Friday, September 27, 2019

అంతు లేని పయనం!


అంతులేని పయనం 

మైడియర్ ఫ్రెండ్,

ఎక్కడికీ పయనమని అడగకు.  ఈ పయనం అంతు లేనిది.  ఎందుకు అ‌ంతులేనిదంటే చప్పున చెప్పలేను.

కొన్ని విషయాలకు కారణాలడిగితే జవాబు శూన్యం అనిపిస్తుంది.  అంటే కారణం నీకు తట్టడం జరిగితే అవి‌ శూన్యం నించే వచ్చేయని.

శూన్యం నించి వచ్చిన విషయాలకు ప్రశ్నలకు విషయాలకు జవాబులు అక్కర్లేదు.  అవి సమయానుసారంగా మనకే విశదీకరింప బడతాయి.

విశదీకరణ మళ్ళీ సమయం కాలం పై ఆధార పడి వుండటం శూన్యత్వానికి ప్రతీక అని మాత్రం చెప్ప గలను.

అది ప్రతీక మాత్రమే శూన్యం కానేరదు.

ప్రతీకకి ప్రతీకరించబడే వస్తువుకీ మధ్య ఈ అవినాభావ సంబంధం అనాదినించీ వున్నదనటం సత్యదూరం కాదు.

సత్యానికి ప్రతీక గా నిలిచిన వాళ్లు సత్యం కాలేరు. వాళ్లు ప్రతీకలు మాత్రమే.

సత్యం ఒక స్థాయి. ఆ స్థాయి కి సామీప్యత చేకూరితే అప్పుడు ప్రతీక లేర్పడతాయి.  అంత మాత్రానా సామీప్యం చెందినవి సత్యం కాలేవు.

సత్యం నిత్యం. సత్యానికి ప్రతీక నీ అనుభవ పూర్వకం. సత్యం శాశ్వతం.   ప్రతీక శాశ్వతం కాలేదు కాబోదు కూడా. 

శాశ్వతం అన్నది జగాంతరాల తరువాయి కూడా యధాస్థితిని పొందగలిగి వుండేది.

యుగం ఒక మారు తనకు దీటుగా సత్యానికి ప్రోద్బలంగా ( సత్యానికి ప్రోద్బల మక్కర లేదు ) యుగకర్తని ప్రసాదించడం యుగానికి మాత్రమే చెల్లుతుంది.

తన దగ్గరున్న చిన్ని చిన్ని బొమ్మలకు బొట్టుపెట్టి కాటుక దిద్ది సంతోషిస్తుంది చిన్ని పాప.  యుగం కూడా అంతే.

అంత మాత్రాన బొట్టూ కాటుక ప్రోద్బల మైనంత మాత్రాన అవి లేకుండా బొమ్మలు లేకుండా వుండక బోవు.



Source not known.

టైపాటు

జిలేబి










Tuesday, September 24, 2019

నిట్టూర్పు గుడి




నిట్టూర్పు అనే గుడిలో జీవితం ఓ దేవత
తడి కన్నులకే దర్శనం
పగిలిన గుండెల చేతనే ఆరాధిత
గుడిలో మనుషులు జీవితం చెక్కిన శిల్పాలు
మేఘాలు వాయు దేవుడి స‌ంకల్పాలు

***

శిధిలాలకు చరిత్ర పిత
శిధిలకుడ్యాలకు నిర్జన దుర్గాలకు
వాయువు అధిష్టాన దేవత
రోదన స్వరాలకు సేనాధిపతి‌
సంగీత ప్రపంచానికి మార్మిక ప్రభువు
ఎన్నో పక్షుల విడిదినిచ్చే యీ చెట్టు
పాటల పోషణకర్త !

***

ఓ యుద్ధంలో వున్న మానవుడా
రేపటి యుద్ధం కోసం
నేటి నిద్ర మానుకోకు
నీ యుద్ధం నిర్విరామం
నిద్రే ఆనందా రామం

***

మంచి నిద్ర కొంచెం సేపే
స్వప్న తుఫానులు వీచే
రాత్రి గడవడం రేపే
మనిషి నడక గమ్యం వైపే
కష్టసుఖాలు భరించే జీవనయాత్ర
మరణం‌ వైపే !

***

పరిచయాల వంతెన పై
రోజుల తరబడి
ప్రయత్నాల తాళ్ళను కట్టాను !


శేషేంద్రజాలము

తేదీలేదు


Monday, September 23, 2019

తేనెటీగలు - చెట్టు బుగ్గలు !


తేనెటీగలు - చెట్టు బుగ్గలు 
=================

ఏవో వాక్యాల తేనెటీగలు
పెదవుల మీద ఎగురుతుండగా
ఓ సౌందర్య మూర్తి 
అద్దంలో మునిగింది స్నానం చేద్దామని 
వెనక నేను కవిత్వం మీటుతున్నా 
హృదయంలోకి స్నానం చేద్దామని 

***

చెట్టు బుగ్గలు పూరించి రెండు శాఖలతో
ఓ పువ్వు పుచ్చుకుని 
షహనాయీ వూదుతోంది 
ఒక్క రాగం విసిరేసి బుల్ బుల్ 
తోటనంతా తన చిన్ని రెక్కల మీద
ఎగరేసుకు పోయింది !


***

శేషేంద్ర
శేషేంద్ర జాలం 
ఆంధ్రప్రభ వార పత్రిక
07- Aug-1985.


Sunday, September 22, 2019

కవి సంయముల మౌన జపమ్ములు!


కవి సంయముల మౌన జపమ్ములు





ఫోటో కర్టసీ : svvu :)

కవి సంయముల మౌన జపమ్ములు

జిలేబి

Tuesday, September 3, 2019

ಕಾಮೆಂಟಾಲಂಟೇ ಇಕ್ಕಡ ಕಾಮೆಂಟುಡೀ :)





ಕಾಮೆಂಟಾಲಂಟೇ ಇಕ್ಕಡ ಕಾಮೆಂಟುಡೀ :)





ಜಿಲೇಬಿ

"హమ్మయ్య! పీడా విరగడయ్యె!!!

పేపర్ చదవడం అలవాటెప్పటిదీ? అరవైఐదేళ్ళ కితంది. పద్నాలుగో ఏట నాలుగో ఫారం చదివేటప్పుడైనది కదూ!  అలవాటెలా అయిందీ? ఆరోజుల్లో పేపర్ పల్లెటూరికి రావడమంటే, అదో యజ్ఞం. ఈ రోజు పేపర్ రేపో ఎల్లుండో టపాలో వచ్చేది. ఆ పల్లెలో ఎంత మంది కొచ్చేది పేపరు? ఒకటి హైస్కూల్ కి రెండవది ఓ కలిగిన షావుకారు గారికి. . 


http://kasthephali.blogspot.com/2019/09/blog-post_3.html

Monday, September 2, 2019

గణాధ్యక్షాయ ధీమహీ !




వినాయక చవితి శుభాకాంక్షలతో
శుభాకాంక్షలతో

చిత్రము కర్టసీ - Keshav of The Hindu fame.


Indonesia Ganesha :)




శుభాకాంక్షలతో

వందనములయ గణేశా!
మందగతి యెకానమీయె మార్పును గానన్
తొందరగా తొండముతో
అందరి పైచూపుమయ్య అనుకంపనమున్!


జిలేబి