Monday, September 23, 2019

తేనెటీగలు - చెట్టు బుగ్గలు !


తేనెటీగలు - చెట్టు బుగ్గలు 
=================

ఏవో వాక్యాల తేనెటీగలు
పెదవుల మీద ఎగురుతుండగా
ఓ సౌందర్య మూర్తి 
అద్దంలో మునిగింది స్నానం చేద్దామని 
వెనక నేను కవిత్వం మీటుతున్నా 
హృదయంలోకి స్నానం చేద్దామని 

***

చెట్టు బుగ్గలు పూరించి రెండు శాఖలతో
ఓ పువ్వు పుచ్చుకుని 
షహనాయీ వూదుతోంది 
ఒక్క రాగం విసిరేసి బుల్ బుల్ 
తోటనంతా తన చిన్ని రెక్కల మీద
ఎగరేసుకు పోయింది !


***

శేషేంద్ర
శేషేంద్ర జాలం 
ఆంధ్రప్రభ వార పత్రిక
07- Aug-1985.


198 comments: 1. నల్లకలువల అందాన్ని
  కొల్లగొట్టిన కళ్ళు

  దొండపండు ఎర్రదనాన్ని
  దోచుకున్న పెదవులు

  ముత్యాల ముక్కెర ముక్కు
  వంకర ముంగురుల టెక్కు

  నల్లని నూగారు నిక్కూ
  పిడికెడైన నడుము తక్కూ
  ఎదలో సన్నాయి నొక్కూ


  రాసిన రోమియో ఎవరో తెలియదు :)
  పక్వానికి వచ్చి ఇప్పుడేమి తిండాట్టముల పడుతున్నాడో :)
  జిలేబి


  ReplyDelete


 2. బామ్మా జిలేబి తమరే
  లేమ్మా ఆ తీపి మాకు లెస్సగ తెలుసోయ్
  గుమ్మాలెంబడి తిరుగుచు
  చుమ్మా చుమ్మా కమింట్ల షూ షూ అంటవ్ !


  జిలేబి

  ReplyDelete


 3. పైట తీసి పరుపు వార్చినీ పొంగుకు
  మావ వేగు చుంటి మంచి మగడ
  రార దరిని రమ్మ రాసకేళి రసమ
  యంపు వేళ పద్మ యామిలముగ!

  రామ రామ ఇదేమి తెగింపు పద్మా!

  జిలేబి

  ReplyDelete


 4. అరయగ తప్పనిదగు నా
  మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
  తరలిక కష్టమ్ములపడ
  క, రోగములులేక పోవ కాటికి సుమ్మీ


  జిలేబి

  ReplyDelete


 5. తరుగుట తప్పదా కలిమి దారిని పుట్టిన వారికిన్, సఖీ
  యరయగ తప్పదమ్మి నరులా సుడుగాడుకు బోవ తీరగన్
  తరలిక, భోగభాగ్యముల దందడి! రోగపు లేమితోడుతన్
  మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై!


  జిలేబి

  ReplyDelete


 6. అరకొర తెలివిడి వలదని
  మరణమ్మును, గోరుకొంద్రు మానవులెల్లన్
  చిరకాలమ్ము బతుకగా!
  పరమార్థకవి పలికె సెలవా మరణమ్మే!


  ***

  పరుగిడి కోరుకొనుమ యొరి
  మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
  సరియైనదికాదది విను
  మ! రణమ్మును గోరుచుట్టు మచ్చుగనుమికన్!

  ***

  పరుగుపరుగుల నెపుడు ధన
  ము రొప్పుచు ములుగును చూచి ముచ్చటపడుచున్
  పరపతి తోడుత గొప్పగ
  మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!

  ***

  సరిసరి జిలేబి కోరకు
  మరణమ్మును! గోరుకొంద్రు మానవులెల్లన్
  జరలేని బతుకు! కోరుకొ
  ను రవంతయు నీవదియె మనుగడయె సాగన్!

  ***

  యోగవాశిష్టము  "మరిమని" వశిష్టుడనె, "రా
  మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
  శరణాగతి జీవితమున
  నరయగ మేలగునయా వినాశమ్మీగన్"!

  ***

  పరిపరి విధముల కోరిక
  ల రహస్యముగ తలదాల్చి లాభము కొరకై
  పొర కనుల కట్టగా కా
  మ రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!

  ***

  అరె ప్రెసిడెంటవగ, యొబా
  మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
  నెరపితి వీవెగ శాంతిని!
  పరిగ్రహించుకొనుమింక ప్రైజిదె నోబెల్!

  ***

  ప్రత్యక్ష ప్రమాణము - మిలాల్ :) వుంటే వద్దంటామా ? :)  అరె! ణిసిధాత్వర్థముగా
  మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
  పరమాత్మునికొలువందు క
  లరూపు తధ్యమనగా! మిలాల్ లేదు కదా:)

  ***

  జీపీయెస్ వారి మరియు యితర కవుల ఐఫోను ఆండ్రాయిడు ఫోనుల కంకితము :)  విరివిగ పొద్దుపొడువ శం
  కరాభరణమందు విడువక టకాల్మనుచున్
  చరవాణి నొక్కి కైపద
  మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్

  ***

  నరకమ్మె లేదు! స్వర్గం
  బరయగ తధ్యము జనాళి ప్రభువుని చేరం
  గ రయము రారండన సం
  స్మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!


  ***

  Modi no to RCEP agreement signing


  అరె! ఆర్. సి.ఇ.పి.వలదయ
  త్వరితము చైనా దినుసులు తలమించునికన్
  విరివిగ! దేశపు వృద్ధికి
  మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్?

  ***

  దొరలుచు దుముకుచు కాదం
  బరి కౌగిలిని కరుగుచు సఫలమనుకొనుచున్
  మురుగప్పా వైన్సు కెడని
  మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!


  ***

  మురుకులు జిలేబి లడ్డులు
  కరకర యంచు నములుచు ప్రకాశము గా వీ
  రరసమ్మిదె యనుకొనుచున్
  మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!


  జిలేబి

  ReplyDelete
 7. తెరువంగనె కనులు , నులిమి
  మరి మరి చూడంగ గంటి మాలికలోనన్ ,
  హరి ! హరి ! యీ యేడ్పేమిటి ?
  ' మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్ '

  ReplyDelete
  Replies


  1. సరిసరి హితుడా మాకవి
   వరుడా! కనులకు పనులిక వలదయ్య మరీ
   ను!రవంత "శంకరుని" సం
   స్మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!


   నారాయణ :)

   జిలేబి

   Delete
  2. వర ' రాజా ' వినుత ! వినుడు ,
   పరమాత్మను వదలి , పతిత పండిత సేవన్
   యెరుక గలవారు నడువరు ,
   సరి బోలునె కుటజ సుమము సరసీ రుహమున్ ?

   Delete


  3. పరమాత్మ వేరు జనులిక
   మరివేరని భావన మన మది లోనేల
   న్న! రుచియునరుచియు వేర్వే
   రరయంగ పదార్థమొకటె రాజా వినుతా!


   నారదా!

   జిలేబి

   Delete
  4. ' అందాల రేలు ' ఖండిక
   విందుగ నిరవొంద నొకటి వెలయించితి , ఆ
   విందారగించి , యటువలె
   పొందుగ నందాల రచన బొనరించు , హితా !

   Delete


 8. హరోంహర !

  వరలెడు త్రిశూలమలరగ
  హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా
  హరిహస్తమందు! శిక్షిం
  చు రావడి సలుపు కఱటుల చువ్వన నెపుడున్!


  జిలేబి

  ReplyDelete


 9. "హరిహరులందు భేదము మహాశయ లేదు సుమీ" హితుండనన్
  వరలెడు కైపదమ్మును సవాలుగ వేయుచు నేర్పు తోడుతన్
  "సరె! హితుడా!సమస్యయిదె! చక్కగ నింపుము" శంకరుండనెన్
  "హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్"


  జిలేబి

  ReplyDelete


 10. హరి! విష్ణువు! శ్రీపతి! అ
  క్షరుడు!అనంతుడు!కపిలుడు!కమలాక్షుడు! పు
  ష్కరనాభుడు!భరిమ!మనో
  హరుని కరము నందు చక్ర మలరారు గదా


  జిలేబి

  ReplyDelete


 11. తతియై సంతతి వృద్ధికి
  రతి మూలము, సర్వధర్మ రక్షణ కొఱకై
  మతి మూలము!పరమాత్ముని
  స్థితి మూలము మన మనుగడ తిరముపడుటకున్!


  జిలేబి

  ReplyDelete


 12. సతియే మూలము గేస్తుడన్ని విధులన్ సాధింప సం పూర్తిగా
  తతియై సంతతి వృద్ధిగాన, ధరణిన్ దార్ఢ్యమ్ముతోవెల్గగా
  పతి ధర్మమ్మును వీడకన్, గృహిణి చేపట్టై నిధానమ్ముగా
  రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్!  జిలేబి

  ReplyDelete


 13. మతి సమ్మతి సన్మతి యభి
  రతి, యవిరతి కొఱతలేని ప్రతికర్మముగా
  యతికాని విధముగా నను
  రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!


