Tuesday, June 7, 2011

బ్లాగ్ యువరాణి అడిగిన మూడో ప్రశ్న

బ్లాగ్ యువరాణి అడిగిన మూడో ప్రశ్న

యువరాజులారా - ఇదియే నా మూడో ప్రశ్న. ఈ ప్రశ్న కి సమాధానం తెలిజెయ్య గలవారు ఉంటారని అనుకుంటాను - అంటూ ఇలా అడిగింది.

ఒక రాజు ఏదైనా చూడటానికి పుట్టు గుడ్డి
ఒక రాజు ఏదైనా వినటానికి పుట్టు చెవుడు
ఒక రాజు ఏదైనా చెప్పటానికి పుట్టు మూగవాడు
అయినా అతని రాజ్యం లో ధర్మం నాలుగు పాదాల నడిచింది.
ఎవరు చెప్పగలరు ఇదెలా అని ?

ఈ మూడు ప్రశ్నలని ఇచ్చి బ్లాగ్ రాణి విశ్రామం తీసుకోవడానికి అంతః పురం వెళ్ళింది.

స్వయం వరానికి వచ్చిన కామెంటు యువరాజుల చెప్పలేక వారి వారి దేశాలకి ఏగి వారి మంత్రి వరేన్యులకిచ్చి ఈ ప్రశ్నలకి సమాధానం కనుగొనుడు ఆదేశించిరి.

ఇంతటి తో ఈ కథ సమాప్తం. (కథ అంతర్జాల లోకానికి - మనం లాగ్ అవుట్ కి ) !

చీర్స్
జిలేబి.

Wednesday, June 1, 2011

పురాణీ దేవి యువతిహి ! -

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజులకి ఇచ్చిన రెండవ ప్రశ్న
 
స్వయం వరానికి వచ్చిన యువరాజులని కలయ జూసి - యువ రాణి రెండవ ప్రశ్న ఇవ్వడానికి మొదలైంది.
ప్రశ్న అడిగే మునుపు ఒక సారి దీర్ఘం గా ఆలోచించి - సందిగ్ధా వస్త లో ఉండి సరే అడుగు దామని ఇలా ప్రశ్నించింది.
 
ఏగు తెంచిన రాజ వరేన్యు లారా - ' పురాణీ దేవి - యువతిహి ' అన్న దానికి అర్థం ఏమిటి ? విశదీకరించ
 గలరా ? అని అడిగింది.
 
ఈ మారు రాజ లోకం లో నిజం గానే ఈవిడకి మతి భ్రమించింది అన్న కల కలం చేల రేగింది. దేవి పురాణీ అంటుంది. మరి ఆవిడెట్లా యువతి కాగలదు ? అని గుస గుసలు మొదలయ్యాయి.
 
(సశేషం)
 
జిలేబి.

Sunday, May 29, 2011

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజ వారల కథ - 2

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజులకి ఇచ్చిన మొదటి ప్రశ్న కథ

అలా వచ్చిన యువరాజులని బ్లాగు యువరాణి వీక్షించి , ఈ ప్రశ్న ప్రుచ్చించెను.

"ఒక బోయ వాడు అరణ్య మార్గాన వెళుతూంటే ఆతనికి రెండు చాతక పక్షులు ఆకసాన ఎగురుతూ కనబడినవి.
ఆ బోయవాడు తన అంబుల పొదినించి బాణాన్ని అందుకుని గురి చూసి బాణం ఎక్కు పెట్టి, వదిలాడు. ఆ రెండు చాతక పక్షులలో ఒకటి ఆ బాణ ఘాతానికి మృతి చెంది నెల వ్రాలినది.

ఆ రెండవ చాతక పక్షి ఆకసాన వృత్తాకారం లో తిరగసాగింది. ఈ మారు బోయ వాడు మరో బాణాన్ని ఆ రెండో పక్షి పై ఎక్కు పెట్టాలని బాణం కోసం అంబు ల పొది లో చెయ్యి పోనివ్వగా అతనికి ఖాళీ పొది కాన వచ్చింది.

ఆ బోయవాడు ఇక చేసేది లేక  'లేని బాణం' తో ఈ మారు విల్లు ఎక్కు పెట్టాడు. రెండో చాతక పక్షి ' లేని బాణ ఘాతానికి'  నేల వ్రాలి ప్రాణం విడిచి పెట్టింది.

స్వయం వరానికి వచ్చిన రాజ కుమారులార ఇప్పుడు చెప్పండి -

౧. 'లేని బాణం' తో ఆ బోయ వాడు ఎలా ఆ రెండో పక్షిని కొట్టాడు ?

