చింతన చైతన్యం సృష్టి
ఒక ఆలోచన స్రవంతి ఐ మేధస్సుని మదించి
చైతన్యాన్ని కలుగ జేస్తే
ఆ చైతన్యం ఉత్తేజాన్ని పుంజుకుని కార్య సాధనలో
సఫలీకృతమై తే -
అందులోనించి ఉద్భవం - సృష్టి
ఆ సృష్టి కాలం పరిమితం - దాని వైశాల్యం పరిమితం
కాని దాన్ని సృష్టించిన చైతన్యం, ఆలోచన అపరిమితం
సృష్టి కి మూలకారణం చైతన్యం, ఆ చైతన్యానికి మూల కారణం ఆలోచన ఐతే
మరి ఆ ఆలోచనకి మూల కారణం ఏమిటి ?
చైతన్యాన్ని కలుగ జేస్తే
ఆ చైతన్యం ఉత్తేజాన్ని పుంజుకుని కార్య సాధనలో
సఫలీకృతమై తే -
అందులోనించి ఉద్భవం - సృష్టి
ఆ సృష్టి కాలం పరిమితం - దాని వైశాల్యం పరిమితం
కాని దాన్ని సృష్టించిన చైతన్యం, ఆలోచన అపరిమితం
సృష్టి కి మూలకారణం చైతన్యం, ఆ చైతన్యానికి మూల కారణం ఆలోచన ఐతే
మరి ఆ ఆలోచనకి మూల కారణం ఏమిటి ?
జిలేబి.
జిలేబిగారు,
ReplyDeleteమీరు వ్రాసినదాంట్లో కొన్ని మౌలికమైన పొరపాటులున్నాయి.
చైతన్యం నుండి సృష్టి ఉధ్భవిస్తున్నదన్నారు. ఇది కొంవరకు బాగానే ఉంది. చైతన్యం ప్రకృతి యొక్క లక్షణం. సృష్టి అంటే ప్రకృతియే. ఇది సూక్ష్మమైనవ్యవహారం. స్థూలదృష్టికి చైతన్యం అంటే శక్తి యొక్క స్వరూపం. శక్తి అనేదాని రూపాంతరమే పదార్ధం - అదే కనిపించే సమస్త వస్తు, జీవ సంచయం.
చైతన్యానికి మూల కారణం ఆలోచన ఐతే మరి ఆ ఆలోచనకి మూల కారణం ఏమిటి అన్న ప్రశ్న వేసారు. ఇక్కడ అన్వయదోషం ఉన్నది. ఎలాగో వివరిస్తాను. ఆలోచన అనేది చైతన్యం వలన యేర్పడుతుంది. తద్విలోమం చెబితే అనవస్థాదోషం యేర్పడుతున్నది. చైతన్యం ఉన్నపుడే మనస్సు యొక్క ఉనికి. మనస్సును స్థభింపజేసి తద్వారా బహిశ్చైతన్యాన్ని నిరోధించటం యోగభూమి యొక్క పధ్ధతి. అలా సిధ్ధించినట్టి స్థితిని సమాధి అంటాము. అందువలన పూర్ణసమాధిస్థితిలో ప్రకృతిలయమైపోతుంది. వ్యక్తి కేవలం శుధ్ధనిర్వికారస్వరూపుడుగా ఉంటాడు. ఇది నిర్వికల్పసమాధి అని చెప్పబడుతుంది. ఈ స్థితిలో వ్యక్తిలేడు - అతడు కేవలం బ్రహ్మమే!
