ఏమండీ అయ్యరు వాళ్ , మిథునం అని మాంచి చిత్రం వెళ్దామా? అన్నా మా జంబునాధన్ కృష్ణ స్వామి అయ్యరు గారితో.
ఇంతకు ముందే చూసేసా నోయ్ మలయాళం పిక్చరే గా ? మోహన్ లాల్ మా బాగా ఏక్ట్ చేసాడు.
'ఆడ మలయాళం కాదు స్వామీ, ఇది ఈడ తెలుగు మిథునం ' చెప్పా 'అబ్బా ఈ అరవం వోళ్ళ కి అరవం, మలయాళం తప్పించి వేరే ఏదీ పట్టదు సుమీ' అనుకుంటూ.
తెలుగు మితునమా ?
మితునం కాదు స్వామీ, మిథునం చికాకుగా అన్నా, ఈ అరవం మరీను, త,థ ,ద ధ అన్నీ ఒక్కటే ఆయే మరి. మధ్య లో గుండు సున్నా కూడా ఉంది, చెప్పా.
అచ్చ తెనుగు చిత్రం కొంత గొప్పగా చెప్పా. 'తనికెళ్ళ భరణి అని మా గొప్ప మడిసి అచ్చ తెనుగు లో తీసేడు'
తెలుగు 'పురియాదె' ఎట్లా మరి ? అన్నారు
అబ్బా ఇంకేట్లా వీరిని లాక్కె ళ్ళేది మరి ?
'అమ్మా నాన్నల ప్రేమ కథ అయ్యరు వాళ్ ' ఈ మారు కొంత ఆశ పెట్టా.
అమ్మా నాన్నల ప్రేమకథ మనమెందుకు చూడడ మే ? మన కథే ఇట్లా తెలవారి పోతోంది కదా మరి ? మళ్ళీ ఓ రిటార్టు.
అబ్బా, ఎట్లా వీరిని లాక్కెళ్ళడం?
'బాలూ లేడు ? అదే నండీ శ్రీ పండితారాధ్యుల వారి గారబ్బాయి , మా బ్రహ్మాండం గా నటించాడంట ' ఈ మారు దీనికైనా బోల్తా పడతాడేమో అని చూసా.
'బాలూనా మా బాగా పాడతాడు, ఇప్పుడు నటించడం కూడా మొదలెట్టేడు?'
అబ్బా, ఈ పాత కాలం వారికి మతిమరుపు చాలా ఎక్కువే మరీ ను.
'బాలూ ఎప్పుడో చిన్నప్పటి నించి అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నాడు కదండీ , ఆ మధ్య ఒక అరవం సినిమాలో గుక్క తిప్పు కోకుండా పాడాడు కదా మరి ?'
అవును కదా ? మర్చి పోయా. చెప్పేరు అయ్యరు గారు.
అయితే వెళ్దామా?
వద్దు లేవే ! అచ్చ తెనుగు అంటావ్, అర్థమయి చావదె మరి'
ఈ మారు ఫైనల్ బాణం వేసా.
లక్ష్మి కూడా ఉందండీ '
ఎవరూ, లక్ష్మే ? రుక్మిణి అమ్మాయే? యారగుడిపాటి వారే కదా,నుంగంబాక్కం జానకి మనవరాలే కదా?'
అబ్బా, ఈ పాతకాలపు జ్ఞాపకాలు మాత్రం ఎట్లా గుర్తుంటాయో వీరికి మరి?
వెళ్దామా అయితే?
అబ్బా, ఇంకా ఎవరెవరొయ్ ఎక్టర్లు?
మండి పోయి, 'వాళ్లిద్దరే! ఇంకా ఎంత మంది కావాలేంటి ?' అన్నా కస్సు మని బస్సు మని.
ఇద్దరే నా ? హాశ్చర్య పోయారు అయ్యరు గారు.
అవును.
ఇద్దరేనా మళ్ళీ నోరు వెళ్ళ బెట్టేరు.
అవును.
అయితే చూడాల్సిందే మరి ! ఇద్దర్ని పెట్టి ఎట్లా చిత్రం తీసారబ్బా?
అన్నిటికీ ఎట్లా ఎట్లా అంటే ఎలా మరి? చూసి వస్తే కాని తెలీదు కదా మరి ? చెప్పా.
'కారులో షికారు కెళ్ళి ఆ పై వెళ్దామోయ్
అబ్బా, ఒక్క చిత్రం చూడ్డానికి ఎన్ని అవస్తలో మరి.
ఈ అయ్యరు లేజీ బీ తో ఈ జిలేబీ మిథునం అన్నీ మా బామ్మ తెచ్చిన ఒక్క ఫోటో వల్లే కదా మరి, అని మురిసి పోయా. ఎంతైనా మా అయ్యరు గారే కదా మరి.
చీర్స్
జిలేబి.
'sevenhills musings'