భోజనం కానిచ్చీ కానివ్వకనే , ప్రయాణ బడలిక తో ఉన్న బుజ్జి పండు హారీ పాటర్ కళ్ళద్దాల మధ్య జోగటం మొదలెట్టాడు మధ్య మధ్య లో బులుసు రాజీ మధురల మాట లు వింటూ.
మధుర ఇది గమనించి, "బుజ్జి అప్పుడే చెబ్తా నన్న కథ ఇప్పుడు చెప్పనా " అంది
"ఊ " అన్నాడు వాడు నిద్రలో 'ఊహూ" అనటానికి కుదరక.
మధుర కథ మొదలెట్టింది.
"అనగనగా ఒక ఊర్లో ఓ మిరపకాయ్ పొట్టోడు ఉండేవాడట. ఆ మిరపకాయ్ పొట్టోడు రోజూ తనకున్న సొరకాయంత సైకిలెక్కి ఊర్లోకి వెళ్లి చాలా కష్టపడి పని చేసి బోలెడు డబ్బులు సంపాయించి బాదంకాయంత బంగారం కొనుక్కున్నాడట. మిరపకాయ్ పొట్టోడికి ఈతకాయంత ఇల్లు ఉంటుందన్నమాట!
బుజ్జీ వింటున్నావా ?
"ఊ"
ఆ ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాలో, తను సంపాదించిన ఆ బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేస్తాడంట.
వింటున్నావా బుజ్జీ ?
"ఊహూ "
ఆ తరవాత ఓ రోజు మిరపకాయ్ పొట్టోడు తన సొరకాయంత సైకిలెక్కి పని మీద బయటికి వెళ్తాడన్నమాట! అప్పుడు ఓ దోసకాయంత దొంగోడు వస్తాడు మిరపకాయ్ పొట్టోడి ఈతకాయంత ఇల్లు దగ్గరికి. మిరపకాయ్ పొట్టోడు ఇంట్లో లేడు కదా అని చెప్పి ఆ ఈతకాయంత ఇంట్లోకి జొరబడిపోయి, గచ్చకాయంత గదిలోకెళ్ళి, ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి, అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని ........
"బుజ్జీ వింటున్నావా?"
ఇంకెక్కడి బుజ్జి, బుజ్జి పండు కథ మధ్యలోనే సోఫాలో అడ్డంగా పడి ఎప్పుడో నిద్రపోయ్యాడు.
మధుర బుజ్జి పండుని చూసి హ్హా హ్హా హ్హా అని నవ్వి మంచి రగ్గు ఒక్కటి కప్పి బులుసు రాజీ లతో ఖబుర్లతో పడింది.
"మధురా సరి లేరు నీకెవ్వరు కథలు చెప్పడం లో " రాజీ గారు మెచ్చుకున్నారు మధురని.
"అమ్మాయ్ మధురా, , మీ మ్యూనిచ్ నగరం లో గ్లూ వైన్ మార్కెట్ చూడాలని దాని టేష్టు చూడాలని ఆరాటం. ఇప్పటికి మీ జర్మనీ రావడం కుదిరింది, కృష్ణ ప్రియ గారి ఆర్ముగం తో బాతా ఖానీ నెపం తో ! రేపే ఆ మార్కెట్ కెళ్లా లమ్మాయ్ " బులుసు గారు వాక్రుచ్చేరు.
"అలాగే మాష్టారు " మధుర చెప్పింది.
ఆ గ్లూ వైన్ కథా క్రమం బెట్టిదనిన.........
(ఇంకా వుంది )

ఎన్నాళ్ళకెన్నాళ్లకు..బుజ్జిపండు సోఫాలో నిద్రపోయాడా, మధుర రగ్గు కప్పారా బావుందండీ..పండు ఇప్పుడు నిద్ర పోతున్నాడు. రేపు లేవగానే చదివి వినిపిస్తాను.
ReplyDeleteజిలేబీ గారూ మంచి పని ఎవరు చేసినా
ReplyDeleteమెచ్చుకోవాలి కదండీ..
మంచి పని చేసే వాళ్ళని పొగిడితే ఇంకా ఎక్కువ మంచి పనులు చేస్తారని పరిశోధనల్లో తేలిందటండీ..
బుజ్జి పండుని వదిలేశారనుకున్నా!
