అర్ధ అంగీ కారం
అర్ధాంగీ కారం
అర్ధాంగీకారం
ఏమీ చెయ్యలేం
పెళ్లప్పుడే అంగీ చుట్టి
కట్ట బెట్టేసుకున్నారు !
చీర్స్
జిలేబి.
అర్ధాంగీ కారం
అర్ధాంగీకారం
ఏమీ చెయ్యలేం
పెళ్లప్పుడే అంగీ చుట్టి
కట్ట బెట్టేసుకున్నారు !
చీర్స్
జిలేబి.
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
నిజమే అర్ధాంగి కారమే !!
ReplyDeleteఅత్రేయగారికి అర్ధ 'అంగీకారమే' నట..
ReplyDeleteఅర్ధ ఆంగికం రమ్ము! నేను కూడా విడగొట్టి చూసా (మీరు కొట్టినవి కాకుండా) ఇలా వచ్చింది చివరికి ప్చ్!
ReplyDeleteఅదేంటి జిలేజీ కారం అయ్యిపొయింది.
ReplyDeleteఅచ్చు తప్పు, అదేంటి జిలేబి కారం అయ్యిపోయింది
ReplyDeleteఅర్ధం అంగీకారమే
ReplyDeleteఅర్ధమేమిటో తెలిస్తే కదా
ReplyDeleteఅంగీకార, అర్ధాంగీకారాలు చెప్పడానికి...
ఇంతకీ "అర్ధాంగీకారంలో" మీరు అర్ధాంగీ,కారం అనే రెండిటిలో యేదీ నయమా అనే విచికిత్సలో ఉన్నారా కొంపదీసి?
ReplyDeleteఅర్ధాంగి మామూలు కారం కాదు... సూరేకారం. :)
ReplyDeleteనిజం గుర్తించేటప్పటికి ఆలస్యమైనట్లుంది.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఅర్ధ భాగం అంగీకరించితేనే కదా.. (ఇక్కడ అర్ధ ..పురుషుడు)అర్ధాంగీకారం అయ్యేది. పరమ శివుడే మెచ్చి..అర్ధ భాగం చేసుకున్నప్పుడు.. ఇంకా అర్ధాంగీకారం గా మిగిలితే..తప్పేముంది?
ReplyDelete@ఆత్రేయ వారు,
ReplyDeleteజేజే లు! మరీ అర్ధాంగీ కారమనేసారు !
@జ్యోతిర్మయీ వారు,
మిగిలిన అర్ధాంగీకారం ఇవ్వడానికి ఆత్రేయ వారికి వారి శ్రీమతీ అంగీకారం కావలి కామోసు !
@రసజ్ఞ వారు,
అర్ధ వంతమైన ఆంగికాన్ని రసజ్ఞ భరిత మైన 'రమ్ము' గా మార్చెయ్యడం మీకే చెల్లు !
భాస్కర్ వారు,
మీ కారానికి అర్దాంగీకారమే !
@బులుసు వారు,
అర్ధం అంగీకారమే అంటున్నారు - పొదుపు సమీకరణాల థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రభావమా ?!
@శ్రీ లలిత వారు,
అర్ధమేమిటో తెలిస్తే ఇది జిలేబీ టపా ఎందుకు అవుతున్దండీ ! మీరు మరీను !
@శ్యామలీయం మాష్టారు !
మాంచి మాట సెలవిచ్చారు. తూకం లో పెడితే రెండూ సరి సమానం గా తూగుతుందేమో !
@పురాణ పండ వారు,
పండంటి మాటని చెప్పారు. పురాణమైన వారు. కాబట్టి కరెక్టు గా నే చెప్పి వుంటారు !
@కష్టేఫలె వారు,
సరి సరి సత్యం గ్రహించడానికి, 70+ !
@రాజేష్ మారం వారు,
వ్యాఖ్య ని తొలగించారు. అర్ధాంగీ అంగీకారం ఇవ్వలేనట్టుంది కామెంటు కి !
కామేమ్టిన అందరికీ నెనర్లు.
అర్ధాంగీకారం అన్న పదాన్ని నిన్న గమనిస్తే వావ్ ఇందులో ఇన్ని పదాలున్నాయా అని అనిపించి కొంత రాస్తే అది మీ అందరి చలవ, ప్రోత్సాహం తో (అంగీకారం తో) అంగీ కారం కాకుండా, అర్ధవంతమైన ఆంగికాన్ని టపా కామెంటు రూపేణా అభినయించడం మీ సహృదయత కి మచ్చు తునక.
అంగీకార మైన ఆమోద్య మైన అర్ధవంతమైన చీర్స్ తో జిలేబి !
వనజ వన మాలీ వారు,
ReplyDeleteపరమ శివుడు అర్ధం ఇవ్వడం ఆ అర్ధాంగీ కారాన్ని కప్పి పుచ్చడానికే నంటారా ?
చీర్స్
జిలేబి.
ఇంతకుముందే నా బ్లాగులో మీ వ్యాఖ్య చూసి లింకులు క్లిక్ చేస్తూ ‘ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే’ బ్లాగులో ‘బుజ్జి పండు తెలుగు చదువు - శ్రీ శంకర విజయం’ చదివాను. దాదాపు నెల రోజుల తర్వాత! ఉదయాన్నే హాయిగా నవ్వుకున్నాను. ఇది మన ‘శంకరాభరణం’ మిత్రుల దృష్టికి వచ్చిందో, లేదో?
ReplyDeleteధన్యవాదాలు.
గౌరవ నీయులైన శ్రీ శంకరయ్య గారికి,
ReplyDeleteబ్లాగుకి స్వాగతం! సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. !
మీకు ఆ టపా నచ్చడం నా కెంతో ఆనందాన్ని ఇస్తోంది. ఆ టపా కి ప్రేరణ మీ సభాస్థలి యే! కావున మీ హాయి అయిన ఆనందానికి చలవ శంకరాభరణ కొలువే !!
ధన్యవాదాలు!
చీర్స్
జిలేబి.