Saturday, July 13, 2013

'మోడీ' ఫికేషన్ !

'మోడీ' ఫికేషన్ !
 
భూగోళాన ముసురు ఎర్ర చీనా కి నల్ల మరక
అభివృద్ధి తరుగు ఐతే గొడుగు పట్టిన
సామాన్యుడే దేశాన్ని కాపాడ గలిగే
మేధావి - 'మోడీ'ఫీకేషన్ జరూర్ !!

జిలేబి భావానికి శ్రీ కంది శంకరయ్య (శంకరాభరణం బ్లాగు ) గారి పద్య రూపం !
 
ఇలను జూడ ముసురె, యెఱ్ఱ చైనాకేమొ
నల్ల మరక, ప్రగతి నాస్తి, భరత
భూమి బ్రోతుమన్న ‘మోడీ’ఫికేషనే
దిక్కటంచు బుధులు దెల్పినారు.
 
*****
 
కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్
 
ఇద్దరి కి ఇరుకైన దారి తావుంటే ఆతండు లేడు
ఆతండు ఉంటే తా లేడు,ప్రేమ బాట పూబాట
పరమాత్మ బాట ఒక్కండే ఒక్కండై ఏ
కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్.
 
జిలేబీ భావానికి గన్నవరపు నరసింహ మూర్తి గారి పద్య రూపం 
 
స్వాంతమున జ్ఞాన మలరగ
ధ్వాంతము దాఁ బాసి పాసి ద్వంద్వము దొలగున్
శాంతము చిత్త మమర నే
కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్.
 
గన్నవరపు వారికి , కంది శంకరయ్య గారికి ధన్యవాదములతో
 
మోడీ ఫికేషన్ జిలేబీయం !
 
 

2 comments:

  1. జిలేబీగారూ
    మీకే తర్ఫీదు ఇచ్చి మీచేతే పద్యాలు వ్రాయించాలని అనుకుంటున్నాను!
    ఏమంటారు?

    ReplyDelete

  2. ఇదిగో నండీ శ్యామలీయం వారు,

    ఏదో నా మానాన నేను టపాలు రాసేసుకుంటున్నా ! ఇట్లా పద్యాలు నేర్చుకోమని అంటే హాం ఫట్ అని పారి పోవాల్సినదే ! జేకే !

    నెనర్లు ! అందరూ పద్యాలల్లెస్తే ఇక రాసే వాళ్ళ పద్యాలని ఎవరు చదువుతారండీ ! మా లాంటి వాళ్ళూ ఉండాలి కదా మరి పద్యాలను ఆస్వాదించడానికి

    చీర్స్
    జిలేబి

    ReplyDelete