ReplyDeleteఓ దోసకాయంత దొంగోడు వస్తాడు మిరపకాయ్ పొట్టోడి ఈతకాయంత ఇల్లు దగ్గరికి. మిరపకాయ్ పొట్టోడు ఇంట్లో లేడు కదా అని చెప్పి ఆ ఈతకాయంత ఇంట్లోకి జొరబడిపోయి, గచ్చకాయంత గదిలోకెళ్ళి, ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి, అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని ........
ReplyDeleteబుజ్జి పండు నిదరోతూ విన్నాడు కాబట్టి బతికి పోయారు.. లేకుంటే..ఇలా కథ చెపితే.. బుజ్జి చేసే క్రాస్ టాకింగ్ కి మధుర..ఇండియా..పరుగెత్తుకుని వచ్చేసేది.
జ్యోతిర్మయీ వారు,
ReplyDeleteకథ వినిపించారా !
సంక్రాంతి శుభాకాంక్షలండీ !
జిలేబి.
రాజి వారు,
ReplyDeleteమిమ్మల్ని పొగిడేస్తున్నానండీ !
చీర్స్
జిలేబి.
కష్టే ఫలే మాష్టారు,
ReplyDeleteఅంత లోపే బుజ్జి పండు తెలుగు చదువు ముగించడమే! ? కుదరదండీ, ఆఖరున వాడు దీక్షితులు గారిని కలవ వలసిన ఘట్టం కూడా ఉందాయే!!
చీర్స్
జిలేబి.
వనజ వనమాలీ గారు,
ReplyDeleteఈ విషయం నాకు తెలియ కుండా పోయెనే ! సరే గుర్తు పెట్టుకుంటాను !!
@కామెంటిన అందరికీ నెనర్లు.!
ఈ బ్లాగ్ టపా మూలకం గా కామెంటిన అందరికీ , చదివిన అందరికీ, సమస్త బ్లాగ్ లోకానికి సంక్రాంతి శుభాకాంక్షలతో
జిలేబి.
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు
ReplyDeleteజిలేబిగారూ ఇంకా వినిపించలేదండీ..లేవగానే స్కూల్కి వెళ్ళిపోయాడు.
ReplyDeleteమీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు .
జిలేబి గారూ పండగ మర్చిపోకుండా చేసుకోండి.
ReplyDeleteమీకు సమ్యక్+క్రాంతి శుభాకాంక్షలు
ReplyDelete@భారారె గారు,
ReplyDelete@జ్యోతిర్మాయీ గారు,
@కష్టే ఫలే మాష్టారు గారు,
నెనర్లు. మీకందరికిన్నూ సంక్రాంతి శుభాకాంక్షలు !
ధర్మో రక్షతి రక్షితః !
జిలేబి.
@భారారె గారు,
ReplyDeleteనెనర్లు. పండగ మరిచి పోవడమా ! భోగి మంట ఆరని పంట ! మంట ఆరిన వెంటనే క్రాంతి మొదలు ! 'సం' అథర్ క్రాంతి మొదలగును ! కావున ప్రతి దినమూ పండుగే !
చీర్స్
జిలేబి.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు, భారతీయులకు, ప్రపంచ వ్యాప్త హిందూ సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.....
ReplyDeleteనెనర్లు రాఫ్సన్ గారు,
ReplyDeleteమీకున్ను సంక్రాంతి శుభాకాంక్షలు !
సంక్రాంతి హాలికుల పండుగ !
చీర్స్
జిలేబి.
జిలేబీ గారూ,
ReplyDeleteమీ అనుమతి లేకుండా ‘బుజ్జిపండు తెలుగు చదువు మొదటి భాగాన్ని’ నా బ్లాగులో ప్రకటించాను. మన్నించండి.
శ్రీ శంకరయ్య గారికి,
ReplyDelete>>>జిలేబీ గారూ,
మీ అనుమతి లేకుండా ‘బుజ్జిపండు తెలుగు చదువు మొదటి భాగాన్ని’ నా బ్లాగులో ప్రకటించాను. మన్నించండి
ఎంత మాటండీ! ఆ చదువు దయ చేసిన గురువర్యులు మీరు. మీ బ్లాగ్ కవి పండితాదులు. దాని ని మీ బ్లాగు నందు ప్రతిష్టాపించడమే నాకు మహదానంద కరమైన విషయం.
ధన్యవాదాలు !
జిలేబి.
నేను కూడా ట్రాక్లోకి వచ్చేసానోచ్....!! అన్నీ ఒక్కటి కూడా వదలకుండా చదివేసాను... ఇంక మీరు నెక్స్ట్ బుజ్జిపండు భాగాన్ని రాయడమే తరువాయి...
ReplyDelete