ఈ మధ్య మరీ బొత్తి గా పని లేక పోవడం తో అట్లా ఏదో కొంత ఓ శీర్షిక పెట్టి టైపాటు ఎలా సాగితే అలా టపా యించి బ్లాగరు చదువరులను కొంత బోరు కొట్టిద్దామని , ప్రణాళిక వేసేసు కున్నా !
బాతాఖానీ బాతాఖానీ అంటారు గదా మరి బాతా ఖానీ అంటే ఖచ్చితమైన అర్థం ఏమబ్బా అని ఆంద్ర భారతి డాట్ కామ్ వారి నిఘంటువు లో జూస్తే, ఉబుసుపోక కబుర్లు, వదురు బోతు పిచ్చాపాటి, ఇష్టాగోష్టి, పుక్కిటి పురాణం , ఊక కబుర్లు , వాగుట (!) అనే 'ప్రతి పదార్థాలు' కనిపించేయి .
ఇందులో మరీ పిచ్చా పాటి కొంత మరీ బాగుంటే పిచ్చా పాటి అన్న పేరు ఎట్లా వచ్చి ఉంటుందబ్బా అని ఆలోచించా !
అంత లో టప్ మని కరెంటు వాడు టైము చూసి కరెంటు పీకేసాడు ! అర్రెర్రె మనకి మరో కాలక్షేపం కబుర్లు కూడా తొదాయెనె ఈ శుభ సూచకం తో అనుకున్నా !
కరెంటు పోతే మనకి కాలూ చెయ్యి ఆడవు ! చూడ్డానికి టీవీ లేదు గాలాడ్డానికి ఫంఖా లేదు !
ఉక్క పోస్తే విసన కర్ర పట్టుకుని మా అయ్యరు గారికి విసురుతూ, నాకూ విసురుకుంటూ పని లేక అట్లా పుక్కటి పురాణం మొదలెట్టా
ఏమోయ్ జిలేబీ మరీ తీరుపాటు గా ఉన్నావ్ అన్నారు అయ్యరు గారు నవ్వుతూ
అబ్బే, కరెంటు లేదు గదా ఇంకేం చెయ్యాలో తోచడం లెదు. సో, కొంత బాతాఖానీ సాగిస్తా మని అన్నా !
సరేలే, 'బైటక్' గానా ' సాగించూ అన్నారు వారు
బైటక్ గానా అన్న పదం బాతాఖానీ అయ్యిందేమో మరి అనుకున్నా ! అదే మాట వారి తో చెబితే , మరి పిచ్చా పాటి ఎట్లా వచ్చి ఉంటుం దంటావ్ అని 'ఉల్టా' ప్రశ్న వేసారు వారు !
గూగులించి క్షణాల్లో తెలుసు కునే కాలం లో ఇట్లా బుర్ర కి పని జెబ్తే ఎట్లా అయ్యరు వాళ్ అన్నా వారికి ఫంకా బజాయిస్తూ .
అబ్బే ఊరికే ఉబుసుపోక అడిగా లే అంతే అన్నారు !
ఇదిగో చూడు జిలేబీ నువ్వు నాతొ ఇట్లా తీరిగ్గా మాట్లాడి ఎన్ని రోజులు అయ్యిందో అని తనే మళ్ళీ చెప్పారు
అంతే కదా , కరెంటు పోతే గాని సిటీ మానవులకి మానవుల తో మాట్లాడ డానికి టైము దొరకని స్థితి కి వచ్చేసాం మరి ! ముఖ పుస్తకం కామెంటు గట్రా ల లో మునిగి పోయి తేలి పోతున్నా మెమో మరి !
ఇంతకీ నీనేని టపా రాస్తున్నా ?
అర్రెర్రె బాతాఖానీ కదూ ? ఇంతకీ పిచ్చాపాటి అన్న పదం ఎట్లా వచ్చి ఉంటుందబ్బా !?
చీర్స్
జిలేబి