి రవంత గనన్
    స్థాపించిరి కొత్త మతమ
    నే పైత్యమ్ములరె హిందు నేనెట్లయితా !


    జిలేబి

    ReplyDelete


  58. రాములోరి ఆసామి అరరె జిలేబి
    భూతముల పైన బడిరటు పుచ్చి పోయి
    న నరుల తలతిక్క టపాల నంట జూచి
    విధియు కర్మ పోటీపడె విరివి గాను!


    జిలేబి

    ReplyDelete


  59. ఈ పిచ్చిపజ్యముల వ్రా
    సే పట్టమ్మ! కనుల తెరచి రవంత గనన్
    స్థాపించిరి కొత్త మతమ
    నే పైత్యము! హిందువరరె నేనెట్లయితా !


    జిలేబి

    ReplyDelete


  60. పనిలేక మూర్ఖుల తరుము
    చు నిమేషమున కొకమారు చువ్వన కామెం
    ట్లని వేసెడు మన హరిబా
    బుని చూడన్ ముచ్చటయ్యె పొలతి జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  61. బడి కేగని పంతులు " ఆఫీసు ల కెళ్ళని డెప్యూటీ కలెక్టర్లు ఎట సెట్రా :


    చెడుగుడు లాటల నాడుచు
    బడి కేగని పంతులె కడు ప్రాభవమొందున్,
    వడి బంగరుపతకము గెలు
    వ! డిగ నురికి యాటల నిలువన్ పోటీలన్ !

    ***

    గడగడ చెస్సు, టెన్నిసుల గట్టిగ పట్టును గాంచి టోర్నమెం
    టు డవిణ మ్రోత లన్ భళి చటుక్కున గెల్చెడు నేర్పుతోడుగా
    వడివడి యాటపాటల స్వభావపు రీతిని నాడుచున్‌ సదా
    బడికిఁ జనంగలే ననెడి పంతులె ప్రాభవమొందు మెండుగన్!

    ***

    నారాయణా :)



    వడివడి యా డీయీ వో
    యడుగులకు మడుగులనొత్తి హద్దరి బన్నా
    గడగట్టి దోచు రాబడి
    బడికే, గని, పంతులె కడు ప్రాభవమొందున్!

    ***

    సలాము కొట్టు నరుడా/ గురుడా బాగు పడతావ్ :)

    గడగట్టి భేరికా ఢాం
    ఢడఢాంఢ నినదము తోడు ఢంబము తోడై
    వడి మ్రొక్కుచు నేతలకున్
    బడి కేగని పంతులె కడు ప్రాభవమొందున్!

    ***

    వడివడి విద్యార్థి చదువ
    బడికే గని, పంతులె కడు ప్రాభవమొందున్
    కడగాలతనికి వేయన్
    జడత్వము తొలగి జయమును సాధింప సదా!

    ***

    వడివడి ఒక్కట్రెండ్లను
    గడగడ నేర్పంగ వారి కంఠస్థముగా,
    బుడిబుడి పిలకాయలకై
    బడికే గని, పంతులె కడు ప్రాభవమొందున్!

    ***

    బుడతడె! మారామయ్యెను
    బడి కేగని! పంతులె కడు ప్రాభవమొందున్
    బడితను బట్టి యితని వం
    టి డింగరుల తీర్చిదిద్ద టెంకణ మిదియే!


    ***

    పడతీ! చిత్తూరాయన
    పడికట్టుగ నయ్యె రాష్ట్రపతి! రాధాకృ
    ష్ణుడతండు జిలేబీ! యే
    ల్బడికే గని, పంతులె కడు ప్రాభవమొందున్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. గడ గట్టి కందపద్యపు
      దడదడల దెలుంగు బ్లాగు దారుల వెంటన్
      బడి , తన చిరునామా "పో
      బడి" కేగని _ కేగని పంతులె కడు ప్రాభవమందున్ .

      Delete

    2. నమో నమః కుశలమేనా ? ఆ మధ్య వినరా గారు విచారించారు కనబళ్ళేదేమని .


      పడ్డారు ! సంత సం "బడి నందులకు " :)


      జిలేబి

      Delete
  62. // "ఆఫీసు ల కెళ్ళని డెప్యూటీ కలెక్టర్లు" //
    కానీ ఫ్యాషన్ షో లకు వెడతారు.

    ReplyDelete


  63. లైనాఫు క్రెడిట్టులతో
    దీనారమ్ముల బిలియను తీసుకొనుడయా
    మా నాడు, వ్లాది వోస్టెక్
    మీనాడు, కలువ సమృద్ధి మించారగనన్!


    జిలేబి

    ReplyDelete


  64. వీయైపీ కల్చరు లా
    వై యీ దేశమును చంపె వైరెసుగ జిలే
    బీ! యివి తొలగంగా మో
    దీయా సిమహాసనమ్ము తీయించె భళా!


    జాల్రా
    జిలేబి
    చైంచిక్ :)

    ReplyDelete


  65. అరికట్టి చిదంబరుడిన
    రరె తీహారు జయిలుని పరామర్శింపన్
    తరలించిరి దేశమ్మును
    సరి చేయు విధానముల్ పసగొనె జిలేబీ!


    జిలేబి

    ReplyDelete


  66. పాప మనానిమసతడే
    శాపము తగిలెనకొ బ్లాగ్లు "సంపక" తినెగా
    వేపంతవెర్రి గలదో
    తాపము తీరక కవితల దారిబడు సదా :)



    జిలేబి

    ReplyDelete


  67. మారుము మామత మోయీ
    చేరుము మా ప్రభువు నిపుడె సీతారామా
    రారమ్మయనంగా మమ
    కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!

    ***

    కోరికల తోడు ధ్యానము
    పేరాశని నాపుకొనక బెట్టుగ చేయన్
    హోరు నెగడి సాక్షాత్కా
    కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!

    ***

    జోరుగ కోరికల్ తనర జోతల ధ్యానము చేయ వచ్చె పో
    హోరు పిశాచమొక్కటి మహోక్షపు రూపము తోడు దానియా
    కారముఁ జూచి దేవుఁడని గట్టిగ నమ్మెను చిత్ర మెట్టులౌ
    తీరని కాంక్షలే సుదతి తిప్పలు బెట్టుచు రూపుదాల్చుగా!


    ***

    అగ్ని మీళే ...


    తీరుగ రాళ్ళను సైసై
    గీరంగన్ వెల్గు గాంచి గీతము తోడై
    పారిన సత్తువకు నమ
    స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్


    ***

    అగ్ని మీళే ...


    తీరుగ రాళ్ళను సైసై
    గీరంగన్ వెల్గు గాంచి గీతము తోడై
    పారిన సత్తువకు నమ
    స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్


    ***

    జోరుగ వీచెడు వాయువు
    హోరనుచు చెవులను చేరి హొనరన్ భళి! తా
    పారిన బిసాతుకు నమ
    స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!

    ***


    పారంగనుధృతమై యిర,
    ధారాపాతముగ నభము దారిని చూపన్
    ప్రేరణ తో మనిషి నమ
    స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్

    ***

    కారువు డాతడి జాలము
    పోరుల నేర్పె మనుజునికి! భువిని సదా జం
    భారికి కృతజ్ఞత! నమ
    స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!


    ***
    వేరూనించెను భావపు
    తీరుల పితరుడగుచు పని తీరుల నేర్పెన్
    ప్రారూఢియటంచు నమ
    స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్

    ***

    పోరడు పోరియు చేరగ
    ప్రేరేపణయే పునాది రేతస్సదియే
    మారన్ ప్రాణముగ నమ
    స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్

    ***

    నేరుగ బలపము బట్టుట
    తీరిచి చదువులను నేర్ప తిరముగ భువిపై
    ప్రేరణ గురువనుచు నమ
    స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్


    ***

    వేరుగ నిలిచెన్ వృక్షము
    గా రవళింపంగ జేయ కన్నకొమరుడిన్
    తీరుగ; దేవత! యా ఓం
    కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!

