మా నడిమింటి హాల్లో నించి మిద్ద పైకి వెళ్ళడానికి మెట్లు ఉండేవి. వాటి కింద ఓ పాటి గూటి లా ఓ ప్రదేశం ఉండేది. ఆ గూట్లో ఓ పురాతన చెక్క పెట్ట మా తాత గారిది ఉండేది. దాంట్లో వారేమో వారు కొన్న కొత్త కొత్త ఆ కాలపు (అంటే బ్రిటిషు కాలపు అన్న మాట ) గడియారాలు ఎలెక్ట్రిక్ సామాన్లు అట్టి పెట్టె వారు. ఆ పెట్టె కో తాళం కూడా భద్రం గా వేసి పెట్టె వారన్న మాట .
మా ఇంటి కాంతా జనావళికి వాటి మీద ఓ గుర్రు వుండేది. ఆ పెట్టెలో ఉజ్జాయింపుగా ఏమి ఉంటుందో తెలుసు గాని, మా తాతయ్య గారు ఆ పెట్టె ని తెరిచి మాకు చూపించనే చూపించరు. అందువల్ల వచ్చిన గుర్రు అన్న మాట అది.
ఇక తాతయ్య గారైతే అప్పుడప్పుడు మమ్మల్ని బయటకెళ్ళి ఆడుకొండ్రా బడుద్దాయిలూ అని గెంటేసి ఆ పెట్టె ని అప్పుడప్పుడు తెరిచి చూడడమూ, ఆ పై ఆ పెట్టి కి గోళ్ళం పెట్టి తాళం వెయ్యడమూనూ జరుగు తూండేది తప్పించి మేము ఎప్పుడూ ఆ పెట్టె లో ఏముందో (అంటే పూర్తి గా అన్న మాట) చూసిన ది లేదు !
కాక పోతే ఆ పెట్టె ఆయన అంత బద్రం గా తాళం పెట్టడం మాకు ఉత్సుకతని కలిగించేది. ఆ పెట్టె తాళం ఎలా పగల గొట్టాలబ్బ అని అన్న మాట.
ఇక మా కాలానికి వస్తే మా అబ్బాయి మా మనవడు కంప్యూటరు ఎక్కువ గా ఉపయోగించకుండా ఉండడానికి తాళాలు పెట్టడం మొదలెట్టాడు. మనవడు కూడా తాడి తన్నే వాడి తల తన్నాలన్నట్లు వాళ్ళ నాన్న పెట్టిన తాళాలని విడగొట్టడం అన్న ఉద్యమం మొదలెట్టి అందులో నిష్ణాతుడై ఓ మారు వాళ్ళ నాన్నకే ఎదురు ఫిట్టింగులు ఇచ్చాడు అంటే , తనే ఒక తాళం పెట్టే డన్న మాట.
ఈ విషయం లో వాడి కెందుకో ఈ బామ్మ అంటే మమకారం. తాళం పెట్టినా బామ్మా , నీకు మాత్రం తాళం రహస్యం చెబ్తా నాన్నారికి తెలియనివ్వకు, నీకు కంప్యూటరు ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు తాళం తీసి ఉపయోగించుకో. ఆ తరువాత ఆఫ్ చేసెయ్యి. ఈ తాళం చెవి మాత్రం నాన్నారి చెవి కి పోనివ్వకు అని చెప్పేడు.
నాకాశ్చర్యం వేసింది. మా కాలం లో తాత వాళ్ళ తాళం ఎలా విరగ్గోట్టాలా అని మేం ఆలోచించే వాళ్ళం. ఇప్పటి తరం లో నాన్నారి తాళం ఎలా విరగ్గోట్టాలా అని వీళ్ళు షెర్లాక్ హోమ్స్ మొదలెట్టారు సుమా అని.
మొత్తం మీద ఈ కాలపు కుర్ర కుంకాల తో మంచి గా ఉండటం మనకే మేలు అన్న ఓ ఫైనల్ నమ్మకానికి వచ్చేసాను నేనైతే. మనం ఎంత బుర్ర లేని మట్టి బుర్రలని వాళ్లకు నమ్మకం వస్తే వాళ్ళు మనకు అన్ని తెకినీకులు సులభం గా అర్థం అయ్యే లా చెప్పేస్తారని నా కనిపించింది.

హన్నా, భావి తరం భాగ్య విధాతల్లారా, ఈ బామ్మ మీద మీరు దయ బెట్టి ఈలాంటి తెకినీకులు నేర్పిస్తూ ఉండండి, రాబోయే కాలం లో (పుట్టీ గిట్టీ పుడితే ) మీ ఋణానుబంధం తప్పక తీర్చేసు కుంటాను. అప్పటికి మీకన్నా నాకే ఎక్కువ తెలిసి ఉంటుంది కదా !
(Hopefully always the future generation is brighter than the past !!)
(future)
జీనియస్
జిలేబి.