కాఫీ కా మింటు రుచియె కాఫి జిలేబీ :)
బీరమ్మినోడు యూకె పోనాడు
కాఫీ అమ్మినోడు కాలవాహినిలో కరిగిపోనాడు
చాయ్ అమ్మినాయిన దేశాన్ని నిలబెడుతున్నాడు !
అయ్యలారా అమ్మలారా
మీ డ్రింకు మీ జీవితాన్ని
నిర్ధారిస్తోంది.
జర బద్రం :)
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDelete+++ "నా వ్యాఖ్ర్య (జై గారికి జవాబు) మూడు సార్లు కనిపిస్తోందేమిటి "మాలిక"లో? అంత నొక్కివక్కాణిస్తోందే?"
కాఫీ , ఆ పై బ్లాకు కాఫీ ఆ పై ఐరిషున్ను ఆ పై జైగారి లైకింగున్నూ అంతగా నొక్కాణించక వుంటుందా మీ కాఫీ కా మింటు :)
జిలేబి
ReplyDelete// "బీరమ్మినోడు ......" //
👌👏
ReplyDeleteజవరాలా! విను! త్వర పడ
క! వినాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్
రవణింపవు! వ్రాయవలెన్
తవణింపగ దేశభక్తి ధరణిని రమణీ !
జిలేబి
ReplyDeleteకవి నానావిధ పర్వుపాసనపు ప్రాకాశ్యమ్ముతో సజ్జనుల్
సువిశాలమ్మగు దేశమందు నిలువన్ చొక్కాటమై సర్వదా
తవణింపంగను విస్తృతమ్ముగ భువిన్ తాత్సార్యమున్ యంకవం
క వినాశంబును గోరి వ్రాయునఁట సత్కావ్యమ్ము సంప్రీతుఁడై
జిలేబి
ReplyDeleteఆకాశవాణి లో చదివినారట!
అవిరామంబుగ వృద్ధిగాంచి జనులే యానందమున్ పొందుచున్
తవణింపంగ విశాల మైన పరిధిన్, తాదాత్మ్యతన్ చెందుచున్
ప్రవిభక్తమ్ముగ మంచి పల్కులమరన్, ప్రార్థించి, స్ఖాలిత్యమున్
కవి నాశంబును గోరి వ్రాయునట సత్కావ్యమ్ము సంప్రీతుడై !
జిలేబి
ReplyDeleteరావాలోయ్ కిక్ బ్లాగు
ల్లో వలసగ రాన్ జనాళి లొల్లిన్ చేయన్
కావలె కిక్కో కిక్కూ
తేవాలోయ్ మళ్లి దాని తేజాన్ని వెసన్ :)
జిలేబి
ఆ కిక్ మళ్ళి వచ్చే సూచనలు లేవు.
ReplyDeleteవస్తుందనే నమ్మకం నాకు లేదు.
ఇదివరలో టపా వేస్తే మూడు నాలుగు గంటల్లో సంకలిను ల్లోంచి వెళ్ళిపోయేది. ముఖ్యంగా కూడలి నుంచి. మాలిక, హారం లలో ఇంకో గంటో రెండు గంటలో ఉండేది. ఇప్పుడు మూడు రోజులు పైగానే ఉంటోంది.
ఇదివరలో కూడలి, మాలిక, హారం రోజుకి రెండు మూడు మాట్లు చూసేవాడిని. ఇప్పుడు మూడు రోజులకి ఒక మాటు. ...... మహా
జనాలు మహా బిజీ అయిపోయారు. ........... మహా
Deleteఏమండోయ్ బులుసు వారు
స్వాతి వీక్లీ వారు హాస్యకథల పోటీ ప్రకటన యిచ్చేరు. మరి ప్రద్యుమ్న ని కొంత పిచ్ చేయకూడదూ స్వాతి పైకి ? ఆఖరు తేదీ august 31st
All the best to Pradyumna for winning laurels in Swathi !
Cheers
జిలేబి
"జిలేబి" గారు,
DeleteI second your proposal.
బులుసు వారు ... పోటీ చెయ్యాలి
బులుసు వారు ... పోటీ చెయ్యాలి
(స్లోగన్ అన్నమాట☝️🙂)
@bulusu
Deleteఆ కిక్ మళ్ళి వచ్చే సూచనలు లేవు.
వస్తుందనే నమ్మకం నాకు లేదు.
hari.S.babu
నన్ను తరిమేశారుగా - పాపఫలం కట్టి కుడపకుండా ఉంటుందా?
నేను మాలికలో ఉన్నప్పుడు ఎంత హుషారు! ఎంత హడావిడి?
అనుభవించండి,మీ ఖర్మ!
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Delete
ReplyDeleteశతకము లెల్లను నేర్పిం
ప తగును పిల్లలకు వారి భవితకు తోడ్పా
టు తరమగు నవియె, శర్మా
జి తెలిపిరి వినవలెను సముచితముగ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteపేరాయెను శ్రీ లావ
ణ్యా రాభా! మరె! పురుషుని నామమ్ము సుమా
వారెవ్వా బెంగాలీ
సారుల పేర్ల గమనించి సాగిల బడుమా :(
జిలేబి
ఆ, నీరసంతో సాగిలబడాల్సిందే.
Deleteపేరే లావణ్య, ఆహా పేరంత అందమైన అమ్మాయి అయ్యుంటుంది అని ఊహల్లో "నౌకా విహారం"(😉) చేస్తూ ఉంటే .. ఓ roly poly మగవాడు వచ్చి హలో, I am లావణ్యొ .. అని చెయ్యి ముందుకు పెడితే (హాండ్ షేక్)... జీవితం మీద విరక్తి కలగదా?
విన్నకోటవారూ,
Deleteపూర్ణశుంఠలు మిమ్మల్ని పిలుస్తుంటే పట్టించుకోవడం లేదేమిటీ ? ఐ ఫోన్ లో సిరితో మాట్లాడుతున్నారట కదా ? ఎవరా సిరి ? ఏమా కధ ?
ఇంకెవరు, చెంచులక్ష్మే. ఏదో సాధిస్తుంటే వినడం.
Deleteఈ "నర"హరి చెట్టులెక్కగలడన్నమాట ! ఎంజాయ్ మాడి :)
Deleteబ్లాగుల్లో అయితే మన రాజ్యానికి మనమే చక్రవర్తులం. ఏ పత్రికకో పంపితే మనం సామంత రాజులం కూడా కాదు. "ఆరు పేజీలకు కుంచించుము. పేజికి ఇరవై ఐదు లైన్లు మించరాదు. వ్రాసేటప్పుడు తుమ్మరాదు" అంటూ బోలెడు నియమాలు. నా వల్ల కాదు. స్వంత దస్తూరి తో వ్రాయాలేమో కూడా. నేను వ్రాసినది రెండు రోజుల తర్వాత నాకే అర్ధం కాదు. అదన్నమాట సంగతి. బ్లాగుల్లోనే అరడజను పేజీలకు తక్కువ వ్రాసిన సందర్భాలు తక్కువే.