  జిలేబి

  ReplyDelete


 14. అతుకుల బొంతయగు బతుకు
  న తరుణి తీరంగ సేద నాకిక దిక్కై
  సతియై నావమ్మా భా
  రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!

  జిలేబి

  ReplyDelete


 15. రతినిర్వేదము పోగొ
  ట్టు తెంపుగల స్వాతియే కిటుకుగా వేమూ
  రి తెలుగునాట నిలిచె! "గిరి",
  "రతి" మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!


  నారదా!

  జిలేబి

  ReplyDelete


 16. సతతము దేవళమందు వి
  నుత! పరమాత్ముని కెడన్ తనువు మైమరపున్
  స్మృతిని తలపించునా భా
  రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!


  జిలేబి

  ReplyDelete


 17. మతిపోయిన "జీవుల"కే
  రతి మూలము; సర్వధర్మ రక్షణ కొఱకై
  మతమేదైనను విదురులు
  హితమును కోరెదరు ప్రజలహీనులు గాకన్!


  జిలేబి

  ReplyDelete


 18. అలపద్మహస్త వికసిత
  పు లపనసఖి చంద్రముఖి కపురపు పిసాళ
  మ్ముల ణిసిధాత్వర్థమ్మున
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!

  నారదా!

  జిలేబి

  ReplyDelete


 19. ఆకాశవాణికి పంపినది :)


  అలకొలకొల్కియె వలచుట
  వలదని త్రోయంగనరె దవదవానలమై
  వలపది మీరగ మగనికి
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!  జిలేబి

  ReplyDelete


 20. గాడిదల తోలుకోండ
  ర్రా డింగరులార యనుచు ప్రాజ్ఞులు తెల్పం
  గా డిగనురుకుల పరుగిడి
  గాడిద మాలచ్చి గనిరి కష్టేఫలిగా !


  జిలేబి

  ReplyDelete


 21. బెంగుళూరు, చెన్నై మార్గమున,8th Nov 2019 రాత్రి పలమనేరు మొగిలి ఘాటు రోడ్డు ఘోర ప్రమాదము


  పగిలెను గుండె చూడ జనవాసము దాటుచు ఘాటురోడ్డులో
  మొగిలి సమీపమందు వెస మోదగ ట్యాంకరు మారుతిన్ తటా
  లు గివురి దారితప్పుచు పెళుక్కున, మాంసము చిమ్మరేగగా
  తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్.


  నివాళి.

  ReplyDelete


 22. తొలగును ముకద్దమాయిక
  తెలవారగ; మదిని చట్టు తీవ్రతరముగా
  పలుమార్లు నాటి తలపుల
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!

  జిలేబి

  ReplyDelete


 23. అలుకయె తోడు జిలేబులు
  కులుకుల సరసమ్ముల రతగురువుల కాల్చన్
  తెలుసుకొనవె చెలికాళ్ళకు
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!

  జిలేబి

  ReplyDelete


 24. గిజగిజ లాడి మాలికని గీరుచు పద్యమటంచు యత్నముల్
  గజగజ కందపద్యమని కట్టుచు పేర్పుడు రాళ్ళ పాదముల్
  జజజజ లన్ ఫెడేల్మనుచు ఛందపు రీతులటంచు మోదుటల్!
  ప్రజలు దృణీకరించిరఁట పద్యకవిత్వము వద్దటం చయో!


  జిలేబి

  ReplyDelete


 25. గజిబిజి జిబిజిగ జిజిగన
  రె! జిలే బివిడువక తుంటరి పదములట ను
  గ్గజ గజ లాడింపంగన్
  ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే!


  జిలేబి

  ReplyDelete
 26. పజిలుల వలె పదముల నస
  హజముగ పూరించుచు , కవితావేశపు త్రో
  వ జిగి బిగి పస గనమిచే ,
  ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే .

  ReplyDelete


 27. మాలోకపు పిచ్చి తెలుగు
  బాలాగుల కొరకు రామ పారాయణమున్
  గాలికి వదిలి గురుడు బే
  లా లెక్కల గణితమునకు లావుగ దిగె పో :)


  నారదా!
  జిలేబి

  ReplyDelete


 28. నిజమిదె!పత్రికల చదువ
  ప్రజలెల్లరు రోసిరయ్యొ! పద్యమ్ములనే
  సుజనులు వెలయింపంగ స
  హజముగ చదువ త్వరపడిరి హస్తపు తొడియై!


  జిలేబి

  ReplyDelete


 29. తన పురమును వీడి దమ్మిడి కొరగాడు
  ప్రతిభ లేనివాఁడె, పండితుండు
  పేరు గాంచు నెల్ల పేట లందు ధరణి
  లోన! విద్యయే ములుగు జిలేబి!


  జిలేబి

  ReplyDelete


 30. మతమేదైనను సమ్మతిన్ పగటుచున్ మానావ మానమ్ములన్
  ప్రతిపక్షమ్ముగ చూచి మట్టముగ నాపాదించి వాగీశుడై
  మతితో కూర్పుగ సౌష్టవమ్ము సయి ప్రామాణ్యమ్ములన్ చూపుడ
  ప్రతిభా శూన్యుఁడె, మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్!


  జిలేబి

  ReplyDelete


 31. వాదనలోన జిలేబీ
  మాదిరి సాక్ష్యమ్ములే సమంబగు నోయీ
  దీదీగిరితగదు సుమీ
  సోదాహరణము వలయును సొంఠికరక్కాయ్!

  జిలేబి

  ReplyDelete


 32. తెలుగు నభివృద్ధి చేయుడి తేనెలూర
  ననిన వేళన రరెనొక్క రైన నోరు
  విప్పలేదు మౌనము వహించిరి! జిలేబి,
  మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు
  ననిన వేళని హైరాన హైలెస లెస!


  జిలేబి

  ReplyDelete


 33. మనుగడ తీరు కైవలయు మా పిల వాండ్లకు దేశమెల్లెడన్
  మన బడులందిఁకన్ జదువు; మానుటె యొప్పగు మాతృభాషలో
  తనరదు సూవె విద్యయను తప్పగు నమ్మిక! రాజకీయముల్
  మనమిక కట్టిపెట్టెదము మన్నిక తోడుత వృద్ధి గాంచగన్!


  జిలేబి

  ReplyDelete


 34. పనిలేనివారు మండలి
  తనూరహమ్మును బెరికిరి తరుణము గానన్
  కొనుగోలులేని యంగడి
  ని నలుదెసల చూడ దక్కునే ఫలితమ్ముల్!

  జిలేబి

  ReplyDelete


 35. ప్రభువుని బిడ్డల్లారా!
  శుభములు లభియించుఁ గాక! చోర విటులకున్
  రభటిల్లు రీతి దేవుడు
  లభించు సత్యంబు పాపులకు సై ! ఆమెన్!


  పరలోకంలో ఉన్న మా యేసు భూ లోకమంతటికి వెలుగు


  ఆమెన్!
  జిలేబి

  ReplyDelete


 36. సభకు జనుల్ జపమ్ములకు సాదరమై తరలండి జెచ్చెరన్!
  ప్రభువుని బిడ్డలెల్లరికి భాసిలు కైవడి యేసునాధుడిన్
  శుభములు గల్గు గాక! ఖల చోర విటాళికి శిష్టు లౌననన్
  నిభముగ దక్కు, నిక్కముగ నెల్లరు పాపులకున్‌ తరాకుగా!

  యేసునాధుడె తీర్థము !


  జిలేబి

  ReplyDelete


 37. తెలపండీ లెక్కలనిక
  ములుగులలో బంగరులకు మూలమ్మేదో!
  వలవేసి పట్టెదమికన్
  జిలేబులన్ దాచు వార్ని చెండాడి మరీ :)

  తాత గారి వద్ద బంగారమెంతుందో ! వామ్మో వామ్మో మనవరాలా గుట్టుగ లాగేయ్ :)  జిలేబి

  ReplyDelete


 38. పదిలంబవగా మదిలో
  చదివిన దెల్లను విరివిగ సభ్యత తోడై
  చదువంగ రాని దానిని
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్!


  జిలేబి

  ReplyDelete


 39. కుదురగ మానసమ్ము భళి కూడగ జ్ఞాపక శక్తి, సూక్ష్మముల్,
  వదిగొను విద్య లన్ని విరివాఱుచు చెంగట వచ్చి ధాటిగా
  పదిలమవంగ నా మదిని వర్ధిలి, కూడని వాటినెప్పుడున్
  చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్!


  జిలేబి

  ReplyDelete 40. శ్వాసగ మారును భక్తియె
  యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్
  బాసటగానీవాతని
  ప్రాసాదమ్మును బడసి శుభమ్ముల బడయన్!

  జిలేబి

  ReplyDelete

 41. సెల్ఫ్ డబ్బా జిలేబి

  ఔరా యెవ్విధి నమ్ముదు
  నౌరౌర! జిలేబి పద్య మంచు! పదునుగా
  తారాపథమును చేరెన్
  జీరాడు పదముల తోడు సెమ్మెపు కాంతుల్!


