Wednesday, February 1, 2012

ఒన్స్ అగైన్ బావా మరదలు !

ఓ సంవత్సరం మునుపు ఈ బావా మరదల గురించి రాసాను.

అంటే ఇక్కడ బావ బాంబే స్టాకు మార్కెట్టు.

మరదలు పిల్ల  బంగారం !

మా తల్లే మా తల్లే !

మళ్ళీ కథ మొదటి కొచ్చింది.

ఈ మారు బావా మరదలు కథలో  బావ ధబాల్మనీ, ఫేడేల్మనీ అదేదో అంతర్జాతీయ 'క్యూస్' సరిగ్గా లేవంట అందుకని ముఖం చాటేస్తున్నాడు ఒక రోజు, మరో రోజు ఆహా ఆసియా కి ఉందిలే మంచీ కాలం ముందూ ముందున అన్నట్లు ఓహో అని ఆకసానికి ఎగురు తున్నాడు.

మరదలు మాత్రం తక్కువ నా !

ముద్దు కే ముద్దొచ్చే బంగారం, ముద్ద బంగారం మీద 'భరోసా ' పెరిగిందట జన ప్రియులకు !  మరదలు పిల్ల మరీ ప్రియం అయిపొయింది !!

కాబట్టి మరదలు పిల్ల ముద్దార ముస్తాబయ్యింది. అసలు మనం మరదలు పిల్ల 'టెక్కు' కి సరి తూగ లేం అన్నంత గా , నన్ను తాక మాకు అన్నంత గా సుతారమై పోయింది.

మళ్ళీ జై జవాన్ జై కిసాన్ ఉద్యమం లా - బాంబే బావ , బంగారం మరదలు కలిసి కట్టు గా ఇలా పోతూంటే జిలేబీ లాంటి సాదా సీదా జనాల గతి ఎం గానూ ! మా బంగారం మోజు ఎలా తీరెను !

చీనా బంగారం ఎప్పుడు వచ్చునో !!

చీర్స్
జిలేబి.

14 comments:

  1. చిన్న కిటుకు
    చైనా బంగారం కన్నా సవగ్గా ...
    మా ఊరి సిలకలపూడి బంగారం బెటరు !!
    కావాలంటే చెప్పండి పంపిస్తాను.

    ReplyDelete
  2. ఆత్రేయ గారు,

    ఈ సి లక లక పూడి బంగారం ఆట రేయి కి , ఫాషను రేయి కి ! చీనా బంగారం ఇరవై రూపాయలు మాత్రమె !!!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  3. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం లాగ స్వర్ణ వైరాగ్యం తెచ్చుకోవలసిన సమయం సరిగ్గా ఇప్పుడే. :)

    ReplyDelete
  4. కం. బంగారం ఓ చైనా
    బంగారం యెప్పు డూడి పడతా వంటూ
    బెంగపడి వేడు తున్నా
    చెంగున రాదాయె పసిడి చెలువ జిలేబీ

    కం. వెల తక్కువ బంగారం
    చిలకలపూ డనెడి యూర చిక్కేనటగా
    వలసినచో ఆత్రేయను
    పిలచిన ధగధగలు వెల్లి విరియు జిలేబీ

    ReplyDelete
  5. కం. ఔరా బంగారంపై
    వైరాగ్యం తెచ్చుకున్న వచ్చేసేనా
    భారత నారికి పసిడికి
    తీరని యనుబంధమెంత తీపి జిలేబీ

    ReplyDelete
  6. >>సిరి దా వచ్చిన వచ్చును
    సలలితముగ నారికేళ సలిలము భంగిన్
    సిరి దాఁ బోయిన బోవును
    కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!

    ఎవరిపని వారు చేసుకుపోతార్ట...ఆ చింత మనకేల...

    ReplyDelete
  7. కం. కొనగలిగి నపుడు పసిడిని
    కొనవచ్చును కోర్కె తీర కొనలేకున్నన్
    తన కంత మోజు లేదని
    యనుటే సరియైన మాట యగును జిలేబీ

    ReplyDelete
  8. @పురాణ పండ ఫణి గారు,

    నెనర్లు. మంచి పదం కనిబెట్టారు- స్వర్ణ వైరాగ్యం ! స్వర్ణ వైభోగం స్వర్ణ యుగం లాగ ఇప్పూరు స్వర్ణ వైరాగ్య యుగం !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. @శ్యామలీయం వారు,

    బంగారం మీ కందలో చందాతి చందం గా అందం దిద్దు కొంటోంది! గారాబం గా ముస్తాబై మళ్ళీ బంగారం ఇక మన స్థాయి కి రాదేమో మళ్ళీ మరి !!

    నెనర్లు
    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  10. @జ్యోతిర్మయీ వారు,

    బంగారం బడాయి పోతోంది. ఎంత దాక పోతుందో చూడాలి మరి !

    నెనర్లు.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  11. బంగారమా!!! బంగారమన్న పలుకే బంగారమాయెరా!!

    ReplyDelete
  12. అమ్మో! అమ్మో! నేను కొంతకాలం దాక్కోవాలి ఐతే;) నన్ను అసలే మా ఇంట్లో బంగారం అని పిలుస్తారు!

    ReplyDelete
  13. @కష్టే ఫలే వారు,

    పలుకుల బంగారం మీరుండగా , పలుకులు బంగారం అయి దక్కును మీ పసిడి పదాలు !

    నెనర్లు

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  14. రసజ్ఞ వారు,

    బంగారమూ గారాలు పోతోంది. ఇక్కడ మా రసజ్ఞ వారూ బంగారమై పోతూన్నారు.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete