జిలేబి 'స్విస్సు' అకౌంటు !!
స్విస్సు బ్యాంకు లో నీ అకౌంటు ఏమైంది జిలేబి ? అడిగారు మా అయ్యరు గారు !
స్విస్సు అకౌంటు కేమి టండీ ! అది ఒక సేఫ్ వాల్ట్ !! క్షేమం గా ఉంటుంది అన్నా అట్లా న్యూస్ పేపర్ తిరగేస్తున్న అయ్యరు గారికి కాఫీ ప్రిపేర్ చేస్తో .
భంశు ! నీ అకౌంట్లకి డోఖా వచ్చే టట్టు ఉందే మరి ? చెప్పారు అయ్యరు గారు ఇవ్వాళ్టి హిందూ పేపరు చూపిస్తో .
వామ్మో వామ్మో అంటే మా అకౌంటు డీటెయిల్స్ బ్యాంకు వాళ్ళు గవర్నమెంటు కి ఇచ్చేస్తారా మరి ?
అట్లాగే ఉంది కదా మరి ?
అంటే నా డబ్బులు అంతా పోయినట్టే నా !!
ఏమో మరి . ఎంత బెట్టా వేమిటి అకౌంట్లో ?
మన రాబోయే ఏడేడు నలభై తొమ్మిది తరాలకి సరిబడ్డా పైకం పెట్టా నే మరి !
అంతే ఇక అన్నీ గవర్నమెంటు వారికి సొంతం !
అదెట్లా అండీ అంత దస్కమూ గవర్నమెంటు వాళ్ళు లాగేసు కుంటే మనకి జీవనం ఎట్లా మరి ?
ఆ ఏముందీ, జమీందారీ, రాజుల వారి రాజ్యాన్ని గవర్నమెంటు పాత కాలం లో తీసేసు కుంటే ఏమి చేసారు ? ప్రివీ పర్సు ఇచ్చేరు కదా అట్లాగే నీకూ ఏదో కొంత ముట్ట జేబ్తారు లే !
ప్చ్చ్ ప్చ్ ! జేబులో డబ్బులు పోయనే అని పాత పాట పాడేసు కోవాలా మరి ?
ఆ ఏముందీ గవర్నమెంటు 'కార్య రంగం' లో కి దిగే ముందే దస్కాన్ని ఏ నాసావు కో మారిషియస్ కో తర లించేయ్ . కాదూ కుదరదూ అంటే ఇండియా కే తరలించేయ్ ! ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్ట లేడని సామెత ఉండనే ఉందాయే మరి !!
హమ్మయ్య ! మా అయ్యరు గారి లాంటి తెలివి మరి వేరే ఎవరికైనా వచ్చునా మరి అని మరింత సంతోష పడి పోయి వారికి మంచి ఫిల్టరు కాఫీ కలిపి ఇచ్చా !!
'అదేనోయ్ నీ చేతి మహిమ ! ఫిల్టరు కాఫీ , హిందూ రీడింగ్ దే గొ టు గెదర్ , యు నో ! అన్నారు మా అయ్యరు గారు !
జిలేబి ఫిల్టరు కాఫీ మజాయే వేరు కదా మరి !!
శుభోదయం
జిలేబి