    ***

    రారా యటంచు టీవీ
    వారధి ప్రకటనల బిల్వ వడివడి వెడలెన్
    భారీగెడ్డమ్ముల నా
    కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!

    ఆ తర్వాత ? గోవిందా గోవిందా :)



    ***

    సరదా గా అహం బ్రహ్మాస్మి విలేకరి :)



    చేరంగ నెక్స్ప్రెసు నతడు
    స్టోరీ లన్ పేపరుని చటుక్కుమను బటా
    బూరము గా వేయగ నధి
    కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్ :)



    జిలేబి





    ReplyDelete

  68. శుభాకాంక్షలతో


    రావోయి చంద మామా !
    మా వింత విమానమిది సుమా వచ్చెనిదే
    నీ వింత మోము చూడన్
    తావిని చేర్చగ నరేంద్ర దాసుడు చేరెన్


    లైవ్ ఫ్రం బెంగుళూరు :)


    జిలేబి

    ReplyDelete


  69. విక్రముని సిగ్నలు జిలే
    బీ క్రమముగ వచ్చునా ? సభీ ఉత్సుక్ హై!
    చక్రమ్మిక తిరుగునకొ? ప
    రాక్రమము వెలువడునా విరాజిల్లంగన్ ?


    జిలేబి

    ReplyDelete


  70. ప్రజ్ఞావంతులు! యిస్రో
    విజ్ఞానులపజయ మనుచు వెరవకుడీ! మీ
    ప్రాజ్ఞానయానమున సం
    జ్ఞాజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్!


    సంజ్ఞాజ్ఞానము - signal beak సంజ్ఞ అజ్ఞానము


    Be courageous ISRO !

    Cheers
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. King Bruce and the spider కథనుండి స్ఫూర్తి పొందవలెను 👍.

      Delete


  71. ఆకాశవాణికి పంపినది


    "ప్రజ్ఞావంతుడ! భాగ్యశాలిని‌ భళా వాగ్దేవి నావాణి ! నే
    నాజ్ఞాపించిన శిష్యులెల్లరును సన్నాహమ్ముతో బారుగా
    సై!జ్ఞానాంబుధి యంచు చేరుదురు!" ఈ శౌటీర్యముల్, వీడగా
    నజ్ఞానమ్ము, వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్!


    జిలేబి

    ReplyDelete


  72. శపిత యోగ దశ జిలేబి ! చంద్ర యాన
    ఫలిత మయ్యె ఢమాలందు వలన సూవె!
    మూడు నెలల మునుపు యోగమున్ను నటులె
    యేడ్చె నామాట వినరేల యెవ్వరున్ను !


    బాబా బ్లాగ్
    జ్యోతిష్యానంద్ జీ మహరాజ్
    కీ జై :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అంతా అయిపోయిన తరువాత వచ్చి ... ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు ... అనడం తేలికైన పని.

      Delete
    2. అల్లదె చంద్రయానమున నార్బిట రిప్పుడె ల్యాండ రానవా
      లెల్ల గనంగ నయ్యె , నొక యించుక యోపిక బట్టు డంతయున్
      దెల్లముగాగ విక్రముని తీరులు దెల్యును , యిస్రొ ! కీపిటప్ !
      చల్లని వార్త విందు మట , సాంతము దిగ్విజయమ్మగున్ కడున్ .

      Delete


  73. ఉల్లము జల్లన నతడా
    లల్లిని ప్రేమించె, పెండ్లి లగనపు సమయం
    బల్లన నమస్కరించుచు
    తల్లికిఁ, గొమరుండు సూత్రధారణఁ జేసెన్ !

