'సప్పోటా పండు బాగుందోయ్ కొనుక్కుం టావా ? ' మార్కెట్ లో సప్పోటా బండి దగ్గిర నిలబడి మా అయ్యరు గారు సప్పోటా ని పరీక్షించి నా వైపు తిరిగి అడిగేరు .
ఆ ఏం సప్పోటా నో ఏమో నండీ అసలే డయాబిటీస్ పేషెంట్ లం అవి తినే దానికి మన శరీరాలు సహకరిస్తాయా ? అన్నా - సప్పోటా తినాలని ఉన్నది కాని మన ప్రస్తుత ఆరోగ్య పరిస్థుతులు బాలేవు మరి .
డయాబిటీస్ ని పక్క బెట్టి అప్పుడప్పుడు ఒకటో రెండో ఇట్లాంటి వి తింటే ఏమీ తరిగి పో లేవు లే , అయ్యరు గారు భరోసా ఇచ్చి 'ఎంతోయ్' అన్నారు బండబ్బాయి వాడితో .
వాడు ధర చెప్పే టప్పుడు గమనించా , బండ్లో ఒక స్టికర్ - ఐ సప్పోర్ట్ నమో ! వార్నీ ఈ స్లోగన్ నీ దాకా వచ్చేసిందా అనుకుని హాశ్చర్య పోయి, ఏమీ తెలీనట్టు అడిగా - ఇదేమి స్టికర్ వోయ్ '
అదేమిటండీ ఆ పాటి తెలీదా ? అన్నాడు వాడు .
తెలీదోయ్ అందుకే గదా అడుగుతుంట అన్నా వాడేమి చెబ్తాడే మో చూద్దామని .
మోడీ 'బ్రాందీ' అన్నాడు బ్రాండ్ అనాలనుకున్నట్టు ఉన్నాడు కామోసు !
బ్రాందీ బానే ఉందే మరి ! ఇంతకీ ఇది వీడికి కిక్కు నిస్తుందా ?
అదే అడిగా ఏమోయ్, మోడీ మోడీ స్టికర్ పెట్టు కున్నావ్ మరి మోడీ ఎవరో తెలుసా నీకు ?
'ఆ గడ్డ పోళ్లు ' తెలీక పోవటం ఏమిటమ్మ గారు అన్నాడు వాడు . మన బాబు గారిలా మరో గడ్డ పాయన .
అంతే నంటావా ? మరి మోడీ డిల్లీ సర్కారు చేస్తాడంటావా ? అడిగా 'కామన్' మేన్ అభిప్రాయం తెలుసు కుందా మని .
ఇదిగో నమ్మ గోరు ఇవన్నీ మనకు తెలవ్వు - మార్కెట్టు లో నుండాము ... ఇక్కడ మాకు వ్యాపారం జరగాలె. ఇది పెట్టుకోవోయ్ ఇవ్వాల్టి కి మంచి వ్యాపారం జర్గు తుందన్నాడు మా లీడరు అంతే మనకు తెలిసింది '
ఔరా ! మార్కెటు మార్కెట్టే కదా మరి ! మార్కెట్టు లో జరగాల్సింది వ్యాపారం - రాజ కీయం కాదు !
దేశం లో ఇది ఇప్పుడు తలక్రిందు లై పోయింది !
మోడీ భాయ్ ? వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ?
ఐ 'సప్పో టా' నమో 'డీ' !
శుభోదయం
జిలేబి