Monday, April 21, 2014

అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ?


ఉపనిషత్తులు వేదాంతములు . అంటే వేదానికి అంతిమ భాగాలని చెప్పుకోవచ్చు . కాకుంటే , వేదసారమని కూడా చెప్పు కోవచ్చు .

ఉప + ని + షద్ (షత్) = దగ్గిర + క్రింద + కూర్చోవడం

గురువు దగ్గిర క్రింద కూర్చొని తన బోధనల ను గ్రహించడం అనుకొవచ్చు.

మరో విధంగా చెప్పాలంటే , గురువు వద్ద గ్రహించిన జ్ఞాన సముదాయం .

ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉన్నాయి వాటి లో ముఖ్యమైనవి అంటే వాటి కి శంకర భగవత్ పాదులు వ్యాఖ్య లందించినవి వేళ్ళ మీద లెక్క పెట్ట గలిగినవి  - పది

  1. ఈశోపనిషత్ (ఈసావాస్యోపనిషత్)
  2. కేనోపనిష త్ 
  3. కథొపనిషత్ 
  4. ప్రశ్నోపనిషత్ 
  5. ముండకోపనిషత్ 
  6. మాండూక్యోపనిషత్ 
  7. తైత్రేయోపనిషత్ 
  8. ఐతరేయోపనిషత్ 
  9. చాందోగ్యోపనిషత్ 
  10. బృహదారణ్యకోపనిషత్ 
వీటితో బాటున్న మరో తొంభై ఎనిమిది ఉపనిషత్తుల్లో అంతర్యామిన్ ప్రస్తావన అక్కడక్కడా వస్తుంది . వేర్వేరు విధం గా వీటి ప్రస్తావన - అంటే మన దేహం లో అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడన్న చర్చ వాటికి ఒక విధం గా సమాధానం (పూర్తీ గా కాక పోవచ్చు ) - లాంటివి కనిపిస్తాయి .

చాలా సౌలభ్యమైన సమాధానం - హృదయేషు లక్ష్మి - అంతర్యామిన్ హృదయం లో ఉన్నాడన్నది .

నారాయణ సూక్తం (యజుర్వేదం - తైత్తరీయారణ్యకం ) కొంత వివరంగా చెబ్తుంది . కొద్దిగా కవి వర్ణ న లాంటిది అనిపిస్తుంది .

ఈ టపా  నారాయణ సూక్తం లో ఈ అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడన్న దాని గురించి.

పద్మకోష ప్రతీకాషం హృదయం చాపి అధో ముఖమ్ !  అంటుంది . హృదయం లో తలక్రిందులైన పద్మం లా ఉన్నాడు/ఉన్నది .

అధో నిష్ట్యా వితస్త్యాం తే   నాభ్యాముపరి తిష్టతిమ్
జ్వాల మాలాకులం భాతి  విశ్వశ్యాయతనం మహత్

నిష్ట్యా అంటే - గొంతు దగ్గిరున్న ఎముక (Adam's apple ) - దానికి 'వితస్త్య ' అంత దూరం లో -( వితస్త్య   అన్నది ఒక కొలమానం -  (defined as long span between extended thumb and little finger) )- నాభి కి పై వైపు తిష్ఠతి ! జ్వాలమాల లా విశ్వమూలం లా ఉన్నది .

ఇట్లా కవి వివరణ సాగు తుంది .

ఇట్లాగే మరి ఉపనిషత్తుల లో వర్ణన ఎలా ఉన్నది అన్నది వచ్చే టపాలలో చూద్దాం

నారాయణ సూక్తం ఆంగ్లానువాదం


శుభోదయం
జిలేబి






 

Saturday, April 19, 2014

మోడీ ప్రధాన మంత్రి ఐతే గుజరాత్ గతి అధోగతి?

 
 
ఈ ప్రశ్న కి సమాధానమేమిటి ?
 
 
మోడీ ప్రధాన మంత్రి ఐతే గుజరాత్ గతి అధోగతి?
 
 
జిలేబి 

Thursday, April 17, 2014

రేతిరి చందమామ

 
రేతిరి చందమామ 
ఎర్రటి రంగులో
జిగేలు మన్నది 
గ్రహణమ ట !
 