  జిలేబి

  ReplyDelete

 42. గాడిద మాలచ్చి :)


  కలయో వైష్ణవమాయయొ
  ములుగుని బంగారమెల్ల ముద్దుగ చేరెన్
  తలపండి‌న ఆసామియె
  తెలుపగ గర్దభపు పాల తెవ్వను బిజినెస్ :)


  జిలేబి

  ReplyDelete


 43. కలయో వైష్ణవమాయయొ
  తెలిసీ తెలియక జిలేబి తెలుగున నేర్వన్
  జల జల రాలెను కందం
  బులు పంచదశపు జగమున బుధుల తల తినన్ :)


  జిలేబి

  ReplyDelete


 44. అర్మిలి తోడై వేదపు
  మర్మము లెల్లతెలుపుచు సమాజహితముగా
  పర్ముని నుపయోగించెడ
  ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్


  జిలేబి

  ReplyDelete


 45. రఫేలు తీర్పు తరువాయి ప్రసాద్ ఉవాచ :)


  పర్ముని వేటు కోర్టదె నివారణ చూపెను! కాలధర్మమా
  ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును! శాంతి సౌఖ్యముల్
  నిర్మల మై ప్రభుత్వమును నీతియు న్యాయము తోడు చేయగా
  నర్మిలి చూపి మోడివలె నాటని నెక్కొను నిక్క మిద్దియే


  జాల్రా
  జిలేబి

  ReplyDelete


 46. ఆకాశవాణికి పంపినది ( చదువ బడెనట !)


  అర్మిలియే సురక్ష ! వినుడయ్య వినాశము విస్తృతమ్ముగా
  ధర్మము వీడు వారలకు తప్పక గల్గును; శాంతి సౌఖ్యముల్
  నిర్మల మానసమ్మున పునీతపు చింతన తోడు ప్రేమయే
  వర్మము గా సదా జనులు వర్ధిల సల్పగ దక్కు నిక్కమై!


  జిలేబి

  ReplyDelete


 47. భార్యా విధేయుడాతడు!
  భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్!
  తూర్యపు మంగళనాదము
  పర్యాప్తిగ చేరగ చెవి పరితుష్టిగనెన్ :)

  జిలేబి

  ReplyDelete


 48. వార్యోకమువలె పట్టిన
  నార్యుని విడువననెడు నళినాక్షి జిలేబీ!
  ఆర్యా! స్వాభావికమే!
  భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్!


  జిలేబి

  ReplyDelete


 49. ఆర్యా సత్యము పల్కిరి!
  భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్!
  వర్యము! సమస్య యెక్కడ?
  ఆర్యకుడ! సమస్య సారసాక్షియె సుమ్మీ !


  జిలేబి

  ReplyDelete


 50. చర్యాతీతియు సర్వో
  పర్యాసీనసమవేతపాదాంగుష్ఠిన్
  వర్యముగానాడించెడు
  భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్!


  Its elementary my dear Watson :)

  జిలేబి

  ReplyDelete


 51. కారణం తాత గారి యోచన సుమా కంది వారు :)


  మనుజుని సృష్టి చేసెదను, మాలిని తొంటిని, వాడు కర్తయౌ
  నను తలవంగ నెప్పుడు, త్సునామి సమానముగా జిలేబిగా!
  మునుగడ తాత యోచన సమున్నత కారణమాయె శంకరా
  కనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై!


  జిలేబి

  ReplyDelete


 52. కొంచెం భయంతో కొంచెం భక్తితో మోడీ పై ఇవ్వాళ్టి ఆంధ్రజ్యోతి కృ.తి. యోపాఖ్యానము :)  ఆర్యా ! కవివర ! కందివ
  రార్యా! కొంచెము భయమ్ము, రవ్వంతగనౌ
  నార్యా భక్తి! కనుకనే
  భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్ :(


  జిలేబి

  ReplyDelete


 53. కార్యాలయమున సింహము!
  పర్యంకమ్మున హిహకము! పదతాడనమే
  మర్యాదగతలచునతడు!
  భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్


  జిలేబి

  ReplyDelete


 54. మత్సరముల మత్తుగొనును
  కుత్సితుఁడైనట్టివాఁడె, గురువన నొప్పున్
  పత్సలము చూపి, విద్యల
  వాత్సల్యమున గరిపెడయవారె జిలేబీ


  జిలేబి

  ReplyDelete


 55. మత్సరముల్ మదిన్ గొనుచు మద్యపు తూగుని బోవ దుష్టుడా
  కుత్సితుఁడైన వ్యక్తియె తగున్; గురువై జన సంస్తుతుల్ గొనన్
  పత్సలమున్ వినీతులకు వర్ధిల చూపుచు విద్య లన్నిటిన్
  వత్సల భావ వీచికల వారికి నేర్పగ నౌత గాదుటే!


  జిలేబి

  ReplyDelete


 56. అరయగ ధైర్యము తోడై
  మరణమ్మును కదురుకొనుచు మహిమాన్వితుడై
  చురుకుగ నుప్పొంగుచు నా
  కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్

  జిలేబి

  ReplyDelete


 57. అరయగ సాహసమ్మును సహాయము గాగొని దావరీడుడా
  కరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో
  విరివిగ నూచమట్టుగొని బెట్టుగ చువ్వన ద్రోలి ద్రోహులన్
  తిరముగ దేశభద్రతను తీరుగ నిల్పె ప్రభాతవేళలో!


  ಜಿಲೇಬಿ

  ReplyDelete


 58. అరరే శకార సాయ
  మ్ము రమ్మ కైపద మునే సముచితము పూరిం
  ప రవంత జిలేబులమర
  కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్


  జిలేబి

  ReplyDelete


 59. ఎట్లా పూరించాలో తెలియని వాడు రివర్స్ కత్తుల దూసెన్ :)

  సరిసరి మీరేమన్నను
  సరిసరి యే గురువరా! పసందుగ పూరిం
  ప రచయితలు వత్తురు! పరి
  కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్!


  జిలేబి

  ReplyDelete


 60. పరిపరి విధముల వేడెను
  కరములు లేనట్టివాఁడు, కత్తుల దూసెన్,
  శరణుశరణనిన వినకన్,
  చరిత్ర హీనుడు క్రమించె సంగరమందున్


  జిలేబి

  ReplyDelete


 61. మహా" మాయ :) ఎప్పుడు తొలగునో :)  అరె! కాంగ్రెస్సెన్సీపీ
  కరములు మేలనగ కంచుకంఠపు టజితుం
  డరె యెన్సీపీ నేనని
  కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్  జిలేబి

  ReplyDelete


 62. ఎట్టెట్టా నీవేమన
  నట్టట్టేను! తలయూపి నమ్మకమునకున్
  పెట్టని కోటయగుచు ఊ
  కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్


  జిలేబి

  ReplyDelete


 63. గుట్టుగ వంటల వండుచు
  పట్టుగ తానింట నిలచి పనివాడివలెన్
  పట్టమ్మాళ్ మాటకు ఊ
  కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్ :)


  జిలేబి

  ReplyDelete


 64. చవటల్ చప్పున పూర్తి చేయు విధమై సాధారణంబైన రీ
  తి, వధాన్యుల్ తమ స్థాయి క్రిందిదని వాదింపంగ సందర్భమి
  చ్చు విధానమ్ముగ, పూరణమ్ములిక చచ్చుల్గాను తోచంగనా
  యవధానమ్ముల నుండరా దనె సమస్యాపూరణం బెన్నడున్!


  జిలేబి

  ReplyDelete


 65. తాతకు మిత్రుడు కైపద
  మాతరుణమున ప్రచురింప మదిమది సరదా
  కైతల పూరణ చేయన్
  రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై

  ReplyDelete
 66. రాతిరి తాగిం దింకా
  భ్రాతా ! దిగలేద ? లేక భ్రమ గొన్నావా ,
  యే తీరున కనిపించెను ?
  రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై"

  ReplyDelete
  Replies

  1. వామ్మో :) ఇంత రివర్స్ గేరా :)
   దండాలయ్యా దండాలయ్య :)   రాతిరికి ముందు భాస్కరు
   డేతా వాతా పడమట డేరా దిగుచుం
   డే! తెల వారి, కనుమరుగ
   రాతిరి, భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై!

   :)
   జిలేబి
   జిలేబి

   Delete


 67. కోతల కోసి బువ్వగొని గుప్పెడు పాన్పుని పవ్వళింపగా
  జోతల చేసి నిద్దురని జోగొని కొంతయె వేళ దాటెనా
  రాతిరియందు, భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్
  స్తోత్రపు సర్వమూషకము చువ్వన వచ్చెను లెమ్ము మిత్రుడా!  జిలేబి

  ReplyDelete


 68. నారదా!


  కాతరు లేదా గృహమన?
  వేతన మెచ్చట గలదిక వెచ్చము సేయం
  గా తెమ్మ తల తినగ సతి
  రాతిరి, భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై


  జిలేబి

  ReplyDelete

 69. ప్రశ్న :)


  ఓ తరుణీలలామ! విభుఁ డొంటిగ నిన్ విడి కార్యమగ్నుఁడై
  చేతము దల్లడిల్లఁ గడచెం గడు దూరము, వాని రాకకై
  నీ తనువెల్లఁ గన్నులుగ నిల్చి ప్రతీక్ష నొనర్చుచుంటివా
  రాతిరియందు; భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్.