ReplyDelete
Deleteఅబ్బే! బ్లాగులోనే టప టపా వ్రాసి దాన్ని ప్రింటు తీసి పంపించేయండి బ్లాగులో పబ్లిష్ బటన్ నొక్క మాకండీ ! రిజల్టు వచ్చేక సందర్భాన్ని బట్టి మీరు పబ్లిష్ చేయడమో లేక ప్రైజొచ్చిందోచ్ అని స్వాతిలంకె ఇచ్చేయడమో చేసేయొచ్చు :)
జిలేబి
ఆరు పేజీలకు మించితే వారు ఎడిట్ చేస్తారు. లేకపోతె మనకి పంపుతారు. "తిరగ వ్రాయుము" అని. ఇదో రకమైన ఒత్తిడి. మొన్ననే మా డాక్టరు గారు BP 160 దాకా వెళ్ళిందని "ఒత్తిడి దరి జేరనీకుము. సిగరెట్లు మాని వేయుము. సున్నుండలు తినకుము" అంటూ పెద్ద లిస్టు చదివాడు. ......... మహా
Delete
Deleteమీరు వ్రాయండి నేను ఎడిట్ చేసి మీకు పంపిస్తా
మీరు రివ్యూ చేసి పోస్టు చేసేయండీ :)
జిలేబి
మహా
Deleteలావణ్య రాభ అస్సామీ కుర్రాడు. ఇంత కధలేదు కానీ, అతను ఇన్స్టిట్యుట్ లో జేరినప్పుడు పరిచయం చేసుకోవడానికి బ్రహ్మచారులందరం లైను కట్టిన మాట నిజం. పేరులో ఏముంది అని నిట్టూర్చిన మాట కూడా నిజం. ......... మహా
ReplyDelete
ReplyDeleteకష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి
నష్టముల లెక్క బెట్టి త్సునామి తీరు
జీవితము దిమ్మ తిరిగెను; చింత జేయ
బతుకు బండి సాగిలబడె భ్రాంతి గూడి
జిలేబి
ReplyDeleteఇష్టము వచ్చినట్లు తమ యిచ్చల తీర్చుకొనన్ తలాకనన్
భ్రష్టయె జీవితమ్ములవి! భాజ్ప విదారక మైన యీ స్థితిన్
స్పష్టము గాను మార్చుటకు చట్టము తెచ్చెను; మీననేత్రులే
కష్టము లెల్లఁ దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్!
జిలేబి
This comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteసభలో కాంగ్రెసు తీరు :)
ఎల్లప్పుడు దేశములో
కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్
తల్లడిలవలె జనాళియు
లల్లాయి పదము పలికె మలక కాంగ్రెస్సూ !
జిలేబి
ReplyDeleteపిల్లా జెల్లెలు రెండు పైబడు తరాల్ విశ్వాసముల్ బోవ యా
అల్లా కావు మటంచు వేడుకొనగా నా కాంగ్రెసీయుల్ సదా
మల్లాగుల్లల బోవ భాజ్ప ధృతితో మార్చెన్ స్థితిన్ తప్పెగా
కల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్!
జిలేబి
ReplyDeleteమా చిలకలు జాంపళ్లని
చూచి కవిత రుచి మరిగి పుసుక్కున కొరికెన్
ఓ చిన రాజా ! పదముల్
దోచెను నాదు మదిని ప్రతి తుంపరలోనన్ :)
జిలేబి
ReplyDeleteఏడడుగుల బంధమ్మది
వేడగ నా తిరుమలేశు వేంకట పతినే
చూడన్ ముచ్చట, వయసౌ
మూఁడేఁడుల పిల్ల కొక్క పుత్రుఁడు గలిఁగెన్!
జిలేబి
"తెలంగాణా చెల్లెమ్మ" (కీ.శే. సుష్మా స్వరాజ్) గారి అంత్యక్రియలకు తెలంగాణా ము.మం. గారు వెళుతున్నారా?
ReplyDeleteచెల్లెమ్మ కాదండీ చిన్నమ్మ.
Deleteతెలంగాణా సాధన కోసం నెత్తిన బోనం ఎత్తిన సుష్మ బతికే కొట్లాడమని యువతకు దిశానిర్దేశం చేసి కోట్లాది మందికి అండదండగా నిలిచారు. పొట్టకూటికోసం గల్ఫ్ బయలెల్లి చిన్నాచితకా పొరపాట్ల మూలాన జైళ్లలో మగ్గుతున్న నిరుపేద తెలంగాణీయులను ఎందరినో విదేశాంగ మంత్రి హోదాలో ఆదుకున్నారు.
కాకతాళీయంగా నిన్న (ఆగస్టు 6, 2019) స్వర్గీయ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి 85వ జయంతి నాడే సుష్మ కాలం చేసారు. ఆవిడ తరువాత విదేశాంగ మంత్రిగా పదవి చేపట్టిన వారి పేరు కూడా జయశంకర్ కావడం మరో coincidence.
ఆవిడకు ఇవే నా జోహార్లు.
జై,
ReplyDeleteపోనీ "చిన్నమ్మ".
మీరు వ్రాసిన విషయాలతో పేచీ ఏమీ లేదు. గల్ఫ్ బాధితులకు సహాయపడిందన్నమాటా వాస్తవమే. అలాగే IPL లలిత్ మోడీకు యూకే నుండి పోర్చుగల్ వెళ్ళడానికి వీసా కోసం మాట సహాయం చేసిందన్న వివాదంలో చిక్కుకోవడమూ జరిగింది. సరే అది తర్వాత సమసిపోయింది లెండి, emergency situation లో అలా చేసిందన్నారు కాబట్టి. ఇవేవీ నేను కాదనడం లేదు. ఓవరాల్ గా ఒక మంచి వ్యక్తి, రాజకీయ నాయకురాలు. ఆవిడకు నా జోహార్లు కూడా.
నా ప్రశ్నల్లా ఒక్కటే - తెలంగాణా వారికి అంత ప్రీతిపాత్రమైన "చిన్నమ్మ" గారి అంత్యక్రియలకు హైదరాబాద్ నుండి ఎవరైనా ప్రముఖులు హాజరవుతున్నారా ... అని (ఢిల్లీలోని తెలంగాణా భవన్ లో కూర్చునే రెసిడెంట్ కమీషనర్ అనే ఆస్ధానవిద్వాంసుడు కాక). మరి తెలంగాణా వారి అభిమానానికి అంత నోచుకున్న వ్యక్తికి ఆ లెవెల్లో నివాళి ఘటించడం సముచితంగా ఉంటుంది కదా. సర్లెండి, సాయంత్రం వార్తల్లో తెలుస్తుందిగా.
నాకు తెలిసిన మేరకు (subject to correction) లలిత్ మోడీకి సాయం చేసింది వసుంధర సింధియా అనుకుంటా.
Deleteఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధి "ఆస్ధానవిద్వాంసుడు" అని గేలి చేసి తీసి పారేసే స్థాయి కాదు. ఆయన ప్రధాన బాధ్యతే రాష్ట్ర ప్రతినిధి కదా. How can it be wrong for a designated state representative to represent the state?
తెరాస పక్షాన పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు సుష్మ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ప్రోటోకాల్ ఇదేనేమో.
తెలంగాణాలో ఏదయినా విద్యాలయానికి ఆవిడ పేరు పెట్టుకొని సత్కరించాలని కొందరు కోరుతున్నారు. ఇది జరిగితే సంతోషమే.
ReplyDeleteఓ తరుణీ ! పెండ్లాడెను
గా తొయ్యలి శంకరుని సుఖమ్ము బడెసెనా ?
ఏతావాతా ఓ మా
మా! తను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్!
జిలేబి
ReplyDeleteబూరెల సంగతి తెలియదు
జోరు జిలేబీల మస్తు జుమ్మని చేయం
గా రాణించున్ పదముల్
రారమ్మా అక్షరమ్ము రవణింప సుమీ :)
జిలేబి
ReplyDeleteచూతము రమ్మ యీశ్వరిని! సుందర మూర్తిని పెండ్లి యాడె! ర
మ్మా, తను భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్,
చేతనుడాయె నాతడె ప్రచేతము తోడుత రమ్మ కొల్వగాన్
భ్రాత వినాయకుండితడె పల్కుము జోతల జై గణేశ! జై!
జిలేబి
ReplyDeleteచిలుకల చూస్తూంటే నే
కిలోల కొలదిగ చికెను టకీమని నోరూ
ర లబక్కని లొట్టలు వే
య లబ్జుగా దోచె నాకు యమహో యమహా :)
జిలేబి
ReplyDeleteరాజీ నామా చేయడ
మే జయ ప్రాకాశు తప్పు మెప్పును పొందే
యే జయమున్ తన కందలె
బాజారున పడుట తప్ప పరిపక్వముగా !
జిలేబి
జిలేబీ గారూ, జాగ్రత్తండీ అసలే "శ" వెర్సిస్ "ష" గొడవలు చెలరేగుతున్నాయ"ష"!
