జంబూద్వీపే భరతః వర్షే భరతః ఖండే మేరోహో పర్వతే దక్షిణే పార్స్వే ఆంధ్ర రాజ్యే రాయలసీమే చిత్తూరు జిల్లాయాం ....
హమ్మయ్యా! ప్రవర అయ్యింది కాబట్టి ఇంక టపా రాసుకోవచ్చన్న మాట !
అయినా చిత్తూరు జిల్లా దాకా వచ్చేసాక , చిత్తూరు మాండలీకం గురించి రాయక పొతే ఎలాగంటారూ?
ఈ చిత్తూరు గ్రామాలలో మా ఫ్యామిలీ ఉన్నప్పుడు చిత్తూరు కి సంబంధించిన స్పెషల్ భాష ని గమనించడం జరిగింది. అదే టపా , గిపా మేటరూ, గీటరూ!
అంటే 'గ ' భాష అన్నమాట.
హోటెల్ కి వెళితే ఏదో ఇడ్లి ఉందా అని అడగకుండా మేము అడిగే తీరు ఎలా అంటారా? -
హోటెల్ కి వెళితే ఏదో ఇడ్లి ఉందా అని అడగకుండా మేము అడిగే తీరు ఎలా అంటారా? -
"ఏమిబా ఇడ్లీ గిడ్లీ ఏదైన ఉందా? ఉంటె గింటే ఓ రెండు ప్లేట్లు పట్టుకురా "
ఆట్లాగే "సాంబార్ గీంబార్" అన్న పదం చాలా తరచుగా వినొచ్చు.
నాకు తెలిసనంత వరకు రాయల సీమలో చిత్తూరు లో ని ఈ "గ " భాష చిత్తూరు పరిసర ప్రాంతాలకే పరిమితమనుకుంటా.
ఈ "గ" భాష ఎంత పాపులర్ అంటే ఆస్సాము దేశంలొ పని చెసేటప్పుడు ఓ అస్సామీ ఆసామీ - తను పూర్వ కాలం లో చిత్తూరు లొ పని చేసే డట ,
నాకున్న చిత్తూరు పరిచయాన్ని తెలుసుకొని "ఏమండీ మేడం, గీడం, జిలేబీ, గిలేబీ ,ఇడ్లి గిడ్లీ ఏమన్నా టిఫనూ, గిఫనూ చెయ్యడం మీకు వచ్చా గిచ్చా " అన్నాడు!
వార్నీ ఈ "గ" భాష ఇంత పాపులర్ అన్న మాట అని అప్పుడే తెలిసింది.
సో, ఈ పూటకి గీటకి ఈ టపా గిపా ఇంతే బా !
ఛీర్స్
జిలేబి.
(మా ఎం హెచ్ ఎస్ గ్రీమ్స్పేట్ రామకృష్ణ గారు చిత్తూరు వైద్యుల టపా రాసి చిత్తూరి జ్ఞాపకాల పుట్టని కదిలించారు )
య్యోమీ! మీ పోస్టు గీస్టూ అదిరుండ్లా
ReplyDelete(ట్రై చేశా కరెక్టేనా)
'గా' భాషని బ్లాగు గీగులో టపా గిపాలో ఎడా పెడా రాసేసారు.
ReplyDelete'బా' గురించి కూడా తొందరగా రాసేయండి. టపా 'బా' 'గా' అధ్భుతంగా ఉంటుంది. :) :)
బాగుందే
ReplyDeleteకామేంటో గీమెంటో త్వరగా పెట్టేస్తే వెళ్లి బుజ్జి పండుతో ఆడుకుంటా!!!
ReplyDeleteబాలవ్యాకరణంలోని ప్రకీర్ణక పరిఛ్ఛేదంలో ఒక సూత్రముంది
ReplyDeleteనిందయం దామ్రేడితంబు నాద్యక్షరములకు హ్రస్వ దీర్ఘంబులకు గిగీలగు (22వ సూత్రం)
దీని ప్రకారం చదువు గిదువు, రావణుడు గీవణుడు వగైరా మాటలద్వయాలు.
అందుచేత ఇడ్లీ గిడ్లీ అనటం నింద లేదా హేళన. ఇది ఒక చిత్తూరివారి పరిభాష అని కాక తెలుగువారిలో సర్వప్రాంతాలలోనూ కనిపించే వ్యవహారంగానే అనుకోవటం సబబు. అయితే గియితే చిత్తూరువారు ఈ పధ్ధతిని హోల్-సేల్ గా వాడతారేమో నాకైతే తెలియదు.
ఈ ప్రసిధ్ధభాగవత పద్యం చూడండి:
ReplyDeleteఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే!
పోతనగరైతే చిత్తూరువాడు కాదుగదా! ఇక్కడ రాజ్యము గీజ్యము అనటంలో రాజ్యభోగతిరస్కారం చూడండి.
అందుకనేనా, మేం కామెంటుతే మీరు గీమెంటుతారు కామెంటక పోతే గీపెడతారు.
ReplyDeleteYou are right..., Syaamaleeyam...
ReplyDeleteసూపరూ... గీపరూ....