  జవాబు :)

  లే! తయినాతియై భళి లెస్సగ చెంపను గొట్ట వేచితిన్
  రాతిరియందు; భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్

  ReplyDelete


 70. అనమానములేదు సుమా
  నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్
  పనిలేక యనుదినమ్ము స
  దనమున పూరణలచేసి తరియించితినే :)

  జిలేబి

  ReplyDelete


 71. జట్పటు నేర్వ నాంగ్లమిక చాలిక చేరును! మీదు వారికా
  రాట్పడు లెల్ల తీరు! మన రాష్ట్రపు పిల్లలు వృద్ధి గాంతురే
  విట్పతి నైతి మార్చెద! సువీజిక గంధము లేని పువ్వుపై
  షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్!


  జిలేబి

  ReplyDelete
 72. This comment has been removed by the author.

  ReplyDelete
 73. ఈ మానవాత్మలు
  చల్లని సైకతసీమల కింద, వెచ్చని రాతిబండల కింద,
  వేనవేల మైళ్ళు
  దిగజారి దిగజారి భూమి పొరల కింద,
  జన్మల జన్మల నుండి పేరుకుపోయిన పాతపగలతో,
  కుతకుత ఉడుకుతున్న కొత్తపగలతో,
  కుట్రలతో, వ్యూహాలతో, రాజకీయాలతో
  ఒకేలా కనిపించే అనేక ముఖాలను తగిలించుకుని తిరగటం
  దేనికోసం?శాంతి కోసమా!

  దారిద్య్రంతో, అజ్ఞానంతో, అనామకుల వలె,
  గ్రహాంతరవాసుల వలె,
  చీకటిలోకి, గుహలలోకి, ద్వేషంతో
  నిలువెల్లా తగలబడిపోతూ,
  దుఃఖంతో గుండెలు బాదుకుంటూ,
  ఎవరూ లేని ఏకాంతం కోసం
  తవ్వుకుంటూ తవ్వుకుంటూ
  భూమి కేంద్రం వరకు పోతున్నది
  దేనికోసం?

  తమ దేహాల్ని ముక్కలుముక్కలు చేసుకుని,
  కణాలుగా, పరమాణువులుగా, ఎలెక్ట్రాన్లుగా, ప్రోటాన్లుగా న్యూట్రాన్లుగా విడిపోతూ
  నిరంతరం శిధిలమౌతున్నది
  దేనికోసం?మోక్షం కోసమా!

  ReplyDelete
  Replies

  1. కాదు కాదు కాదు.   బ్లాగులాడుకోటానికోసము .   సత్యం వద

   జిలేబి

   Delete


 74. శరషట్పద వృత్తము :)

  భలే బాగుంది. నో యతి‌ నో ప్రాసల ఝంఝాటపు ఝంకృతి :)

  తెలుగు సీమలో "మొదల్ మురయాగ" జిలేబీయపు శరషట్పద :)  షట్పద మొనరిం
  చునొక్కొ ఝంకా
  రమ్మున్ జిలేబి శరషట్పద
  మిదియె సుమా సుల
  భమైనది నేర్వ
  గా ప్రాసయతులు లేవు సుమా


  ఆహా యెంతహాయి

  రాసుకుంటా పోవచ్చు :)

  రెండు నాల్గు మాత్రలు
  రెండు నాల్గు మాత్రలు
  మూడు నాల్గు మాత్రలు ఒక రెండు మాత్రలు :)

  రిపీట్ మాడి


  జిలేబి

  ReplyDelete


 75. కొంచెము తూగుచు, జోగుచు
  కొంచెము, జారుచు మరింత కొంచెము మంచెం
  బంచున సర్రున నరరే
  మంచము క్రిందన్ జొరఁబడె మానధనుండే!


  జిలేబి

  ReplyDelete


 76. పంచెను లాగి కట్టి తనువంతయు నివ్వెరపాటుతోడుగా
  మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుఁడై
  కొంచెము భార్య చిట్టెలుక కొత్తది దూరెను క్రింద పట్టు మా
  యంచును పెట్టగాపనిని హద్దరి బన్న విశేష మిద్దియే!


  జిలేబి

  ReplyDelete


 77. శరషట్పద వృత్తము  మంచము క్రిందన్
  జొరఁబడె మానధ
  నుండే చిట్టెలుకను బట్టన్
  పెండ్లాము జిలే
  బి యానగా భీ
  తిలి జలదరింపుల తోడుగా!


  జిలేబి

  పిట్ట కొంచెము కూత గొప్ప :)

  శర షట్పద పద్య లక్షణములు
  జాతి(షట్పదలు) రకానికి చెందినది

  4 నుండి 14 అక్షరములు ఉండును.
  6 పాదములు ఉండును.
  ప్రాస నియమం లేదు
  గణ లక్షణాలు :
  ఒకటవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
  రెండవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
  మూడవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
  నాలుగవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
  ఇదవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
  ఆరవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.

  ***

  ఆహా యెంతహాయి

  రాసుకుంటా పోవచ్చు :)

  రెండు నాల్గు మాత్రలు
  రెండు నాల్గు మాత్రలు
  మూడు నాల్గు మాత్రలు ఒక రెండు మాత్రలు :)

  రిపీట్ మాడి

  ప్రాస యతుల ఝంఝాటము లేదోయ్ :)


  జిలేబి

  ReplyDelete
 78. శర షట్పద పద్య లక్షణములు
  జాతి(షట్పదలు) రకానికి చెందినది

  4 నుండి 14 అక్షరములు ఉండును.
  6 పాదములు ఉండును.
  ప్రాస నియమం లేదు
  గణ లక్షణాలు :
  ''''ఒకటవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
  రెండవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
  మూడవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.''''
  నాలుగవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
  ఇదవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
  ఆరవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
  Explain matter in inverted comas

  ReplyDelete


 79. కష్టేఫలి శ
  ర్మ గారు ఉదాహ
  రణ యిదియె తెలుసు కొనుడీ సార్

  ReplyDelete
  Replies
  1. పిల్లి అంటే బిడాలం అన్నట్టుంది

   Delete


  2. పిల్లి అనగా బి
   డాలమ నినట్టు
   కలదండి జిలేబీ గారూ


   జిలేబి

   Delete
  3. సూత్రం వివరిం చ
   వమ్మా యనగ వి
   నక ఇదేమి రచ్చ జిలేబీ

   Delete


  4. సూత్రం వివరిం
   చవమ్మ యనగ వి
   నక రచ్చ యిదేమి జిలేబీ


   :)

   జిలేబి

   Delete

  5. అబ్బా! ఉదాహరణ లు
   కాదు యిలా ఏందుకు మార్చాలో
   చెప్పాలి అదిగడా వివరణ.

   Delete


  6. కొంటె డవిలాగు
   లను వ్రాయడాని
   కైతే మరీను వేగమ్మే

   Delete


  7. కాస్తా కూస్తా
   కంపిది కాదం
   డీ ముక్కులు బద్దలయేటం
   తటి కంపు సుమా
   ఏపి పొలిటిక్కు
   చూడన్ కళ్లు తిరిగె నండీ :)


   Delete

  8. తమరూ గురువులే :)
   ఆకలేస్తే రోకలి మింగండి
   వివరించవమ్మా కొంటే జిలేబీ

   Delete


  9. అబ్బా! ఉదాహ
   రణలేల? యిలా
   ఏందుకు మార్చాలో చెప్పం
   డీ! అది కదా వి
   వరణ జిలేబీ
   గారండీ వినరెందుకనో ?

   Delete


 80. తమరున్నూ గురు
  వులె! ఆకలి వే
  యన్ రోకలి మింగండంటా
  రేమీ? వివరిం
  చుడి కొంటె జిలే
  బీ వెంటనే యిపుడే వెసన్

  ReplyDelete


 81. మహాప్రభో! తెలి
  యదు మాకు సుమా
  పేర్చితి మంతే సరిబోవన్
  మాత్రలు గణములు
  పదముల విరుచుచు
  నటునిటు కోతివలె గెంతుచున్ :)


  జిలేబి

  ReplyDelete


 82. కాచి దరి యట్లకాడని
  సాచి చురచురయని చూచి జ్వాలపు వేగం
  బై చరచుచున్ జిలేబీ
  నాచెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా!


  నారదా!
  జిలేబి

  ReplyDelete


 83. ఓసోసి ఉల్లిపాయ! వి
  కాసిత మఖగంధకమ్ముగా తాంబూలము
  గా సెహ భేషుగ నర్హత
  నే సాధించితివి నేర్పు నీదే సుమ్మీ :)


  జిలేబి

  ReplyDelete


 84. వారెవరో యెవిరికెరుక!


  ఎవరోయి జిలేబీ తా
  నెవరోయీ ? మదిని తొలుచు నేస్తంబై ని
  ల్చు విరాట్టెవరోయీ? రె
  డ్డి, వివరములరయగ బాపురే మన తరమా

  జిలేబి

  ReplyDelete


 85. నోటిని పండ్లే లేవోయ్
  చాటెద వంకాయకూర చకచక చేయన్
  వాటముగా "నెట్లో" నా
  మాటామంతియిది నేటి మగువల్లారా :)

  జిలేబి

  ReplyDelete


 86. మేని సుఖములకు భోగియె
  సానిన్ ముద్దాడె, యోగి సద్గతిఁ బొందన్
  కాననమున ముద్దాడెను
  ధ్యానమ్మును, మది నడతని దాని ఫలితముల్!