    జిలేబి

    ReplyDelete


  74. కనుగొంటిమి విక్రముడిని!
    జనులార! కనుగొనెదమిక శకటంబునెటుల్
    మనచంద్రునిపై నడుపుట
    యని విఘ్నములెల్ల బాయ యవనాశ్వంబై !


    జిలేబి

    ReplyDelete

  75. మల్లెలవేళ! మేలగు కుమారుడు! వందన మాచరింపనా
    తల్లికిఁ, బ్రీతి సూత్రమును ధారణఁ జేసెను పుత్రుఁ డంతటన్,
    లల్లిని ప్రేమ యాత్రని భళా కలిసెన్ ముద మారగానతం
    డల్లన పెండ్లియాడుటకు డాయుచు మండప మందు చేరువై!


    జిలేబి

    ReplyDelete


  76. మన కందివరులు :)



    భళ్ళని తెలవారగ కో
    కొల్లలు కైపదపు మాల గూర్చు కవీశుం
    డల్లన క్రొత్తగ, తెల్లని
    తల్లికి కొమరుండు, సూత్రధారణ జేసెన్!


    జిలేబి

    ReplyDelete


  77. అనకొండవలె విడువక న
    ను నీవు కబళించినావు నుకసానపడం
    గ! నెలత నలతలు వలదిక!
    వనవాసమె సంపదను శుభంబు నొసంగున్!



    జిలేబి

    ReplyDelete


  78. అనవరతమ్మ నాగరిక మైన జిలేబుల మై సిటీల వెం
    ట నలతలన్ బడంగ వికటంబయె జీవితమే సభర్తృకా!
    మనమిక శాంతికోరుచు సమాశ్రితమై గడుపంగ మేలగున్!
    వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కు! రా!


    జిలేబి

    ReplyDelete

  79. వచ్చిన స్పందనలు ( కవుల సభలో :))


    కందివారు -


    పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరిచ్చిన లింకుతో 'నవ్వితే నవ్వండి' చదివాను. కాని ఈ 'అడ్డాట' ఏమిటో నాకు తెలియదు. పేకాటలో ఒక్క రమ్మీ మాత్రమే నాకు తెలుసు.


    పోచిరాజు వారు -

    అబ్బో యది చాలా యిష్టమైన యాటండి. దానినే తురఫాట యని కూడా నందురు. అందు జాకీ మణేలాలు (తొమ్మిది) తురఫున నధికములు.
    వర్ష కాలములో మేము చిన్నఁదనమున నుదయము నుండి సాయంత్రము వఱకు నాడుచునే యుందుము. 4, 6 లేక 8 మంది కలసి రెండు జట్లుగా నాడెదరు. ఇందు డబ్బున కవకాశము లేదు.


    జిలేబి

    ReplyDelete


  80. సున్నిత మైన విషయమిది!
    అన్నియు రఘురాముని దయ యంచు మరొక వై
    పన్నియు నాచిన్నప్పుడె
    కన్నవనుచు చెప్పుచుండ్రి ! కాస్త తెలుపుడీ :)


    నారాయణ :)
    జిలేబి

    ReplyDelete


  81. ఇపుడే తెలిసెను జోస్యము
    టపాల్మనుచు విక్రముండటా నార్బిటరుం
    డు పనుపు సిగ్నలు రేపటి
    కి పట్టపగలు పయినన్ టకీల్మని పొదువున్‌ :)


    జిలేబి

    ReplyDelete


  82. మెల్లగ విక్రముని తలము
    నల్లని యుత్పలము దోచె నభమున, శశియై
    తెల్లగ వికసింప శివుం
    డల్లన ప్రాజ్ఞుల ముఖమ్మ డరెను జిలేబీ !


    జిలేబి

    ReplyDelete


  83. చల్లగ పీరుగాంచుచు విచారము తోడుత వున్న వారికిన్
    మెల్లగ చుట్టి యార్బిటరు మెక్కొని విక్రము జాడ చూపగా
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె; శశాంకబింబమై
    తెల్లగ వెల్గె కే. శివుని తేకువ ప్రాజ్ఞుల ధైర్యముల్ సఖీ!


