విహంగావలోకనం - A bird's eye view - విహంగ వీక్షణం !
రామాయణం లో పుష్పక విమాన వర్ణన సుందర కాండ లో వస్తుంది. హనుమంతుల వారు పుష్పక విమానాన్ని చూడటం జరుగుతుంది .
వాల్మీకి అత్యద్భుత వర్ణన - ఈ పుష్పక విమానాన్ని గురించి సుందర కాండ లో ఏడవ సర్గ లో లో చెప్పడం జరుగుతుంది. ఆ పై ఎనిమిదవ సర్గ ఈ పుష్పక విమాన వర్ణన కి కేటాయించ బడి ఉన్నది .
ఏడవ సర్గ లో ఈ పుష్పక విమానం గురించిన వర్ణన ఒక విహంగావలోకనం లాంటి దైతే ఎనిమిదవ సర్గ లో వర్ణన 'a detailed description' లాంటిది !
పుష్పక విమానాన్ని హనుమంతుడు చూడడాన్ని వాల్మీకి వర్ణన - ఈ పుష్పక విమానం - మహా విమానం - 'best of the best! - वेश्म उत्तमानाम् अपि च उच्च मानम् |! ఉత్తమ మైన వాటిల్లో అత్యుత్తమ మైన విమానం అని !
అంటే ఆ కాలం లో ఇది ఒక్కటే విమానం కాక మరెన్నో విమానం ఉండేవని అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి విమానా ల లో ఈ విమానం అత్యుత్తమ మైన విమానం !
ఇక ఈ విమానని గురించి న మరిన్ని వివరాలు ఎనివిదవ సర్గ లో మొత్తం ఏడు శ్లోకాలలో వాల్మీకి వర్ణన చేయడం జరుగుతుంది . మహద్విమానం మణి వజ్ర చిత్రితం !
महद्विमानम् मणिवज्रचित्रितम् |!
విశ్వకర్మ చేత నిర్మింప బడ్డది. అక్కడ 'వాయుపథం' లో నిలిచి ఉన్నది ! (ఈ వాయుపథం అన్నది మన కాలపు 'Run way' అనుకోవచ్చా ? ) ఆదిత్య పథ వ్యరాజవత్ !
తపోబలము చేత రావణుడు దీన్ని పొందాడు . 'ఇది మనోబలము చేత ప్రయాణిస్తుంది' అంటాడు వాల్మీకి !
అంటే ఈ విమానం ఆ కాలం లో ప్రయాణం చేయడానికి మనోబలం ఇంధనం లాంటిదన్న మాట . - मनःसमाधान विचारचारिणम् | -
तपह्समाधानपराक्रमार्जितम् |
मनःसमाधानविचारचारिणम् |
अनेकसंस्थानविषेषनिर्मितम् |
ततस्ततस्तुल्यविशेषदर्शनम् || ५-८-४
ఈ మధ్య మన కాలం లో నే స్పీచ్ రెకగ్నిషన్ పరికరాలు వస్తున్నాయి . వీటి తరువాయి సాయిన్సు డెవలప్ మెంట్ ఇక మనో బలం (Thought Power) చేత పరికరాలు నడప బడే స్థాయి కి రావచ్చు అనుకుంటా .
అంటే ఆ రామాయణ కాలపు డెవెలప్ మెంట్ ఒక స్థాయి ముందర ఉన్నట్టు అనుకోవచ్చు. మనోబలం చేత నడప బడే విమానం లాంటివి ఉన్నట్టు !
ఇక ఇది కాల్పనిక మైనదేమో అన్న సందేహం చాలా మందికి ఉండనే ఉన్నది. ఆ కాల్పనిక కథ అన్న మాటలని పక్కన బెట్టి - ఈ రామాయణ కాల ఘట్ట కాలం నాటికి వాల్మీకి సమకాలీకుడు అన్న మాటలని బట్టి ఆ కాలం లో తాను చూసినదానిని ఒక కవి వర్ణించాడు అని కూడా అనుకోవచ్చు. అట్లా అయిన పక్షం లో ఇది ఆ కాలపు ఒక విమానానికి సరియైన వర్ణన అయ్యే ఆస్కారం కూడా ఉన్నది.
ఇక దాని రూపం ఎట్లా ఉన్నది ? విచిత్ర కూటం బహుకూట మండితం ! -like a mountain with wonderful peaks adorned by many peaks!
ఇంతే గాక మనోభిరామం శరదిందు నిర్మలం ! - చంద్రుని లా నిర్మలం గా మనోభిరామం గా ఉన్నదట దాన్ని చూడడడం !
సో, ఈ విచిత్ర కూటం బహుకూట మండితం అన్నది చూస్తే దాని రూపు రేఖలు - మన కాలపు 'flyingsaucer' వర్ణన లా ఉన్నది !
ఈ వర్ణన లో అన్నిటికన్నా ముఖ్యమైనది నా కనిపించింది - ఇది మనో బలం చేత నడప బడుతుంది అన్నది . ఈ వాక్యం నిజంగా ఆలోచింప దగ్గ వాక్యం అనుకుంటా . ఎందు కంటే ఇప్పుడు మన మున్న కాలం లో thought power మీద జరుగుతున్న విశేష రీసెర్చ్ రాబోయే కాలం లో ఇట్లాంటి వనరులని మనకి తేవచ్చు కూడాను .
ఆ మధ్య ఎక్కడో చదివా ... హ్యూమన్ క్లోనింగ్ రీసెర్చ్ లో భాగం గా - ఒక బ్రెయిన్ లో జరిగే విశేష మైన లాజికల్ మేపింగ్ ని మరో బ్రెయిన్ లో కి ట్రాన్స్పోర్ట్ చేయ గలిగితే తద్వారా knowledge transfer mechanism చాలా సులభ తరమై పోతుంది అని !
సో ... ఇవ్వాల్టికి ఈ పుష్పక విమాన విహంగావ లోకనం పరి సమాప్తం !
మీకు నచ్చిందని ఆశిస్తూ ...
मनःसमाधान विचार चारिणम् |
ఎప్పట్లా చీర్స్ సహిత -
మీ
జిలేబి
సైనింగ్ ఆఫ్ !
మనోభిరామం శరదిందు నిర్మలం !