  జిలేబి

  ReplyDelete


 87. మేని సుఖమ్ములన్ బడయ మేలములాడుచు భోగి నెయ్యమిన్
  సానిని ముద్దుపెట్టుకొనె, సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్
  కాననమందు దీక్షని వికారము లెల్లతొలంగ చిత్తమున్
  ధ్యానము నందు నిల్పె; మది దారిని దాని ఫలమ్ము జీవికిన్!


  జిలేబి

  ReplyDelete


 88. మేనక తిలోత్తమలు మన
  సా నిన్ ముద్దాడె! యోగి! సద్గతిఁ బొందన్
  దేనికి లొంగక నీవా
  ధ్యానమున నిమగ్నమై సదా యుంటివిగా!


  జిలేబి

  ReplyDelete


 89. చానలతో సరసమె "ని
  త్యానంద" మటంచు రసికతయె మార్గముగా
  పానుపు పై పవళింపుల
  సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్!


  జిలేబి

  ReplyDelete


 90. గృహస్తాశ్రమ ధర్మము

  మీనా కుమారి సుదతిని
  మేనిని తా నిడుకొని పరిమితపిలఱేడై
  ధ్యాన పథము విడువక దొ
  ర్సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్!


  జిలేబి

  ReplyDelete


 91. ఎవరోయి జిలేబీ తా
  నెవరోయీ ? మదిని తొలుచు నేస్తంబై ని
  ల్చు విరాట్టెవరోయీ? రె
  డ్డి, వివరములరయగ తెల్పుడీ మన తరమా :)


  జిలేబి

  ReplyDelete


 92. కవి' పదంతో నాలుగు పాదాలను ప్రారంభిస్తూ
  భారతార్థంలో
  నచ్చిన ఛందంలో పద్యం

  కవిగొన కోరెద బావా
  కవిదల లో సంగ్రహీతగా నాకై యా
  కవియము బట్టి నను నడుప!
  కవియించుమయా విజయుని గా సార్థకతన్!

  జిలేబి

  ReplyDelete


 93. జీపీయెస్ వారి తరపున వారి ఫేవరెట్ రాహులయ్య నేటి భారతం :)


  కవిదల యెన్నికలన్ జో
  క విడివడుచు రాహులయ్య కాంగ్రెస్సునరే
  కవికన్ విడిచిన హరివలె
  కవియించెడు థాయిలాండు కై పరుగులిడెన్!


  జిలేబి

  ReplyDelete


 94. సందింటి జగనుడీతడు
  సందియము వలదిక జనుల సంక్షేమమ్మే
  డెందపుటానందముగా
  పొందిన "లా నేస్తుడు" మన పుడమిదొర భళా :)  జిలేబి

  ReplyDelete


 95. సహనమ్ము కిరీటమ్మగు
  బహుసుందరముగ మనుజులు పరిణితి చెందన్
  విహరింతురు జనుల మదిని
  నహరహమున్ పేరుగాంచిన ప్రభువు లగుచున్


  జిలేబి

  ReplyDelete


 96. ఒకవైపు నీతులున్ మరి
  యొక వైపిక బూతులున్ పయోధరముల తూ
  గు కథల్, టిట్బిట్సుల నే
  వకమ్ము మా స్వాతి సపరి వారంపు ప్రతిన్ :)

  నారదా!
  జిలేబి

  ReplyDelete


 97. తెలుసు కొనవె జిలేబీ మితియె నెరవుగ
  రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గా దె
  పుడు జనులకు! మేలు కలిగె పుణ్యమనగ
  సుఖము లెల్ల విరివిగాను శోభలలర!

  జిలేబి

  ReplyDelete


 98. వెతుకను మచ్చుకైన కనువిందగు వారలు కానరారు! భ
  వ్యత యొక యెండమావి గ సవాలుగ జీవులకెల్ల కాన్బడెన్
  అతుకుల బొంత జీవితమనాదరణల్ నిలువెత్తు! యేమిరా
  బ్రతుకిది రామరాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్!

  జిలేబి

  ReplyDelete


 99. యువతులాటవస్తువులయి యూతలేక
  మానభంగములకు గురి! మచ్చుకైన
  న్యాయ మన్నది లేదె! వినాశమేను
  రామ! రాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె?
  జిలేబి

  ReplyDelete


 100. వంకాయమ్మను యుమ యని
  నింకను శంకరునిసతియనిపిలుతురయ! ఆ
  వంకాయమ్మమొగుండగు
  శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్


  జిలేబి

  ReplyDelete


 101. ఆకాశవాణి కి పంపినది :)


  ఖంకరమును సరిజేసెను
  శంకరుడు‌మకొరకు, పారిజాతము తెచ్చెన్
  కంకిణిగా, దేవేంద్రుడు
  రంకెలు వేయంగ నడచి వ్రజవల్లభుడే!
  జిలేబి

  ReplyDelete


 102. అంకిత మైన భర్త యగు నాతడు పెండ్లము కోర్కె మేర లో
  వంక భుజమ్ము లానతిని వంకలు బెట్టక వేగవేగమై
  డొంకల వాగులన్ వెదికి డుండుభమొక్కటి దారి చూపగా
  శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్!


  జిలేబి

  ReplyDelete


 103. Enjoy Maadi :)

  జీవితము‌న సంతసింప వెరవకు! కా
  యమున కగును బూది యగుట యెపుడొ
  దాని చింత వలదు ! దమ్ముబట్టి యనుభ
  వించు నరుడ యెల్ల వేళలందు


  జిలేబి

  ReplyDelete


 104. ఘుమఘుమ లాడ జీవితపు గుల్యము గాఢముగా సుఖమ్ములన్
  తమకము తీర పొందవలె! దమ్మును బట్టుచు సాగిపొమ్ము! కా
  యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్
  చిమచిమలాడు యోచనల చిక్కిన కాలము వట్టి చేయకోయ్


  జిలేబీయం :)
  జిలేబి

  ReplyDelete


 105. ఆటవెలది పాద గర్భిత కందము


  బాదరబందియె నిజమని
  మోదనములవేలనొకొ! ప్రమోది జిలేబీ!
  సోదరి! కా"యమున కగును
  బూది యగుట యెపుడొ" పడకు బూకని వినుమా!


  జిలేబి

  ReplyDelete


 106. చాముండేశ్వరి యనెడా
  క్షామ నివారణపు నాటకమున జిలేబీ
  మా మిత్రులు నటులు ! భళా
  కాముండే దున్నపోతు గణపతి కపియౌ!


  జిలేబి

  ReplyDelete


 107. నీమము గా జనాంతమున నెమ్మిని బాసట చూప మిత్రులా
  క్షామ నివారణంపు సహకారపు ద్రవ్యము సేకరింప మా
  గ్రామము నందు నాటకము "రాముడు భీముడు" వేయగానట
  న్కాముఁడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్!


  జిలేబి

  ReplyDelete


 108. సోమరి వలె పని లేని స
  కాముండే దున్నపోతు, గణపతి! కపియౌ
  వేమారులటునిటు తిరుగు
  సామర్థ్యమ్ముకలవాడు సాధించుటలో!

  జిలేబి

  ReplyDelete


 109. భామల మది కెలుకునెవడు?
  స్వామి యముని వాహనమెది ? శంకరి తనయుం
  డో? మదిని రాముని నిలిపె?
  కాముండే; దున్నపోతు; గణపతి; కపియౌ.

  జిలేబి

  ReplyDelete


 110. చూడగా తల తిరిగె బుసుబుసటంచు
  మేడ నెక్కఁగ, దిగవలె మూఁడు మెట్లు
  దిగి మరల యెక్కుడీ ముప్పదియని వ్రాసి
  యుండి రచ్చట! యిదియెట్లు యుక్తమౌత!  జిలేబి

  ReplyDelete


 111. చూడగ సూచనొక్కటిని, చొక్కుని తేలెను బూదకాయమే
  మేడనుఁ జేర, "రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్
  పాడుచు నేసునామమును ప్రార్థన చేయుడు మీకు మేలగున్"
  పాడితి వేడుచున్ దిగితి ఫాదరు మెచ్చిరి దక్కె ముత్తియే


  జిలేబీయము

  ReplyDelete


 112. ఒక శయము చేయు దానము నొక కరమున
  కు తెలియక చేయు మనుజుడె కోమలాంగి
  దాత యనఁబడు; దాత తాన్ దాత గాఁడు
  దాత ననుచు దంభనముల దాపరింప


  జిలేబి

  ReplyDelete


 113. ఓ పరలోకములో నున్న తండ్రి ఈ పాపుల క్షమింపుము


  చేతుల నెత్తి మొక్కుము సచేతను డాతడె యేసునాధుడే
  దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ; దాత గాఁడు పో
  నీ తవిషిన్ మరెవ్వడు! వినేతృని గా మన జీవితమ్మదే
  పాతకమార్గమున్విడువ భారపు కొఱ్ఱుని నెక్కి నిల్చెగా  జిలేబి

  ReplyDelete


 114. పీతల మంగపు కతలన్
  మా తాతయ్య ప్రచురించె మరల జిలేబీ
  యేతావాతా యేదై
  నా తాత్పర్యము కలదకొ నాతుక తెలుపన్ :)

  జిలేబి

  ReplyDelete


 115. ఆటవెలది పాద గర్భిత కందము :)


  సహనమ్ము లేని మనుజుల
  బహణెని చూడగ క్షణమున భగ్గను కణికల్!
  అహ! గడ్డిపోచ చాలు క
  లహమునకు జిలేబి రేగు లావుగ మంటల్


  బహణె : శాస్త్ర పరిభాష, వ్యవహారిక కోశము (దిగవల్లి వెంకట శివరావు) 1934 Report an error about this Word-Meaning
  నెపము; ఉపాయము; Pretence; Excuse; Contrivance; Evasion

  జిలేబి

  ReplyDelete


 116. తలపుల తప్పు గాదు! తమ దారిని బోవుచు రాజకీయమున్
  విలువయె లేని సంగతుల వేడిగ ఘాటుగ చర్చ చేయగా
  పలుకులు తిట్లు గా మరలి బాదరబందిని తిట్టుకొంచు నా
  కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే!