అయితే ఇప్పుడు బ్రహ్మము వేరు ప్రకృతివేరుగా ఉన్నాయా అన్నప్రశ్న సహజంగా యేర్పడుతుంది. సర్వంఖల్విదం బ్రహ్మ అన్న వాక్యం చేత బ్రహ్మమేకాని తదన్యం యేమీ లేదు. అలాకనిపించటము కేవలం అవిద్య చేత మాత్రమే. ఆ అవిద్యకు మూలం అయిన ప్రకృతి బ్రహ్మము యొక్క సహజతత్వం కాని తభ్బిన్నం కాదు. అయితే ప్రకృతిని ఆశ్రయించి ఉన్నంతకాలం శరీరాది ఉపాధులూ, కాలాది ప్రమేయాలు యేర్పడుతున్నాయి. ఇట్లా నిజానికి లేనట్టి ఇవి సత్యాలుగా కనిపించటాన్నే 'మాయ' అంటారు. ఇవి వ్యావహారికసత్యాలేకాని పారమార్థికసత్యాలు కావుకాబట్టి సమాధిస్థితలో అన్నీ లయమై పోయి కేవలం బ్రహ్మమే ఉంటుంది. ఒక విశేషమేమిటంటే బ్రహ్మము ఒక్కటే కదా, అనేకం లేవు కదా. కాబట్టి ఈ బ్రాహ్మీస్థతి అనుభవంలోకి వచ్చిన తరువాత ప్రకృతి సమాధిలో ఉన్నా లేకపోయినా సరే స్వాధీనం అయి ఉంటుంది. అట్టి యోగిని స్థల, ఉపాధి, కాలాదులు బంధించవు. ఉపాధి బంధం లేకపోబట్టి రాగద్వేషాలూ లేవు. స్థలకాలాలు బంధించవు కాబట్టి సర్వజ్ఞుడూ, సర్వవ్యాపకుడూ అయి విరాజిల్లుతూ ఉంటాడు.
చెప్పవచ్చేది యేమిటంటే, అలోచన చేసేది మనస్సు. దానికి కారణం ప్రకృతి. దాని వలవల్లనే మనస్సును కలిగి ఉన్న ఉపాధి ( శరీరం) కూడా. ఇట్టి అనేక ఉపాధులు (స్థూలంగా జీవ నిర్జీవాలన్నీ) కాలాది ప్రమేయాలతో కలిసి సృష్టి అని పిలువబడుతున్నది. ఇట్టి సృష్టి అనేది పరబ్రహ్మముయొక్క సహజమైన వ్యవహారమే కాని ప్రయత్నపూర్వకం యేమీ కాదు. సముద్రానికి కెరటాలు యెలా అప్రయత్నాలూ సహజమో అట్లాగు.
ఇదే ఒక పెద్ద పోష్టు అయిపోయినట్లుంది!
అందువలన జిలేబీ గారూ...
ReplyDeleteఇంత తాత్విక ఆలోచనా స్రవంతితో మేధస్సును మథించి చైతన్యాన్ని కలుగజేస్తే... జిలేబీ కాక పచ్చిమిరపకాయలు ఆవకాయలో నంచుకు తిన్నట్టుంటుంది.
శ్యామలీయం మాష్టారు,
ReplyDeleteధన్యవాదాలు. ! మీ కామెంటు టపా చాలా బాగున్నది.
A thought when sets into an action and when the action fructifies it results into creation.
ఈ అర్థం లో ఈ టపా రాసాను.
నాసదీయ సూక్తం చదువు తున్నప్పుడు నాకని పించినది అది -
కామస్తదగ్రే సమవర్తతాది మనసో రేతః ప్రథమం యదాసీత్
సతో బంధు మసతి నిరవిందన్న హృది ప్రతీష్యో కవయో మనీషా
తిరశ్చీనో వితతో రశ్మి రేషామ్ అధస్విదాసీత్ ఉపరిస్విదాశీత్
రేతోధా ఆసన్ మహిమాన్ ఆశన్ స్వధా అవస్తాత్ ప్రయతిహి పరస్తాత్
అన్నది వస్తుంది. కామం- ఇక్కడ ఇచ్ఛ, లేక కోరిక అన్న అర్థం లో ఉందను కుంటాను.
రెండు స్వధా అవస్తాత్, ప్రయతిహి పరస్తాత్ అన్నది కొంత ఆలోచననిస్తుంది.
నెనర్లు మీటపా కామెంటుకి!!
చీర్స్
జిలేబి.
పురాణ పండ ఫణి గారు,
ReplyDeleteజిలేబీ కారం కారం జిలేబీ ! అప్పుడప్పుడు 'బోరు' కొడితే ఇట్లాంటి 'కారణము లేని కారం ' అన్న మాట !
నెనర్లు.
చీర్స్
జిలేబి.
నమస్తే అండీ !!
ReplyDeleteఎందుకో? ఏమో! youtube ఛానల్ లో నిన్న మొన్న నే రెండు మూడు video లు మా సత్సంగానివి upload చేయటం జరిగినది, చిత్రం ఏమంటే అమృత బిందు ఉపనిషత్ లో మీ ఈ టపా కు చెందినా సమాచారం ఉందని పిస్తుంది, ఎమాత్రపు అవకాసం ఆసక్తి సమయం ఉన్నా గమనించ గలరు
http://youtu.be/Rbsl3QsE67M
Sairam