మనం ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు అని ఎవరో ఒక పెద్దాయన వాక్రుచ్చేరు !
నేను మొదటి మారు అస్సాము కి పోయేటప్పుడు మనం ఈ ఎక్కాల్సిన రైలు సూక్తి చాల బాగా అనుభవం లో కొచ్చింది.
సుతారం గా ముస్తాబై టంచ ను గా రైలు వచ్చే టైం కి మనం ముందే ఉండాలే మరే అని ఆవేశ పడి పోయి హైరానా పడి పోయి మా వారి తో బాటు హుటా హుటిన మా గ్రామం నించి బయలు దేరి మద్రాసు సెంట్రాలు చేరితే ఓర్నాయనో పదునెనిమిది గంటలు ట్రైను లేటు అన్నాడు రైల్వే వాడు.
'ఆయ్, అది తప్పయ్యి ఉంటుందండీ , పద్దెనిమిది నిముషాలు అన్నదాన్ని మీరు పద్దెనిమిది గంటలు అని చదివి వుంటారండీ , మీరు మళ్ళీ వెళ్లి కనుక్కొని రండీ అన్నా ' మావారు జమ్బునాధన్ కృష్ణస్వామీ అయ్యరు వారితో.
మనకెప్పుడూ శ్రీ వారికి పని జేప్పటం అంటే ఒక మజా. ఎంతైనా మా వారే మరీ !
ఆ మాత్రం వారికి పని బెట్టక పోతే ముదురు ఐ పోరూ ! ఆ పై మనమాట వినకుండా పోయే అవకాశాలు ఎక్కువై పోతాయ్నన్న మాట.
అంతే గాక శ్రీ వారలను ఎప్పుడూ మనం 'పని' మీద పెట్టాలే ' అని మా బామ్మ చెప్పేది. మా బామ్మ మాటల్ని వింటూ ' నీ బామ్మ మాటలకేమి జిలేబీ,
పట్టించు కోకు , వేళా వేళా కు తిండి పెడు తొందిగా, దానికన్నా ఇది పెద్ద పనిష్మెంటు ఏమీ కాదులే అనే వారు మా తాతా వారు.
అందుకే మనం ఇప్పుడు కూడా అందరి బ్లాగర్లకీ మన కథల్ చదవండోయ్, మన కవితల్ని చదవండోయ్ అని, ఆయ్ అంటే ఓ కామెంటు చెండు తో కొట్టి , ఓ పాటి పద తాడన కేళీ విలాసం గావిస్తూ పని అప్పజేప్పుతూ ఉంటామన్న మాట.
వాళ్ళంతా బిజీ ఐపోతే మనం చక్కా మన పనుల్ని, (అంటే షాప్పింగు వగైరా గప్పు చిప్పు గా ) చక్క బెట్టు కోవచ్చు చూడండీ ! అదీ మన తెక్నీకు అన్న మాట.
మీరు కూడా మీ వారికి కి వంట పని, ఆ పనీ, ఈపనీ అని అప్ప జెప్పి చూడండే, ఆ పై చూడండీ, మీకు ఎంత వెసులు బాటు వుంటుందో !
నాలా చక్కా టపాలు బ్లాగులు, అల్లికలూ, కామెంట్లు రాసేసుకుంటూ వేళా వేళా కాఫీ టీ లాగించు కుంటూ కాలం గడిపెయ్యోచ్చు!
సో, అలా మా వారిని పనికి పురమాయించి పక్కనే వున్న ఓ తాత గారిని పలకరించా - ఏమండీ మీరూ అస్సామేనా అని అరవం లో.
మేము అరవం వాళ్ళం కదండీ, కాబట్టి మాకు మద్రాసు పట్టిణమ్ పట్టినంతగా ఆదరాబాదరా హైదరాబాదు ఎప్పుడూ పట్టలే ! మాకు రాష్ట్ర రాజధాని బహు దూరం. ఓ ఆరువందలు కిలో మీటర్లు పై చిలుకు. కాబట్టి మాకు పేద్ద సిటీ అంటే మాద్రాసు పట్టిణమే !
అప్పట్లో నండీ మద్రాసు అనే వారండీ. ఇప్పుడు కూడా మా వూళ్ళో నండీ ' మద్రాసు పోయ్ వారె' అనే అంటా రండీ ! అరవం వాళ్ళు వూరికె అలా పేర్లు మార్చేసుకుంటూ వుంటారండీ - ఇప్పుడేమో చెన్నై సింగార చెన్నై అంటా రండీ, కానీ అందులో ఏమి సింగారం వుందో ఆ పెరుమాళ్ళ కే ఎరుక !
అదేమీ వారీ చోద్యమో, ప్రతి దానికీ ఓ అరవ పేరు అది జిలేబీ లా వుంటుంది కదండీ కాబట్టి తీపిగా వుంటుందని కొత్త కొత్త పేర్లు కని పెట్టేసుకుంటూ అఆయ్, మా అరవం గొప్ప జూడు అంటూ "జాం బజారు జగ్గు నాన్ సైదాపెట్టై కొక్కు" అంటూ అవేవో పాటలు కూడా పాడేసుకుంటూ వుంటారండీ మరీను !
మేము అరవం వాళ్ళమైనా ఈ అరవ దేశపు అరవం వాళ్ళ లా ఇలా అప్పుడప్పుడూ పేర్లు మార్చమండి.