  జిలేబి

  ReplyDelete


 117. శరషట్పద


  సహనమ్ము లేని
  మనుజుల బహణెని
  చూడగ క్షణమున భగ్గను కణి
  కల్! గడ్డిపోచ
  చాలు కలహమున
  కు జిలేబి రేగు జ్వలనమహో


  జిలేబి

  ReplyDelete


 118. తెలుగు నాట జనుల తీటయె తీట సు
  మ్మీ జిలేబి పాకమేను రగడ!
  రాజకీయ మనెడు రచ్చని చర్చింప
  గడ్డిపోచ చాలు కలహమునకు!


  జిలేబి

  ReplyDelete


 119. ఉల్లిపాయపైన లొల్లియు హెరిటేజు
  నీదనెడు రగడల నెత్తిపొడుపు
  రెండు చేతులెత్తి రీతినమస్కృతి
  గడ్డిపోచ చాలు కలహమునకు :)


  జిలేబి

  ReplyDelete


 120. కర్నూలులోన కాఫియు
  వర్నా తిరుపతిని లడ్డు వరుసని సెల్ఫీ
  డర్నామత్ సాబ్ చెన్నై
  మెర్నా బీచిని కలిసెదమీ సారి సుమీ :)


  జిలేబి

  ఓర్నాయనో! జిలేబీ
  కార్నామాల్ సెప్ప కమలగర్భుని వశమే?

  కంది శంకరయ్య :)

  ReplyDelete


 121. మాయామచ్చీంద్రా విను
  మా! యింటింటను విరివిగ మధురిమ లలరన్
  తీయని జిలేబులుండగ
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్?

  జిలేబి

  ReplyDelete


 122. ఓయమ! గేస్తురాల! విను! నోర్మిని నోచుకొనమ్మ గేస్తుడిన్
  సాయము బట్టియాతనికి జాంగ్రి, జిలేబులు బాదుషాల్ వడి‌న్
  ప్రాయపు మాయ చేయు మదిరమ్ముగ నీవిక కొల్లగొట్టగా
  పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్?

  :)


  జిలేబి

  ReplyDelete


 123. ఆటవెలది పాద గర్భిత కందము

  కోపపు పల్కుల వలదు సు
  మీ పట్టింపులు తగవులు మింకిరి తనముల్
  పాప! పగను మున్గ నడఁగుఁ
  బాపచయము? వలదె పోరు పడతి విడువుమా!


  జిలేబి

  ReplyDelete


 124. ఆకాశవాణికి పంపినది


  మిగులన్ దోపరి గాండ్లుగా విడువకన్ మేలంపు కాలమ్ములన్
  సెగలన్ గ్రక్కెడు తీక్ష్ణదారముల నిశ్శేషమ్ముగా కుత్తుకల్
  తెగగోయన్ వెనుకాడకన్ భగభగా దివ్సాలు దివ్సాలుగా
  పగలో మున్గిన వారి పాపచయముల్ భస్మంబులౌ నెప్పుడున్?


  జిలేబి

  ReplyDelete


 125. ఆయాసమనక తాగును
  పాయసమన_, నెవ్వఁ డిష్టపడు నీజగతిన్
  సోయాసాసుల గబ్బుని
  శ్రేయస్సగు తెలుగు వంట చేవయె వేరోయ్ !

  జిలేబి

  ReplyDelete


 126. ఓయి అమాయకుడ! జనుల
  కాయాసము జేర్చునయ్య! గట్టిగ యనక
  య్యా! యీ కాలము లోనన్
  పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్?

  జిలేబి

  ReplyDelete


 127. బిడ్డ! మెక్కమాకు ప్రీతిని! విడువుము
  మితము గాని తిండి! మేలు సేయు
  నెపుడు సంయమనపు నెరియగు బువ్వయె
  విను జిలేబి మాట వెంకటేశ!


  జిలేబి

  ReplyDelete


 128. సుతరామూ సరి కాని మాటయె సుమా సుబ్బన్న! మాంద్యమ్మగున్
  మితమే లేక భుజించినన్ జనులకున్; మేలౌఁ గదా చూడఁగన్
  హితమై యోగ్యపు బువ్వతీసుకొనగా! హేఠమ్ము కల్గించక
  య్య తనాయించెడు రీతి గా కడుపు హయ్యారే విభేదిల్లగాన్

  జిలేబి

  ReplyDelete

 129. ఇది కలియుగ మాయె! యెవరి యిచ్చ వారి
  దాయె! యేది నిత్యమగు సత్యమని తెలుపు
  మంచిని వినుటకు జిలేబి మనుజులకదె
  తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు!


  జిలేబి

  ReplyDelete


 130. బిజి బిజీ మన్ డే మార్నింగ్ లో హైస్పీడు నగరమ్ములో కవిసమ్మేళనమంటే చెవికోసుకునే వారెక్కడండి :)

  తెలవారెన్ కవివర్యులింక మహతిన్ తీర్చంగ సమ్మేళన
  మ్మిల శ్రీ వేంకట నాథుడి‌న్ పురములో మించారు సందోహమున్
  తిలకింపంగను వచ్చువారెవరకో? తిండాడుకాలమ్ములో
  తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా


  శుభాకాంక్షలతో
  జిలేబి

  ReplyDelete


 131. వచ్చిరి బ్లాగ్జ్యోతిష్కులు
  గుచ్చిరి జరిగిన కథలను గుచ్ఛముగా తా
  విచ్చిరి యారు గ్రహములకు
  పచ్చదనమ్ములిక కాలి భగ్గను నంటా :)  జిలేబి

  ReplyDelete


 132. అరరె కవిత్వము పేరిట
  వరలెను గా పిచ్చి పిచ్చి పసలేని పదాల్
  చురచుర చూచు విమర్శకు
  లరరే కనరారు కత్తులను దూయంగన్ !

  జిలేబి

  ReplyDelete


 133. కానుకయిద్ది యపూర్వం
  బైనది మాలాంటి కృష్ణభక్తులకండీ
  మానసచోరుండాతడు
  వేణువు నూద మది పొంగు వేగము గానన్

  జిలేబి

  ReplyDelete


 134. కాలము గోధూళి సమయ
  మాలయపు వెనుకల పొంచె మరణము వడిగా
  చేలను పడి దూకుచు శా
  ర్దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్

  జిలేబి

  ReplyDelete


 135. బాలపు ప్రాయమాయె! పరి వారము తప్పుచు దారిమారి పో
  గాలము దాపురించగ నెకాయెకి కాననమందు దూరగా
  కాలము పొద్దుగూకె! కెడ కాలయముండట యాననీయ శా
  ర్దూలము పెచ్చురేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై


  జిలేబి

  ReplyDelete


 136. సిటీ వాసులకేమి తెలుసు ఏదో ఒహటి రాసి పడేస్తారు :)


  కలుహారములకు మరియు క
  మలములకున్ తారతమ్య మరయని నగరం
  పు లలన జిలేబి పలికెన్
  కలువలు వికసించె రవినిఁ గాంచి ముదమునన్


  జిలేబి

  ReplyDelete
 137. RRR కి సూటయ్యే టైటిల్ అడుగుతున్నారట జక్కన్న!
  "రఘుపతి రాఘవ రాజారాం" అయితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా!☺️

  ReplyDelete
  Replies

  1. కొంత వివరింపుడి

   జక్కన్న యెవరు ?

   Delete
  2. "జిలేబి" గారు,
   "జక్కన్న" యెవరో ఇంత వరకు చెప్పనేలేదా సూర్య? Very bad.‌

   సరే, నాకు తెలిసినది నేను చెబుతా, ఆలకించండి. S.S.రాజమౌళి గారని తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖుడు వెలుగొందుతున్నాడు. "యమదొంగ", "బాహుబలి" లాంటి పాషాణాలను తీసిన దర్శకోత్తముడు. వారు ఒక సినిమాను రూపొందించడానికి ఆ పాషాణాన్ని ఒక శిల్పిలా "చెక్కుతార"ట (ఇతర డైరెక్టర్లు ఎలా రూపొందిస్తారో మరి?) ... ఇంకేం, శిల్పి తో పోలిక తీసుకొచ్చాక అలనాటి "అమరశిల్పి జక్కన్న" గుర్తుకు రావడం ఎంతసేపు? ఇంకా ఆలస్యం ఎందుకు, వారికి "జక్కన్న" అనే పేరు తగిలించేశారు సినిమా వాళ్ళే ఎవరో. ఆ రంగంలో బిరుదులు మీద మోజు ఎక్కువ గదా. ఇవన్నీ ప.కు.మ. ఆనందాలు.