    జిలేబి

    ReplyDelete


  84. మూగ వోయె నేల ముద్దుగుమ్మానీదు
    పల్కు లెల్ల పడతి పద్మ చెప్ప
    వేల కవిత లన్ను వేవేళ నీవేల
    గుమ్మ! సరసి ! పొలతి ! కోమలాంగి :)


    జిలేబి

    ReplyDelete


  85. అసహజ మేమియు కాదోయ్
    అసమాన ప్రతిభ గల జనుల కిది జిలేబీ
    పసగల్గిన విదురులకున్
    మిసిగల్గినవారలకు సుమీ సహజమ్మే ! :)



    జిలేబి

    ReplyDelete


  86. గుడిలో యేముందర్రా
    బడిలోన గలదు బిసాతు పండితులారా
    సుడిగుండములో పడకం
    డి డిగనురుకుల నురుకుచు వడివడిని భువిలోన్ :)


    జిలేబి

    ReplyDelete


  87. కామెంటినాను కనులె
    ర్రై మహ దేవ శివశంకర టపా పై! ఓ
    యీ మానవాధమా చె
    ప్మా మా ప్రశ్నలకు బదులు ! మానిన విడువన్ :)


    జిలేబి

    ReplyDelete


  88. డంబము! కంఠము తనదట
    కంబు సుమీ; ముఖము రతి; సుఖంబును బొందన్
    జంబముగా నయ్యరుతో
    జంబలకడిపంబముగ సుజఘనయె చేరెన్!


    జిలేబి

    ReplyDelete


  89. అంబురుహాక్షి! రావె రమణా! నను వీడకు నీవు నాకు మై
    కంబు సుమీ! ముఖం బతి సుఖంబు సుమీ! రతి నోలలాడ గం
    జంబిక చూపకోయి వనజాక్షి జిలేబి ! సుహాసినీ! ప్రియా!
    డంబమ దేల కంజముఖి!డాయుచు రావె ప్రతీపదర్శినీ!


    జిలేబి

    ReplyDelete


  90. అంబా! బెంగ్లూరుద క
    న్నాంబా! కుశలంబకొ మన నమ్మదె మెట్రో?
    తుంబా చెన్నాగిదె మై
    కంబు సుమీ! ముఖము రతిసు, ఖంబును బొందన్‌:)


    జిలేబి

    ReplyDelete

  91. హరిబాబా మజాకాయా !
    హరి బాబా! మహాకాయా!


    ప్రతి మాటా లెక్కెడతా
    అతిగా అనిపించ వచ్చు హరిబాబుని రా!
    ఉతికేస్తా! హిందూత్వపు
    మెతక మనిషని అనుకొనకు మెడనొక్కేస్తా!



    జిలేబి

    ReplyDelete


  92. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కిక
    రంగీ వలదే మనకు ! తిరస్కారంబా
    అంగడి వారలకు తెలుపు!
    చెంగున రంగమున దూకు సింహంబగుచున్ !


    జిలేబి

    ReplyDelete


  93. ప్రతి యింటా గోమాతను
    వితరణ చేయాలి వారు విధిగా కాపా
    డి తరించగా జిలేబీ
    పితుకగ పాలిచ్చు నదియె విరివిగ సుదతీ !


    జిలేబి

    ReplyDelete


  94. ఓంకారంబన భయపడి
    బింకము ప్రతిపక్షము గొని భీతియు చెందున్
    ఘీంకారంబుల మోదీ
    ఝంకారంబుల తెలిపిరి జర భాయి సునో !



    జిలేబి

    ReplyDelete


  95. సెన్సారు కత్తెరబడునా ? :)


    హుం! బౌబౌయని నావెను
    కంబడ నేల వృకరాతి కలహంసనకో?
    జంబమకో? రుచి నీ మ
    ర్కంబు సుమీ, ముఖము రతి సుఖంబును బొందన్!

