బ్యాక్ ప్యాక్ బకరా బాబు ఉస్సూరు మని కూలబడ్డాడు ఇంటికి వస్తూ రాకనే.
వాడి పెండ్లాము బక్రీ బేబీ ఇంకా 'ఓఫీసు' నిండి ఇంటికి రాలే.
ఏమిరా ఈ లైఫు అని ఆలోచిద్దా మనుకుని ,
అబ్బే ఇట్లాంటి సెంటిమెంటు ఫిలోసోఫీ లో కి వెళ్తే
మరీ 'బేజారే' సుమీ అని సోఫాలో పడి గురక పెట్టి నిద్దుర పోయేడు.
అపరాత్రి తలుపు కిర్రుమంది.
బక్రీ బేబీ మరో కీ తో తలుపు తెరుచుకుని ఇంట్లో కి వచ్చింది.
బకరా బాబు సోఫాలో అడ్డంగా పడి నిదురోతున్నాడు.
చేతిలో లాపు టాపూ అట్లాగే 'ఆన్' లో ఉంది.మరో చేతిలో మౌసు !
చ, స్పౌసు కౌగిట్లో నిద్దుర పోవాల్సిన మానవుడు ఇట్లా మౌసు కౌగిట్లో నిద్దుర పోతున్నాడే
అని ఆలోచిద్దా మనుకుని ,
అబ్బే, ఇట్లాంటి సెంటిమెంటు ఫిలోసోఫీ కి వెళ్తే మరీ బెజారే సుమీ
అని మరో సోఫాలో పడి బక్రీ బేబీ కూడా నిదుర పోయింది.
కథ స్వప్న లోకానికి, మనం మళ్ళీ మరో రోజుకి !
శుభోదయం.
జిలేబి
(బక్రీ Musings)
(My wife dresses to kill. She cooks the same way!).
(My wife dresses to kill. She cooks the same way!).
బకరాబాబూ,స్పవుస్ కౌగిట్లో నిద్రపోవలసిన వాడు మవుస్ చేతిలోనూ, స్పవుస్ బకరా బేబీ ఓఫీస్ లోనూ గడిపేస్తే జీవితం నిస్సారమే. డబ్బే ముఖ్యం కాదని బకరా బేబీ కి చెప్పండి, బకరా బాబుకీ.
ReplyDelete