౨. ఆ రెండవ పక్షి ఎందుకు ప్రాణాన్ని విడిచి పెట్టింది ?

ఈ ప్రశ్న లని విని రాజ లోకం లో కల కలం చేల రేగింది. ఈ యువరాణి సుకుమారి మాత్రం కాదు - కొంత మతి భ్రమించిన లలన కూడా అని. కాని ఆ సుకుమారి ని చూడగా ఆ మె తెలివైనదిగా అగుపించింది అందరికినూ.

ఈ ప్రశ్నల కి సమాధానం చెప్ప గలవారెవ్వరు అన్నట్లు మహారాజులం వారు సభ ని ఒక మారు కలయ జూసినారు.

(సశేషం )

జిలేబి.

Friday, May 27, 2011

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజ వారల కథ - 1

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజ వారల కథ

ఒకానొక దేశం లో బ్లాగ్ యువ రాణి సమ్మోహనం గా వెలుగొందు చుండెను.

పొరుగు రాజ్యాలలో పేరిన్నికగన్న కామెంటు యువరాజాలు కోకోల్లెలు గా ఉండిరి.

బ్లాగు యువరాణి  వారి కి  పెళ్లి చెయ్య దలిచి వారి రాజా వారు - తన రాజ్యం లో నూ పొరుగు రాజ్యం లోనూ డప్పు వేయించెను.

బ్లాగు యువరాణికి  సరి జోడు ఎవరైనను స్వయంవరమునకు రావలనేహో అని ఆ డప్పు వాడు డప్పు వాయిన్చుచూ రాజ్యాలు తిరిగెను.

ఈ బ్లాగు రాణి బహు సుందరాంగి కావున అన్ని కామెంటు యువరాజులు వారి వారి పనులని పక్కకు నెట్టి స్వయంవరాని కి ఏగు తెన్చిరి.

ఆ నాటి స్వయం వారానికి ఏగు తెంచిన రాజా వారలను గమనిచి బ్లాగు యువరాణి సుకుమారి వారికి కష్టమైన పనిని చెప్పెను. అది ఎవరు  సాధించెదరో వారికి తన కుమార్తెను కట్ట బెట్టెద నని రాజా వారు వ్రాక్కున్చిరి.

(సశేషం)

జిలేబి.

Thursday, May 26, 2011

'ఈ ' లాగు - బ్లాగు - ఏలాగు ? ఊ లాగు !

ఈ లాగు 
బ్లాగు  
ఏ 'లాగూ' లేని
ఈ లాగు
ఏదో  లాగూ
ఆలాగూ
ఊ లాగూ

కూత డప్పు లింకులు
కేక నెనరులు బాగు బాగు

వెరసి

బ్లాగు  బటాణీ
టపా టైం పాస్
కామెంటు కప్పు కాఫీ
హారం 'ఆ' హార్యం'
కూడలి 'కూల్ డ్రింకు'
జాలం - 'జాం ' బాజారు !

చీర్స్
జిలేబి.

Wednesday, May 25, 2011

కామెంటిన కనక ధారా వర్షం కురియున్ !

ఈ  మధ్య బ్లాగు లోకం లో - శంకరాభరణం, చమత్కార పద్యాలు - పాద పూరణలు చదివాకా నాకు ఓ ఆలోచన కలిగింది. మనమూ ఒక పాద పూరణ ఇవ్వ వలె నని.

కాన ఇచ్చి తి మి పోండు బ్లాగ్మిత్రులారా - ఇదే మీకు పాద పూరణ
గావింప వలసిన వాక్యంబు, రండు మీ ఆలోచనా పటిమకు సాన పెట్టుడు
ఈ వాక్యమును పూరింపుడు ! బ్లాగ్ బాండు పరివారముల 'వాః వాః లను గైకొనుండు !

కామెంటిన కనక ధారా వర్షం కురియున్!

చీర్స్
జిలేబి.

Tuesday, May 24, 2011

ఇవ్వాళ మే ఇరవై నాలుగో తారీఖు - మీకు తెలుసా ?

ఆయ్ నిన్న ఇరవై మూడైతే ఇవ్వాళ ఇరవై నాలుగు కాదా అని అడగ మాకండి !

ఇవ్వాళ మే ఇరవై నాలుగు !

దాని ప్రాధాన్యత దానిదే  !

ఏమంటారా? ఈ కాలం చూడండి -

ఓ పది సంవత్సరాల మునుపు ఓ పదిహేనేళ్ళ కుర్రాడు - మౌంట్ ఎవేరేస్ట్ అధిగమించడం జరిగింది !

కొండ ఎక్కితే గొప్ప ఏమిటి మేం ప్రతి రోజూ కొండ ఎక్కి దిగుతాం అంటారా - దానికి తిరుగు సమాధానం లేదు !