   Delete
  3. ఈయన ఇంకా చేయి కోసుకోలేదు. వచ్చే సినిమా ఫ్లాప్ అయితే చెప్పలేము సుమా!

   "ప.కు.మ." అంటే ఏమిటి సార్?

   Delete
  4. జై గారు,
   // "ప.కు.మ." అంటే ఏమిటి సార్?"//
   --------------
   హ్హ హ్హ హ్హ, అది ఎవరికి వారు figure out చేసుకుంటే ఉత్తమం, జై గారు 🙂👍. సరే మీరు అడిగారు కాబట్టి ఒక జోక్ మాత్రం చెబుతాను, ఆస్వాదించండి 😃.

   ఒక వ్యక్తిని మేజస్ట్రేట్ గారి దగ్గరకు తీసుకువచ్చాడు పోలీస్. ఏం చేశాడితను అని పోలీస్ ను అడిగాడు మేజిస్ట్రేట్ గారు. ఇతను పబ్లిగ్గా బూతులతో తిడుతున్నాడు, దొరా అన్నాడు పోలీస్. మరి దానికి నువ్వేం చేశావు అని అడిగాడు మేజిస్ట్రేట్ గారు. ఛస్, ఇసుమంటి మాటలు మర్యాదస్తుల దగ్గర మాట్లాడకూడదు. నిన్ను కోర్టుకు తీసుకువెళతాను, ఈ మాటలన్నీ మేజిస్ట్రేట్ బాబు చెవిలో చెప్ఫు అని ఆ పళాన ఈడ్ని మీ దగ్గరకు తోలుకొచ్ఛాను బాబూ ... అని జవాబిచ్చాడు ఆ పోలీసెంకట సామి 😃.

   Delete


  5. నెనరుల్స్ విన్నన్న వారికి జవాబులకు !

   విన్నన్న! రాజ మౌళియె
   మిన్నగ జక్కన్నయా! జిమిక్కుల వాడం
   చన్నారా నతడిని జ
   క్కన్నాయని ? తేటతెల్లగా విశదమయెన్ :)


   జిలేబి

   Delete


  6. ప.కు.మ! మనుజులెవరండీ
   చకచక చెప్పండి ప్రైజు చక్కగ గెలవం
   డి!కరకర జిలేబులివిగొ
   టకటక లాగించుడీ తటాల్మని రండీ :)


   జిలేబి

   Delete
  7. స్వకుమల విని యుంటిమి , మరి
   పకుమలు కూడా గలరను పలుకుల నిపుడే
   సకలాగమ విదులు నరస
   వికచాబ్జాక్షులు వలుకగ వింటిమి భళిరా !

   Delete

  8. న, రస వికచ అబ్జ‌ అక్షులు :)

   Delete
  9. సరసులు సరసీరుహ హృ
   త్సరసులు నరసింహరావు సారు , తవ రిలా
   విరసములు వలుక తగునా ,
   యర విరిసిన పద్మనయన ! హరినీల మతీ !

   Delete
  10. మీ మంచిమాటలకు, నన్ను సమర్ధించినందుకు ధన్యవాదాలు, రాజారావు మాస్టారు. “జిలేబి” గారి పేరులో మాత్రమే తీపి, మాటలో వ్రాతల్లో మాత్రం వెట”కారం” ఎక్కువ, మనందరికీ తెలిసిన సంగతేగా.

   పొద్దున్నించీ కాస్త నలతగా ఉండడం వల్ల ఇవాళ వాట్సప్ వైపు ఎక్కువ రాలేదు. అందులోనూ ఇవాళ ప్రపంచ ఆధునిక గణిత శాస్త్ర పితామహుడు మన భారతీయుడు Srinivasa Ramanujan, FRS గారి స్మృత్యర్ధం govt ప్రకటించిన National Mathematics Day కూడానూ. దీన్ని గురించి వేరే వ్యాఖ్య వ్రాస్తాను కాసేపటి తర్వాత.

   సరే గానీండి, మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు మాస్టారు - కోవిదుడు వగైరా అంటూ. నేను తగనండీ. అసలు అంత “కోవిదుడు” ను అయితే ... ప్రెసిడెంటే అయ్యేవాడినేమో (just joking. ఆయనెక్కడ, నేనెక్కడ?🙏).

   అయినా అంత పండితులైన మీకు “ప.కు.మ” అర్ధం కాలేదంటున్నారు అంటే మీ ముందు నేనెలా కోవిదుడను అవుతానండీ 🙏?

   (అయినా “ స్వ” తెలుసన్నారు కదా, మరి అదే అలవరసలో “ప” దేన్ని సూచిస్తుందో కనిపెట్టడం మీకు అరక్షణపు పని)

   Delete
  11. 🙏🙏🙏లు నరసింహరావు గారూ ,
   మీరేమిటో నాకు తెలుసు . పైకెత్తడం కాదు .
   మా అందరిలోకీ మీరు అన్ని విథాలా మీరు ఉన్నతులు. పకుమ అలవరస అర్థమైంది .
   స్వకుమ యూసేజ్ విన్నాను , పకుమ వినలేదే .

   Delete


  12. జిలేబి” గారి పేరులో మాత్రమే తీపి, మాటలో వ్రాతల్లో మాత్రం వెట”కారం” ఎక్కువ,

   కరకర జిలేబి :)


   వామ్మో ! ఇంత బేషింగా మా పై ?


   జిలేబి

   Delete


  13. పకుమ స్వకుమ అనగా నేమి ?

   Delete


  14. తియ్యదనము నామమ్మున
   చయ్యను వెటకారమాయె సాటినరులపై
   నెయ్యపు పల్కులు కనరా
   వయ్యా రాజన్న! గ్రుచ్చు బడిని జిలేబీల్ :)


   జిలేబి

   Delete
  15. జిలేబి” గారు,
   Srnivasa Ramanujan, FRS గారి గురించి వ్యాఖ్య వ్రాస్తానని నిన్న ఇక్కడే రాజారావు మాస్టారినుద్దేశించి వ్రాసిన నా వ్యాఖ్యలో అన్నాను, గమనించారా?

   నిజానికి నా ఈ వ్యాఖ్యలో ప్రత్యేకించి రామానుజన్ గారి గురించి చెప్పడానికేమీ లేదు, నేను చెప్పగలవాడినీ కాదు. నిన్న ఆ మహానుభావుడి జయంతి (డిసెంబరు 22). గవర్నమెంటు వారే డిక్లేర్ చేసిన National Mathematics Day ప్రతి సంవత్సరం. అటువంటి ప్రత్యేకదినం సందర్భంగా ఆ మహానుభావుడిని మన తెలుగు బ్లాగులోకం బ్లాగర్లలో ఎవరైనా తలుచుకోకపోతారా అని రోజంతా ఎదురు చూశాను. కానీ కృష్ణరాయబారం పద్యంలో ... ఒక్కండును, ఒక్కండును, ఒక్కండును ... అన్నట్లు అయింది అనిపించింది 😩 పోనీ పెద్దవారు, తెలిసినవారు మీరైనా ఓ రెండు పద్యాలు సమర్పిస్తారేమో అనుకుంటే మీరేమో కన్నులెన్ని, కుచములెన్ని లాంటి పద్యాలలో బిజీ బిజీగా ఉన్నారు. చివరకు నిన్న దీపాలు పెట్టిన చాలా సేపటికి రెండు మూడు గంటల తరువాత చైతన్యుడు తన “తెలుగోడి రాతలు - కూతలు” బ్లాగులో “జాతీయ గణిత దినోత్సవం” అని ఒక టపా పెట్టారు, సంతోషం అనిపించింది 🙏 .

   సరే, తేదీ మారిపోయింది, రాత్ గయీ బాత్ గయీ అన్నట్లయింది. అయినా ఫరవాలేదు, ఇప్పుడైనా ఓ రెండు పద్యరత్నాలు పెట్టండి రామానుజన్ గారి గౌరవార్థం. ఎంతైనా శ్రీనివాస రామానుజన్ గారు మన దేశపు icon లలో ప్రముఖుడండీ, మనమే స్మరించుకోకపోతే ఎలాగ?

   https://sskchaithanya.blogspot.com/2019/12/blog-post_22.html?m=1

   Delete


  16. వచ్చె నతడనంతము దా
   టొచ్చెన నంతము తెలుప పటుత్వపు లెక్కల్
   మెచ్చగ లోకంబెల్లను
   విచ్చిన పువ్వువలె తావి విరజిమ్మి చనెన్ !


