రాతిరి
పొద్దు పొడిచింది.
తెల తెల వారింది
సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి తో
టేబులు పై ముద్దు లాడింది కాఫీ తో.
( నా మొదటి వచన కవిత)
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
రాతిరి
పొద్దు పొడిచింది.
తెల తెల వారింది
సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి తో
టేబులు పై ముద్దు లాడింది కాఫీ తో.
( నా మొదటి వచన కవిత)
జిలేబి
-
ReplyDeleteనా మొదటి వచన కవిత
ఆహా ! యెంతో అద్భుత ,
ReplyDeleteమోహో ! భావము జిలేబి బోలు మధురసా
స్వాహా భరితం , బికపై
ఈ హోరున బడి జనాల యేడుపు చెలగున్ .
-
ReplyDeleteఇక మీదట రాస్తా విడు
వక వచన కవిత్వమే సువాసనల జిలే
బికి సంపూర్ణమగు తెలుగు
నకున్ బలి జనాళి చదివిన మరునిముషమే
-
ReplyDeleteకోతి చేతికి పూమాల కుప్ప దొరికె
పీకి పీకి చెదుర వేసె పిచ్చి ముదుర
తిట్టి తిట్టిపోయ జనులు తిరిగి తిరిగి
పీకి వేయనారంభించె బెట్టు జూపి
రామా ! నిను గూర్చి తలచి ,
ReplyDeleteధీమముగా వ్రాయ విడిచి , తిట్లురకగ , ఈ
తామస జిలేబి కవివరు ,
లేమేమో వ్రాయుచుందు , రేలనొ దెలియన్ .
-
ReplyDeleteఇదియొక అద్భుతము ! కవిత
లిదివర కెంపిక యెలా సలిపిరొ కదాండీ ?
మదినిండుగ నాసక్తి గ
లదండి నాకు తెలుసుకొని లబ్ధిని పొందన్
-
ReplyDeleteఉండేది రాము డొకడే
కందువగా నభయమిచ్చు కరుణానిధి యెం
దెందు వెతికినన్ గలడం
దందున శరణన్న వారి ధర్మప్రభువై !
-
ReplyDeleteతామసపు జిలేబి పదము
లే మాత్రంబర్థమగును లే యెవ్వరికిన్?
కామా ఫుల్ స్టాపులు కన
రామస్సలు పద్యమందు రావడియొకటే!