కష్టే ఫలే ? కృషి తో నాస్తి దుర్భిక్షం ?
కొందరి జీవితాల్ని గమనిస్తే విచిత్రం గా అనిపిస్తుంది . కష్టానికి కొదవలేదు . అంత జీవిత కాలం కష్ట పడ్డా ఫలం దక్కినట్టు అనిపించదు. ఏదో కొరత జీవన ఆఖరి ఘట్టం దాకా ఉండక పోదు .
మళ్ళీ అలాగే, కృషి కి తక్కువా ఉండదు .
మానవ జీవితం లో ఏదైనా సరే మనం సాధించాలి అని అనుకున్నప్పుడు అది సాధించి తీరుతాం అంటారు ఆశావాదులు . అట్లా అని జీవితం లో కృషి సలపని, నిమిషం కూడా వృధా చేయని వాళ్ళ జీవితాల్లో అసలు ఎప్పుడైనా సుఖ శాంతులు ఉన్నాయా అని కూడా అనిపించేలా సంఘటనలు ఉన్నాయి .
మరి ఈ కష్టే ఫలే ? కృషి తో నాస్తి దుర్భిక్షం అందరికీ వర్తించదు లా అనిపిస్తుంది .
అంటే దీనికి తోడు మరేదో అదృశ్య శక్తి కాకుంటే అదృశ్య కారణం తోడైతే గాని వీరి జీవితాల లో ఫలం గాని శుభిక్షం గాని కనబడ కుండా ఉండదేమో అని పించేలా సంఘటనలు కూడా ఉన్నాయి .
మరి కొందరి జేవితాలు వడ్డించిన విస్తరి . వారేమి చెయ్యక పోయినా వారి ముంగిట అన్నీ వాలి పోతూ ఉంటాయి .
వీరికి కష్టే ఫలే కృషి లాంటివి అసలు అవసరం లేదేమో అనిపిస్తుంది .
ఇంతకీ ఈ విషయం లో మీ అభిప్రాయాలని తెలియ జేయ గలరు !
వీటికి అతీతం గా మరో కారణం (factor ?) ఉండాలేమో అవి సాకృతం గావడానికి ?
శుభోదయం
ఈనాటి జిలేబీ
అంతులేని అవకాశాల
జిలేబీ పాకం !!
జిలేబి

అక్కడే కదండి , మనవాళ్ళు పూర్వజన్మ సుకృతాన్ని గుర్తు చేస్తారు , ఈ జన్మకి ముదిపెడ్తారు . ఏ విషయాన్ని ఎలాగైనా అన్వయించుకోవచ్చు అన్నది మనకున్న ప్రత్యేక వసతి .
ReplyDeleteఅంతా విష్ణుమాయ
ReplyDeleteకష్టపడే పని సంస్కృతిని అలవరచుకుంటే ఏ దేశమేగినా ఎందుకాలిడినా కొంచం ఆలస్యమయినా ఫలం ఫలితం కనపడి తీరుతుంది!కాని అలా కాకుండా మీ తండ్రి రాజకీయ స్టీరింగ్ కొంతకాలమయినా పట్టుకొని అక్రమంగా సంపాదించి ఉంటే వాల్లపిల్లలకు కష్టే ఫలే అనే సూత్రం వర్తించదు!వడ్డించిన విస్తరిలా వారి జీవితం కొంతకాలం బాగా సాగి ఆనక తండ్రి తప్పులు బయటపడితే సంతానం కూడా ఇడుముల పాలు కావచ్చు!easy గా డబ్బు సంపాదించిన సినిమా, క్రికెట్ రంగాలకు చెందినా వారు తమ పిల్లలకు స్పీడ్ బైక్ లు కొనిస్తే వాళ్ళు మితి మీరిన వేగంతో ఒళ్ళుతెలియకుండా క్రమశిక్షణ తప్పి నడిపి ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంటారు,తండ్రులకు పుత్రశోకం మిగులుస్తూ!డబ్బున్నవాల్లయినా తమ పిల్లలకి మంచి పని సంస్కృతి నేర్పడం మంచిది!క్లిష్టమయిన విషయాలనుకూడా జిలేబి పాడుతూ తీయగా ఎంత మెత్తగా చెప్పారు!
ReplyDelete"కృషితో నాస్తి దుర్భిక్షం" నిజమే. కాని ఆ కృషి ఎంతవరకు ఉపయోగకరమైనది అనేదానిపై కూడా ప్రతిఫలం ఆధారపడుతుంది. ఒక బండని పట్టుకుని చెడమడా సుత్తితో మోదేస్తే బోలెడు శ్రమ ఖర్చవుతుంది కాని ప్రతిఫలం తక్కువ. అలా కాకుండా సుత్తితో ఎలా మోదితే మీ ప్రొఫైల్ పిక్చర్ లో లా అందమైన శిల్పం తయారవుతుందో తెలిసినవాడు ధన్యుడు. వాడి కృషి విలువైనది.
ReplyDeleteపిండిని బోలెడు శ్రమ పడి ఎలాగోలా కలిపేసి నూనెలో వేస్తే జిలేబీ తయారవుతుందా? సరైన కొలతలతో వస్తువులు కలపాలి, లాఘవంగా వెయ్యాలి. అపుడే నోరూరించే జిలేబీ వస్తుంది. సో ఇక్కడ కనిపించని factor పుర్రెకు ఉన్న తెలివితేటలు. కొందరి జీవితాలు వడ్డించిన విస్తరి అన్నది నిజమే అయినా ఆ విస్తరి అలా ఎల్లకాలం వడ్డించబడుతుందని చెప్పలేం. మనుషులు నిర్మించుకున్న మహా సౌధాలూ వ్యాపార సామ్రాజ్యాలూ ఒక్క భూకంపం కుదేలు చేయగలదు. అటువంటి పరిస్థితే వస్తే జిలీబీ ఎవరికి దక్కుతుంది? జిలేబీలు వండటం వచ్చినవాడికి తప్ప తినటం వచ్చినవాడికి కాదు కదా !!
శర్మ గారికీ మీకూ ఏదో దెబ్బలాట వచ్చినట్టుందేం? ఎందుకు ఆయన బ్లాగు మీద విసుర్లు విసురుతున్నారు? :-) (గత వారంగా)
ReplyDeleteఏమోనండీ....మీరైనా కష్టపడకుండా ఫలితం దక్కేమార్గం చెబుతారనుకున్నా మీరూ అందరిలాగే అన్నమాట, నేను అలిగాను :-)
ReplyDeleteఈ జన్మ లో కష్ట పడి వచ్చే జన్మకి దాచి పెట్టుకోవడం.. అనుకోవచ్చు కదా !
ReplyDeleteజిలేబీ బాషలో చెప్పాలంటే జిలేబీ తయారు చేసుకుని పాకంలో వేసి దాని సంగతి మర్చి పోయి రేపు తినడం అన్నమాట.