    ReplyDelete


  96. మా హరిబాబు కనానిమ
    సూ!హద్దులు సుద్దులు తెలుసు సుమా ! వాయిం
    చే హాండు గలదు తప్పుని
    బాహాటమ్ము సరిజేయు పక్వత గలదోయ్ :)


    జిలేబి

    ReplyDelete
  97. @Jai Gottimukkala
    దొంగచాటున కాషాయ దళంలో పాగా వేసేందుకు వెంకయ్య నాయుడి కొంగు పట్టుకొని కమలం పార్టీలో చేరిన సుజనా చౌదరి & కో.

    hari.S.babu
    రాజ్యసభలో ఆర్టికిల్ 370 రద్దుకీ ముస్లిం మహిళల తూచ్చి విడాకులో హాచ్చి పెటాకులో ఇప్పించటానికి కోరం సరిపోక లాక్కున్నారని (అలా వాళ్ళని లాక్కోకపోయంటే రాజ్యసభలో తగినన బలం లేదనేది సాంకేతికమైన పాయింటు)భాజపా అభిమానియే ఒకరు చెప్తుంటే చదివాను!అసలు నామీద ఈ భూపెపంచకంలో ఏ కోర్టు దగ్గిరా కేసు పడలేదని సుజనాయే బల్లగుద్ది చెప్పేశాడు!అనగా ఈ తొట్టిముక్కల లాంటివాళ్ళకి "దొంగచాటున కాషాయ దళంలో పాగా వేసేందుకు వెంకయ్య నాయుడి కొంగు పట్టుకొని కమలం పార్టీలో చేరిన" భ్రమ పుట్టించారన్న మాట.ఐడీ, ఐటీ, యూటీ, బీటీ దాడులన్నీ ఇటు టీడీపీ వాళ్ళకేమో "అయ్యోపాపం, సుజనా చౌదరి మాత్రం ఏమి చేస్తాడు!గోడ దూక్కపోతే చిప్పకూడు తంటాదేమో - పోనీలే పాపం!" అనిపించ్గాలి, అటు బీజేపీ వాళ్ళకేమో "చహంద్రబాబు మన మోదీని అన్ని తిట్లు తిట్టినందుకు పగ తీర్చుకోవద్దూ, అలాగే చెయ్యాలి - మన నతాల్ చాణక్యం అట్లాంటిది!" అనిపించాలి - అందుకోసం అసలు భౌతిక ప్రపంచంలో ఏ కోర్టులోనూ కేసు వెయ్యకుండా సమన్లు లాంటివేమీ రాకుండా నిఘా విభాగం,మీడియా విభాగం నే రెండు పెంపుడు కుక్కలని ఉపయోగించుకుని చేసిన హడావిడి అది!గోడ దూకుడు పూర్తి కాగానే నిఘా విభాగమూ మీడియా విభాగమూ గప్ హుప్ అయిపోయాయి - కోర్టులో కేసు ఉంటే అంత ఈజీగా ఆగుతుందా?.మోదీ, షా, సుజనా, క్లైసి పబ్లీకునా(ఆ పార్టీవాడే కాబ్ట్టి వె ంకయ్య నాయుడికి కూడా తెలుసనేఅ మ్నుకుందాం, అయితే మాత్రం వాళ్ళ్ళకీ వీళ్ళకీ పరస్పార్ లాభాలు కళ్ళముందు కాంబడుతుంటే సుజనా వెంకయ్య నాప్కిన్ పట్టుకోవాల్సీన అవసరం ఏంటో!) ఆడిన డ్రామాలో ఈ పిచ్చిసన్నాసి గొట్టిముక్కలకి సుజనా చౌదరి వెంకయ్య నాయుడు కొంగుపట్టుకోవడం కనబడింది - వారెవ్వా ఏమి పొలిటికల్ నాలెడ్జి?!