ReplyDelete
ReplyDeleteఅలుకలు కౌతుకములతో
లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్;
వలయును సద్భక్తియు కా
వలయు నిబద్ధతయు లక్ష్మి వరల గృహమునన్!
జిలేబి
ReplyDeleteమూలంబెద్దియొ దాని కెల్లపుడు నామోదంబు దక్కున్ భువిన్
స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వ, రా దెన్నఁడున్
బాలా వ్యర్థపు కష్టనష్టములు; సౌభాగ్యమ్ములున్ శోభలున్
బాలారాజము గాను వెల్గు నెపుడున్ కంజారమే స్వర్గమౌ!
జిలేబి
ReplyDeleteజాగర్తండోయ్ ! అసలే
బాగా గొడవలయె శ ష ల పయినండి జిలే
బీ గారు! మీరు కూడా
ఆ గడబిడిలోన చిక్కి యావిరయేరూ :)
జిలేబి
ReplyDeleteచిలుకలను చూడగా వి
హ్వలులవగా కోడి పిల్ల లన్నియు ను తలం
పుల జొచ్చెన సూర్యాజీ!
చిలిపి తలంపులు మరే ప్రచేతన మయెనా :)
జిలేబి
ReplyDeleteఅంతేమి సీను లేదం
డింతకు మనమనుకొనిన బుడిగి కత వారున్
కొంతైనన్ తలచిరకో?
కొంత సమయమింక నేను కోరెద చెప్పన్ :)
జిలేబి
ReplyDeleteకొందరి యభిమతమది తా
నందరి లాంటి మనుజడని నమ్మక తామై
బిందాసగు జీనియసని
క్రిందా పైనపడి చెప్పిరి జయ ప్రకాశున్ :)
జిలేబి
ReplyDeleteచదివితిమి తెలుగు మీడియ
ము! దరిమిలా మా గురువులు మోదముతో నే
ర్ప దిగంతములను తాకెను
పదిలముగా నేర్వ తెలుగు పరిపక్వతతో :)
మహా దహా :)
జిలేబి
ReplyDeleteహెరిహెరి మరేమి టో మా
కు రవంతైన అవగతము కుదరలె సుమ్మీ
సరె! అస్సామీసగునో
మరి కాదో తెలియదమ్మ మాకు జిలేబీ :)
జిలేబి
అర్ధమేమిటో చెప్పకుండా ఈ "హోరా హోరీ" ఏమిటండీ "జిలేబీ" గారూ?
ReplyDelete
ReplyDeleteభాషాయోషకు వచ్చెను
శోషయు నరరే జిలేబి సోకులు మాడన్
" బాషా యాస" తెలంగా
ణా"ష! వివరములకు లంకె నరె చూడాలే :)
https://www.youtube.com/watch?v=f2eibTZQNbI
జిలేబి
ReplyDeleteఉత్తమ నటి కీర్తి సురేష్!
నెత్తావిగ వెల్లివిరిసె నేర్పును చూపిం
చత్తరి సావిత్రిగ నొ
క్కత్తయె తెలుగు సినిమా ముఖమ్ముగ నిలిచెన్!
జిలేబి
ReplyDeleteవస్తుతః జిలేబి వస్తువు విలువ తె
లియగ వచ్చు నదియె లేని క్షణము
నటులె నిక్కమమ్మ నమ్మదగు! విలువ,
కలిమి దొలఁగినపుడె, కలుగు సుఖము !
జిలేబి
ReplyDeleteఇల కన వచ్చు ద్వంద్వములు;యిమ్ముగ గాన్పడు హాయిహాయిగా
మిలమిల లాడు నీ బతుకు మిక్కిలి రక్షణ దోచు చేరగా
కలిమి; దొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్
విలువలు చేరి జీవితము విస్తృత మై వెలుగున్ విచిత్ర మై!
జిలేబి
ReplyDeleteఆకాశవాణి కి పంపినది చదువబడెన(ట) !
అలవియె లేని భోగముల హర్నిశలున్ కొనియాడు సేవకుల్
తలచిన తక్షణమ్ము తమ దాష్టికమెల్లెడ చూప గల్గు వా
రల తల రాత చిత్రము! పరాత్పరు చింతన ప్రాప్తియౌత, యా
కలిమి తొలంగి నప్పుడె సుఖమ్ము లభించును మానవాళికిన్!
కలిమి - అతిశయము
జిలేబి
ReplyDeleteజైమిని యనగా నేమ
య్యా? మాకుతెలియదు! జమున యనబడు శుక వా
ణీమణికి కొమరు డేమో!
సామీ! మీరేమన నది సరిసరి సరియే :)
జిలేబి
ReplyDeleteఅరరె! చెవిని చేయు నల్లరి గుయ్యు మ
టంచు విడువ దాయె టక్కరివలె
చూడ చూడ నొడలు జుయ్యిజుయ్యిమనును
భామ కంటెఁ జిన్నదోమ మిన్న!
జిలేబి
ReplyDeleteతేమయెక్కువ గాన వచ్చును దిక్కుదిక్కులు గుయ్యనన్!
భామ కంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్
దోమజొచ్చుచు కర్ణపేటిక ధూముధామని చేయగా
రామరామయటంచువేయగ రచ్చచేయుచు చచ్చునే
జిలేబి
దోమ రొద, భామ పోరు .. రెండూ రెండే నండీ :)
ReplyDeleteచెప్పులోన రాయి చెవిలోన జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ వినుర వేమ
ReplyDeleteదోమ రొదయు భార్య తోముడు రెండునొ
క్కటె! పడతుక, విన్న కోట రాయ
పల్కు విను! జిలేబి భామ మించు పతిని
భామ కంటెఁ జిన్నదోమ మిన్న!
జిలేబి
ReplyDeleteవేము మాదిరి మాట ఘాటగు విప్లవాంగి జిలేబి! యా
భామ కంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్
జామురాతిరి చెంతచేరుచు చాటుగా మరి మాటుగా
గోముగా తన వంతుగా మన గూబగుయ్యన మ్రోగునే :)
జిలేబి
మా అయ్యరు గారి మాటగా :)
ReplyDeleteకాక - తాత - పాప - మామ
పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
శూర్పణఖ మాట గా
మా మనసును దోచిన ధీ
రా! మనువాడెదము వీరుడా! కాకడతో
టై మదిమది తాతనముగ
నా మగనిగ పా! పద! లలనను వలదనకోయ్!
జిలేబి
ReplyDeleteకరివే పాకుకు కలదోయ్
మరి యిష్టాయిష్టముల్ తమకు నచ్చినచో
సరి విచ్చును వృక్షముగా
మరి ఊపందుకొనవింక మదిలేకున్నన్ :)
జిలేబి
ReplyDeleteజీవితపు మత్తు లో ప
ద్మా వరలుచు తూగుటే ప్రధానమనెదరా
తావిని చేర్చిరి పదముల
తో విరివిగ చిత్రమైన తోరణములతో !
జిలేబి
ReplyDeleteజీవితపు మత్తు లో ప
ద్మా వరలుచు తూగుటే ప్రధానమనెదరా
తావిని చేర్చిరి పదముల
తో విరివిగ చిత్రమైన తోరణములతో !
జిలేబి
ReplyDeleteనేర్చు కొనవచ్చు ఛందము
పేర్చుచు పేర్చుచు పదముల బెదుర వలదయా
నోర్చుకొనుచు సరి జేతురు
కూర్చుట యెటులో తెలియును కుదురుగ వచ్చున్ !
జిలేబి
ReplyDeleteనో ఫర్దరు కామింటై
నా ఫార్ నౌ నెయిదరోకె నార్ డిఫ రింగూ
ఐ ఫార్ ఒన్ ఔట్ ఆఫ్ దిజ్
సో ఫార్ నాన్ సెన్స్ కమింట్సు సో పొండర్రా :)
జిలేబి
బాగా ఆంగ్లీకరించారు "జిలేబి" గారూ - అదిన్నూ పద్యరూపంలో, వాహ్ 👌.
Delete
ReplyDeleteభెరి భెరి కాంప్లికేటడు రిలేషన్ షిప్పు మామకుమామ శ్రీమన్మహావిష్ణువు
శ్రీమతి తోయరాట్టునకు చెన్నుకొమార్తె! సముద్రుడైన నా
మామకు భార్య గంగను కొమార్తెగ గాంచిన విష్ణుడాతడౌ!
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్
రామను భార్య గానిలిపి రాజిలె పృథ్విని వేంకటేశుడై!
జిలేబి
Deleteరామను భార్య గా నిలిపి రాజిలె పృథ్విని వేంకటేశుడై!
శ్రీమతి తోయరాట్టునకు చెన్ను కొమార్తె! సముద్రుడైన నా
మామకు భార్య గంగను కొమార్తెగ గాంచిన విష్ణుడాతడౌ!
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్
జిలేబి.
ReplyDeleteవేపాకు నమిలి నట్లుం
డే పద్యముచదివి డోకుడే వచ్చె జిలే
బీ పాసగూల ! యేలా
మా పాడెను గట్ట వ్రాయ మరి వచ్చితివో :)
జిలేబి
ReplyDeleteమామకు మామ !
జామాతయతడు సంద్రుని
కై, మామ సతిని కొమార్తె గా బడసె నహో
నామాల సామిగ వెలసె
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్!
జిలేబి
ReplyDeleteనీహారిక గారి హవా
ఆహా! తగ్గెను కమింటులసలే లేకన్
ఓహో బ్లాగ్సన్యాసమ
కో? హా! యేమాయె బో పకోడి జిలేబీల్ :)
జిలేబి
మొన్నామధ్య పవనుడి బ్లాగ్ లో మీరావిడను దృష్టిలో పెట్టుకుని ఏదో అన్నట్లున్నారు కదా? అందువల్లనేమో?
ReplyDelete
ReplyDeleteబాంధవుడా మాధవునే
సంధింపగ మన్మథుండు, సల్లాపములన్
బంధింపంగను చెలులే
బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్!
జిలేబి
ReplyDeleteఏవిటో జిలేబి జీ! బ్లాగునగరిని
నొక్క రొక్కరుగ వదులుట! శర్మ
గారు కూడ మూత గట్టిగ పెట్టిరి
వ్యాఖ్యలకు తలమ్ము వట్టి పోయె!
జిలేబి
ReplyDeleteమతమది కాదోయీ జీ
వితమునకు విధానమును పవిత్రము గా తె
ల్పుత! హిందూత్వమదియె! భా
వి తరములకు పట్టుగొమ్మ విశ్వవిధాతౌ !
జిలేబి
ReplyDeleteవందే మాతర మనుచున్
వందన మిడు భరతభూమి వర్ధిల్లంగన్
బృందావనమిది పృథ్విని
పంద్రాగష్టుకు నమామి పరిపూర్ణముగా !
జిలేబి
శుభాకాంక్షలతో
ReplyDeleteఅదిగో యల్లది గో త్రివర్ణముల జెండా! భారతాంబన్ ధ్రువ
మ్ము దృఢమ్మై తను రక్ష జేయు నమనమ్ముల్ తోడు వందే యనన్
పదిలమ్మై నిలువంగ జైయనుమికన్ ప్రాబల్యమై భాజపా
విదురుల్ డెబ్బది యేండ్ల నాటి వెతలన్వీగింప కష్మీరమున్
జిలేబి
ReplyDeleteతొలగెన్ తలాకు కాష్మీ
రుల వెతలు త్రివర్ణమున కరుగ డెబ్బది యే
ళ్ళలజడి తొలంగు జయహో
బలమ్ముతో భరత భూమి ప్రబలమవంగాన్!
జిలేబి
ReplyDeleteబలముగ నెక్కొని కలుప న
దులన్ భరతభూమి నేటి దురితములు తొలం
గు! లపితములాడి రాష్ట్ర
మ్ములు చేర మన ప్రగతి పథము వెలుగు నొందున్
జిలేబి
ReplyDeleteట్రిలియన్నైదను డాల
ర్లిలలోన యెకానమీగ రివ్వున నెగురన్
బలమును పుంజుకొనెదమిక
వలాకముగ భరతభూమి ప్రాపు పెరుగగాన్
జిలేబి
ReplyDeleteఅభియానమ్ముల తోడై
యభిమానమ్ములను తెలుపు మమ్మ జిలేబీ
ప్రభవింపన్ మన జెండా
కభివందనముల తెలుపు ప్రగతి మనుగడగా!
జిలేబి
ReplyDeleteజలజీవన్ అభియాన్ !
భారత భూమి నేడు తన భాగ్యపు రేఖను డెబ్బదేండ్లుపై
ప్రేరణ గాంచి మార్చుకొను వేళ జనాళికి నీటియెద్దడిన్
తీరిచి జీవితమ్మున ప్రతీకము గా జల మెల్ల గీములన్
చేరగ, రండి రాష్ట్రముల జియ్యలు! కట్టుగ మోడితోడుతన్!
జిలేబి
ReplyDeleteమరువగ నేతలెల్ల యిది మన్నిక గాంచిన వేద భూమి యం
చు రవము తోడు మోడి భళి చువ్వన తేజము జేర్చి కాలు మో
ప రవళి తోడుగా జనుల భాగ్యము మారె విధాత రాతగా
పరుగిడి రండి జైయనుచు భారత భూమిని ముద్దులాడ గన్!
జిలేబి
ReplyDeleteవేద భూమికి ప్రగతికి వేడుకలమ
రంగ పండుగ! జెండా తిరముగ నెగుర
రంగి రావె రాట్నమ్మును రయ్య నంగ
త్రిప్పి ఖాదీ మనదను ప్రతీక గాన !
జిలేబి
ReplyDeleteఅదిగొ జొమేటో అమెజా
నదిగో వాల్మార్టికియ! మనకికన్ షాపిం
గిదిగిది గో! మువ్వన్నెలు
పదిలంబుగ "మేను మరియు వైల్డనగ నమో!
జిలేబి
Deleteఅదిగొ జొమేటో అమెజా
నదిగో వాల్మార్టికియ! మనకికన్ షాపిం
గిదిగిది గో! మువ్వన్నెలు
పదిలంబుగ "మనిషి మరియు వన్యమ" న నమో !
జిలేబి
ReplyDeleteఎర్ర కోట పైన నెక్కి త్రివర్ణ ప
తాక మెగుర భారతాంబ ముద్దు
బిడ్డ మోడి తాను పేర్మిని చూపెను
భరత భూమి కీర్తి ప్రాపు జేయ !
జిలేబి
ReplyDeleteఇవ్వాళ మోడీ భజన మరిన్ను మువ్వన్నెల జెండా భేషుభేషుల జిలేబీలు మరీ యెక్కువయి పోయె కాబట్టి ఆఖరుగా మత్తకోకిలతో బైబై :)
పారివారపు గోలలెల్లను భ్రాంతివీడుచు పోవగా
భారతాంబకు భాజపాయను పార్టినేతగ మోడియే
ధీరుడైన ప్రధాని గా భళి దిక్కుదిక్కుల చూపగా
మారె రాత జనాళికెల్లను మంచిరోజులు చేరగా!
జిలేబి
ReplyDeleteఅరిగె నెరేజరు పెన్సిలు
సరిగా వ్రాయంగ జనుల సమ్మతముగనన్
పరిచయమిదియె తలా తో
క రవంతయు లేని కతకు కంద జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఇంద్రు డే యంపగా వచ్చె నింద్రియముల
ధాటి పెంపున నేర్పనాదటను నలిని
గాధిసుతునకు మేనక! కన్నతల్లి
యయ్యెను శకుంతలకు ప్రణయపథమందు!