మా చిత్తూరు వాళ్ళకండీ ఒక్క మారు పేరు పెట్టేస్తే అధట్లా నే వుండి పోవాలండీ మరీ.
మా బామ్మ నాకు జిలేబీ అని ముద్దు గా పేరు పెట్టిన్దండీ , అప్పట్నించి ఇప్పటిదాకా నేను జిలేబీ గానే వున్నా నండీ. అదండీ మా గొప్పదనం. ఉద్యోగ రీత్యా మేడం, మేం సాహెబ్ ,మాల్కిన్ ఇట్లా ఎన్నో పేర్లున్నా ఆ జిలేబీ అన్న పేరు ఇప్పటిదాకా అందరికీ మా సర్కిల్ లో ఓ ఝలక్ అండీ.
మా వూరి నించి మా బామ్మ కాలం లో మద్రాసు పట్టణానికి నెంబరు వందా నలభై నాలుగు అరవ బండి పోయేదండీ. ఆ పై మన ఆంధ్రా వాడు కూడా బండి వదిలాడండీ, కానీ చూడండీ ఆ బస్సుకి వాడు కూడా వందా నలభై నాలుగే నంబరు అన్నాడండీ - చూసారా ఎంత ఖచ్చితం గా వుంటామో ! ఆర్టీసీ వాడు వాడి ప్రకారం నాలుగు సంఖ్యలు , ఐదు సంఖ్యలు నెంబర్లు పెట్టు కున్నా ఈ బండి కి మాత్రం నూటా నలభై నాలుగే పెట్టాడండీ . ఈ నెంబరు చాలా పాపులర్ నమ్బరండీ. ఒన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లా మరీ గట్టి నమ్బరండీ ఇది.
సో, ఆ పక్క తాత గారిని 'ఏమండీ మీరూ అస్సాము కేనా నన్నాండీ. ఆయనేమో హా హా బేటీ అని అరవం లో అన్నారండీ. అంటే నండీ ఆయన జెప్పింది హిందీ లో నే అండీ, నాకు ఆది అరవయాస తో కలిసి అరవం లాగే వుండింది మరి.
"మీరు ఈ వూరి సేట్లా?" అన్నా వారితో.
"అమ్మాయ్ నువ్వు బడా హుషారు , వెంటనే కని బెట్టేసావే " అని మెచ్చు కున్నారాయన. మద్రాసులో నండీ షావు కారు సేట్లు చాలా కాలం మునుపే వచ్చి సెట్టిల్ అయి పోయి వారి ఇప్పటి తరం అరవం మాట్లాడే దాక ఇప్పుడొచ్చిందంటే చూడండీ మరీను.
నాకు హిందీ అండీ చదవడం వచ్చినా అంతగా మాట్లాడ్డం రాదండీ. మా వూళ్ళో దక్షిణ భారత హిందీ ప్రచార సభ వుండే దండీ , అందులో నేనూ తూ తూ మంత్రం గా కొంత హిందీ లో ప్రవీణు రాలై నండీ అదీనునా ఏడో క్లాసులోనే.
అప్పట్ల్ ఓ అరవమ్మాయ్ హిందీ లో ఏడో క్లాసు లోనే ప్రవీణ్ పూర్తీ చేసిందని మా వారిని నాకు కట్ట బెట్టె ముందు మా బామ్మ మా వారితో చాలా గొప్పగా జేప్పిమ్దండీ.
మా వారు కూడా హెంత ఆశ్చర్య పోయారంటే నమ్మండీ - ఎందు కంటే వారు అరవ దేశం వారు. అక్కడ వారంతా 'అహిందీయలు' అండీ. ఇప్పుడు కూడా హిందీ అంటే వాళ్ళు ఆయ్ మా మీద అథారటీ చేస్తారా అంటా రు కదండీ - అప్పట్లో అయతే పెద్ద వియత్నాం వార్ జరిగే డండీ హిందీ మాటంటే వాళ్ళ మద్రాసు పట్టిణమ్ లో.
కాబట్టి ఈ తాతా వారితో సంభాషణ అంతటి తో కట్టి బెట్టి మనం పని మీద తోలిన మన పెనిమిటి 'ఎంగే' పోయారబ్బా అని ఆశ్చర్య పోయా నండీ.
వారేమో మళ్ళీ తిరిగొచ్చి, 'జిలేబీ, అది పద్దెనిమిది గంటలే లేటు. ఆపై వాళ్ళు చెప్పిమ్దేమంటే కొన్ని గంటలమునుపే ఆ తిరువనందపురం గువాహాతీ గాడీ కేరళ వైపు వెళ్ళింది. అది ఆ వూరు చేరి మళ్ళీ తిరుగు ముఖం ఇప్పుడే పట్టింది కాబట్టి మనం ఇక్కడే మకాం ఫార్ నెక్స్ట్ ఇరవై నాల్గు గంటలు ' అని ముఖం వేలాడదీసారు మా శ్రీ వారు.
వారి ముఖారవిందం చూసి బాధేసి, (ఎంతైనా మా జంబూనే కదా ) 'మీరు అంత గా బాధ పడకండీ, ఆ 'ఏழு ' మలై ఆండవన్' అన్నిటికీ వున్నాడు సుమండీ ' అని వారిని వోదార్చి, ఈ మద్రాసు సెంట్రాలు లో భైటాయించి పక్కనున్న తాత గారిని మళ్ళీ కదిపా 'ఏమండీ ' అని.