అయిన మౌంట్ ఎవేరేస్ట్ ఎక్కడం అంట సులభమా ? అదీను పదిహేనేళ్ళ వయసులో ?



చీర్స్
జిలేబి.

Monday, May 23, 2011

ఉత్తరం - మా తరం - 'ఈ' తరం - మీ తరం

ఒరేయ్ మనవడా  ఉత్తరం ఏమైనా వచ్చిందా చూడరా అంది బామ్మ మనవాడి తో

కరంటు లేదే బామ్మ అన్నాడు ' పంఖా' వై పు చూసి - తిర గ దేమిటి చెప్మా ఇది - కరంటు వస్తే బాగుండు - కంపూటర్ ఓపెన్ చెయ్యొచ్చు. వాడి కి తెలిసిన ఉత్తరం - 'ఈ' మెయిలు !


అదేమీ చోద్యం రా - ఉత్తరం రావడానికి - కరంటు కి సంబంధం ఏమిట్రా అబ్బిగా అదీను - పైకి చూసి దేవుడికి దండం పెట్టేదేందుకు ? -

బామ్మ - నీకేమి అర్థం కాదె ! ఈ లోకం లో ఉండి - 'ఈ ' లోకం గురించి తెలియ కుండా ఉండావేమిటే అంటూ వాపోయాడు మనవడు .

'మా కాలం ' లో మేమూ ఇలానే వాపోయాము లేవోయి - అని కళ్ళు మూసుకుంది బామ్మ - ! ఎండ వేడి - వడ గాడ్పు - ఆ విసన కర్ర ఇలా ఇవ్వరా అబ్బిగా అంటూ !-

చిన్నప్పట్టి పల్లెను - చల్ల గాలిని తలుచు కుంది బామ్మ - అబ్బే ఈ మహా నగరం లో ఒంటి స్థంభం మేడలో - ఒకటిన్నర గదిలో - ఆ పల్లె ని తలుచు కుని ఏమి ప్రయోజనం ?

ఎ కాలం ? ఈ కాలం ? మీ కాలం ?  మా కాలం - అంతా పోయే కాలం రా అబ్బిగా అంటూ నిద్ర లోకి జారుకుంది బామ్మ . ఈ మారు ఏమి అర్థం కాక బుర్ర గోక్కున్నాడు మనవడు.

జిలేబి.

Friday, May 20, 2011

బులుసు వెర్సస్ ఐరన్ లెగ్ శాస్త్రి ఒక అపరాధ పరిశోధన

బులుసు గారేమైనా ఐరన్ లెగ్ శాస్త్రి గారా ?
నా బ్లాగులో ఆయన గురించి టపా రాయాగానే
ఝామ్మని నా టపా ఎగిరి పోయింది ?

ఆ టపా మాయ మై పోక ముందు రెండు కామెంటులు కూడా ఉండింది
(అందులో ఒకటి మళ్ళీ ఈ బులుసు గారిదే)

హుష్ కాకి ఆ కామెంటులు  కూడా హులుక్కి ఐపాయింది !

కొన్ని రోజుల తరువాత టపా తప తప తిరిగి వచ్చింది కాని
కామెంటులు గల్లంతు ఐపోయినై !

అంతా విష్ణు మాయ కాకుంటే అమెరికా వొడి మాయ అని అనుకోవాలా ?
కాకుంటే ఇది ఖచ్చితం గా ఐరన్ లెగ్ శాస్త్రి గారి పనే  అనుకోవాలా ?
ఈ అపరాధ పరిశోధన కి ఎవరి కైనా సమాధానం తెలుసా ?

చీర్స్
జిలేబి.

Thursday, May 19, 2011

'జిలేబి' ల కోసం లేజీ ఐన 'మేం' సాహేబులం !

భారతావని నోచుకున్న అదృష్టం
రెండు రాష్ట్రాలు చేసుకున్న పుణ్యం

ప్రజల మనోభిరామం
అందలం ఎక్కిన వైనం

మరల ఇదేలనన్న
మరో మారు మీరు పండగ చేసుకోండని
ప్రజలు ఇచ్చు కున్న తాకీదు

బెహన్ అర్జీ మీకు ఇదే

రాష్ట్రం కట్ట బెట్టినాము - రత్నాలు అందుకోండి
జయం కలిగించాం - లలితం గా లభ్యం పొందండి
మిగిలిన చో కొండకచో   మా కు కాస్త పడేయండి
ఇదే మా అర్జీ

ఇట్లు
'జిలేబి' ల కోసం లేజీ ఐన 'మేం' సాహేబులం !