జిలేబి
ReplyDeleteఒకరిక్కడడిగి నార
చ్చికబుచ్చిక గలదకో యిసియిలునకున్ మీ
కు? కమింటుని తా ప్రచురిం
పక చెప్పిరవుననుచున్ సభని మోదముతో :)
జిలేబి
ReplyDeleteరాయంగ పొద్దు గూకల
నాయాసము గబ్బయెను సునాయాసముగా
గీయన్ పెన్సిలు లబ్బరు
సాయము గైకొనక సూవె జైగొట్టనుపో :)
జిలేబి
ReplyDeleteవేలుపు ఱేడు గాభరని వెల్లువ మీరగ నాట్యమాడుచున్
వాలుచు మీద మీద తన వాల్జడ ధాటిని పంచె నర్మిలిన్
మేలుగ గాధిసూనునకు మేనక! తల్లి యగున్ నిజంబుగన్
తేలగ ప్రేమ మార్గమున తెమ్మర వీచి శకుంతలన్ గనన్!
జిలేబి
ReplyDeleteమన జెనరేషన్లో లే
వె నాంచుడు వ్యవస్థ మరియు విన్యాసాల్! ఈ
జెనరేషన్లో నరరె వె
త! నడ్డి విరగ పిల వాండ్ర తలలను తినిరే!
జిలేబి
ReplyDeleteడ్రోను లెగిరె కెమెరాలన్
మా నారా చంద్రబాబు మాన్యుని తలపై
యీ నాటకమ్ము నెవరో
యీ నడిపినది ? తెలియవలె నిప్డె జిలేబీ :)
జిలేబి
ReplyDeleteకవిమిత్రులార! ఆకా
శవాణి కార్యక్రమపు దెసయిపుడె ముగిసెన్
భవదీయుడు కలిసి హితుని
కవాడి గూడాని, చేరె గయమిపుడె సుమీ !
జిలేబి
ReplyDeleteరేపిక భద్రాచలమున
కై పయనము పుస్తకమ్మొకటి విడుదలగున్
నేపాల్గొనెద సభని; ఈ
నేపథ్యమునందు చూడ నే వసతి యు లే!
జిలేబి
Deleteకావున పరస్పరమికన్
నావలె గుణదోషములను నచ్చిన రీతిన్
మీ వసతిని బట్టి గనుడి
నా వీలునుబట్టి చూతు నా బ్లాగునికన్ :)
జిలేబి
ReplyDeleteనీవడిగిన ప్రశ్నలకిక
నే వరుసగ బదులు చెప్ప నీకేమొరుగున్ ?
నీవాహినిదాటన్ మరి
నీవే యతనమ్ము చేయ నీకగు మేలౌ !
జిలేబి
ReplyDeleteహారన్ల మహానగరము :)
హారన్ కొట్టుచు బోవుట
ఓరయ్యో జన్మ హక్కురో పలువిధముల్
హోరని మ్రోతల తోడై
హోరాహోరిగ చనెదమహో సాహోరే :)
జిలేబి
ReplyDeleteఅవునండీ సరదాగా
రవంత సొగసుగ లిరిక్కు రాంబాణంలా
కువకువ లాడుచు సాగు భ
ళి వస్తుతః సునిశితము భళీ చాతురియున్
జిలేబి
ReplyDeleteపోరలము! రయ్యనగ మా
హారను మ్రోతలకు తోడు హాహా కారాల్
భారద్దేశపు ప్రగతికి
సోరణి దివ్వెల వెలుంగు సొబగు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteధోతిని వెంకయ నాయుడు
నేతగ యెస్తొనియ లితువెనియ లాత్వియలన్
సాతమిరు దేశములకై
లాతన వెడలిరి జిలేబి లాభమ్ము గనన్ !
జిలేబి
ReplyDeleteభద్రము శ్యామలరాయా!
భద్రాచల విభుని నమ్మి పాడౌతారో ?
ఛిద్రమయె రామ దాసుడె!
భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్!
జిలేబి
ReplyDeleteభద్రము రా సుపుత్రుడ! గభాలున నమ్మకు రాములోరినే!
ఛిద్రము నమ్మి రాఘవుని చిక్కెను రావణు చేతి సీతయే
ఛిద్రము రామదాసుడయె చీకటి రాత్రుల లెక్కబెట్టెరా!
భద్రగిరీశునిన్ గొలుచు భక్తులకున్ జెరసాల దక్కురా
జిలేబి
ReplyDeleteనిద్రను వీడుము దుష్టుడ!
ఛిద్రంబయెదవు నిటుల వచింపగ ధూర్తా!
క్షుద్రపుటాలోచన ! యే
భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ జెరన్?
జిలేబి
ReplyDeleteభద్రంరాకొడుకో! దెస
భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ, జెరన్
క్షుద్రులకు కింకరులగు ద
రిద్రులకున్ తానొసగు పరిత్రాణమునన్!
జిలేబి
ReplyDeleteటాపరవటమ్ము కన్నా
టాపరు పిలగాడినే పటాయించి జిలే
బీ పబ్బముగడుపు కొనా
లే పడుచుదనంబదేను లెమ్మా బొమ్మా :)
జిలేబి
ReplyDeleteకొండల వాలు తీరమున కోరిక తీరగ మేడ కట్టగా
మెండుగ కృష్ణ పొంగుచు మమేకము చేయగ బాబు మేడనే
దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో
గండర గండుడా జగను గట్టిగ డ్రోనుల నంపి బట్టెనే!
జిలేబి
ReplyDeleteఏ పేపరు చూసినా యిదే మాట!
దొరకదే త్రాగను జిలేబి దోసిలికి క
లికపు మంచి నీళ్లకట! ఫలితమిదియె సొ
రాజ్జెమున డెబ్బదేండ్లపై రాష్ట్రమందు!
వాన లెన్నియో కురిసె పిపాస పోదు!
జిలేబి
ReplyDeleteవండుట కైన లేదరరె భారత దేశము లోన మంచినీ
రండి జిలేబి గారు! మన రాష్ట్రపు తీరును చూడుడీ సదా
దండుకొనంగ గద్దెపయి ధాటిగ కూర్చొనునాయకుల్ సుమా!
దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో
జిలేబి
ReplyDeleteబిపాస బసు బసననీకే :)
నాయకుడదిగొ వచ్చె విన్యాసములకు
బాలి వుడ్డిది సరసకు భామ పోవె!
వాన లెన్నియో కురిసె! బిపాస పోదు
నీ బడాయి బసుబసననీకు సోకు !
జిలేబి
ReplyDeleteచదివా నే వాట్సాప్లో
కుదురుగ స్మార్టైన పిల్ల కువకువ తోడై
బదులిచ్చెను టాప రిని ము
కు దాడు నట కట్టివేయు కూయక మునుపే :)
జిలేబి
అంతేగా మరి, తెలివంటే అదేగా మరి 🙂.
Delete
ReplyDeleteఅంతేగామరి ! గెలువగ
నింతుల సమమగునకొ భువిని జిలేబీ మా
కింతయె దక్కెను రాతయు
సుంత కనికరము విధాత చూపె చలువగా :)
జిలేబి
ReplyDeleteతెలివంటేను మరియదే
లలనల గెలవంగ మా వలనగునకో! బే
లల సాటిగ మేమిక మా
టలాడ గలమా జిలేబి టక్కరి బామ్మా :)
జిలేబి
ReplyDeleteతెప్పలతో నీళ్ళను ఓ
యప్పా మళ్ళించ కుదిరినన్ ప్రాజెక్టుల్
ముప్పల తిప్పల తోడై
డప్పా కొట్టుకొని చేయు డంబాలేలా :)
జిలేబి
ReplyDeleteనా రాముని పద్యమ్ముల
నే రాసుకొనెద చదివిన నేమి చదువకన్
ఆ రాజకీయ రొచ్చుల
జోరు జనులు బోవ లాగి చూడండననా ?
జిలేబి
ReplyDeleteఅంఘ్రియ నగ పాదమ్మగు
నంఘ్రిద్వంద్వమ్ము రెండనన్ పాదములౌ!
