డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి !!
ఈ మధ్య ఓ బ్లాగు టపా లో పిడక ల వేట ! టపా లో ఓ వాక్యం - ఓ యోగి కి యోగ దృష్టి ఉన్నది . ఆ యోగి ఆవు తప్పి పోయింది . అరణ్య మంతా వెదికాక యోగ దృషి సారించి ఆ ఆవు ఎవడో ఎత్తుకు పోయాడని తెలుసు కుంటాడు . ఇదీ బ్యాకు గ్రౌండు !
డింగిరి బొంగిరి ప్రశ్న - ఆ యోగి కి మొదటే యోగ దృష్టి ఉంది కదా మరి మొదటే ఎందుకు యోగ దృష్టి సారించి తెలుసుకో లేదు ? అంతా వెదికాక ఎందుకు ఆ పై యోగ దృష్టి సారించడం అని !
టప్ మని జిలేబి ఓ జాంగిరి పారేసింది - ఆ యోగికి డింగిరి బొంగిరి కున్నంత జ్ఞానం లేక పోబట్టి అని !
వెంట నే మరో 'కా' మింట్' దారుడు - ఆయ్ అట్లా ఎలా అంటావు జిలేబి - ఏదన్న ప్రశ్నిస్తే అట్లా గా జవాబిచ్చేది ?
"బోంగిరి గారు అడిగిన దాంట్లో ఎద్దేవా చెయ్యవలసినదేమీ లేదని అనుకుంటున్నాను.
మన పురాణాలు చెప్పేవి కొన్ని కొన్ని rigorous గా ఉండవు. (ఇక్కడ రిగరస్ అనగా ఏమియో !)
ఎవరైనా ప్రశ్నిస్తే “అది అంతే” అని నోరు మూయించేవాళ్ళే ఎక్కువ.
ఈ కధలోనే, వశిష్టుడికి ఆల్రెడీ యోగదృష్టి ఉంది. కాని అలా కాదు.
తన దగ్గర యోగదృష్టి ఉండి కూడా ఎందుకు కొండలు కోనలు వెదికాడు అంటే జవాబు లేదు. మహా అయితే, “యోగదృష్టి ని చీటికీ మాటికీ వాడితే అది క్షీణిస్తుంది” లాంటి సమాధానం ఇస్తారు. లేదా “మీకున్న పాటి తెలివితేటలు ఆయనకి లేకపోయాయి” అని ఎద్దేవా చేస్తారు. అందుకే మన పురాణ కధలు విమర్శకి గురవుతుంటాయి.
నేను పైన చెప్పినది కొంతమంది బ్లాగుపండితులకి నచ్చకపోవచ్చు. కాని నా అభిప్రాయం మాత్రం ఇదే, భారతం అంటే నాకెంతో అభిమానం ఉన్నా కూడా."
వామ్మో ఈ అజ్ఞాత ఎవడో మరీ బేజారు పడి పోతున్నాడే జాంగిరి కి అని వాపోయా !
ఆ జాంగిరి రాసేటప్పుడు అస్సలు ఏమి ఆలోచించ కుండా స్ట్రైట్ గా రాసిన జాంగిరి అది . అంటే, ఇట్లా బుర్ర ఉపయో గించ కుండా ఆ యోగి అట్లా ఆరణ్య మంతా తిరగడం అవసర మా అన్నది లాజిక్కైన ప్రశ్న. సరి యైన ప్రశ్న ! అట్లా ఆ యోగి చేయలేదంటే , ఎందుకు చేయ లేదంటే మరి సరి యైన సమాధానం మనకు తెలిసిన జ్ఞానం వారి కి లేక పొవట మనేది మాత్రమె !
అబ్బా , సత్యము జెప్పినా ప్రజలు ఎద్దేవా అంటా రేమిటి మరి ?
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సత్యమప్రియం న బ్రూయాత్ అంటే ఇదే నెమో మరి !!
సరే ఈ విషయం గురించి తీవ్రం గా ఆలోచిద్దాము అని ఆలోచిస్తే అని పించింది ఏమిటంటే , వాత్సల్య మున్న చోట , యోగి కావచ్చు, భోగి కావచ్చు - తన మానవ పరిధి లో తాను ఏమి చేయ గలడో అదే మరి ప్రపధమం గా ఆలోచిస్తాడు - ఆచరిస్తాడు . ఇక్కడ దారి పోయినది ఆవు. సో వెంటనే వెదకాలి అంతే ! ఇందులో లాజిక్కు ఏమీ లేదు !
సరే దొరక లేదు - ఏమి చేద్దా మని తీరిక గా ఆలోచిస్తే , తనకున్న శక్తి గుర్తు కొస్తుంది . సో, అప్పుడే అతను తనకు యోగ దృష్టి ఉందే , కనుక్కుందాం అనో, కాకుంటే , ఈ కాలం లో పోలీసు స్టేషన్ కి వెళ్లి కంప్లైంటు ఇస్తా మనో ( ఆవు దారి పోతే పోలీసోళ్ళు వెదికి పెడతారా ?) అనుకుంటాడు !
హమ్మయ్య
ఇవ్వాల్టి కి ఒక టపా కట్టేశా !!
చీర్స్
శుభోదయం !
జిలేబి