Friday, January 4, 2013

బావిలో చెందురూడు

 
వెన్నెల పిచ్చ కాసింది..
 
హాలికుడు బావి దగ్గరికి వెళ్ళేడు  నీళ్ళ కోసం.
 
బావి లో చెందురూడు కనబడ్దేడు .
 
అయ్యో చెందురూడు బావిలో పడ్డేడే !
 
చేంతాడు కొక్కీ తెచ్చి చెందురూణ్ణి లాగాడు 
 
చేంతాడు కొక్కీ బావిలో రాయి కి తగులుకుంది 
 
ఎంత లాగినా చెందురూడు రాలే.
 
గట్టిగా పట్టి లాగాడు హాలికుడు.
 
చేంతాడు పుటుక్కుమని తెగి ఊరుకుంది 
 
హాలికుడు వెల్లకిలా పడ్డాడు దబ్బున 
 
కొంత సేపటికి తేరుకుని చూస్తే ఆకసం లో చెందురూడు !
 
అబ్బా నేను పడ్డా ఫర్లేదు గాని,చెందురూణ్ణి  రక్షించా
 
హాలికుడు సంతోష పడ్డాడు!
 
 
 
జిలేబి.

6 comments:

  1. హలికుదేవ్వరో వెన్నెలేమిటో అర్ధమయ్యీ అవనట్లుగా వుంది.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయీ గారు,

      మీకు అర్థమయినందులకు ఆనంద మాయెనే!

      జిలేబి.

      Delete
  2. దీనిభావమేమి తిరుమలేశా?

    ReplyDelete
    Replies
    1. శర్మగారు,

      అది జస్ట్ ఒక కథ అంతే వేరే అర్థమూ పరమార్థమూ ఏమీ లేదు !

      జిలేబి.

      Delete
  3. Replies
    1. ఎందుకో ఏమో గారు,

      చాన్నాళ్ళ తరువాయి! నెనర్లు.

      జిలేబి.

      Delete