Sunday, March 29, 2026

రాత్రి పొద్దు పొడిచింది

 


రాతిరి

పొద్దు పొడిచింది.


తెల తెల వారింది


సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి తో 


టేబులు పై ముద్దు లాడింది కాఫీ తో‌.




( నా మొదటి వచన కవిత)


జిలేబి





12 comments:

  1. -

    నా మొదటి వచన కవిత

    ReplyDelete
  2. ఆహా ! యెంతో అద్భుత ,
    మోహో ! భావము జిలేబి బోలు మధురసా
    స్వాహా భరితం , బికపై
    ఈ హోరున బడి జనాల యేడుపు చెలగున్ .

    ReplyDelete
  3. -
    ఇక మీదట రాస్తా విడు
    వక వచన కవిత్వమే సువాసనల జిలే
    బికి సంపూర్ణమగు తెలుగు
    నకున్ బలి జనాళి చదివిన మరునిముషమే



    ReplyDelete
  4. -
    కోతి చేతికి‌ పూమాల కుప్ప దొరికె
    పీకి పీకి చెదుర వేసె పిచ్చి ముదుర
    తిట్టి తిట్టిపోయ జనులు తిరిగి తిరిగి
    పీకి వేయనారంభించె బెట్టు జూపి





    ReplyDelete
  5. రామా ! నిను గూర్చి తలచి ,
    ధీమముగా వ్రాయ విడిచి , తిట్లురకగ , ఈ
    తామస జిలేబి కవివరు ,
    లేమేమో వ్రాయుచుందు , రేలనొ దెలియన్ .

    ReplyDelete
  6. -

    ఇదియొక అద్భుతము ! కవిత
    లిదివర కెంపిక యెలా సలిపిరొ కదాండీ ?
    మదినిండుగ నాసక్తి గ
    లదండి నాకు తెలుసుకొని లబ్ధిని పొందన్



    ReplyDelete
  7. -
    ఉండేది రాము డొకడే
    కందువగా నభయమిచ్చు కరుణానిధి యెం
    దెందు వెతికినన్ గలడం
    దందున శరణన్న వారి ధర్మప్రభువై !


    ReplyDelete
  8. -
    తామసపు జిలేబి పదము
    లే మాత్రంబర్థమగును లే యెవ్వరికిన్?
    కామా ఫుల్ స్టాపులు కన
    రామస్సలు పద్యమందు రావడియొకటే!



    ReplyDelete
  9. -
    శోధింప జవాబు దొరక
    లేదను వేదన నిశీధి లివ్వన సారూ
    రోదన! మీలో కవి యెద
    సేదపడగ రణపు ధరణి సెగతగ్గదికన్!


    ReplyDelete
  10. మీ వచనకవిత కోసం
    మా వంటి పఠితల కళ్ళు , మరి మరి వగచెన్
    చేవలు గలవారలు కద !
    భావము లేకున్న నేమి ? భాష కలదుగా .




    ReplyDelete
  11. మము పరవశ పరచు టెపుడొ ?
    తమ ' కవితా ' ఝరులలోన తలమునకలుగా
    తమకంబున తడియు టెపుడొ ?
    శ్రమ యనుకోరుగ , జిలేబి సారూ ! వ్రాయన్ .

    ReplyDelete
  12. ఏమండీ ఆపేశా
    రేమొకొ ? మీ వచన కవిత లేరులయి సదా !
    భూమిని పారవలె కదా !
    క్షేమ మరసి పాఠకులను , చింతించేరా ?

    ReplyDelete