అంఘ్రుల బడెద నెటులయా
అంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్ ?
జిలేబి
ReplyDeleteఅంఘ్రిన్జాతము! గంగయై పరుగు తానాంధ్రావనిన్గోలగా
నంఘ్రుల్మ్రొక్కగ రాజమండ్రిని సుదానంబై తలిర్చెన్ భళా
నంఘ్రుల్లేకయు కృష్ణవేణిగను విన్యాసంబులన్తోడుగా
నంఘ్రిద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్!
జిలేబి
ReplyDeleteమావూళ్ళో నండయ్యా
ఓ వనితామణియె మనసు నొచ్చేసుకునే
నీ వాట్సప్పుమెసేజిని
దావానలమువలె చూచె తరుణుల పైనన్ !
జిలేబి
జనాల్లో హాస్యప్రియత్వం కనుమరుగవుతోందా అనిపిస్తోంది "జిలేబి" గారూ. వ్యాపార సంస్కృతీ ప్రభావమా?
ReplyDeleteమేం (మిమ్మల్ని కూడా కలపవచ్చా 🙂?) యువకులుగా ఉన్న కాలంలో angry young man అనేది ప్రాచుర్యం పొందిన ఒక ధోరణి. అయినా కూడా హాస్యాన్ని బాగానే ఆస్వాదించేవారు. ఇప్పుడేమో చీటికీమాటికీ "మనోభావాలు" దెబ్బ తినేసాయి అనడం ఒక ఫ్యాషన్ లా తయారయినట్లుంది (రాజకీయం చేసేవారికి అదొక ఆయుధం కూడా లెండి) 🙁.
Deleteహాస్యప్రియత్వమునరరె
నస్యపు పొడిపీల్చుటవలె నాట జనులు వై
రాస్యతని జూచిరే! ఔ
రాస్యపు చెణుకులకు చెల్లె గా కాలమహో!
జిలేబి
ఇప్పుడు angry young man ఫాషన్ పోయింది, ఇవి angry *old* man & angry young *woman* రోజులు. ఈ దశ కూడా పోయి "happy all folks" కాలం రావాలని కోరుకుందాం.
Delete
Deleteయాంగ్రీ ఓల్డ్మేనుల నా
యాంగ్రీ యంగు వుమనుల భయానక టైమౌ!
జాంగ్రీ జిలేబులై తమ
యాంగ్రీతనము తొలగ సమయమగు! సయిపుడీ!
జిలేబి
ReplyDeleteబూజొదల తరమ్ముల స్క్రూ
లూజు సరియవన్ జిలేబులు సుమా మారన్
నే జైగొట్టిని చెప్పెద
రోజులు గడవాలె కొంత రూల్స్మారాలే :)
జిలేబి
ReplyDeleteమంచి సినిమా యిదండీ
కొంచెము కామెడి జతన్ పకోడి జిలేబీల్
పంచెడు హీరోయిన్నూ
మించారు డిటెక్షను తధిమితకట మ్యూజిక్ :)
జిలేబి
ReplyDeleteఏమిటంటిరి ? కవివర! యెటుల యెటుల
మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట?
ఇట్లు పలుకుట తగునయ్య? యింపు గాను
లేదు వినుటకు వలదిది లెస్సగాదు !
జిలేబి
ReplyDeleteజాకిర్నాయకు దువ్వన్
యాకు పలుకులన్ మలేషియా నిదురన్ వీ
డే! కానీ మన దేశపు
తోకల్ వాడిని వహవహతో గొల్తురుగా !
జిలేబి
ReplyDeleteసింపుల్విషయముల భళా
యింపగు కైపు కతలన్ మయియు తూలె పవన్
బంపరు లాటరి కతలివి
సొంపుగ సాగెను విషయము సొబగుల తోడై :)
జిలేబి
ReplyDeleteతలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్
వలదే పోవలదే షికారుకు జనావాసంబు తీవ్ర్రమ్ము! ఓ
వలపైనాచిన దాన! మాట వినవే వయ్యారి పూబోడియా
కలలో తేలుచు ట్యాంకుబండు వెడలన్ కారెక్కు రావేసఖీ !
జిలేబి
This comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteఅమరావతి భవిష్యత్తు :: సూచనల రాక
... ఇవాళ్టి (21-08-2019) "ఆఃధ్రజ్యోతి" దినపత్రిక (హైదరాబాద్ ఎడిషన్) మొదటి పేజ్ లో వార్త 👇.
This news will surely make some adversaries of Andhra jump with joy?
"అమరావతి .. అంతేనా?"
Deleteసమ్ అడ్వర్సరీస్ అని సూక్షి చేయనేల ? డైరెక్టు గా పేరు చెప్పేయ రాదూ :)
హు హు
జైలేబి
This comment has been removed by the author.
Deleteలౌక్యం ఆండీ లౌక్యం🤘. ఎవరైనా భుజాలు తడుముకుంటారేమో చూద్దామని 😉.
Delete
Deleteఎవరైనా భుజముల తడి
మి, వార్ని నన్నే యనుకొని మీద పడుటనే
ను వసతిగా తప్పుకొన తె
లివిగా నా వ్యూహమిద్ది లెమ్మ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమారగ రాజమరావతి
చేరె సమీక్షలకు నెలవు సింహపురీశా
ఈ రాజ్యమ్మును నమ్మితి
వే!రాత్రికి రాత్రి మారె విధి ఈశ్వరుడా!
జిలేబి
ReplyDeleteతెరపడె హైడ్రామాకున్
పరపతి కొరకై తపించి పట్టుబడి చిదం
బరులు లిబర్టిని పొగిడిరి
కరుణన్ చూపదగు ఈడి కర్తవ్యముపై :)
జిలేబి
ReplyDeleteబాలా! బతుకగు శూన్యము
కాలాతీతమునఁ, గలుఁగుఁ గద సత్ఫలముల్
మాలిని! సరియగు వేళని
చాలిక తో చేయగ పని చక్కగ నెపుడున్!
జిలేబి
ReplyDeleteమన సఖి గురించి వ్రాయం
గను పోస్టును బ్లాగులోన గట్టిగ నచ్చం
గను మీకు ముదావహమయె!
మనదైన దెపుడును లలితమైనది సఖియా :)
జిలేబి
ReplyDeleteవిన్నాను బండివర! బా
వున్నాయండీ ఖయాము ఉమరుని పాటల్
చెన్నగు హీరోయిన్లున్
మిన్నగ కదులాడిరి తధిమి తకట తకటా !:)
జిలేబి
ReplyDeleteపాలిక లేలు మ్యూచువలు ఫండు జిలేబుల చేర్చు దండిగా
చాలిక మాది! డబ్బులను చక్కగ పోయుడి స్టాకు మార్కెటున్
తేలిక తో జయించెదరు! తెండు దినారము లెల్ల నిప్డె! పో
గాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్!
జిలేబి
ReplyDeleteచాలదు తీరదు మోహము
తేలిక పడు మానసమ్ము తెమ్మర వీచున్
మాలిని చేరువ తెలియని
కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్
జిలేబి
ReplyDeleteచాలిక! మోదీ ప్రభుతన్
త్రోలిరి ఈడీ చిదంబరుని సీబీయై
పాలికి ! భళిరా యైనన్
కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్!
జిలేబి
ReplyDeleteగోలా వినవే! వలదన
కే లలనా!పిల్లలు మన కెంపులవుదురే!
గ్రోలెదమిక రమ్మ సుధల
కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్!
జిలేబి
ReplyDeleteమేలౌ ఫ్రాన్సు ప్రయాణము
మేలౌ యూయేయి పయనమే! బెహరెయినౌ
మేలు మనకు వెళ్లెదనిక
కాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్!
జిలేబి
ReplyDeleteకథనమ్ము పై న స్పందన
కథపైన చమకుల వ్రాయు కామింటరు! మీ
రథబడబాన్యాయము మా
కథలకు చేర్చెను మహత్తు గట్టిగ సుమ్మీ !