    ReplyDelete


  98. జీవితమునకు లక్ష్యము స్థిరము గాను
    దైవమును గొల్చు టొక్కటె! తపమటంచు
    కోరికల తోడు జీవించి కొవ్వు బట్టి
    దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు!


    జిలేబి

    ReplyDelete


  99. జీవాధారమతండు! లక్ష్యమతడే! చేగూరు మోక్షమ్ము, శ్రీ
    కైవల్యంబది కోరికల్ విడువ సాక్షాత్కారమౌ, మాలినీ
    దైవమ్మున్ గొలువంగ, రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్,
    భావావేశపు చేష్టలున్ తలపులున్ ప్రారబ్ధ కర్మాదులున్ !



    జిలేబి

    ReplyDelete


  100. మైనపు విగ్రహములయిరి
    మా నాయికలరె తుసార్డు మాడపు మేడన్
    చూనాబట్టి జిలేబీ
    యే నాటికి నీవగుదువె యీ మాదిరిగా :)


    జిలేబి


    నేనున్నా "తలయాట్టి", ని
    శానిగ పదియేండ్ల పైన సామీ హెరిటే
    జై నిలబడి నానొక దే
    శాన కనుగొనంగ వచ్చు చట్టున నచటన్!



    జిలేబి

    ReplyDelete


  101. సాహో యాక్షన్ థ్రిల్లరు
    ఆ హాలీవుడ్డు రీతి ఆహ్లాదంబున్
    మాహిష్మతి కథ విజువల్స్
    లా హాయిని గొల్పు చిత్ర లహరి జిలేబీ‌ :)


    జిలేబి

    ReplyDelete


  102. ఏనాటికైన నింగ్లాండ్
    బానిస బ్రతుకే నయమని పలికెను; గాంధీ
    మానక సత్యాగ్రహమున్
    దీనావస్థ తొలగింప తీరుగ చేసెన్ !


    జిలేబి

    ReplyDelete
  103. ఈ సంవత్సరం పద్మ పురస్కారాలకు ప్రపంచ ఛాంపియన్ అంటః పి.వి.సింధు పేరు పద్మభూషణ్ కోసం నామినేట్ చేసిందట కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.సంతోషం.

    అదే బాడ్మింటన్ ఆటలో వికలాంగుల ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన మానసి జోషి, పురుషుల విభాగంలో ప్రమోద్ భగత్ ల పేర్లు కనీసం పద్మశ్రీ నామినేషన్ కు కూడా నోచుకున్నట్లు లేదు.

    నాలుగైదు రోజుల క్రితం ముంబయ్ లో సహారా వారు సభ ఏర్పాటు చేసి సింధుని అభినందించారట. అదే ఆటకు సంబంధించిన వికలాంగ ఛాంపియన్ల ఊసే లేదు (కనీసం వార్తాపత్రిక ఐటెంలో).

    హేవిటో, మనమూ మన ప్రోత్సాహాలూ, ప్చ్ ప్చ్.

    Nominations of sportspersons for Padma Awards

    ReplyDelete
    Replies


    1. సిరి తా వచ్చును చెప్పక
      మరలును చెప్పక మరల తమకు తెలియనిదా!
      పరుగిడు చున్న సమయమిదె
      పరమోత్సాహపు దినములు పరపతి పెరుగున్


      జిలేబి

      Delete


  104. విస్తారంబగును భళా
    పుస్తకములఁ జదువువాని బుద్ధి, నశించున్
    మస్తిష్కపు దుర్బుద్ధియు,
    హస్తమునకు భూషణమది హద్దరి బన్నా!


    జిలేబి

    ReplyDelete


  105. మనసుని గట్టిగ నిలుపుచు
    దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్
    ఘనముగ కాగలరోయ్ ము
    క్తిని కోరుచు విభుని చేర తిరముగ కొల్వన్ !


    జిలేబి

    ReplyDelete


  106. వనితా! గర్వపు మనుజులు
    దనుజులు! హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్,
    వనమాలిని మదితలచు సు
    జనులమ్మ ! నమనము లిడుము జయము జయమనన్!

    జిలేబి

    ReplyDelete


  107. ఇంకగ ధైర్యంబరరే
    జంకు తనకు తానుగ మన సన్నిధి చేరున్!
    ఢంకా మ్రోతల తోడై
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్!


    జిలేబి

    ReplyDelete


  108. లా పాయింటుని పట్టెన
    యా పిండుచు బుచికి అక్షరారణ్యములో
    గోపాలుని భగవద్గీ
    తా పదముల నెల్ల వెతికి తరియించెనయా :)


    జిలేబి

    ReplyDelete


  109. ముంగురులు తాకె నడుమని
    కంగారు పడకు లకలక కంజముఖి సఖిన్
    బంగారమ్మి జిలేబిన్
    చెంగున దూకి యిదె వచ్చి చేరితి నిన్నే :)



    జిలేబి

    ReplyDelete


  110. అట్లాంటావైద్యమిదియె
    ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్!
    తూట్లేమియు పొడవమయా
    గిట్లాంటిది కనివినియెరిగియు నుండరయా


    జిలేబి

    ReplyDelete


  111. అతుకుల బొంతగ వరలెడు
    బతుకున నిలదొక్కుకుని గబగబ జిలేబీ
    అతిగా వాగక యే దు
    ర్గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్


    జిలేబి

    ReplyDelete
  112. సింధుకు BMW కారు బహూకరణ

    2016 Olympics తరువాత BMW కారును ఈ క్రీడాకారిణికీ బహూకరించినట్లు గుర్తు.

    హేవిటో, కలవారికే మరింత కలిసొస్తుంటాయేమో?

    ReplyDelete



  113. అడడా! జిలేబి పద్యం
    బుల తాకిడి సృష్టి గతియె బుచికీ గా మా
    రి లకలక తిరగబడగా
    పడమట నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ గ్రుంకెన్!


    జిలేబి

    ReplyDelete


  114. అడరి జిలేబి పద్యపు సయాటల ధాటికి దిక్కు లెల్ల మా
    రె! డమ డమాల్మటంచును సురీల్మని రీతిని మార్చి జెచ్చెరన్
    పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో
    వడివడి గా కవీశ్వర చివాలున బాళియు మారె చిత్రమే


    జిలేబి

    ReplyDelete


  115. ఆకాశవాణికి పంపినది ( చదువబడెనట :))



    లొడలొడమాటలాడు భడిలుండొక డచ్చట వల్లె వేయుచుం
    డ డవిణ సద్దు తో గడగడాయని మాటలు తారుమారుగా
    వడివడి పల్కగా నరరె వాక్యము వచ్చెనిటుల్ కవీశ్వరా
    "పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో"


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "జిలేబి" గారు,
      "చదువబడెనట" అంటారేం మీరు ప్రతిసారి? ఆ సమయానికి రేడియో పెట్టుకుని మీరే వింటే ఈ "ట" అననక్కరలేదుగా?

      Delete

    2. టాప్ సీక్రెట్టు :)


      జిలేబి

      Delete


  116. వడివడి విమాన మెక్కితి
    పడమట, నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ, గ్రుంకెన్
    జడి బెంగుళూరు నే చే
    రెడు వేళన్ గీము వెడల రివ్వున సుమ్మీ !



    జిలేబి

    ReplyDelete


  117. ఈ మధ్య అమెరికా అబ్బోడొకడు పిలగాడు తెలుగు నాట హోరెత్తిస్తున్నాడని చదివా !



    వడినేర్చిరా యమెరికా
    బుడతలు తెలుగుని వధాన పూర్ణులయిరి; మా
    దుడుకలు మరిచిరి తెలుగుని
    పడ మట నుదయించె నినుఁడు ప్రాగ్డిశ గ్రుంకెన్!



    జిలేబి

    ReplyDelete