   జిలేబి

   Delete
  17. నాదీ ఒక పద్యం

   మానుగ విశ్వ మంతయు ప్రమాణముగా గణితాంతరంగమై
   పూనికతో చలించునట , మూలము లెక్కలె , శ్రీనివాస రా
   మానుజు కీర్తి గొప్పది సుమా గణితాన , ప్రపంచ మంత యెం
   తేనియు గుర్తు జేసుకుని ధీనిధికిం గడు గౌరవమ్మిడున్ .

   Delete


  18. రామానుజుడని నామ
   మ్మా మానవునికిడ మాథమాటిక్సాయెన్
   ప్రామాణికమ్ము చూపె న
   సామాన్యంబైన ప్రతిభ శ్లాఘింప జనుల్


   జిలేబి

   Delete
  19. ఇది భేషుగ్గా ఉంది, సముచితంగా ఉంది 👏.
   ధన్యవాదాలు “జిలేబి” గారు 🙏.
   ధన్యవాదాలు రాజారావు మాస్టారు 🙏.

   Delete
  20. సారీ ! జిలేబి గారే
   సారూ ! తవరికి ప్రధములు సరి రాలే మే
   సారీ మేమవ్వారికి
   నారయ నెందేని , బుధ వరాన్వయ సరసీ !

   Delete


 138. నారదా! నీహారిక వారెక్కడున్నా శంకరాభరణమునకు వెళ్ళవలె :)


  భారీ వాల్పోస్టరులో
  చీరలు స్థానము విడువగ చీర్సను కైపుల్
  వారిరుహనేత్రయొకతెయు
  నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్


  జిలేబి

  ReplyDelete


 139. ప్రేరణగా సమ్ముఖిలో
  నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్
  వారిజలోచన యా నీ
  హారిక రతగురువు చెంత హాయిగ చేరెన్!

  ReplyDelete


 140. దారిని మగనికి కోతుల
  నారీమణి యొకతె చూపె నాలుగు; కుచముల్
  తీరుగ గోకుకొనుచు వి
  స్తారముగా తిరుగ చుండె తరువుల చెంతన్


  జిలేబి

  ReplyDelete


 141. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారనుకొంటే ఏదన్నా సాధ్యమే !


  సారామత్తును మీరెడా చమకులన్ సాధించు క్రొంగొత్తగా
  భారీచిత్రము దర్శకేంద్రునిది విస్ఫారించు కన్దోయితో
  ప్రేరేపించెడు కైపు చూపులమరన్ రేకెత్తగా కోరికల్
  నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్!


  జిలేబి

  ReplyDelete


 142. ఇల్లరికపు టళ్ళుల్లన
  చిల్లర మల్లరయని తలచితిని! ఫణీంద్రుల్
  వల్లభులనే సెబాసో
  యిల్లరికపు వాండ్లుగ ప్రకటించిరి సుదతీ!


  జిలేబి

  ReplyDelete


 143. ఓరోరీ యేమంటివి?
  నారీమణి యొకతె చూపె నాలుగు కుచముల్?
  వారెవ్వా బ్రేకింగ్ న్యూ
  సా! రవ్వంతయు నరరె విచక్షణ లేదే!


  జిలేబి

  ReplyDelete


 144. చేరన్ పద్మసరోవరమ్ము తపమున్ చేయన్ కటాక్షమ్ముగా
  చేరెన్ లక్ష్మియు నొక్క ఛాతి నలమేల్ చేరంగ వేరొక్కటిన్
  తీరైనట్టి ముఖమ్ము స్వామిది సదా తీర్చున్ వెతల్ బ్రోవుమా
  నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్!


  జిలేబి

  ReplyDelete


 145. అలుకను మానుమిక సఖీ
  చలిపులిఁ గని; వేవెలుంగు చయ్యనఁ బాఱెన్
  నులివెచ్చగ కప్పుకొనెద
  నెలతుక రావే సరసకు నెయ్యము బారన్


  జిలేబి

  ReplyDelete


 146. అలిగితి వా సఖీ ప్రియతమా! అలుకన్ సరి మానవే వయా
  రి! లలిత మైన రాత్రి యిదె రివ్వున నాదరి రా! జిలేబి! నీ
  పలుకుల తీపు గాత్రమగు పారునికై చెలి రావె రావె! ఆ
  చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్!


  జిలేబి

  ReplyDelete


 147. ఆకాశవాణి కి పంపినది :)


  విలవిల లాడి చిక్కగను భీకర కోరల ధాటి చీల్చుచున్
  దులుపుచు జూలు గుర్రనుచు దూకగ చట్టని పైన, పారెనా
  చలి, పులి పల్కరించగనె, చయ్యన పారె సహస్ర రశ్మియున్
  జలజల పారగా కనుల చందిరమయ్యరొ వీడె స్వప్నమే  జిలేబి

  ReplyDelete


 148. జగనుడి 47 వసంతాలకు :)


  జగనన్న పుట్టిన దినమి
  దిగిదిగొ నేతన్నలకు పదిలమయ్యె జిలే
  బిగ హస్తమిదిగిదిగొ! రం
  డి గహ్వరీపతికి వడివడి తెలుప జేజేల్!

  జాల్రా
  జిలేబి

  ReplyDelete


 149. తెంగ్లీషుమాటలాడెడు
  కంగ్లీ జనులార రండు కబళంబిదిగో!
  ఇంగ్లీషు మేము సాహిబ
  బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్!

  జిలేబి

  ReplyDelete


 150. ఇంగ్లీషేల తెలుంగు చాలు వినుడీ యింగ్లాండు లోసైతమున్
  జంగ్లీలెల్లరు మాతృభాషయె ప్రశస్తంబంచు నేర్పింతురే!
  కంగ్లావాళ్లవకండి!రండి! నడుమున్ కట్టండి! ఆంధ్రంబనే
  బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్


  జిలేబి

  ReplyDelete


 151. తాతగారి బాలాగు వైరాగ్యము :)


  ఆలోచనలు కలిగె పో
  బాలాగు టపాని చదువ పారుల కచటన్
  మేలైన బతుకెదియనన్
  చాలదు గా జీవితమ్మసలు తెలుసుకొనన్


  జిలేబి

  ReplyDelete
 152. జిలేబి గారి వెటకారం లో కూడ నాకు మమకారమే కనపడుతుంది.

  ReplyDelete
  Replies

  1. మా బంగారు కొండ బోనగిరి గారు :)

   Delete


 153. తెలిపిరి అడిగిన క్షణమే
  సులభమ్ముగ నర్థము వరసుగుణపు రాయా
  కలరా మీవంటి జనులి
  లలో జిలేబీయమై కలకలల రేపన్

  జిలేబి

  ReplyDelete


 154. తేనీటిని సేవించక
  నే నా దాహము తొలంగె! నే కతుకకనే
  నానా విధరుచులు తెలిసె!
  వానలు లేకుండ మెట్టవరి ఫలియించెన్!

  జిలేబి

  ReplyDelete


 155. ఎవరాయన ?


  తానొక సిద్ధియోగుడు! సితాగ్రపు తీక్షణ దీక్షతోడుతన్
  వీనులవిందు గాత్రమున ప్రేమయె దేవుని కానవాలటం
  చా నవబిందువృత్తమును క్షామము తీరగ వేసికొల్వగా
  వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే!  జిలేబి

  ReplyDelete


 156. చానల్లు త్రిప్పుచునరరె
  నేనా పడకని మయికపు నిదురని తొంగొ
  న్నా నంతలోన స్వప్నము!
  వానలు లేకుండ మెట్ట వరి ఫలియించెన్


  జిలేబి

  ReplyDelete


 157. ఆటవెలది పాద గర్భిత కందము


  విపరీతపుటాలోచన
  ల,పరిస్థితుల పఱిగొని కలకలములను రే
  పు,పొలసు పూల వలనఁ జెడె
  ను పుష్పవనము భరతమ్మ నుడి సత్యమ్మే!  జిలేబి

  ReplyDelete


 158. గెడ్డ మందు గలదు కెంపుకంటి! పడచు
  దనము; ముదిమి నాటి తరపు జనులు!
  కుర్రకారుల సొబగులెటుల తెలియును
  పాత చింతకాయ పచ్చడాయె!


  జిలేబి

  ReplyDelete


 159. మూకుమ్మడిగా నరుడా
  చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిది యే
  తేకువయున్ కాదు సుమా
  యీ కలి కాలంపు జీవి యిక్కట్ల గనన్  జిలేబి

  ReplyDelete


 160. చీకాకులు తొలగును సు
  మ్మీ కష్టములే స్థిరమని మీరనుకోకం
  డీ! కరుణామయు దయ చన
  చీకటియే, వెలుఁగు నిచ్చు జీవిత మిదియే


  ఆమెన్
  ప్రభువు దయ యెల్లరికీ వుండు గాక

  జిలేబి

  ReplyDelete


 161. ప్రభువా ! అందరిని కాపాడుమా


  ఆకస మందు గాన్పడు సమాకలితమ్ముగ వెల్గురేకలే!
  మీకిక కష్టముల్ తొలగు ! మిన్నుల మీరు కృపాళు ప్రీతితో
  మీకడ గండ్ల తేర్చును సుమీ! యిది క్రిస్మసు వేళ పాఱునా
  చీకటియే! వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా!


  జిలేబి

  ReplyDelete