జిలేబి
కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
ReplyDeleteకృష్ణం వందే జగద్గురుం
Deleteమీకున్నూ కృష్ణాష్టమి
కై కామనలివియె రాయ! కామింటుల రా
యా! కోటగ భళి చేర్చిరి
జోకుల్ జతలింకులన్ ప్రజోపహితముగా!
జిలేబి
ReplyDeleteతెల్లగ చంద్రుని చూచుచు
చల్లని కిరణముల తోడు సఖితోడై మే
నెల్ల పులకించెడు జనుల
కల్లన డొల్లలను చూపె గా చంద్రాయన్ :)
జిలేబి
ReplyDeleteమా కృష్ణుని కిప్పుడె రా
యా కొంచెమిక తెలవారె! యవనారి యిదే
మీ కొరకువచ్చె నరస
న్నా! కానుకలిచ్చి వందనమ్మనుడయ్యా!
జిలేబి
ReplyDeleteఱరలన్ సామీ యేదం
డరయన్ వాడ వలె చెప్పు డయ్యా జైగొ
ట్టి రవంత సంతసమ్మును
కురిపించుచు వేసిరే పకోడి జిలేబీల్ :)
జిలేబి
ReplyDeleteవిభీషణు పల్కుగా
ప్రభువులు రామలక్ష్మణులు! భాగ్యవిధాతలు! కౌసలేయుడో
యభినవ విష్ణుమూర్తి కరుణామయుడౌ! దరి యాదిశేషుడే!
యభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు! రావణ !కుంభకర్ణు! లే
చి భవము దాటి వారి దరి చేరగ యత్నము చేయ వేడెదన్!
జిలేబి
ReplyDeleteసీత తో కింకరి పలుకులు
ముగుద! వినవె రాలేడు నీ మొగుడు సంద్ర
మునిక దాటి ! ప్రేమ కురిపించు దశకంఠు
పైన ! మారాజు గా మనువాడుమింక!
యభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు!
జిలేబి
ReplyDeleteఅమ్మా చేసితి వా ఓ
యమ్మ యరంగేట్రమున్ ? సయాటల్ బలిమిన్
చుమ్మా చుమ్మా యనెనా ?
గొమ్మా పద్మార్పిత! పలుకు జగంబెరుగన్
జిలేబి
ReplyDeleteచూడుమదే చెలియా యని
పాడుచు కృష్ణాష్టమిని ప్రభలు వెలుగంగన్
వేడుచు యవనారిన్ మన
వాడిన్ రారమ్మని పిలువవయా వైవీ :)
జిలేబి
ReplyDeleteఇమ్ముగ మనసున కింపుగ
తెమ్మర వీచిన విధముగ తేవె చెలి ప్రసా
దమ్మును కృష్ణాష్టమి నా
డమ్ముని యోగీశ్వరుని కెడ నిడ జిలేబీ !
జిలేబి
ReplyDeleteవాటర్లూ స్ట్రీట్ కృష్ణుని
పాటల తోడు కొనియాడి వైభవముగ సా
పాటు ప్రసాదము గొని క్రాం
జీ టేషనుకిదె జిలేబి జీ బై బై బై :)
జిలేబి
ReplyDeleteఅర్రులు చాచె "ర " " ఱా" కై
బర్రున మోటారు చేర్చి బండిని లాగెన్
చర్రున వేగము గాంచెను
మొర్రో యనుచుకవివరులు ముక్కును చీదన్ :)
జిలేబి
ReplyDeleteహ! జిలేబి శకట రేఫమ
హొ! జాలి కలిగెనుకదా మహోజ్వలత డమా
లు! జనులు వ్రాయక బోవం
గ జరయు నొందెనకొ! మంచి కాలము గలదో ?
జిలేబి
ReplyDeleteనిలుపంగ శివుని మదిని ప్ర
చలితంబగు వాసనల విచారణ తోడై
బలిమియు నొందక చేయం
గ లింగమూర్తిని ప్రసన్ను గా నింపు కొనన్ !
జిలేబి
ReplyDeleteసోరణి దీపపు వెల్గుల
నారీమణి హత్తుకొనగ నవ్వుల పువ్వై
వీరుని గుండెయు జారెన్
వారిజపత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్!
జిలేబి
ReplyDeleteమేరుసమానమాయెను ప్రమీల మహత్తుని నేల గానటన్
నీరజనేత్రులెల్లరు కనిష్టపు దుస్తుల నీత కొట్టుచున్
జోరుగ కండబల్మిని ప్రచోదన చేయగ చూడముచ్చటై
వారిజపత్రమే తగిలి వజ్రము రెండుగఁ జీలెఁ జిత్రమే!
జిలేబి
ReplyDeleteఆకాశవాణి కి పంపినది చదువబడెన(ట)!
ప్రేరణ యయ్యె ప్రేయసియె రేడను మాలిమి వీడగా మయిన్
కోరిక లెల్ల జోరుగ ప్రకోపము చెందగ తోడునీడగా
సోరణి దివ్వె వెల్గుల కుచోన్నత సుందరి ముద్దులాడగా
వారిజ పత్రమే తగిలి వజ్రము రెండుగ చీలె చిత్రమే!
జిలేబి
ReplyDeleteబొప్ప లెన్ని గట్టినను గబుక్కు కంద
ముల సమర్పించు కొనెనుగా ముగుద యేను
తప్పు లెన్నక తలదాల్తు! తరుణి భాగ్య
ముల సదా కాచెదనిక సముచిత రీతి !
జిలేబి
ReplyDeleteరూపే కార్డుల కంటా
ప్రాపిక యూయేయిలోను ఫ్రాన్సుని! పోదా
మే పల్లె దాటి దేశాల్
ప్రోపది యే రంగి సింగపురమున కూడన్!
జిలేబి
ReplyDeleteలేరిక అరుణ్ జయిట్లీ
చేరిరమర లోకముల కచేరిన్ భాజ్పా
కైరవ లోచనులు! జిలే
బీ రద్దగునిక నగారి విమలపు నాణేల్ !
జిలేబి
ReplyDeleteఅవునఱ్ఱా కఱ్ఱయె సరి
అవస్థ పడలేక బండి రాలా గుదిబం
డవలదని నెట్టిరే జను
లు వలదు కూడదన గురువులున్ పండితులున్
జిలేబి
ReplyDeleteఉత్సాహ వృత్తము
మురిసె వారణాసి యేను మోది కాలుమొక్కి స్వీ
పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ
తరుణ మిద్ది యంచు చాటి ధర్మమేది యంచు తె
ల్ప! రతనంబు దేశ మందు వారిజాక్షి! మోదియే!
జాల్రా
జిలేబి :)
ReplyDeleteప్రేమకు మూలంబతడే
రాముడు కృష్ణుడతడేను రాద్ధాంతము లే
లా? మది చిలుకు జిలేబ
మ్మా మానసమందు నిల్పుమా పరమాత్మన్ !
జిలేబి
ReplyDeleteఈ దిక్కు మాలిన కవిత
లీ దెబ్బుటలేల నో భళీ యని పొగడన్
రాదె మనసు! బుచికి యనుచు
నే దారెంబడి కమింట్ల నెట్టుచు పోతా :)
జిలేబి
ReplyDeleteఅందాన్ని చూడుమమ్మా
అందరి లోనన్ జిలేబి యందము నీవై
డెందపు టానందము నీ
కందగ సుఖముల బడయ వికాసపు బాటన్
జిలేబి
ReplyDeleteఓ పడతి! కాళహస్తిని
నే పరమేశు తిలకింప నెక్కగ నార్టీ
సీ పొడగంటి ప్రకటనను
"పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్"!
జిలేబి
ReplyDeleteఓ పడతీ! జిలేబి మన వూరికథే యిది ! కాళహస్తికై
నే పయనమ్ము చేయ మన నెమ్మది బస్సగు నార్టిసీని హ
న్నా! పొడ గంటి నే ప్రకటనమ్మొకటిన్ ! విను !"బుద్ధిహీనతౌ!
పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్"
జిలేబి
ReplyDeleteకంది వారి స్ఫూర్తి తో
పాపమె దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్
పాపపు చింత చేయ యను బాధల నీవిక తల్లడిల్లకోయ్
పాపుల రైన దేవుడిదె భారత దేశపు పుణ్య మూర్తి! రా!
పాపము చెల్లు నేసుడిని ప్రార్థన చేయగ నాదివారముల్!
జిలేబి
ReplyDeleteకంది వారి స్ఫూర్తి తో
ఓ పాపుల్లారా! నలి
పాపము దక్కు జనులకు శివస్తుతి జేయన్
మా ప్రభువును నమ్మండీ
మీ పాపము లాదివారమే తొలగు వెసన్ !
జిలేబి
ReplyDeleteసర్వరులై యడుగగనే
సర్వము మీకే జిలేబి సాదరముగ నం
చర్వపు తెలివిడి తోడై
దుర్వినయమ్మునను మనసు దోచెదరు! హితుల్!
జిలేబి
ReplyDeleteఉర్విని కాంగ్రెస్ నేతలు
దుర్వినయమ్మునను మనసు దోచెదరు! హితుల్
గర్వము లేక ప్రధానిగ
సర్వస్వము సేవగ మన సై నిల్తురుగా !
జిలేబి
ReplyDeleteదుర్వినియమంటే యిదేనా :)
"దుర్వినయమ్ముతో మనసు దోచెడువారు హితైషులే కదా?"
సర్వము పృచ్ఛకేశ్వరుడ ! చక్కగ మీకెరుకైన దేను!మా
గర్వము వీడ కైపదపు గాఢత నేర్పను మీరు చేర్చిరీ
పర్వము గాదె సభ్యుల ప్రభాతపు వేళని మేలుకొల్పగా !
జిలేబి
ReplyDeleteఉర్విని కింకరులకటా
దుర్వినయమ్మునను మనసు దోచెదరు! హితుల్
సర్వంబాలోచింపన్
పర్వంబున కేది సరి సభని పల్కురదే !
జిలేబి
ReplyDeleteతెలగాణ బిడ్డ ! సింధూ !
అలంకృతంబయె పసిడిని! బ్యాడ్మింటన్ క్వీన్!
పులకింపన్ లాగుదురు జ
ను లెల్లరిక బ్రహ్మరథమును జిలేబమ్మా !
జిలేబి
ReplyDeleteమాయమ్మే! తెలగాణ బిడ్డ! తెలుగమ్మాయీ !భళా! సింధు! నీ
ధ్యేయమ్మందుకొనేవు దేశమునకై బ్యేడ్మింటనాటన్ ! జిలే
బీయంబిద్ది జనాళి బ్రహ్మరథమున్ వేగమ్ము వేగమ్ముగా
సాయంబట్టుచు లాగి పుష్పములతో సాగింతురే యానమున్ !
జిలేబి
ReplyDeleteపట్టుగ గెల్వంగా జై
కొట్టిరి; కోమలియె శ్రీమకుటమార్జింపన్
పట్టిరి బ్రహ్మ రథమ్మును
పట్టము గట్టిరట సింధు ! భారత్స్రత్నా !
జిలేబి
Deleteపట్టుగ గెల్వంగా జై
కొట్టిరి; కోమలియె శ్రీమకుటమార్జింపన్
పట్టిరి బ్రహ్మ రథమ్మును
పట్టమిదే స్వర్ణ సింధు ! భారత రత్నా !
జిలేబి
Congratulations to Sindhu. She did India proud 👏👏.
ReplyDeleteఈ ఆనంద సమయంలో ఈ ప్రశ్నేమిటి అనుకోకండి గానీ నాదొక చిన్న సందేహం. మీరావిడను "తెలంగాణా బిడ్డ" అంటున్నారు. అలనాడు ఒలింపిక్ రజత పతకం గెలిచింది కాబట్టి, ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణపతకం సాధించింది కాబట్టీ "తెలంగాణ బిడ్డ" అంటుంటే తెలంగాణా వారికి మురిపెంగానే ఉంటుంది అనుకోండి. మరి ... కుతూహలం కొద్దీ అడుగుతున్నాను ... ఒలింపిక్స్ తరువాత 2017లో ఒక వేరే రాష్ట్రపు వ్యక్తిని (however accomplished she is) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (ఆ ఆ, అవును bifurcated AP రాష్ట్రమే లెండి) డైరెక్ట్ గా డిప్యూటీ కలెక్టర్ గా ఎలా నియమించిందంటారు (క్రింది లింక్ లు చూడండి)? ఆ అప్పాయింట్మెంట్ ఆర్డర్ ప్రకారం ఆవిడ కృష్ణాజిల్లాలో విధుల్లో జేరినట్లు కూడా తెలుస్తోంది. సింధు పట్ల నాకేమీ విముఖత లేదు లెండి గానీ ... ఆహా, Best of both worlds అంటే ఇదేనేమో అనాలనిపిస్తోంది కదా?
2017 - P V Sindhu appointed as Deputy Collector in AP
P V Sindhu joins duty as Deputy Collector in Krishna Dist in Aug 2017 (See "2017" section, para3)
Deleteజైగొట్టి గారూ కొంత ఈ క్లెయిము చూడండీ :)
జిలేబి
This comment has been removed by the author.
DeleteFight your battles yourself. ఇమ్రాన్ ఖాన్ లాగా వేరే వాళ్ళ సహాయం అడగనేల?
Delete
Deleteసమ ఉజ్జీలుండాలిగా దేనికైనా
జిలేబి
ReplyDeleteకోరగ దౌహృదిని జిలే
బీ, రయ్యన వెడలె మగడు భీమాస్ హోటల్
మారగ రూపేకార్డుని
జోరుగ రొక్కంబు వచ్చెను జిలేబీలున్ :)
జిలేబి
ReplyDeleteరూపే కార్డిదిగో! భీమ్
పే! పేటీయమ్ము ఫోన్పె! పే అమెజాన్ పే!
బాపురె యెన్ పీ సీ యై!
కౌపీనము పోవ నేమి ఖర్చు వెరవకోయ్ :)
జిలేబి
ReplyDeleteరిఫండు వర్షములు:)
గోలు గోలు గోవిందసామి దివాలు కత :)
వందా యాభై పైబడి
డెందపు టానందముగ వడివడి కొనంగన్
పందుంపుల్లైన సరే
యందు కొనుమికన్ రిఫండు యాభై నీ కై :)
వచ్చిన యాభై ఖర్చు చేయ మళ్ళీ మరొక్కటి కొనాలె :)
జిలేబి
ReplyDeleteదోచిరి రిజర్వు బ్యాంకుని!
దోచుదురిక ప్రజల ప్రభుత ! దొమ్మియు మొదలౌ
నో చాలక దేశములో ?
వాచాలత్వమకొ పప్పు ? వాయ్మూడు వెసన్ !
జిలేబి
ReplyDeleteశ్రీవారి నగలకు జిలే
బీ! వా! కాళ్లొచ్చె నంట ! వివరమ్ములకై
ఈవో గారు విచారణ
గావింతురటా త్వరితముగా గోవిందో !
జిలేబి
ReplyDeleteసారా యే లైఫోయ్! మన
సారా యానందమింక సారంబొప్పన్
హేరాఫేరీల జిలే
బీ, రఫ్ఫాడించి చేయి విరివగ నిపుడే !
జిలేబి
ReplyDeleteపిడికిలి మూత విప్పుటకు వీరికి చాలిక యేది? సీబియై
నడకయు నత్త వేగము! దినమ్ములు వేగము సాగిపోవు! నే
తడబడకన్ విచారణ విధానము చూచెద నవ్వుకొంచు! చే
విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్!
జిలేబి
ReplyDeleteఎరుగను చిదంబర రహస్యమెవరి తరము!
ఈడి సీబియై తనను బంధించిన నగ
వులను చిందించుచున్ తన యునికి చాటి
యెగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు!
జిలేబి