ReplyDeleteకం. నిందార్ధంబున నాంధ్రము
ReplyDeleteనందున నామ్రేడితమును నాపైన గిగీల్
చిందులు వేయును మరి యా
నందార్ధము సూత్ర మేది నడచు జిలేబీ
ఈ టపా గిపా శానా బాగుండ్లా...
ReplyDeleteబలేగా గిలేగా ఉంది గా :)
ReplyDeleteచిత్తూర్ కి ట్రేడ్ మార్క్ అనదగ్గది "దా" భాష. నేను దా ఈ టపా రాస్తే, మీరు దా ఆ వూరోల్ల మింద ఇంకో టపా రాయల్నా..?
ReplyDeleteనండ్రి (మీరు రాసిన గా భాష కి) :-)
అమ్మో ...కమెంటో గిమెంటో పెడ్తేపోలా! లేకపోతే జిలేబీగారు పీకుతారో గీకుతారో:-)
ReplyDelete@శంకర్ ఎస్ గారు,
ReplyDeleteఅదురస్య అదురః!!
@సిరి శ్రీనివాస్ గారు,
తప్పకుండా బా !
@కష్టే ఫలే గారు,
బాగుంది బా !
చీర్స్ బా
జిలేబి.
@రసజ్ఞ గారు,
ReplyDeleteమంచి ప్లాను దా మీరు వేస్తిరి! అట్లాగే ఆడు కొండీ, గీడు కొండీ బా
@శ్యామలీయం వారు,
మీరు చెప్పటం బట్టి చూస్తే, బమ్మెర పోతనా మాత్యుల వారి కాలం లోనే ఈ చిత్తూరి 'గ' భాష కమ్మ తెమ్మర వారి ఊరి దాక పయనించి వున్నట్టు ఉంది !
రెండు, ఈ కారణం చేతనేమో చిత్తూరి నాగయ్య వారు పోతన చిత్రాన్ని తీసారు !
మూడు, శ్రీ సతి చిత్తూరు జిల్లాలో సెటిల్ అయిపోయారు ఈ 'గ' మకాన్ని మెచ్చు కుని!
'గగనం గభీరం' అన్న నాసదీయ సూక్తం వాక్యం గుర్తుకు వస్తున్నది!!
నెనర్లు ఆ జిలేబీయానికి !
@బులుసు వారు,
కామెంటినా గీమేంటినా, అన్నిట్లో నూ 'ఘీ' మేళవింపు కలిసి న 'ఘీంకారమే! జిలేబీయం !
నెనర్లు
చీర్స్
జిలేబి.
@మిర్చి బజ్జీ వారు,
ReplyDeleteనెనర్లు.
@ఫణీంద్ర గారు,
సూపరు కామెంటు బా !
@జ్యోతిర్మయీ వారు,
నెనర్లు గినర్లు !!
@తెలుగు పాటలు గీటలు (గీతాలు !) గారు,
నెనర్లు.
@పద్మార్పిత గారు,
మీ క కా కి కీ లా ఈ గ గా గి గీ గు గూ... అన్న మాట !
@గ్రీమ్స్పేట్ రామకృష్ణ గారు,
మీరు దా బా ఆ టపా రాసూడ్సితిరి, నేను నిండా సంతోష పడిపోయి ఈ టపా గిపా గీకేస్తిని.
ధన్యవాదాలు !
చీర్స్
జిలేబి.
హహహహ.. బాగుందండీ ;) ;)
ReplyDeleteచీర్స్
రాజ్ కుమార్ ;)
చాలా బాగుంది....
ReplyDeleteచినప్పుడు మేము మాలోమాకే అర్థం అవ్వడానికి ' క 'భాష మాట్లాడుకునేవారం...
కానీ అది ఇలా ఉండదు....
ఎలా ఉంటుందంతే....... కచాకలా కబాకగుంకది ( చాలా బాగుంది )
@కమాకధకవి కగాకరు,
ReplyDeleteకనెకనకర్లు!
కభాకష కడు కగొకప్పకది!
అయ్య బాబోయ్ ఇంతకన్నా ఎక్కువ కభాకష రాయలేను!!
నెనర్లు
చీర్స్
జిలేబి
@రాజకుమార్ గారు,
ReplyDeleteమీరు చీర్స్ మొదలెట్టేశారు !!
నెనర్లు
జిలేబి.
నేనీ పోస్టుని ఇప్పుడే చూస్తున్నాను.బాగుంది.అన్ని ప్రాంతాలవారూ వారి వారి యాసని ఇలాగే రికార్డు చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఒక్క విషయం. గీ భాష చిత్తూరు వారికే సోంతం కాదు.శ్యామలీయం గారు చెప్పినట్లు నిందార్థంలో ఆమ్రేడితంలోనే కాదు తెలంగాణా అంతా గీ భాష చాలా ఎక్కువగానే వినిపిస్తుంది. ఉదాహరణకి-- గీడు( వీడు) గింత( ఇంత)గిప్పుడు(ఇప్పుడు)గీడ(ఈడ) ఇలా--. గీ ముచ్చట మంచిగుంది గానీ గిసుమంటివి గింకేమై నాసెప్పుండ్రి.
ReplyDelete