నిరుడు భువి లో 
పెను చోట్ల 
ఆకశ్మిక ప్రమాదం 
'ఆగ్రహమట' !
 
 
కర్ణాటక బస్సు 
అస్సాము రైలు 
కొరియా క్రూయిజర్ 
అమెరికా హత్య 
 
వెరసి లోకం పై  
చందురిని మచ్చ 
 
 
నివాళితో  
జిలేబి 

Saturday, April 12, 2014

పడవ 'ప్రణయం' !

 
నది లో పడవ
జన సాంద్రత తో 
అలవోక గా సాగి
తీరాన్ని చేరింది 
 
గప్ చుప్ పడవ ఖాళీ !
 
విశాలమైన నది రా రమ్మని 
ఆహ్వా నిస్తోంది
 
పడవ నిట్టూర్చింది !
 
అంతలో మళ్ళీ జన సందోహం !
 
పడవ హుషారయ్యింది మళ్ళీ 
నది దాట దాని ఆనందం 
సత్ చిత్ ఆనందం !
 
 
శుభోదయం 
జిలేబి 
*కష్టే ఫలి వారి పడవ ప్రయాణం చిత్ర మాలిక చూసేక*

(దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిహి!
విశ్వాని నో దుర్గః జాతవేదః సింధున్న నావ దురితాత్ పర్షిహి !)

Friday, April 11, 2014

ఏడు కొండల కి దరిదాపుల్లో కి వెళుతున్న నిఫ్టీ - మస్త్ మోడీ ?

ఏడు కొండల కి దరిదాపుల్లో కి వెళుతున్న నిఫ్టీ - మస్త్ మోడీ ? !

' ఏడు కొండల' దగ్గిర లో కి వెళుతోంది నిఫ్టీ - ఇండియా స్టాకు మార్కెట్టు తమాషా చూడటానికి అర్థం చేసు కోవటానికి మన ఒక జీవిత కాలం సరిపోదు సుమీ !!

జనవరి నెలకి ఏప్రిల్ నెలకి మధ్య న మూడు నెలలు . ఈ మూడు నెలలో మన దేశం లో అంత మార్పేమి జరిగిందో లేదో తెలియదు కాని బాంకింగ్ సెక్టార్ దరిదాపుల్లో ముప్పై శాతం పెంపొందిన 'స్టాకు' లావు లతో 'భర్పూర్' హోగయా !!

ఏడు కొండల కి వెళితే బోడి గుండు కొట్టు కో కుండా రావడం బావోదు ! ఇక మన ఇండియా స్టాకు మార్కెట్టు ఎప్పుడు బోడి గుండు కొడు తోందో ఆ మా పెరుమాళ్ళ కే ఎరుక !!

దేశం లో కి డాలర్లు వచ్చేస్తున్నాయి  వచ్చేస్తున్నాయ్ - సో మన మార్కెట్టు ఎకానామీ అభివృద్ధి పథం లో కి జుమ్మంది నా 'దమ్' అనుకోవాలా లేక డం డం డమాల్ డమాల్ రాబోయే కాలం అనుకోవాలా ?

నిఫ్టీ వేల్యూ ఎంత ? ఎవరి కెరుక లోగుట్టు ? ఏ పెరుమాళ్ళు ఈ మారు హర్షద్ మెహతా ని తలపించ బోతాడు ? అంతా విష్ణు మాయ !
వేచి చూడుము నరుడా  తమాషా !

కాశీ ఘాట్ ఈ మారు చూపిస్తుంది ష్యూర్ షాట్ !

అమెరికా మార్కెట్టు నిన్న 'డాం' అంది సందులో సడేమియా అని మన మార్కెట్ రివ్వున ఆకాశానికి ఎగురుతోంది ! ఇది ఎప్పుడో 'బెలూన్' బర్స్ట్ అగునో మరి !!


వెల్కం బెక బెక !

'చీర్స్' సహిత
శుభోదయం
జిలేబి

Wednesday, April 9, 2014

చెట్టు - పువ్వు-కాయ-పండు !

చెట్టు - పువ్వు-కాయ-పండు 
 
ఓ చెట్టు కో పువ్వు పూచింది 
పువ్వు కాయ గా మారింది 
కాయ పండు గా పరువాని కొచ్చింది 
దారిన వెళ్ళే పక్షి రాజు మోజు పడి 
పండుని కొరుక్కు ఎళ్ళాడు !
 
పండు దారెంబడి తింటూ వెళితే 
విత్తనాలు దారెంబడి పడుతూ వెళ్ళాయి 
 
మళ్ళీ తల్లి ఒడి లో మరో 
చెట్టు కి అంకురార్పణ !
 
పండు తిన్న పక్షి రాజూ రాణి తో చేరితే 
మరో పక్షి కి అంకురార్పణ !
 
అన్నాత్ భవంతి భూతాని !
 
 
శుభోదయం 
జిలేబి 
 
 

Monday, April 7, 2014

సూరీడు మండి పోతున్నాడు !

 
సూరీడు మరీ మరీ
మండి పోతున్నాడు !
వస్తోంది మోడీ కాలం
అని సూచిస్తో !
 
 
 
శుభోదయం
జిలేబి
 

Wednesday, April 2, 2014

వెదురు బొంద - చెందురిని చమక్కు !

 
 
రేతిరి వెదురు బొందల 
నీడల కదలికలో మెట్ల మీది 
దుమ్ము చెక్కు చెదర లేదు 
 
నడి రేయి చెందురిని 
కాంతి కిరణాలు తాలాబ్ ని 
తాకి ఇసుమంత కూడా నిలువ లేదు !
 
 
 
శుభోదయం 
జిలేబి 
(జెన్ కోవన్ ఆధారం)

Thursday, March 20, 2014

Homoeopathy- Migrain-A candid analysis by Shri Sathyanarayana Sharma


హోమియో అద్భుతాలు - హెడ్ ఏక్ - పార్శ్వపు తలనొప్పి

A candid analysis by Shri Sathyanarayana Sharma

For those who have inclination towards Homoeopathy this article is not to be missed

For more details:

http://www.teluguyogi.net/2014/03/31-migraine.html

I wish the author produces in English as well for more readers!



Cheers
zilebi

 

Wednesday, March 19, 2014

కాశీ నించే ఎందుకు జిలేబి పోటీ ?

కాశీ నించే ఎందుకు జిలేబి పోటీ ?

ఏమోయ్ జిలేబి, ఆ మధ్య కాశీ నించి పోటీ జేస్తా నన్నావే 'తయ్'  కర్లియా హై క్యా ? - మా అయ్యరు గారు ప్రశ్నించేరు

బహు భేషు గా కాశీ నించే నండి చెప్పా తాడు సాక్షి గా !

ఎందుకోయ్ నీకు వారణాసీ - బెనారస్ - కాశీ అంత లైకింగ్ ?

మొట్ట మొదటి ది జిలేబి ! దాంతో బాటు గర్మా గరం చాయ్ - అదీ దాంతో అన్న మాట బ్రేకు ఫాష్టు ! అందుకే కాశీ నాకు బెష్టు చెప్పా హాట్ హాట్ జిలేబి నోరూరిస్తూ ఉంటే .

ఇంకా ? అయ్యరు గారి ఎగదోత .

రెండు - బెనారస్ పట్టు చీరల మోజు నాకుందని మీకు తెలుసుగా ! - ఏమండీ బెనారస్ కి వెళ్లి మంచి పట్టు చీరలు కొని నా పోటీ మొదలు పెట్ట బోతున్నా ! చెప్పా మరీ మురిపాలు బోతూ

ఇంకా ? అయ్యరు గారి మరో పృచ్చ

అదేమిటండీ ఇంకా ఇంకా అంటారు - కాశీ కి వెడితే మనకు నచ్చినదానిని వదిలి పెట్టి రావాలి అంటారు - అందుకే !

అంటే ?

నాకు మస్తు గా నచ్చిన వారు మీరే నాయె ! కాశీ కి వెళ్లి మిమ్మల్ని వదిలి పెట్టి వచ్చేస్తా  చెప్పా !

ఆ అని నోరు తెరిచేసేరు మా అయ్యరు గారు !

కాశీ కాండం ఇంకా ఏమేమి చెప్ప బోతోందో మరి !

వెల్కమ్ టు  'కాశీ కాండం' !!

చీర్స్
జిలేబి